తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పాలకుడి చేసే చట్టాలు, ఆలోచనలు ఎంత ముందుచూపుతో ఉంటాయో అనే దానికి కాపు రిజర్వేషన్లు అంశం మరో చక్కని ఉదాహరణ. చంద్రబాబు ఆధ్వర్యంలో రూపొందించే చట్టాలు ఎంత పకడ్బందీగా వుంటాయో ఇదివరకూ సీఆర్డీఏ చట్టం నిరూపించింది. టిడిపి అధికారంలో వున్న 2014-19 కాలంలో  ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ  బిల్లు పెట్టి ఆమోదించారు. ఈబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ దెబ్బ తినకుండా, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపులకు చంద్రబాబు సర్కారు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ ఎత్తేసింది. ఓబీసీ రిజర్వేషన్లు గురించి ప్రశ్నించిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు కాపులకు టిడిపి సర్కారు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చిన బిల్లు చెల్లుతుందా అని రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి సామాజిక న్యాయశాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానం ఇచ్చారు. కాపులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ చెల్లుతుందని స్పష్టం చేశారు.  కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమేనని కేంద్రం తేల్చేసింది. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్ర సర్కార్ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన కబ్జాలు ఆక్రమణలు మొదలయ్యాయి. ప్రభుత్వ భూములను వైసీపీ కబ్జా చేస్తోంది. ప్రైవేట్ స్థలాలను ప్రభుత్వం ఆక్రమిస్తోంది. ఇదొక విచిత్రమైన కబ్జాలపర్వం. బాపట్లలో వైసిపి కార్యాలయ నిర్మాణం కోసం ఆర్టీసీ గ్యారేజీ పక్కన ఉన్న 1.45 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు కేటాయించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజ చేశారు. దీనిపై వివాదం నడుస్తోంది. అనకాపల్లి జిల్లాలోనూ వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంపై వివాదం నడుస్తోంది. వైసీపీ తన ఆఫీసుల కోసం కబ్జాలకి తెగిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భూములు, స్థలాలు ఖాళీగా ఉంచినందుకు పన్ను కట్టలేదనే కారణంతో ఆయా స్థలాల్లో ప్రభుత్వం నోటీసు బోర్డులు వేలాడదీస్తోంది. కట్టాల్సింది 5 వేలు అయితే 50 లక్షలల స్థలంని ప్రభుత్వం బోర్డు పాతేస్తోంది. ఇది ఉభయగోదావరి జిల్లాల్లో స్థలయజమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ఏపీ పర్యాటకశాఖా మంత్రి ఆర్కే రోజా తన శాఖ పరిధిలో ఓ చెత్త రికార్డు సాధించారు. రోజూ ఏదో ఒక సభలో సెల్ఫీలు, డ్యాన్సులతో హడావిడి చేస్తున్న రోజా తన శాఖని దిగజార్చడంలో ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర విభజన తరువాత అన్నిరంగాల్లో ప్రగతిని జీరో నుంచి మెరుగైన స్థానాలకు తీసుకెళ్లడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేశారు. దీని ఫలితంగా నరేగా పనులలో మొదటి స్థానంలో వచ్చింది ఏపీ. పర్యాటకరంగంలోనూ 9వ ర్యాంకు సాధించింది. వైసీపీ సర్కారు వచ్చిన తరువాత అన్నిరంగాలూ తిరోగమనంలో పయనించాయి. అందులో ఒకటి పర్యాటక రంగం. సహజసిద్ధమైన ప్రకృతి వనరులు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ప్రగతి సాధించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. అయితే నిత్యమూ రాజకీయ కార్యకలాపాలలో మునిగి తేలుతున్న మంత్రులు తమ శాఖల పురోగతి గురించి పట్టించుకోవడం మానేశారు. నాలుగేళ్ల క్రితం 8వ స్థానంలో వున్న పర్యాటక రంగం 18వ ర్యాంకుకి దిగజారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను నెలరోజుల నుంచి నిర్వహిస్తున్న పర్యాటక శాఖా మంత్రి రోజా గారు దీనిపై స్పందిస్తారేమో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read