ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పదే పదే ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఈ అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. 2014, ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. ఏపీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన బీజేపీ... ఆ తరువాత అందుకు నో చెప్పింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనేక వేదికలపై ప్రకటించారు.

rahulmanifesto 0202019

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చడంతో... ఏపీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూలతలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేయడంతో... జాతీయ స్థాయిలో ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు టీడీపీ అంగీకరించింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ... జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందనే అంశంతో సంబంధం లేకుండా కేంద్రంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

rahulmanifesto 0202019

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. మంగళవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ఆ ప్యాకేజీ ఇప్పుడు అమలులో ఉందని చెప్పరి. ఆమోదించిన ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు ఆ నిధులు వస్తాయని స్పష్టంచేశారు. ఇప్పటికే తమ రాష్ట్రానికి సైతం ప్రత్యేక హోదా కావాలంటూ ఒడిశా సహా అనేక రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. హోదా కింద ఇచ్చే డబ్బును కాంగ్రెస్‌ ఎక్కడినుంచి తెస్తుందని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందునుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం మరో వివాదానికి తెరతీశారు. సరిగ్గా చంద్రబాబు చంద్రగిరిలో ప్రచారం చేస్తున్నారు అనే ఒక రోజు ముందు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం తెప్పించారు. టీడీపీ బలంగా ఉన్న ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్లి, గ్రామస్తులతో వివాదానికి కాలుదువ్వారు. రాత్రి పొద్దుపోయేవరకు తన మంకుపట్టు వీడలేదు. చంద్రగిరి మండలంలో టీడీపీకి గట్టి పట్టున్న ముంగిలిపట్టు గ్రామంపై చెవిరెడ్డి కన్నేశారు. గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించే ఆదే గ్రామానికి చెందిన దామోదరనాయుడు అనే వ్యక్తిని వెంటపెట్టుకుని సోమవారం మధ్యాహ్నం అక్కడికి ప్రచారానికి వెళ్లారు. దీంతో ముంగిలిపట్టు గ్రామస్తులంతా ఒక్కటై చెవిరెడ్డి గోబ్యాక్‌ అంటూ నినదించారు. ఆ వ్యక్తిని (దామోదరనాయుడు) పక్కనపెట్టి.. తమ గ్రామంలో ప్రచారం చేసుకోవాలని చెవిరెడ్డికి సూచించారు.

chandragiri 02042019

అయితే గ్రామస్థుల మాటను పెడచెవినపెట్టి ఆ వ్యక్తితోనే ప్రచారం చేసేందుకు చెవిరెడ్డి బయలుదేరడంతో ప్రచారం చేయనీయమని గ్రామస్తులు వ్యతిరేకించారు. చెవిరెడ్డి భీష్మించుకు కూర్చోవడమే కాక కాసేపటికి ఇతర మండలాల నుంచి వైసీపీ కార్యకర్తలు ఆ గ్రామానికి తరలి రావడంతో ముంగిలిపట్టులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా ప్రచారం చేసుకోమని కోరగా, ఇలా గ్రామంలో ఉద్రిక్తతలు రేపడాన్ని గ్రామస్థులు తప్పుపడుతున్నారు. చెవిరెడ్డికి, గ్రామస్థులకు తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరడంతో పారామిలటరీ బలగాలతో పోలీసు ఉన్నతాధికారులు భద్రత చర్యలు చేపట్టారు.

chandragiri 02042019

మరోవైపు టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి అతని అనుచరులు దాడికి దిగారని సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గ్రామానికి చేరుకుని గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని పోలీసులను అభ్యర్థించారు. గ్రామస్థులకు సర్దిచెప్పి ఎటువంటి గొడవలు జరగకుండా సముదాయించి ప్రజాస్వామ్యం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఇక్కడినుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించి గ్రామంనుంచి వెళ్లిపోయారు. అప్పటికే సుమారు మూడు గంటల పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగడంతో పోలీసులు క్షణక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. తన అనుచరులతో కలసి ముంగిలిపట్టులోనే బైఠాయించిన చెవిరెడ్డి రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్లిపోయారు. ఊరిలోకి రాకుండా అడ్డుకుంటున్నారంటూ దళిత మహిళలచేత ఫిర్యాదు చేయించారు.

