ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ప్రధాని మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే పర్యటనకు ముందు ఎన్టీఆర్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు. సాయంత్రం తాను కర్నూలులో ప్రసంగించబోతున్నానని తెలిపారు. మహోన్నత ఎన్టీఆర్‌ ఆదర్శాలకు నీళ్లొదిలారన్నారు. మోసపూరిత టీడీపీ పాలనలో ఏపీలో అవినీతి... బలహీనమైన పరిపాలనతో ఏపీ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. యువత కలలు నెరవేర్చడానికి ‘నేను ఏపీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు’ మోదీ ట్వీట్ చేశారు. దీని పై చంద్రబాబు కూడా అదే విధంగా ఘాటుగా ట్వీట్ చేసారు. రాష్ట్ర విభజనతో కుదేలైన ఏపీకి అండగా ఉంటానని వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ మాట ఇచ్చారని... మాటను నిలబెట్టుకోకుండా, ఏపీకి నమ్మక ద్రోహం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

moditweet 29032019 1

ఆర్థిక నేరస్థులతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. లక్ష కోట్లు దోచుకున్న ఆంధ్ర నేరస్తులను కటకటాల వెనక ఉంచుతానన్న మోదీ ఇప్పుడు వారితోనే జతకట్టారని విమర్శించారు. ఒక్క విభజన హామీని కూడా అమలు చేయని మోదీ... సిగ్గులేకుండా వైసీపీకి సాయం చేయడానికి ఏపీకి వస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు మేలుకోవాలని... రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థను, యువతను, రైతులను, వ్యాపారులను, మైనార్టీలను సంక్షోభంలోకి మోదీ నెట్టేశారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. మాట నిలబెట్టుకోవడం చేతకాక ఏపీకి నమ్మక ద్రోహం చేసిన మోదీ.. ఆర్థిక నేరస్థులతో కలిసి కుమ్మక్కయ్యారనిచంద్రబాబు విమర్శించారు.

moditweet 29032019 1

విభజన గాయాలతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా మోదీ మాటిచ్చారని మరోసారి గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని, లక్ష కోట్లు దోచుకున్న స్కామాంధ్ర ఆర్థిక నేరస్థులను కటకటాల వెనుక ఉంచుతానన్న మోదీ.. ఇప్పుడు వారితోనే జట్టుకట్టారని ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబుతో రాష్ట్రం బంగారు భవిష్యత్‌ వైపు అడుగులు వేస్తుందని మోదీనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్ఠు పట్టించడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులను, యువకులను, వ్యాపారులను, మైనారిటీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా.. వైకాపాకు సాయం చేయడానికి నిస్సిగ్గుగా మోదీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు మేల్కోవాలని, ధర్మపోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యర్ధులను లొంగదీసుకోవడానికి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థులు లొంగకుంటే వారి బంధువులను, అనుచరులను వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇలాంటి పన్నాగాన్ని రచించిన వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. వైసీపీ తీరును పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లాకు టీడీపీ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తెచ్చింది. కియో కార్ల పరిశ్రమతో పాటు, గోదావరి జలాలను జిల్లాకు తీసుకువచ్చి సస్యశామలం చేసింది. అయితే అభివృద్ధే ఎజెండాగా టీడీపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా జిల్లాలో ఎదగాలని ఈ పార్టీ చూస్తోంది.

kalva 29032019

గత ఎన్నికల్లో భంగపడ్డ వైసీపీ ఈ సారి జిల్లాలో అత్యధిక స్ధానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులోభాగంగా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు ప్రచారంపై వైసీపీ రెక్కీ నిర్వహించింది. నిఘా పెట్టి రహస్యంగా ఫొటోలు, వీడియోలు సేకరిస్తున్న 21 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఏలూరు, భీమవరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కాల్వ శ్రీనివాసరావు ప్రచార బృందంలో కలిసిపోయి ఆయన కదలికలను వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. దీన్ని ముందే పసిగట్టిన టీడీపీ నేతలు ఆ గ్యాంగ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం భీమవరం బ్యాచ్‌‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

