నిన్న కర్నూల్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన ఈ సభకు ప్రధాని మోదీ హాజరుకావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు స్టేడియంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో తనీఖల్లో వారికి అవాక్కయ్యే దృశ్యాలు కనిపించాయి. తనిఖీ చేసే సందర్భంలో కొందరు కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు, కండువాలు కనిపించాయి. ఇది బీజేపీ మీటింగ్ కదా, మరి వైసీపీ జెండాలు ఉన్నాయి ఏంటి అని అవాక్కయ్యారు. ఇలా ఒకరు ఇద్దరు కాదు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీ వారికి ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. ఈ విషయాన్ని అధికారుల వద్దకు తీసుకువెళ్ళారు.

meetig 300362119

ఏ ఆదేశాలు వచ్చాయో కాని, అప్పుడు వారిని లోపలకి పంపించారు. అయితే, కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు, కండువాలు స్వాధీనం చేసుకుని పక్కనపడేసిన అనంతరం వారిని లోపలికి పంపించారు. లోపలికి వచ్చిన కొందరు వైసీపీ కార్యకర్తలు బారికేడ్లకు ఆ పార్టీ జెండాలు తగిలించారు. 5 కోట్ల ఆంధ్రులను నమ్మించి మోసం చేసి, ఢిల్లీ అహంకారాన్ని, ఆంధ్రుల పై రుద్దుతున్న మోడీ పై, యావత్త ఆంధ్రప్రదేశ్ ఆందోళన చేస్తుంటే, వైసీపీ అధ్యక్షుడు జగన మోహన్ రెడ్డి మాత్రం, ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. కొన్ని రోజుల క్రిందట, గుంటూరులో జరిగిన మోడీ సభకు ఒక పక్క జగన్, ఒక పక్క మోడీ ఫోటోలు, జెండాలు పెట్టి మరీ ప్రజలను తరలిస్తున్నారు.

meetig 300362119

మరో పక్క, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు, మోడీకి స్వాగతం పడుతూ, బ్యానర్లు కట్టారు. బీజేపీ..వైసీపీ అక్రమ సంబంధానికి ఇంతకంటే రుజువులు కావాలా?? రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వెనకనుండి మద్దతు ఇచ్చింది ఎవరో తెలిసిందా? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. ఇవ్వడం కుదరదు అన్న బీజేపీ తో కలిసి హోదా తెస్తారా వీళ్ళు....?? కేసుల కోసం మోడీ కాళ్లదగ్గర మొకరిల్లే వీళ్ళ వలన రాష్ట్రానికి ప్రయోజనం ఉందా?? బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని భావిస్తున్నారు. మరో 20 రోజుల్లో అధికారంలోకి వస్తానని పదేపదే చెప్పుకుంటున్న జగన్.. సీఎం పీఠాన్ని అధిష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కేసీఆర్ దారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ యాగం నిర్వహించిన అనంతరం మలి విడత ప్రచారం మొదలుపెట్టిన కేసీఆర్... రెండోసారి తెలంగాణలో విజయందుందుభి మోగించారు. తాజాగా కేసీఆర్ బాటలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నడిచినట్టు తెలుస్తోంది.

jagan 30032019

వైఎస్ జగన్ కూడా రాజశ్యామల యాగం నిర్వహించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బెంగళూరు మిర్రర్ కథనాన్ని ప్రచురించింది. జగన్ తరపున స్వామి స్వరూపానందేంద్ర ఈ యాగాన్ని నిర్వహించారని... నెల్లూరులో జగన్‌కు సన్నిహితుడైన ఓ ఎంపీ ఈ మొత్తం యాగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగిన యాగంలో జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నేతలు పాల్గొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న వైసీపీ అధినేత మాత్రం ఈ యాగానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

jagan 30032019

మరోవైపు ఆయన సన్నిహితులు కొందరు జగన్ ముఖ్యమంత్రి కావాలని ఈ యాగం చేయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాతోనే వైఎస్ జగన్ ఈ యాగం చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ యాగంలో ఆ కుటుంబానికి సన్నిహితుడైన ఒక్క ఎంపీ మాత్రమే పాల్గొన్నట్టు తెలిపింది. రాజశ్యామల యాగంలో మొత్తం 27 మంది రిత్వికులు పాల్గొన్నట్టు బెంగళూరు మిర్రర్ పేర్కొంది. విశాఖ శారాదాపీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానంద పర్యవేక్షణలో యాగం పూర్ణాహుతిని నిర్వహించినట్టు తెలిపింది. అలాగే, జగన్‌కు బదులు ప్రధాన రిత్వికులు వరుణ తీసుకుని యాగాన్ని పూర్తి చేసినట్టు వివరించింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు కేసీఆర్ సలహాతోనే జగన్ కూడా యాగం నిర్వహించారని తెలుస్తోందని ‘బెంగళూరు మిర్రర్’ పేర్కొంది.