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి ఈ కేసును వేశారు. మోహన్ బాబుకు జైలు శిక్ష పడిందనే వార్త సంచలనం రేపుతోంది. మరోవైపు దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'కొన్ని టీవీ చానళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఇప్పుడే విన్నా. నేను నా ఇంట్లోనే ఉన్నా' అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఒక పక్క టీవీల్లో కోర్ట్ నుంచి వార్తలు చెప్తుంటే, అవి నమ్మకండి అంటూ, మోహన్ బాబు ఎందుకు ట్వీట్ చేసారో అర్ధం కాలేదు. అంటే టీవీ చానల్స్ అన్నీ తప్పుడు వార్తలు వేసాయా ? కోర్ట్ చెప్పింది కూడా నిజం కాదా ? మోహన్ బాబు ఎందుకు ఇలా ట్వీట్ చేసారు ?

mohan 02042019 4

మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.. రూ.40లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేసు విచారణ జరగ్గా, మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఇందులో ఎ1గా ఉన్న లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు రూ.10వేల జరిమానా, ఏ2గా ఉన్న మోహన్‌బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41,75,000 చెల్లించాలని ఆదేశించింది. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో ‘సలీం’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా రూ.40.50లక్షల చెక్కును మోహన్‌బాబు దర్శకుడికి అందించారు.

mohan 02042019 4

అయితే, ఆ చెక్‌ నగదుగా మారకపోవడంతో వైవీఎస్‌ చౌదరి 2010లో కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఒక వేళ మోహన్‌బాబు రూ.41.75లక్షలు చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ కేసుకు సంబంధించి మోహన్‌బాబు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజులు బౌన్స్ అయిన నగదును దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించాలంటూ కోర్టు ఆదేశించింది. నెలరోజుల లోపు చౌదరికి ఇవ్వాల్సిన రూ. 48 లక్షలు చెల్లించేస్తే ఈ కేసు కొట్టివేయడం జరుగుతుంది.

జగన్‌.. ఆయన పేరులోనే ‘గన్‌’ ఉందని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయనకు ఎప్పుడూ నేరాలు, ఘోరాలేనని, ఎప్పుడూ కుట్రలు చేస్తుంటారని ఆరోపించారు. ప్రజలే తనకు పోలీసు అధికారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దుర్మార్గుల ఆటలు సాగనీయబోమని, కుట్రదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపించేవరకు వదిలిపెట్టబోనన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మోదీని బ్యాన్‌ చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

jagan 02042019

కోడికత్తి పార్టీకి ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనన్నారు. హైదరాబాద్‌ నుంచి వలస పక్షులు వస్తున్నాయని, ఆ పక్షులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు మోదీ, కేసీఆర్‌ నుంచి డబ్బులు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే జైలుకు.. జనసేనకు ఓటేస్తే అత్తారింటికే పోతారని ఎద్దేవా చేశారు. తనను నమ్ముకుంటే భవిష్యత్‌ బ్రహ్మాండంగా తీర్చే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఒక్కసారి గెలిపించాలని జగన్‌ ప్రజలను కోరుతున్నారని.. ఒక్కసారి అని తినే తిండిలో విషం కలుపుకొంటామా? ఒక్కసారి అని కొండ పైకెక్కి లోయలో దూకుతామా? అని ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

jagan 02042019

సామాజిక న్యాయమే తన ధ్యేయమని, నిత్యం పేద ప్రజలతోనే ఉంటానని చంద్రబాబు స్పష్టంచేశారు. ఏ ఒక్కరివాడిగా కాకుండా అందరివాడిగా ఉంటానని హామీ ఇచ్చారు. 18 నుంచి 35ఏళ్ల లోపు యువత ఆలోచించి ఓటేయాలని సూచించారు. కోటి మంది చెల్లెళ్లు ఉన్న ఏకైక అన్న తానేనన్నారు. పెన్షన్లు పదిరెట్లు పెంచి భరోసా కల్పించానని చెప్పారు. మోదీ మోసం చేసినా, కేసీఆర్‌ సహకరించకపోయినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలిపేందుకు కృషిచేసినట్టు చెప్పారు. రెండేళ్లలో ప్రతి ఇంటికి కుళాయిలు ద్వారా నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ సిగ్గులేకుండా పోలవరం తనకు ఏటీఎం అంటున్నారని, పోలవరానికి రూ.58వేల కోట్లు అవసరం కాగా.. అందులో కేంద్రం రూ.7వేల కోట్లే ఇచ్చిందన్నారు. ప్రధాని ఇచ్చేది సొంత సొమ్మా? అని ప్రశ్నించారు. పోలవరం పనులు ముందుకెళ్లకూడదనేదే మోదీ ఉద్దేశమని మండిపడ్డారు. జులైలో పోలవరం గ్రావిటీ ద్వారా నీళ్లు అందించనున్నట్టు చంద్రబాబు స్పష్టంచేశారు.

Advertisements

Latest Articles

Most Read