చీరాలలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. చీరాల టీడీపీ అభ్యర్థి కరణం బలరాం దగ్గర రాజశేఖర్ పీఏగా పనిచేస్తున్నారు. బలరాం వియ్యంకుడి ఆసుపత్రిలోకి వెళ్లి మరీ రాజశేఖర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో బలరాం తనయుడు వెంకటేష్ తన అనుచరులతో సమావేశమయ్యారు. దీన్ని గమనించిన వైసీపీ కార్యకర్తలు బాధితుడి దగ్గరకు వెళ్లి తాము చికిత్స కోసం వచ్చామని చెప్పారు. అయితే ఆసుపత్రిలో ఓపీ సమయం అయిపోందని, ఇప్పుడు రోగులను చూడరని రాజశేఖర్ చెప్పాడు.

karanam 10042019 1

అతడి సమాధానం విన్న నిందితులు.. తాము చికిత్స కోసం రాలేదని దాడి చేయడానికి వచ్చామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు తమతో తెచ్చుకున్న ఆయుధాలతో రాజశేఖర్‌పై దాడి చేశారు. రాజశేఖర్ అప్రమత్తం కావడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. బాధితుడికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడ్డవారిని మనోజ్, వెంకటేష్‌గా గుర్తించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క, గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కనగలలో పీహెచ్‌సీ డాక్టర్‌ రమేష్‌పై వైసీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. మందుల విషయంలో వైసీపీ కార్యకర్తలు డాక్టర్‌తో గొడవపడ్డారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీ కోసం వెళ్తున్న హెలికాప్టర్ బుధవారంనాడు దారితప్పడం ఆందోళనకు దారితీసింది. అయితే ఆ తర్వాత సరైన రూటులోకి వచ్చిన హెలికాప్టర్ అరగంట ఆలస్యంగా సభాస్థలికి చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మమత హెలికాప్టర్ దారితప్పిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదే‌శ్‌తో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్న చోప్రాలో మమతా బెనర్జీ ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆమె సిలిగురిలో హెలికాప్టర్ ఎక్కారు. నార్త్ దీనజ్‌పూర్‌లోని చోప్రాకు 1.27 గంటలకు హెలికాప్టర్ చేరాల్సి ఉండగా, 2 గంటల తర్వాత అక్కడకు చేరుకుంది.

mamatha 0042019

బహిరగం సభలో ఈ విషయాన్ని మమత ప్రస్తావిస్తూ 'ఆలస్యంగా వచ్చినందుకు సారీ. సభాస్థలిని పైలట్ గుర్తించలేకపోవడంతో ఆలస్యం చోటుచేసుకుంది. ఆయన డైరెక్షన్ మర్చిపోయారు. 22 నిమిషాల్లోనే నేను ఇక్కడకు చేరుకోవాల్సి ఉండగా 55 నిమిషాలు పట్టింది' అని ఆమె తెలిపారు. కాగా, హెలికాప్టర్ పొరపాటున బీహార్‌లోకి అడుగుపెట్టిందని, దీంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, కలర్ట్ స్మోక్ గన్ సహాయంతో హెలికాప్టర్‌ను చోప్రాలో సురక్షితంగా పైలెట్ దింపగలిగారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీ జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీలో ఉండటం, ఆమె హెలికాప్టర్ దారితప్పిందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు సీనియర్ పోలీసు అధికారులు నిరాకరించారు.

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. నిన్న టీడీపీ నేత గల్లా జయదేవ్ అకౌంటెండ్ గుర్రప్ప నాయుడు ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. దీంతో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా ఐటీ శాఖ చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్షసాధింపు చర్యగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడి ఐటీ దాడులు జరుగుతుంటే వేధిస్తున్నారని చెప్పడం ఎంతమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడటం కేవలం విపక్షాలకే చెల్లిందని దుయ్యబట్టారు.

arun jaitley 10042019

ఇది ఇలా ఉంటే, ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ద్వివేదీ వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ కొమ్ము కాయట్లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పనిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోంది తప్ప ఏ ఒక్క పార్టీకో సహకరించాలని ఆదేశించడంలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని ద్వివేది పునరుద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.

