ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తరువాత, అధికారుల బదిలీల తరువాత, నిత్యమూ వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఈసీలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. పోటీ చేసిన వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైపోయిందని, దాన్ని ఎవరూ మార్చలేరు, కాని ఆయన పోరాటం జాతీయ స్థాయిలో జరిగే మిగతా ఎన్నికల పై, అందుకే ఢిల్లీ స్థాయిలో తన నిరసనగళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఎన్నికలు మాత్రమే ముగిసి, నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ, నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, ఈసీ అధికారులతో సుదీర్ఘ సమావేశం జరిపిన సంగతి తెలిసిందే.

cbn question 14042019

చంద్రబాబు ప్రెస్ మీట్ లో , "మీరు ఎందుకిలా విమర్శలు చేస్తున్నారు? ఓడిపోతారనే భయమా?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు, ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, వాటి పనితీరుపై ఒక్క మాట కూడా మాట్లాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ సంగతేంటని ఎదురు ప్రశ్నించారు. ఇంతవరకూ జగన్ అసలు స్పందించలేదని గుర్తు చేస్తూ, జగన్ వైఖరికి కారణమేంటని మండిపడ్డారు. ప్రజలు మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు ఓటు వేసారని, ఈ వైఫల్యం ఎవరు ప్రశ్నిస్తారని ? ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే చేస్తారనే ఉద్దేశంతో, జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాని చెప్పారు. ప్రజల సమస్యల పై పోరాడాల్సిన బాధ్యత తన పై ఉందని అన్నారు. జగన్ లాగా ఇంట్లో కుర్చోలేనని అన్నారు.

cbn question 14042019

ప్రజల తీర్పు పై సంపూర్ణ విశ్వాసం ఉందని, ఎన్నికల కమిషన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ బస్సులు ఆపినా, జగన్ విధ్వంసం చేసినా, ప్రజలు మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు లైన్లలో నుంచుని ఓటు వేసారంటే, ప్రజా స్వామ్యం పై వారికి ఉన్న నమ్మకం అని చంద్రబాబు అన్నారు. అంత కసిగా ఓటింగ్ ఎందుకు జరిగిందో అర్ధం చేసుకుంటే, వీరి కుట్రలను ఎలా తిప్పి కొట్టారో అర్ధమవుతుందని అన్నారు. ఏపిలో నేను గెలవటం ఎలాగూ జరుగుతుందని, కాని అక్కడ జరిగిన లోపాలు, వివిధ దశల్లో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జరగకుండా ఉండటానికే తన పోరాటమని, మోడీ, అమిత్ షా కుట్రలు సాగనివ్వనని చంద్రబాబు అన్నారు. ఓడిపోతానని తెలిస్తే ఇంట్లో కుర్చుంటాను కాని, ఢిల్లీకి వచ్చి మోడీని ఎదిరిస్తానా అని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం, ఈవీఎంల్లో లోపాలను ఎత్తిచూపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న హరిప్రసాద్‌ను చర్చలకు అనుమతించకపోవటాన్ని ఖండిస్తున్నట్లు తెలుగుదేశం లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ఈసీకి మూడుపేజీల లేఖ రాశారు. తొమ్మిదేళ్ల క్రితం హరిప్రసాద్‌పై ఈవీఎం చోరీ ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఇప్పటివరకూ కనీసం ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేయలేదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. గతంలో ఈవీఎంలపై జరిపిన సమావేశాలకు ఆయనను అప్పటి ప్రధాన కమిషనర్లు ఎస్‌వై ఖురేషీ, వీఎస్‌ సంపత్‌లు ఆహ్వానించారని చెప్పారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు సమస్య పరిష్కారంపై దృష్టిపెడితే బాగుంటుందని కోరారు.

