బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి ఆ పార్టీ నాయకత్వం ఊహించని షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించడం లేదనీ... ఎక్కడా ఆయన పోటీ చేయవద్దనీ ఆదేశించింది. ఈ మేరకు ఆయన తన నియోజకవర్గం కాన్పూర్ ప్రజలకు రాసిన లేఖలో స్వయంగా వెల్లడించారు. ‘‘ప్రియమైన కాన్పూర్ ఓటరులారా... నేను కాన్పూర్ సహా మరెక్కడా ఎన్నికల్లో పోటీ చేయరాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంలాల్ తెలియజేశారు. ..’’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం కోసం బీజేపీ ఇవాళ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కూడా ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిలకు స్థానం లభించలేదు.

adwani 26032019

మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్‌కే ఆడ్వాణీలతో పాటు బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో జోషి కూడా ఒకరు. ఎల్‌కే ఆడ్వాణీకి కూడా బీజేపీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన నియోజవర్గం గాంధీనగర్ టికెట్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షాకి కేటాయించారు. ఎల్‌కే అడ్వాణీ 1991 నుంచి ఆరు సార్లు గాంధీ నగర్‌‌ నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించారు. 1996లో వాజ్‌పేయి కూడా గాంధీ నగర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 85 ఏళ్ల మురళీ మనోహర్ జోషి... 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కోసం వారణాసి స్థానాన్ని త్యాగం చేశారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తీరా ఇప్పుడు కాన్పూర్ నుంచి కూడా పార్టీ నాయకత్వం ఆయనను తప్పించింది.

 

adwani 26032019

ఇప్పటికే గాంధీనగర్‌ నుంచి తప్పించినందుకు గానూ భాజపా సీనియర్‌ నేత లాల్‌కృష్ణ అడ్వాణీ అసంతృప్తి వ్యక్తం చేసిన తెలిసిందే. అలాగే తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్‌ జోషి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తన పోటీ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అది స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్‌ పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. కాన్పూర్‌ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.

ప్రధాని మోదీ కుట్రలకు భయపడేది లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. గుంటూరులో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ద్రోహాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టానన్న కక్షతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈడీ, ఐటీ దాడులతో ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు. బడ్జెట్‌ ప్రసంగం తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చి 8 గంటలకు పైగా ప్రశ్నించారు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాను. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఇదంతా చేస్తున్నామని చెప్పి మొదటసారి కంటే రెండోసారి బాగా మాట్లాడి పంపించారు’.. అని ఎంపీ జయదేవ్‌ వివరించారు.

galla 26032019

తెలుగు రాష్ట్రాల్లో పక్కాగా పన్ను చెల్లిస్తున్న నంబర్‌వన్‌ ట్యాక్స్‌ పేయర్ని.. ఐటీ సంస్థ అవార్డులు కూడా ఇచ్చిందన్నారు. నా వద్ద ఏమీ దొరకలేదని.. నా బంధువులు, స్నేహితులను వేధిస్తున్నారని.. సినీనటుడు మహేష్‌బాబుకు చెందిన సంస్థలపై రెండుసార్లు ఐటీ దాడులు చేయడం ఇందులో భాగమేనన్నారు. కుటుంబాన్ని, వ్యాపారాన్ని రిస్క్‌లో పెట్టి పని చేస్తున్నానని తెలిపారు. బ్రిటీష్‌ వాళ్లతో పోరాడి తన తాత రాజగోపాలనాయుడు ఆచార్య ఎ.జీ.రంగాతో పాటు జైలుకు వెళ్లారని.. ఇప్పుడు మోదీతో పోట్లాడి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

