తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 36 ఏళ్లు. తెలుగువారి ఆరాధ్య నట నాయకుడు ఎన్టీఆర్‌ 1982లో స్థాపించిన ఈ పార్టీ ఇప్పటి దాకా మిత్ర పక్షాలతో కలిసే బరిలోకి దిగింది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర కోసం లేదా రాష్ట్ర, రాజకీయ అవసరాల కోసం టీడీపీ ప్రతిసారీ మిత్రులతో జత కట్టింది. చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తోంది! రాష్ట్రంలో మిత్రపక్షాల ప్రభావం ఉన్నా.. లేకపోయినా గతంలో ఎక్కువసార్లు వాటితో కలిసే ఎన్నికల బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ.. ఘనవిజయం సాధించిన సందర్భాల్లో మిత్రపక్షాలూ లాభపడ్డాయి. ఆ పార్టీ ఓడిపోయినప్పుడు అవీ నష్టపోయాయి. తెలుగుదేశం పొత్తుల కథాక్రమం ఇదీ.. ఆరంభం: 1983లో మేనక పార్టీతో... 1982లో పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో తొలిసారి పోటీ చేసినప్పుడు టీడీపీకి సంజయ్‌ విచార్‌ మంచ్‌ అనే పార్టీ మిత్రపక్షం. మేనకా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్న ఆ పార్టీకి ఎన్టీఆర్‌ 5 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆఖరు: 2014.. బీజేపీతో.. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాలకు విడివిడిగా జరిగాయి.

madhav 20032019

విభజన తర్వాత నవ్యాంధ్రకు కేంద్రం సహకారం అవసరమన్న అభిప్రాయంతో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొంది. ఈ కూటమి ఆంధ్రలో గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ, నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్న అభిప్రాయంతో నాలుగేళ్లకే ఆ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐతో పొత్తు పెట్టుకొని ఓడిపోయింది. తాజా ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. 1984.. బీజేపీతో పొత్తు.. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మినహా దేశమంతా ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు లభిస్తే అందులో ఒకటి టీడీపీ కూటమి భాగస్వామిగా హన్మకొండ నుంచి దక్కడం గమనార్హం. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. 1989.. అందరినీ కలిపి.. తానోడి.. 1989 ఎన్నికల్లో కూడా అదే కూటమి కొనసాగింది. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రాజీవ్‌గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవడంతో ఇక్కడా ఆ పొత్తు కొనసాగింది. కానీ, రాష్ట్రంలో కూటమి ఓడిపోయి కాంగ్రెస్‌ గెలిచింది. 1994.. జన ప్రభంజనం... 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రభంజనం వీచింది. టీడీపీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసింది. కానీ, అందులో బీజేపీ లేదు. లెఫ్ట్‌ పార్టీలతో కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించింది.

madhav 20032019

1995.. చీలిన టీడీపీ.. 1995లో టీడీపీ రెండుగా చీలిపోయి ఎన్టీఆర్‌ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1996 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆవిర్భావానికి చంద్రబాబు కృషి చేశారు. 1998లో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. టీడీపీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అదే సమయంలో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1999.. మళ్లీ అధికారం.. 1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. ఆ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004.. బీజేపీతో.. 2004లో మరోసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసి వచ్చాయి. అప్పుడూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పింది. 2009.. కూటమి విఫలం.. 2009లో అన్ని పక్షాలతో కూటమి నిర్మాణానికి టీడీపీ ప్రయత్నించింది. టీడీపీ, టీఆర్‌ఎస్‌, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. కానీ నెగ్గలేకపోయాయి.

 

 

హైదరాబాద్‌లో ఆస్తులున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను నామినేషన్‌ వేయొద్దని టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బెదిరింపుల కారణంగానే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీ టికెట్‌ కేటాయించినా ప్రచారం ప్రారంభించకుండా చడీచప్పుడు లేకుండా కూర్చున్నారని అంటున్నారు. నామినేషన్‌ దాఖలు పైనా భిన్నమైన సంకేతాలు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆ ఎమ్మెల్యేలకు ఉన్న ఆస్తులను అధికారాన్ని అడ్డం పెట్టుకొని వివాదాస్పదం చేశారని ఆరోపిస్తున్నారు. ఇద్దరిలో కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలోని ఎమ్మెల్యే ఒకరు కాగా, రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మరొకరు! స్థానికంగా బలమైన నాయకులే. పార్టీ టికెట్లు ఇచ్చింది. గెలుపు ఖాయం! వీరిద్దరికీ హైదరాబాద్‌లో విలువైన ఆస్తులు ఉన్నాయని, ఎప్పుడో రెండు దశాబ్దాల కింద కొన్నారని చెబుతున్నారు.

