కొన్ని రోజుల క్రితం, ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణనే, మోడీ వద్దకు పంపించని సంఘటన మరువక ముందే, ఈ రోజు మరో ఏపి బీజేపీ సీనియర్ నాయకుడుకి అవమానం జరిగింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అవమానం జరిగింది. రాజమండ్రిలో జరగుతున్న మోదీ సభకు మాణిక్యాలరావుకు పాస్ అందలేదు. దీంతో ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది ఆయనను స్టేజీపైకి రానివ్వలేదు. పాస్ చూపించకపోవడం ఆయనను కిందకు దించేశారు. దీంతో వేదిక నుంచి మాణిక్యాలరావు వెనుదిరిగారు. అయితే కొద్ది సేపటి తరువాత విషయం తెలుసుకుని, పార్టీ పెద్దలు, సెక్యూరిటీతో మాట్లాడి, మళ్ళీ ఆయన్ను పైకి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు రాజమండ్రిలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు.

modimeet 01042019

మరో పక్క, ఈ రోజు ఉదయం రాజమండ్రి పర్యటన సందర్భంగా మోడీ ట్వీట్ చేసారు. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ‘ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడం లేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు’అన్నారు. చివర్లో @BJP4Andhra జోడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీటుగా బదులిచ్చారు. మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గు వేయడం లేదా అని నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. ప్రత్యేక హోదాతో ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని మోదీ రాజమండ్రి పర్యటనపై సీఎం చంద్రబాబు ట్విటర్‌లో ప్రశ్నాస్త్రాలు సంధించారు.

modimeet 01042019

రాజధాని అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మట్టి నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లడటానికి సిగ్గేయడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ప్రతిపక్ష పార్టీలు కోరినట్లు 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తే ఫలితాల వెల్లడికి ఆరు రోజులు సమయం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈసీ సమాధానంపై తమ అభిప్రాయం తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం పిటిషన్‌దారులను ఆదేశించింది. దీనికిగానూ వారం రోజుల గడువు విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. 50శాతం మేర ఓటు రసీదు యంత్రాలను(వీవీప్యాట్‌లను) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

vvpat 01042019

ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక ఈవీఎంను మాత్రమే వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీలు చేస్తున్న డిమాండ్ సరికాదని..కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కిస్తే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ఆరు రోజులు ఆలస్యంగా వెల్లడించాల్సి వస్తుందని ఈసీ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో పిటిషన్‌దారులైన 21 ప్రతిపక్ష పార్టీలు.. ఈసీ వివరణపై అభిప్రాయం తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కోరింది.

vvpat 01042019

ఈవీఎంలపై పలు వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా 50శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. అందుకు సంబంధించి నిబంధనలు రూపొందించాలని విన్నవించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌తో పాటు మొత్తం 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడాను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఈసీ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను నవ్యాంధ్రలో కూడా విడుదలకు అనుమతించాలంటూ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి ఈరోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట దెబ్బతీసేలా చిత్రం ఉందని ఆరోపిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో కోర్టు నవ్యాంధ్రలో విడుదలపై స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వెనుక జగన్ ఉన్నారని, జగన్ పార్టీ వ్యక్తే, ఈ చిత్రానికి నిర్మాణం చేస్తున్నారని, ఎన్నికలు అయ్యే వరకు, ఈ సినిమా వాయిదా వెయ్యాలని కోరారు. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో సినిమా గత నెల 29వ తేదీనే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఆడేందుకు అనుమతించాలని రాకేష్‌ రెడ్డి సుప్రీం కోర్టును కోరారు.

ntr 01042019

ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ నిర్మాత. అత్యవసర పిటీషన్ దాఖలపై విచారణ సందర్భంగా ఈ విధంగా వ్యాఖ్యానించారు న్యాయమూర్తులు. అత్యవసర విచారణ చేపట్టేందుకే నిరాకరించింది సుప్రీంకోర్టు. పిటీషన్ తిరస్కరించారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఎందుకు ఆగలేకపోతున్నారంటూ ప్రశ్నించింది. 3వ తేదీ విచారణ తర్వాత.. హైకోర్టు నిర్ణయం వెల్లడించిన తర్వాత.. అప్పుడే విచారణ చేపడదాం అని.. మీకు అక్కడి కోర్టులో వ్యతిరేకంగా నిర్ణయం వస్తే.. అప్పుడు మళ్లీ ఆశ్రయించాలని సూచించింది సుప్రీంకోర్టు. ఈ చిత్రం విడుదలపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టు తలుపుతట్టారు.

ప్రధాని మోదీ రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా, తెలుగుదేశం పై చేసిన ట్వీట్ లకు, ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విటర్‌లో ప్రశ్నాస్త్రాలు సంధించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వారు అవినీతి, కుటుంబ రాజకీయాలు కోరుకోవడం లేదు. అందువల్ల అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. ఇది నా పూర్తి విశ్వాసం’ అని ఉదయం మోదీ ట్వీట్‌ చేశారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ‘ఆర్థిక నేరస్థులతో అంటకాగుతూ అవినీతి గురించి మీరా మాట్లాడేది?’ అని ఎదురు ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని, ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

modi 014042019

రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి.. మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి రాష్ట్రం గురించి మాట్లాడడానికి సిగ్గు వెయ్యడం లేదా అని నిలదీశారు. నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్థిక నేరస్థులతో అంటకాగుతున్నారంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాంకులను దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. ‘మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ!’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వా్మ్యానికి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఈ దుర్మార్గపు పరిపాలనకు త్వరలోనే ముగింపు పలకాలని దేశ, రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

modi 014042019

"ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా కూలుస్తూ దేశానికి, ప్రజాస్వామ్యానికీ, తీరని ద్రోహం చేసిన మీ దుర్మార్గపు పరిపాలనకు, త్వరలోనే ముగింపు పలకాలని దేశ ప్రజలు-రాష్ట్ర ప్రజలు స్థిర నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రంలో అధికార మార్పును బలంగా కోరుకుంటున్నారు నల్లధనాన్ని విదేశాలనుంచి వెనక్కు తెస్తామని హామీలు ఇచ్చి, ఆర్ధిక నేరస్తులతో అంటకాగుతూ, బ్యాంకులు దోచిన వారిని దేశాన్ని దాటిస్తూ, లక్ష కోట్ల ప్రజాధనాన్ని అపహరించినవారికి అభయమిస్తూ, ఎన్నికల బాండ్ల ద్వారా అవినీతిని వ్యవస్థీకరిస్తూ.. మీరు అవినీతి గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా లేదూ?" అంటూ చంద్రబాబు ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read