galla 26032019

గల్లా జయదేవ్‌ సోమవారం ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. మిర్చి, పసుపు మద్దతుధర కోసం లోక్‌సభలో మాట్లాడినట్టు తెలిపారు. దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరానన్నారు. గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.903 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారెవరైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రధానిని ఎదిరించి లోక్‌సభలో మాట్లాడానని.. వెంటనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు. ఆదాయ పన్ను అధికారులు దాడులు చేస్తామని తనను బెదిరించారని తెలిపారు. పన్నులు సరిగా కట్టడం వల్ల తనవైపు రాలేకపోయారన్నారు. తననేమీ చేయలేక తన బావ హీరో మహేశ్‌బాబుపై ఐటీ దాడులు చేసినట్టు గల్లా ఆరోపించారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో మాకు అంత బలం లేదన్నది నిజం. కానీ... టీడీపీ ఓటమికి గట్టిగా కృషి చేస్తున్నాం. ప్రధాని మోదీపై చంద్రబాబు దాడి మొదలుపెట్టారు. ఇదొక తప్పిదమైతే... మా బద్ధ శత్రువైన కాంగ్రె్‌సతో చేతులు కలపడం అంతకంటే ఘోర తప్పిదం. అలాంటప్పుడు ఆయనను దెబ్బతీయకుండా ఎలా వదిలేస్తాం! ఇందుకు తగిన ప్రణాళికలు ఎప్పుడో సిద్ధమయ్యాయి! సీమాంధ్రలో తెలుగుదేశం ఫినిష్‌ అయితే... రెండో పార్టీగా మేమే బలం పుంజుకుంటాం!’’ .... బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పిన మాట ఇది! విషయం సుస్పష్టం! నవ్యాంధ్రకు చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఇచ్చినా, ఇవ్వకపోయినా... నోర్మూసుకోవాలి! నిలదీయవద్దు, ప్రశ్నించవద్దు! ఇక... మోదీపై పోరు మొదలుపెడితే... ‘ఫినిష్‌’ చేస్తాం! సీమాంధ్రకు ఢిల్లీ బీజేపీ పెద్దలు పంపిస్తున్న హెచ్చరికలివి! విభజన హామీలతోపాటు ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరుకు దిగిన చంద్రబాబు... ఈ విషయంలో చాలా దూరం వెళ్లారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతోపాటు... బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పార్టీలను ఒక్కటి చేశారు. ఇది.. కమలం పెద్దలకు కంటగింపుగా మారింది! ‘ఏదిఏమైనా సరే, ఏపీలో టీడీపీ రావొద్దు’ అని బీజేపీ నిశ్చయించుకుంది. త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇవి ఢిల్లీ, హైదరాబాద్‌ కేంద్రంగా అమలవుతున్నాయి. బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌ సమన్వయంతో వ్యవహరిస్తూ.. తమ ఉమ్మడి శత్రువైన చంద్రబాబుపైకి అనేక అస్త్రాలు గురిపెట్టినట్లు తెలుస్తోంది.

టీడీపీని దెబ్బ తీసేందుకు రచించిన వ్యూహాల్లో ఒకటి.. ‘ఆర్థిక దిగ్బంధం’! టీడీపీకి మొదటి నుంచీ ఆర్థిక సహకారం అందిస్తున్న సుమారు 20మంది పారిశ్రామిక వేత్తలపై ఢిల్లీ స్థాయిలో గురిపెట్టారు. ఐటీ, ఈడీతో సహా వివిధ సంస్థలను వారిపైకి ప్రయోగిస్తున్నారు. తాఖీదుల మీద తాఖీదులు పంపడం, సోదాలకు దిగడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. రాయలసీమకు చెందిన ఒక అధికారి ద్వారా ‘నోటీసుల’ పర్వం నడిపిస్తున్నారు. ‘ఏదో ఒక నెపంతో నోటీసులు పంపండి’ అంటూ పైస్థాయి నుంచి ఆదేశాలు వస్తున్నట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు. అలాగే.. టీడీపీకి నిధుల సరఫరా అడ్డుకోవడంతోపాటు, వైసీపీకి మాత్రమే ఆర్థికంగా సహకరించేలా చూడటం కూడా ఈ వ్యూహంలో భాగమే. ఇది ప్రధానంగా హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తోం ది. తెలంగాణతో ఆర్థిక ప్రయోజనాలు ముడిపడిన సీమాంధ్ర పారిశ్రామిక వేత్తలను పిలిపించి మరీ హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ‘మీరు టీడీపీకి మద్దతు ఇస్తే.. ఇక్కడ వ్యాపారాలు చేసుకోలేరు. మద్దతైనా, విరాళాలైనా వైసీపీకే ఇవ్వాలి’ అని సూటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘అవసరమైతే శ్రీకాకుళానికి వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటా. మీ బెదిరింపులకు మాత్రం లొంగ ను. మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి’ అని ఒక వ్యాపారి తేల్చిచెప్పినట్లు తెలిసింది.

