పోలీసులుగా చట్ట పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, దానికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఏ పార్టీ వారైనా తమకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసులు పనిచేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు బదులిచ్చారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విషయంపై ఫిర్యాదు చేస్తే నిందితులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

vs 24032019

ఈ నెల 28వతేదీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నామని, సదరు సమావేశంలో ఎవరైనా తమ వద్ద ఉన్న నిర్దుష్ట సమాచారాన్ని పోలీసులకు తెలియజేయవచ్చన్నారు. పోలీసులు తనను లక్ష్యంగా ఎంచుకున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యాఖ్యానించారన్న విలేకరుల ప్రశ్నకు- ‘వాళ్లు రాజకీయ నాయకులు, ఏమైనా మాట్లాడుతారు. మేం ఇక్కడ కూర్చొని ఏమీ మాట్లాడలేం.. యూనిఫాం లేకపోతే మేమూ వంద మాట్లాడగలం’ అని బదులిచ్చారు. చీరాలలో పాత కేసులను తిరగదోడి అరెస్టులకు దిగుతున్నామనేది అవాస్తవమని, దర్యాప్తు పెండింగ్‌లో ఉన్న కేసుల్లో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

vs 24032019

ఎన్నికల నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాంటూ జిల్లా ఎస్పీతో పాటు పలువురిపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన అంశంపై స్పందిస్తూ... ఆ విషయం తన దృష్టికి రాలేదని, అందులో ఏవైనా అభ్యంతరకర అంశాలుంటే న్యాయపరంగా వెళ్తామని బదులిచ్చారు. ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా ఉంటుందని, అసాంఘిక శక్తులను సహించేది లేదని ఎస్పీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ వేడి ఎక్కువగా ఉంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు మీద గతంలో పలు కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ నేతలు డీజీపీ ఠాకూర్, ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ మీద ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జగన్, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు. కేసీఆర్ తీరు మారకపోతే హైదరాబాద్‌లోనే ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ సందర్భంగా చంద్రబాబు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్ధులను టీఆర్ఎస్ బెదిరిస్తోందన్న ఆయన.. కేసీఆర్ సహకారంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ విర్రవీగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తీరు మార్చుకోవాలని.. హైదరాబాద్‌లో నిరసన చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దుని హితవు పలికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా కేసీఆర్ తీరు ఉందన్నారు.

cbn dharna 24032019

ఆంధ్రప్రదేశ్‌కు అతి పెద్ద సమస్య జగనేనన్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి తుఫాన్‌లు, ఆర్ధిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్యన్నారు. ఏపీలో లక్షల సంఖ్యలో ఫేక్ ఫాం-7 దరఖాస్తులు పంపిన వాళ్లపై కేసులు పెట్టాలన్నారు. 85 శాతం ఫాం-7 దరఖాస్తులు బోగస్ అని ఈసీ తేల్చిందని గుర్తు చేశారు. టీడీపీ కుటుంబాన్ని వీడి వెళ్లడానికి ఎవ్వరికీ ఇష్టం ఉండదని కానీ, బెదిరింపుల కారణంగానే కొందరు వైసీపీలోకి వెళ్లారని చెప్పారు. ఎవరైనా అతితెలివి ప్రదర్శిస్తే దండం పెట్టడం మినహా మరేం చేయలేనన్నారు బాబు. కాపులకు ఏమీ చేయలేనని చెప్పిన జగన్ ఇప్పుడు హామీలిస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. టీడీపీ బూత్ కమిటీ కన్వీనర్లు ఈ 3 వారాలు సమర్థంగా పనిచేయాలని, వైసీపీ ప్రలోభాలను ఆధారాలతో సహా బయటపెట్టాలని కోరారు.

cbn dharna 24032019

తెలుగుదేశం మంచి స్వింగ్‌లో ఉందన్నారు. కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేదని వ్యాఖ్యానించిన జగన్‌ మళ్లీ న్యాయం చేస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. జగన్‌ను నేరస్థుడిలా కాకుండా ఇక్కడ రాజకీయ నేతలా చలామణీ అవుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఓ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్‌లో పేర్కొన్న కేసులే నిదర్శనమన్నారు. 48 పేజీల్లో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులేనని.. దేశంలో ఎవరి అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు లేవని చెప్పారు. చిన్నాన్న హత్య విషయంలోనూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం నీచమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. అరాచకాల పార్టీకి ఎవరూ ఓటెయ్యకూడదన్నారు. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐలో తొలిపాఠం జగన్ లాంటి వాళ్ల గురించే ఉంటుందని.. ఇలాంటి నేరాల నిరోధంపై అక్కడ శిక్షణ ఇస్తారని చంద్రబాబు తెలిపారు.

‘రిటర్న్ గిఫ్ట్’ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కంగారొద్దని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శనివారం జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం కవిత ఏబీఎన్‌తో మాట్లారు. కాగా ‘రిటర్న్ గిఫ్ట్’ వ్యవహారంపై కవిత మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. గిఫ్ట్ విషయంలో కంగారుపడొద్దని ఇవ్వాల్సిన టైంలో సీఎం కేసీఆర్ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారన్నారు. ఇప్పుడు మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యమన్నారు. కేసీఆర్‌ని చంద్రబాబు చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారని.. ఆయన విమర్శలకు కేసీఆర్ త్వరలోనే స్పందిస్తారని కవిత స్పష్టం చేశారు. మాకు ఎవరితోనూ యుద్ధం లేదని తెలంగాణను దెబ్బతీసే వారితోనే మా యుద్ధమని ఎంపీ కవిత చెప్పుకొచ్చారు.