kalva 29032019

టీడీపీ కార్యక్రమాలపై భీమవరం బ్యాచ్‌ నిఘా వేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాల్వ శ్రీనివాసులు బంధువులను భీమవరం బ్యాచ్‌ బెదిరించినట్టు గుర్తించారు. వైసీపీకి అనుకూలంగా లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. భీమవరం బ్యాచ్‌కు రాయదుర్గం వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డితో బంధుత్వం ఉన్నట్లు సమాచారం. వైసీపీ అనుసరిస్తున్న తీరును పలువురు తప్పబడుతూ ఆ పార్టీ చర్యలను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పోటీ చేస్తున్న కాల్వ శ్రీనివాసరావు కదలికల్ని రహస్యంగా చిత్రీకరిస్తున్న కొండా శివనాగరాజు అనే యువకుడిని టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి పట్టుకున్నారు. అతడిని విచారించడంతో తనతో పాటు ఇంకో 21 మంది ఉన్నారని నాగరాజు చెప్పాడు. దీంతో ఆ 21 మందిని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. విచారణలో వీరంతా కాల్వ శ్రీనివాసరావు ప్రచారం, కదలికల ఫొటోలు, వీడియోలను వైసీపీ రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డికి అందిస్తున్నట్లు తేలింది. వీరంతా కాపు రామచంద్రారెడ్డి వియ్యంకుడు శ్రీరామరెడ్డికి చెందిన కంపెనీలో పనిచేస్తున్నారు’ అని తెలిపారు.

రెండు రోజుల క్రిందట, పవన్ కళ్యాణ్ సన్నిహితులు పై, వాళ్ళ కంపెనీల పై ఐటి దాడులు జరిగాయనే వార్తలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ, కేసీఆర్, బీజేపీ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలతో, పవన్ ను లొంగదీసుకునే ప్రయత్నంలో భాగంగా, ఈ కుట్రలకు తెర తీసారు. దీని వెనుక విజయసాయి రెడ్డి స్కెచ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే, ఇప్పుడు పవన్ పర్యటనను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కలయన్ హెలికాప్టర్ ఉపయోగించి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే నిన్న జగన్ సొంత ప్రాంతం కడపలో పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పవన్ కళ్యాణ్ కు హెలికాప్టర్ పెర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇంతక ముందు కూడా ఇలాగే చేసారని, అది సాంకేతిక పరమైన అంశం ఏమో అని వదిలేశామని, కాని ఇప్పుడు పదే పదే ఇలా చేస్తుంటే, కావలని చేస్తున్నారని అర్ధమవుతుందని అంటున్నారు.

pk 29032019

దీని పై పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. ‘నేను ఎవరితో మాట్లాడినా వారి భాగస్వామి అంటున్నారు. జగన్‌ అమిత్‌షాలే భాగస్వాములు. రాయలసీమలో అడుగు పెట్టకుండా చేసేందుకు అనేక కుట్రలు పన్నారు. నాకు ఇవాళ హెలికాప్టర్‌ అనుమతి రద్దు చేశారు. ఎందుకని ప్రశ్నిస్తే దిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి డైరెక్షన్‌ ఎవరు ఇస్తున్నారు. జగన్‌ ఇచ్చారా?.. భాజపా వాళ్లు ఇచ్చారా.. జగన్‌లా నేను డొంక తిరుగుడుగా చేయను. దొంగయవ్వారాలు చేయను’ అని జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కడప సభలో విరుచుకుపడ్డారు. ఈ రోజు సభకు హెలికాప్టర్‌లో రావాలనుకుంటే.. హెలికాప్టర్‌ పర్మిషన్‌ను రద్దుచేశారని, ఎక్కడి నుంచి డైరక్షన్‌ వచ్చిందో తెలియడంలేదన్నారు. జగన్‌ ఇచ్చారా? లేకపోతే భాజపా నేతలు ఇచ్చారో అర్థంకావడంలేదని పవన్‌ వ్యాఖ్యానించారు. జగన్‌లా తాను డొంకతిరుగుడు రాజకీయాలు చేయబోనని, రాయలసీమ పద్ధతిలో ముఖస్తుతి లేకుండా మాట్లాడగలని చెప్పారు.

pk 29032019

‘‘నేను రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్‌ని. ఆ తర్వాతే అన్నీ తెలుసుకొని రాజకీయాల్లోకి వచ్చా. నీవు రాజకీయాల్లోకి రాక ముందే జైలులో ఉండి వచ్చావు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని’’ జగన్‌పై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఏ పరిశ్రమ వచ్చినా స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దరఖాస్తుల కోసం వసూలు చేసిన సొమ్ముతో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ఉద్యోగాలకు దరఖాస్తుకు ఒకేసారి రుసుం చెల్లిస్తే చాలన్నారు. ‘నేను ఓ పింఛను ఉద్యోగి కుమారుడిని. మా నాన్న పింఛను డబ్బులను మా అమ్మ పార్టీ కోసం ఇచ్చింది. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానం కొనసాగించి ఉద్యోగులకు భద్రత కల్పిస్తాను. రాష్ట్రంలో లక్ష ఎకరాలు భూసేకరణ చేసి యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి మంచి రైతులుగా తీర్చిదిద్దుతాను. పదో తరగతి వరకు చదువుకున్న 25 వేల మందిని పోలీసు సహాయకులుగా ఉపాధి కల్పిస్తాం’ అని పవన్‌ తెలిపారు.