త్రిముఖ వ్యూహంలో మరొకటి టీడీపీ అభ్యర్థులను ఎగరేసుకుపోవడం. ఇక్కడ కూడా పారిశ్రామికవేత్తలైన నాయకులపైనే గురి. ‘మీరు టీడీపీ తరఫున పోటీ చేయవద్దు. వైసీపీలో చేరిపోండి’ అని ఆదేశించి, టికెట్‌ కూడా ఖరారు చేయిస్తున్నారు. కాదూ కూడదంటే.. ‘మీ వ్యాపారాలు క్లోజ్‌’ అని హెచ్చరికలు పంపిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక ప్రముఖ వ్యాపారి.. ఆఖరి నిమిషంలో వైసీపీలో చేరిపోయారు. అక్కడ ఆయనకు ఎంపీ టికెట్‌ ఖరారైంది. ఆయనపై తెలంగాణతోపాటు.. తమిళనాడు ద్వారా కూడా ఒత్తిడి చేయించినట్లు సమాచారం. ఇక.. వ్యాపారం దాదాపు దివాలా తీసి కష్టాల్లో ఉన్న మరో పారిశ్రామికవేత్తకూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ‘బ్యాంకులు ఆర్థికంగా ఆదుకోవాలంటే వైసీపీ తరఫున పోటీ చేయండి’ అని చెప్పడంతో... ఆయన సైకిల్‌ దిగి, ఫ్యాను కింద కూర్చున్నారు. టీడీపీని ఒకవైపు ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీస్తూనే... మరోవైపు నుంచి వైసీపీ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌ ద్వారా మైండ్‌గేమ్‌కు తెరలేపడం మరో వ్యూహం! ‘అనుకూలమైన’ సర్వేలు చేయించడం, ఆ సమాచారాన్ని లీక్‌ చేయడం ఇందులో కీలకం! అలాగే... ‘ఫలానా నేత పార్టీ మారుతున్నారు’ అంటూ తప్పుడు వార్తలు సృష్టి తీసుకొస్తారు. జగన్‌ మీడియాతోపాటు సోషల్‌ మీడియా ద్వారా ఆ వార్తలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తారు. ఉదాహరణకు... ఇటీవల ఒక టీడీపీ నాయకుడు విజయవాడలో లోకేశ్‌తో ఉండగానే ఆయన లోట్‌సపాండ్‌లో జగన్‌ను కలవనున్నట్లు ప్రచారం చేశారు. ఇలాంటివన్నీ మైండ్‌గేమ్‌లో భాగమే. నిజానికి... ఈ వ్యూహాన్ని కర్ణాటక ఎన్నికల్లోనూ బీజేపీ అమలు చేసింది. చంద్రబాబు విషయంలో మరింత బలంగా అమలు చేస్తోంది.

చంద్రబాబు తరుపున ప్రచారం చెయ్యటానికి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా సోమవారం విజయవాడ చేరుకున్నారు. ఆయన కొందరు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘‘ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి ఇక్కడికి వచ్చాను. అబ్బో... ఏం ఎండలు, వేడి తట్టుకోలేపోయాను. ఆ రోజు నా హోటల్‌ గదిలో ఏసీ కూడా పనిచేయలేదు. రాత్రంతా నిద్రలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా.. ఎప్పుడు కశ్మీర్‌ వెళ్లిపోదామా? అని రాత్రంతా ఎదురు చూశాను అంటూ గతాన్ని ఫరూక్‌ గుర్తుచేసుకున్నారు. ‘‘మీకు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు... మాకు 12 డిగ్రీలు ఉంటుంది మీరంతా కశ్మీర్‌కి రండి. చల్లదనాన్ని ఆస్వాదించండి.’’ అని వ్యాఖ్యానించారు.

farooq 26032019

మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘భాజపా పాలకులు వచ్చాకే... రాముడు మా వాడు, అల్లా మీ వాడు అంటూ విభేదాలు సృష్టిస్తున్నారు. అదో పెద్ద విషాదం. నేను ముస్లింని. నా భార్య ఇంగ్లిషు వనిత. ప్రతి ఒక్కరూ ఈ నేల నాదని భావించినప్పుడే సామరస్యంగా జీవించగలరు’’ అని చెప్పారు. చంద్రబాబు మైనార్టీల పట్ల తన సుహృద్భావాన్ని గతంలోనే నిరూపించుకున్నారని, ఇదే సందేశాన్ని రాష్ట్రంలోని మైనార్టీలకు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఇస్తానని చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సోదర రాష్ట్రాలు. రెండు రాష్ట్రాలు ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకోవాలి. మోదీ ఒక్కరే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చగలరని కేసీఆర్‌ అనుకుంటే తప్పు.’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

farooq 26032019

‘‘మేం ప్రజల కోసం మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నాం. విజయం సాధిస్తామన్న ఆశ ఉంది’’ అని చెప్పారు. ఏపీకిచ్చిన ఏ హామీని కేంద్రంలోని భాజపా నాయకులు అమలు చేయలేదు..మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు అని ఆయన చెప్పారు.‘‘ బాలాకోట్‌ దాడులకు ముందు రామమందిరం గురించి మాట్లాడినవాళ్లు ఇప్పుడు మాట్లాడటం లేదు. దాడుల తర్వాత కశ్మీరులో ఉగ్రవాదం తగ్గిందా? పాక్‌కు నిజంగానే గుణపాఠం చెప్పగలిగారా? అని ప్రశ్నించారు. మోదీ న్యూజిలాండ్‌ ప్రధానిని చూసి నేర్చుకోవాలని ఫరూక్‌ అభిప్రాయపడ్డారు. కోరేగావ్‌లో ఒక కుటుంబంపై 40 మంది గూండాలు దాడి చేస్తే, ఆ కుటుంబానికి మద్దతుగా ప్రధాని మోదీ ఒక్క మాటా మాట్లాడలేదు, అదే న్యూజిలాండ్‌ ప్రధాని మసీదులో జరిగిన దాడుల్లో చనిపోయిన వారికి చెందిన ప్రతి కుటుంబాన్ని పరామర్శించారని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read