108 26112018 1

అయితే చంద్రబాబు ప్రతి సభలో కేసీఆర్ ఆంధ్రా వారి పై చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నారు. ‘‘తప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్న వారంతా నాకు రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తారంట! వారు ఇస్తే తిరిగి మనంకూడా ఇవ్వాలికదా... అందుకే రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఒకే మాట, ఒకే తాటిపైకొచ్చి తెలుగుదేశాన్ని గెలిపించి... దానిని వారికి గిఫ్ట్‌గా ఇవ్వాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘విభజన తర్వాత సీమాంధ్రకు దక్కాల్సిన దాదాపు రూ.లక్ష కోట్లు కొట్టేసిన కేసీఆర్‌... మన రాష్ట్రానికి రూ.500 కోట్లు ఇవ్వాలనుకున్నారట! మోదీయే మట్టీ నీళ్లు ఇస్తే నేనేమిచ్చేదని ఎగతాళిగా మాట్లాడతుంటే మీకు రోషం, కోపం రావడంలేదా తమ్ముళ్లూ! సీమాంధ్రులను రాక్షసులన్న కేసీఆర్‌కు బుద్ధి చెబుతారా... లేదా?’’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో... ‘చెబుతాం’ అని జనం ముక్తకంఠంతో సమాధానం చెప్పారు.

108 26112018 1

ఈ ఎన్నికలు భావితరాల భవిష్యత్‌కు సంబంధించినవని బాబు తెలిపారు. ‘‘లక్షలమంది చెల్లెమ్మలు, తమ్ముళ్లు ఏకం కావాలి. ఓటుతో గెలిపించాలి. మన గెలుపుతో తెలంగాణ, ఢిల్లీకే కాకుండా ప్రపంచానికే సందేశం ఇద్దాం. తెలంగాణ నుంచి రావలసిన రూ.లక్ష కోట్లు ఎందుకురావో, కేంద్రం నుంచి మనకు హక్కుగా దక్కాల్సివి ఎందుకు దక్కవో నేను మళ్లీ సీఎం అయ్యాక చూస్తాను’’ అని గట్టిగా చెప్పారు. 2014లో కాంగ్రెస్‌ ఒక్కస్థానం గెలవకుండా గుణపాఠం చెప్పామని... ఇప్పుడు వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ స్థానం నుంచి కిలారి ఆనంద్‌(కేఏ పాల్‌) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఆయన శుక్రవారం నామపత్రాన్ని కూడా దాఖలు చేశారు. కానీ నామినేషన్‌కు సంబంధించి ఆయన ప్రాథమిక వివరాలతో కూడిన దరఖాస్తును మాత్రమే అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఆ నామినేషన్ పత్రాలు, అఫిడవిట్‌లో ఆయన చాలా భాగం ఖాళీగా వదిలేశారు. నామినేషన్ పేపర్లపై అధికారులు చెప్పే వరకు ఫోటో కూడా అంటించలేదు. విద్యార్హతలేంటో కూడా ఆయన వెల్లడించలేదు. తన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీలను మాత్రమే ఆయన వెల్లడించారు. అంతేకాక నామినేషన్‌కు అవసరమైన పూర్తి పత్రాలు కూడా కేఏ పాల్ అందించలేదని వారు తెలిపారు.

paul 24032019

కిలారి ఆనంద్ పేరుతో ఆయన నామినేషన్ వేశారు. ఇదే ఆయన అసలు పేరు. విశాఖపట్నంలోని న్యూ రైల్వే కాలనీలో ఉన్న తన ఇంటి అడ్రస్‌గా కేఏ పాల్ పేర్కొన్నారు. కానీ తన నామినేషన్‌ను ప్రపోజ్ చేస్తున్న అభ్యర్థుల పేర్లు మాత్రం ఆయన రాయలేదు. తన వయసు 55 ఏళ్లు, పోటీ చేస్తున్నది ప్రజాశాంతి పార్టీ అని మాత్రమే అందులో రాసి ఉంది. కులం, మతం లాంటి వివరాలేవీ అందులో రాయలేదు. నామినేషన్ ప్రక్రియలో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించే అఫిడవిట్‌ను ఆయన జత చేయలేదు. కానీ తన చేతిలో రూ.30 వేల క్యాష్ ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకు ఖాతాతో పాటు ఇతర వివరాలకు సంబంధించి కూడా ఖాళీ ఫారాలు మాత్రమే కేఏ పాల్ జత చేశారని అధికారులు తెలిపారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలన్నింటిని ఈనెల 25వ తేదీలోపు అందజేయాల్సిందిగా రిటర్నింగ్‌ అధికారి ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. మార్చి 26న ఆయన నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు.

paul 24032019

ఇది ఇలా ఉంటే, కేఏ పాల్ బసచేసిన విజయవాడ, హోటల్ ఐలాపురంపై ఈ ఉదయం నుంచి పోలీసు దాడులు జరుగుతున్నాయి. కేఏ పాల్, హోటల్ లోని 301 నంబర్ రూమ్ లో బసచేసి వుండగా, బీ-ఫారాల జారీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని అభియోగాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన తన సహాయకుల నిమిత్తం అదే హోటల్ లో బుక్ చేసుకున్న రూముల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. పార్టీ టికెట్ ఇచ్చేందుకు కేఏ పాల్ డబ్బులను వసూలు చేశారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొందరు బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్ కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో వారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read