madhav 20032019

కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, ఆ ఎమ్మెల్యే మాత్రం దిగాలుగా ఇంట్లో కూర్చున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతకు హైదరాబాద్‌లో బాగా ఖరీదైన ప్రాంతంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంది. దానిపై భారీగా పెట్టుబడి పెట్టారు. మంచి ఆదాయాన్ని ఇస్తోంది. ఇటీవల ‘నిబంధనల ఉల్లంఘన’ పేరిట కన్వెన్షన్‌ సెంటర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఆయన ఆందోళనకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ‘‘విలువైన ఆస్తుల విషయంలో సమస్యలు తెచ్చుకోవద్దు. టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరితే మంచిది’’ అని తెలంగాణ ముఖ్య నేతలు సలహా ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అవతలిపక్షం ఆడుతున్న ‘మైండ్‌ గేమ్‌’ చంద్రబాబు దృష్టికి వచ్చిందని, ఇద్దరు నేతలను పిలిపించుకుని మాట్లాడారని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవాళ్ల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారు. వైసీపీకి సరెండర్‌ కమ్మని వేధిస్తున్నారు.

madhav 20032019

ఏమనుకుంటున్నారు వీళ్లు..? ఇది రాజకీయమా..? ఇదా నీతి? ఇది ధర్మమా..? దీనికి సమాధానం చెప్పకుండా మాపై దాడులు చేయిస్తున్నారు’’ అన్నారు. అలిపిరి దాడిలో తనను చంపేందుకు ప్రయత్నించిన వారిలో వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడైన గంగిరెడ్డి కూడా ఉన్నట్లు చంద్రబాబు ఆరోపించారు. ‘‘మోదీ, జగన్‌, కేసీఆర్‌ ముగ్గురు ఒకటై మనకు అన్యాయం చేస్తున్నారు. వారి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా.. వారికి వదిలేసి ఊడిగం చేద్దామా..?’’ అని ప్రశ్నించారు. పోలవరం కట్టడానికి వీలులేదని కేసీఆర్‌ ప్రభుత్వం రిట్‌ పిటీషన్‌ వేసింది. ఎందుకు వేశారని నేను అడుగుతున్నా?’’అని ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే, ఆ కృష్ణా జిల్లా నేత, గన్నవరం తాజా మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ బెదిరింపులకు లొంగని వంశీ, చంద్రబాబు ఇచ్చిన అభయంతో, మరింతగా దూసుకెళ్ళి, గన్నవరం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి జన సందోహం మధ్య నామినేషన్ వేసి, కేసీఆర్ కు ధీటుగా బదులిచ్చారు.

 

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో భారీగా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అసాధారణ రీతిలో సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో 43 శాతం మందిని మార్చి.. కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈ స్థాయిలో మార్పులు ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున 102 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇద్దరు స్వతంత్రులు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత ఆ పార్టీలో చేరారు. వీరితో కలిపి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 127కి పెరిగింది. ఈ సీట్లలో 34 చోట్ల ఈసారి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించారు. ఒకట్రెండు చోట్ల ఎమ్మెల్యేలు బలంగా ఉన్నా ఇతరత్రా సమీకరణల కారణంగా మార్చారు. అటవీ మంత్రి శిద్దా రాఘవరావు తన నియోజకవర్గమైన దర్శిలో బలంగా ఉన్నారు.

aadani 10012019 1

కానీ ఆయన్ను ఒంగోలు లోక్‌సభ స్థానానికి పోటీచేయిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే, మార్కెటింగ్‌ మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా.. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభను రాజంపేట లోక్‌సభకు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును నరసాపురం లోక్‌సభకు నిలుపుతున్నారు. ఇద్దరు మంత్రులు సహా నలుగురు సిటింగ్‌ ఎమ్మెల్యేల సీట్లు మార్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్థానమైన భీమిలిని వదిలి ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు. ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కొవ్వూరుకు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి మార్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్‌ హత్య చేయడంతో.. ఆయన కుమారుడు, గిరిజన సంక్షేమ మంత్రి శ్రావణ్‌కు ఆ టికెట్‌ ఇచ్చారు.