‘‘ఒక పార్టీ చేసిన ఫిర్యాదును బట్టి, ఎలాంటి స్వతంత్ర విచారణ లేకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని అడగకుండా.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఏపీ ఉన్నతాధికారులను బదిలీ చేసిందని వార్తలు వస్తున్నాయి.. అదే నిజమైతే కచ్చితంగా అపశ్రుతి దొర్లినట్లే’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ‘ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉంది.. ప్రజలు, పార్టీలు, పత్రికలు దానికి మద్దతునిస్తున్నాయి. కోర్టులు అసాధారణ సమయాల్లో తప్ప జోక్యం చేసుకోకుండా గౌరవమిస్తున్నాయి. దాన్ని కాపాడుకోకుండా ఎవరో చేసిన ఫిర్యాదును బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని అభిప్రాయపడ్డారు.

game 27032019

రాజ్యాంగం ఇచ్చిన విచక్షణాధికారాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం. మేమే రాజులం.. చక్రవర్తులం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే పొరపాటని, కచ్చితంగా ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు జవాబు దారీతనంగా ఉండాల్సిందేనన్నారు. ప్రభుత్వ అధికారుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల నిర్వహణకు ప్రమాదకరం అన్నారు. ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు. ఘటనపై స్వతంత్ర విచారణ చేసి, పారదర్శక నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన తన నివాసంలో ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.

game 27032019

ఈవీఎంలు, వీవీప్యాట్‌లు బాగానే పనిచేస్తున్నాయి. పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న దానికి ఆధారాల్లేవు. ఆ భయాన్ని వదిలేసి.. ఎన్నికల నిర్వహణపై నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇదే సమయంలో అనుమానాలున్న చోట కనీసం 5-10శాతం వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఆచరణ సాధ్యమైతే ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందుకు వస్తుందనే నమ్ముతున్నా. ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి. అదే యంత్రాలతో మళ్లీ గెలుస్తున్నారంటే వాటిని ట్యాంపర్‌ చేయడానికి వీలులేదనే విషయం స్పష్టం అవుతుంది.

నిన్న మదనపల్లిలో ఎన్నికల సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సైకిల్ పాతపడిపోయిందని, సైకిల్ చైన్ కేసీఆర్ తెంపేశారని అన్నారు. అసెంబ్లీకే రాని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిచారు. ఏ పార్టీతోనైనా పొత్తు కావాలంటే బహిరంగంగానే ప్రకటన చేస్తానని అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యల పై చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సైకిల్ చెయిన్ పీకేశాడు అంటూ టీడీపీ పై పవన్ వ్యంగ్యాస్త్రాల పై రావులపాలెం సభలో ప్రస్తావించిన చంద్రబాబు.. కేసీఆర్‌కు ఆ శక్తి ఉందా అని ప్రశ్నించారు. సైకిల్ జోరు పెంచితే.. బుల్లట్‌లా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘సైకిలు వెనక్కి పోతుందా.. సైకిల్ సత్తా ఏంటో కేసీఆర్‌కు తెలుసు! ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినోడే.

counter 29032019

అలాంటి వాడు సైకిల్ చైన్ పీకేస్తాడా.. బుల్లెట్‌లా దూసుకుపోతుంది తప్ప.. వెనక్కిపోదు. అడ్డం వచ్చినోళ్లను తొక్కుకుంటా పోతుంది’’ అంటూ తనదైన శైలిలో పవన్‌కు సమాధానమిచ్చారు. రాయలసీమలో కియా కారు పరుగెడుతోందని.. అదీ మన ప్రతిభ అని చెప్పారు. సినిమా యాక్టర్‌ను నమ్ముకున్నా లాభం లేదన్నారు. సైకిల్‌ చైన్‌ను ముట్టుకుంటే షాక్‌ కొడుతుందని.. జాగ్రత్తగా ఉండాలంటూ విపక్షాలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌ డబ్బులు పంచి 88 సీట్లు గెలిచారని.. కాంగ్రెస్‌, తెదేపా సభ్యులనూ లాక్కొన్నారని ఆరోపించారు. అందరికీ ఒకరో ఇద్దరో చెల్లెళ్లు ఉంటారని.. తనకు మాత్రం కోటి మంది ఉన్నారన్నారు. ఇంతమంది అండ ఉంటే మోదీ, కేసీఆర్‌, జగన్‌కు భయపడతామా అని ప్రశ్నించారు. త్వరలో మహిళలకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామని.. సమస్యలను యాప్‌ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. ఐదేళ్లుగా తెలంగాణ కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

counter 29032019

రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు కేంద్రం 750 పురస్కారాలు ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టును దిల్లీలో ప్రశంసిస్తారని.. ఇక్కడ తిడతారని భాజపా నేతలను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని చంద్రబాబు అన్నారు. మీడియా సహా అన్ని వ్యవస్థలనూ మోదీ బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వియత్నాం సైనికులు, ప్రజల్లా అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. మోదీ, కేసీఆర్‌ మనపై దాడి చేస్తుంటే వైకాపా దానికి వంతపాడుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఆ ముగ్గురూ పరస్పరం విమర్శించుకోరని దుయ్యబట్టారు. భాజపా, తెరాస, వైకాపా కుట్రలు అర్థమయ్యాయా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలవరం పూర్తయితే కేసీఆర్‌కు వచ్చే నష్టమేంటన్నారు. రాజమహేంద్రవరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read