వైసీపీ తరఫునప్రచారానికి రాలేమని, తాము జనసేనకు ఓటేస్తామని చెప్పినందుకు ఒక ఇంటి యజమాని.. అద్దెకు ఉంటున్న దంపతులపై కక్ష పెంచుకుని వారిపై దాడికి పాల్పడ్డాడు. గర్భిణి అనే కనికరమైనా లేకుండా ఆమెను జట్టుపట్టుకుని రోడ్డు మీదకు తోసేశాడు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో జరిగిందీ ఘటన. బాధితురాలి కథనం ప్రకారం.. నియోజకవర్గ పరిధిలోని పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతంలోని పిట్ట వీధిలో.. ఎన్‌.నాగమణి, సిద్దు అనే జంట స్థానిక వైసీపీ నేత, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి పిట్ట నాగేశ్వరరావు ఇంట్లో మూడేళ్లుగా అద్దెకుంటున్నారు. సిద్దు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు పనులకు వెళ్తుంటాడు. సిద్దు, నాగమణి దంపతులకు మూడేళ్లపాప ఉంది. నాగమణి ప్రస్తుతం నాలుగో నెల గర్భిణి.

gaajuwaaka 29032019

ఇటీవలే ఆమెను పరీక్షించిన వైద్యురాలు.. ఆమె బలహీనంగా ఉన్నదని, విశ్రాంతి అవసరమని చెప్పారు. ఎండవేడి తగలకుండా జాగ్రత్తపడాలని సూచించారు. దీంతో వారు ఈఎంఐ పద్ధతిలో ఏసీ కొనుక్కుని.. ఇంట్లో బిగించుకునేందుకు యజమాని అనుమతి తీసుకున్నారు. ఇంతలో.. ఎన్నికల ప్రచారం మొదలైంది. స్థానిక వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి రావాలని.. దంపతులిద్దరికీ ఒక్కో ఓటుకూ రూ.వెయ్యి చొప్పున ఇస్తానని యజమాని పది రోజుల క్రితం నాగమణి దంపతులను కోరారు. అందుకు వారు నిరాకరించారు. నాగమణి గర్భిణి కాబట్టి బయటకు రాదని.. అయినా తాము పవన్‌కల్యాణ్‌ అభిమానులమని, జనసేనకే ఓటు వేస్తామని చెప్పారు. దీంతో యజమాని నాగేశ్వరరావు.. ‘ఎక్కడో బయట నుంచి వచ్చే పవన్‌కల్యాణ్‌కు ఓటు వేస్తే...ఏం ఉద్ధరిస్తాడు’ అంటూ గొడవ చేసి వెళ్లిపోయారు. తర్వాత వారు ఏసీ బిగించుకునే ప్రయత్నంలో ఉండగా నాగేశ్వరరావు కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఏసీ బిగించొద్దని, వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హకుం జారీ చేశారు.

gaajuwaaka 29032019

ఉన్నపళంగా ఖాళీ చేయాలంటే తాము ఎక్కడికి వెళ్లగలమని.. కొంత సమయం కావాలని.. నాగమణి దంపతులు ఆయన్ను కోరారు. దీనిపై వారి మధ్య మరోమారు వాగ్వాదం జరిగింది. ఈ నెల 19వ తేదీ రాత్రి నాగేశ్వరరావు, వారి బంధువులు మద్యం మత్తులో వచ్చి సిద్దు, నాగమణి ఉంటున్న పోర్షన్‌లోకి చొరబడ్డారు. సిద్దుపై దాడికి దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నాగమణి జుట్టు పట్టుకుని విసురుగా బయటకు తోసేశారు. దీంతో ఆమె ఇనుప గ్రిల్‌ను గుద్దుకుని కింద పడిపోయింది. నాగేశ్వరరావు ఆ ఇద్దరినీ బయటే ఉంచేసి ఇంటికి తాళం వేసి.. ‘ఏం చేసుకుంటారో చేసుకోండ’ంటూ వెళ్లిపోయారు. యజమాని దాడి వల్ల నాగమణికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోగా వెంటనే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. గర్భిణి అని చూడకుండా తనపై, తన భర్తపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేసింది. తాము ఎవరికి ఓటు వేయాలో ఇంటి యజమానే నిర్ణయిస్తాడా? అంటూ ప్రశ్నిస్తోంది. ఆమె పొట్ట భాగంపై దెబ్బ తగిలిందని.. అబార్షన్‌ జరిగే ప్రమాదం 30 శాతం దాకా ఉందని వైద్యులు చెప్పారని నాగమణి తల్లి లత ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read