arun jaitley 10042019

ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో జోక్యం చేసుకోవడం ఎన్నికల సంఘం(ఈసీ) ఉద్దేశం కాదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా స్పష్టం చేశారు. సోదాలపై మీడియా, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే రెవెన్యూ విభాగం, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)కి లేఖలు రాసినట్లు ఆయన వివరించారు. తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఈసీ వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల వేళ అక్రమ నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఈసీకి కచ్చితంగా చేరవేయాల్సిన అవసరం ఉందని సునీల్ అరోడా గుర్తుచేశారు. అలాగే సీబీడీటీ ఛైర్మన్‌, రెవెన్యూ విభాగం కార్యదర్శికి నిన్న జరిగిన సమావేశంలో సమన్లు జారీ చేశారని వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. వారు ఉన్నతాధికారులనీ.. వారికి సమన్లు జారీ చేసే అధికారం తమకు లేదని తెలిపారు.

ఎన్నికల ప్రచారం ముగిసి, తాయిలాలకు తెరలేచిన వేళ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న ఎస్పీ బదిలీ మంగళవారం రాత్రి జరిగింది. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ప్రధాని ఒత్తిడితో సానుకూలంగా స్పందిస్తున్నదని, రాష్ట్రప్రభుత్వంపై కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నదని టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన పలు బదిలీలను వారు అందుకు ఉదహరిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆకస్మిక బదిలీ అనంతరం ముఖ్యమంత్రి ఈసీపై తీవ్రమైన వ్యాఖ్యానాలు కూడా చేశారు. కాగా, తొలి నుంచి అనుకుంటున్నట్లే మంగళవారం రాత్రి ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. రాష్ట్రంతో సంబంధం లేకుండా నూతన ఎస్పీని కూడా ఈసీ నియమించింది. సర్వీసులో బాగా జూనియర్‌ అయిన ఐపీఎస్‌ అధికారిని ఎస్పీగా ఎన్నికల సంఘం నియమించడం కూడా చర్చనీయాంశమైంది.

game 27032019

సహజంగా ఇలాంటి బదిలీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రందించి వారు ప్రతిపాదించిన వారిలో ఒకరిని నియమించడం జరుగుతుంది. కానీ, జిల్లా ఎస్పీ నియామకం విషయంలో ఎన్నికల సంఘం అలాంటి విధానాన్ని పాటించలేదు. ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేయడంతోపాటు నూతన ఎస్పీగా సిద్ధార్థ కౌషిక్‌ను నియమించింది. బదిలీ అయిన ఎస్పీపై వైసీపీ నాయకులు గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో వారు డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ, పలు జిల్లాల ఎస్పీలపై ఫిర్యాదులు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ వారు ఫిర్యాదు చేసిన కొంతమంది అధికారులపై వేటు వేసింది. అయితే జిల్లా ఎస్పీ ప్రవీణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు బదిలీ ఉండదని భావించారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం రాత్రి ఆయన్ను బదిలీ చేయడంతోపాటు నూతన ఎస్పీని కూడా నియమించారు.

game 27032019

గత రెండు, మూడు రోజులుగా ఈ విషయంలో ఇటు అధికార పార్టీ నాయకులు, పోలీసు శాఖలోని సీనయర్లయిన కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజా బదిలీతో వారి అనుమానాలు నిజమయ్యాయి. ఇదేసమయంలో ముఖ్యమంత్రి తనకుడు నారా లోకేష్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి సీఐను కూడా బదిలీ చేశారు. దీంతో జిల్లాలో మరికొందరు కింది స్థాయి పోలీసు అధికారుల బదిలీలు ఉంటాయేమోనన్న అనుమానం ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఏ ఉద్దేశంతో బదిలీలు చేసినప్పటికీ చివరి మజిలీలో పోలీసు యంత్రాంగంలో నెలకొన్న బదిలీల భయం మొదటికే మోసం రావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 

 

Advertisements

Latest Articles

Most Read