hariprasad 14042019 2

‘అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ ఫ్రాంటియర్‌ ఫౌండేషన్‌ ఈపీఎఫ్‌ పయనీర్‌ అవార్డ్‌-2010 అవార్డుతో సత్కరించిన తొలి భారతీయుడు హరిప్రసాద్‌. ఆ అవార్డు స్థాపించిన 27 ఏళ్లలో ఏ భారతీయునికీ ఆ గౌరవం దక్కలేదు. భద్రతా పరిశోధకుడిగా ఆయన ఈవీఎంలలో ఉన్న లోపాలను వెల్లడించారు. 2011 జులై 21న కేంద్ర ఎన్నికల సంఘం దిల్లీలో తొలిసారి ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌ క్షేత్ర స్థాయి ప్రయోగానికి రమ్మని ఆయనకు ఆహ్వానం పంపింది. నాటి సీఈసీ వీఎస్‌ సంపత్‌, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ అలోక్‌ శుక్లాలను హరిప్రసాద్‌ కలిశారు. ఎన్నోసార్లు ఈసీ ఆహ్వానం మేరకు సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రజావేగుగా ఈవీఎంలలో ఉన్న లోపాలను వెలికి తీయడానికి ప్రయత్నించిన ఆయనపై తప్పుడు కేసు నమోదైన తర్వాతే ఈ సమావేశాలన్నీ సాగాయి. ఈ అంశాన్ని మీ రికార్డులను తనిఖీ చేసుకుని ధ్రువీకరించుకోవచ్చు.

hariprasad 14042019 3

శనివారం నాటి ఈసీఐతో ముఖ్యమంత్రి భేటీకి సాంకేతిక సలహాదారు హోదాలో హరిప్రసాద్‌ హాజరయ్యారు. ఈవీఎంలలో తలెత్తిన లోపాల గురించి ఆయన పూర్తి స్థాయిలో వివరించారు. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనరు ఆహ్వానం మేరకు 4 గంటలకు ఈసీఐ సాంకేతిక నిపుణుల కమిటీ ఛైర్మన్‌ డీటీ సహానిని కలిశారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఈసీ అధికారి సుదీప్‌ జైన్‌ రామ్మోహన్‌ నాయుడిని లోపలికి పిలిచి, క్రిమినల్‌ కేసు దృష్ట్యా హరిప్రసాద్‌తో ఎన్నికల సంఘం చర్చలు జరపడానికి ఇష్టపడటం లేదని చెప్పారు. ఇప్పుడు సమస్యపై దృష్టి సారించడానికి బదులు దాన్నుంచి తప్పించుకోవడానికి ఎన్నికల సంఘం ఇలాంటి ఎత్తులు వేస్తోందనిపిస్తోంది. హరిప్రసాద్‌కున్న నిపుణతను దృష్టిలో ఉంచుకుని సోమవారం ఆయన్ను చర్చలకు ఆహ్వానిస్తారని మేం ఆశిస్తున్నాం’ అని రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో సమావేశం కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. దేశ రాజధానిలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఈరోజు ఉదయం 11.30 గంటల తర్వాత భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశానికి ఏపీ, ఢిల్లీ సీఎంలు చంద్రబాబు, అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ నాయకులు అభిషేక్‌ మనుసింగ్వి, కపిల్‌సిబల్‌ తో పాటు, 21 పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంలపై వస్తున్న అనుమానాలు, వీవీ ప్యాట్‌ స్లిప్పు లెక్కింపు, సుప్రీం కోర్టులో రివ్యూపిటిషన్‌ దాఖలు, ఈసీ పనితీరు తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. వీవీ ప్యాట్ల స్లిప్పుల లెక్కింపు, ఎన్నికలు మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఏపీలో ఈవీఎంలు మొరాయించిన అంశంపై ఇప్పటికే చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ec 140422019