aadani 10012019 1

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయారు. రావెల కిశోర్‌బాబు (ప్రత్తిపాడు) జనసేనలోకి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి (గుంటూరు పశ్చిమ), మేడా మల్లికార్జున్‌రెడ్డి (రాజంపేట), ఆమంచి కృష్ణమోహన్‌ (చీరాల) వైసీపీలోకి వెళ్లారు. ఆ సీట్లలో టీడీపీ కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. ఈసారి అవకాశం లభించని ఎమ్మెల్యేల్లో గౌతు శివాజీ (పలాస), కిమిడి మృణాళిని (చీపురుపల్లి), మీసాల గీత (విజయనగరం), వరుపుల సుబ్బారావు (పత్తిపాడు), పులవర్తి నారాయణరావు (పి.గన్నవరం), పీతల సుజాత (చింతలపూడి), ముడియం శ్రీనివాసరావు (పోలవరం), జలీల్‌ఖాన్‌ (విజయవాడ పశ్చిమ), డేవిడ్‌రాజు (ఎర్రగొండ పాలెం), ఎస్‌వీ మోహన్‌రెడ్డి (కర్నూలు), కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ), మణిగాంధీ (కోడుమూరు), పరిటాల సునీత (రాప్తాడు), యామినీబాల (శింగనమల), హనుమంతరాయ చౌదరి (కల్యాణదుర్గం), చాంద్‌బాషా (కదిరి), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి), తలారి ఆదిత్య (సత్యవేడు), కాగిత వెంకట్రావు (పెడన), జేసీ ప్రభాకర్‌రెడ్డి (తాడిపత్రి) ఉన్నారు. పలాస, చీపురుపల్లి, విజయవాడ పశ్చిమ, పత్తికొండ, రాప్తాడు, శ్రీకాళహస్తి, పెడన, తాడిపత్రిల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేల కుమారులు లేదా కుమార్తెలకు ఈసారి అవకాశం దక్కింది.

 

రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిలోని మూడు లోక్‌సభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ ‘యువ’ దళాన్ని ఎన్నికల బరిలోకి దింపింది. తొలిసారిగా రాజకీయరంగప్రవేశంతో పాటు విద్యావంతులు, టెక్నాలజీపరంగా నిష్ణాతులు, ప్రజలను ఆకర్షించే చురుకైన స్వభావం కలిగిన ముగ్గురిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఒకరు తండ్రి వారసత్వంతో రాజకీయ అరంగేట్రం చేస్తే ఇంకొకరు మామయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. మరొకరు రాజకీయ ప్రస్థానంలో విజయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వారే అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడల నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న గంటి హరీష్‌, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్‌. తెలుగుదేశం పార్టీ జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు విద్యావంతులైన యువతను ఎంపిక చేసింది. 

madhav 20032019

రాజమహేంద్రవరం స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కోడలు రూపను బరిలోకి దింపారు. అమలాపురం రిజర్వుడు లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌ టిక్కెట్‌ దక్కించుకున్నారు. మొదటి దళిత స్పీకర్ గా జీఎంసీ బాలయోగికి అవకాసం ఇచ్చి, దేశ చరిత్రలోనే నవసకానికి చంద్రబాబు నాంది పలికిన విషయం తెలిసిందే. ఇక చలమలశెట్టి సునీల్‌ మరోసారి తన రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు కాకినాడ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్నారు. కసరత్తులపై కసరత్తులు చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ముగ్గురికీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. రాజకీయపరమైన ఒత్తిళ్లను సైతం అధిగమించి ఆశావహుల అనూహ్యమైన పోటీ మధ్య సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరి పేర్లను ఖరారు చేశారు. బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌ తన తండ్రికి కోనసీమలో ఉన్న పలుకుబడితో రాజకీయ అరంగేట్రం చేశారు. మామయ్య మురళీమోహన్‌ రాజకీయ అనుభవాన్ని పుణికిపుచ్చుకున్న కోడలు రూప రాజమహేంద్రవరం నుంచి రంగంలోకి దిగారు. కాకినాడ లోక్‌సభకు మొదటిసారి ప్రజారాజ్యం, రెండోసారి వైసీపీ నుంచి పోటీచేసిన చలమలశెట్టి సునీల్‌ ఈసారి అనూహ్యమైన రీతిలో టీడీపీ నుంచి బరిలో వున్నారు.

madhav 20032019

అమలాపురం అభ్యర్థి హరీష్‌ బీబీఎం పూర్తిచేసి ఐటీ రంగంలో స్థిరపడ్డాడు. తన సాంకేతక నైపుణ్యంతో కొంత కాలంగా టీడీపీ కార్యాలయంలో విశేషమైన సేవలందించారు. తండ్రి బాలయోగి వారసునిగా తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాకినాడ అభ్యర్థి సునీల్‌ ఉన్నత విద్యా కుటుంబం నుంచి వచ్చారు. ఫ్రాన్స్‌లోని షిల్లెర్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ కింద ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సు పూర్తి చేశారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అపార అనుభవం వుంది. రాజమహేంద్రవరం అభ్యర్థిని రూప బీఏ (కార్పొరేట్‌ అండ్‌ సెక్రటరియేట్‌ గ్రూప్‌), డిప్లొమా ఇన్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డవలప్‌మెంట్‌ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్‌ సైకాలజీని యూఎస్‌లోని అరిజోనా యూనివర్శిటీలో (ఫినిక్స్‌ సిటీ) చదివారు. అయితే ఈ ముగ్గురికీ రాజకీయంగా అనుభవం లేనప్పటికీ విద్యాపరంగా ఎంతో అనుభవజ్ఞులు. ముఖ్యంగా జిల్లాలోని ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారు. స్పష్ణమైన ప్రణాళికతో ప్రచారంలోకి దిగుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read