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. ఈసీపై ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ‘‘కళకింత పార్టీలు, నేతలకు ఈసీ మద్దతిస్తోంది. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, రిజర్వు బ్యాంకు వంటి రాజ్యాంగ సంస్థలకు నాశనం చేశారు. ఇప్పుడు స్వయం ప్రతిపత్తిగల కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది’’ అని చంద్రబాబు ఆగ్రహించారు. వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపునకు 6 రోజుల సమయం పడుతుందంటూ సుప్రీం కోర్టును ఈసీ తప్పదోవ పట్టించిందని చంద్రబాబు తెలిపారు.

ec 140422019

‘‘ఈవీఎంల పట్ల తమకు విశ్వాసం లేదని, కనీసం 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని దేశంలో 75 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న 22 రాజకీయ పార్టీలు ఈసీని కోరాయి. ఇందుకు ఆరు రోజులు పడుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించింది. నేను వారికి సవాలు చేస్తున్నా... అంత సమయం ఎందుకు పడుతుందో చెప్పాలి? గతంలో బ్యాలెట్‌ పేపర్లు ఉన్నప్పుడు మొత్తం లెక్కించడానికి 12 గంటల నుంచి అత్యధికంగా 24 గంటలు పట్టేది. ఇప్పుడు సగం వీవీప్యాట్‌లు లెక్కించేందుకు 6 రోజుల సమయం పడుతుందనడం సరికాదు. దాదాపు 45 నిమిషాలు చాలు’’ అని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 5 వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాల్సి ఉంటుందని, ఒకవేళ ఆ ఐదింట్లో లెక్క తప్పితే మొత్తం అన్ని వీవీప్యాట్‌ల స్లిప్‌లకు లెక్కించాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయన్నమాటే గానీ... రాజకీయ పార్టీలకు ప్రశాంతత కరువైంది. ఎన్నికల ముందు ఎలా టెన్షన్ పడ్డాయో... ఇప్పుడూ అలాగే పడుతున్నాయి. ఇప్పుడెందుకంటే... 43 రోజులు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంలు భద్రంగా ఉంటాయో లేదో అన్న టెన్షన్. ఎప్పుడైనా ఎవరైనా దాడి చేసి... వాటిని ఎత్తుకుపోతారేమోనని స్వయంగా రాజకీయ పార్టీలే తమ ప్రతినిధులను కాపలాగా పెట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో... ఓ సంఘటన తీవ్ర కలకలం రేపింది. మే 23వ తేదీ తెరుచుకోవాల్సిన మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను శనివారం రాత్రి 10 గంటల సమయంలో తెరిచారు.

evm 14042019

అందులో నుంచి ఈవీఎంలను వాహనాల్లో తరలించారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఈవీఎంలను కృష్ణా వర్సిటీలో భద్రపరిచారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం శుక్రవారం కలెక్టర్‌, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేశారు. వాటిని ఏ కారణంతో తెరవాలన్నా... ఎన్నికల సంఘం అనుమతితో కలెక్టర్‌తోపాటు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుంది. అయితే, శనివారం రాత్రి కలెక్టర్‌, పార్టీల ప్రతినిధులు లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌ సీలు తీసి, తలుపులు తెరిచి మూడు టాటా ఏస్‌ వాహనాల్లో ఈవీఎంలను తరలించారు.

evm 14042019

అసలే ఎన్నికల కమిషన్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచి ఈవీఎంలను తరలించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను సంప్రదించగా... ‘‘అవి నూజివీడు నియోజకవర్గానికి చెందిన రిజర్వు ఈవీఎంలు. ఆ నియోజకవర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ కలెక్టర్‌ స్వపిన్‌ దినకర్‌ ఆధ్వర్యంలో వాటిని తరలించాం’’ అని తెలిపారు. 103 రిజర్వు ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో వినియోగించుందుకు వీలుగా అక్కడి నుంచి తరలించామని, ఇందులో వివాదమేదీ లేదని సబ్‌ కలెక్టర్‌ కూడా తెలిపారు. అన్ని పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరూ రాలేదని చెప్పారు.

 

Advertisements

Latest Articles

Most Read