కొన్ని రోజుల క్రితం అనంతపురంలో జరిగిన ఘటనలో, సీనియర్‌ నేత, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్‌ విసిరి వార్తల్లోకి వచ్చిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ గుర్తున్నాడా ? ఈయన్ను చూసి, పోలీస్ అంటే ఇలాగే ఉండాలి, రాజకీయ నాయకులతో ఇలాగే ఉండాలి అని అందరూ అనుకున్నారు. కాని, ఇప్పుడు ఈ మాధవుడు చేసిన పని చూసి, దీని వెనుక కూడా రాజకీయ కోణం ఉందని, ఉద్యోగాల్లో ఉండి కూడా, ప్రభుత్వాల పై ఎంత ద్వేషం ఉందో తెలుస్తుంది. దివాకర్ రెడ్డి పై అంత ఇదిగా మీసం మెలేసి, చివరకు లోటస్ పాండ్ ల తేలాడు, ఈ మాధవుడు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే, సర్వీస్ లో ఉండగా వేసిన వేషాలకు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు.

madhav 20032019

హిందూపురం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. కదిరి సీఐగా పనిచేసిన మాధవ్ రెండు నెలల క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) తీసుకుని జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ ఆయనకు హిందూపురం ఎంపీ టిక్కె్ట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ ఆయనకు షాకిచ్చింది. వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకుని రెండు నెలలైనా శాఖాపరంగా ఆమోదించలేదు. దీంతో ఆందోళన చెందుతున్న మాధవ్ హైకోర్టును ఆశ్రయించారు. మాధవ్ పిటిషన్‌ పై హైకోర్టు ఈ రోజు విచారించనుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఓ పార్టీ తరపున పోటీ చేయడంగానీ, ప్రచారం గానీ చేయకూడదు. మాధవ్ వీఆర్ఎస్ ఇంకా ఆమోదం పొందనందున ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. అయితే తనపై పోలీసులు ఉన్నతాధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాధవ్ ఆరోపిస్తున్నారు. మాధవ్ వ్యవహారం ఎటూ తేలకపోతే ఆయన భార్యను రంగంలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

madhav 20032019

2018 సెప్టెంబర్‌లో అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణలు జరిగాయి. ప్రబోధానం శిష్యులు, స్థానికులు రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. ఈ వ్యవహారంలో తలదూర్చిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రబోధానందకు వ్యతిరేకంగా నడిరోడ్డుపై బైఠాయించిన హల్‌చల్ చేశారు. పోలీసులపైనా రుసరుసలాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురం పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న కదిరి సీఐ గోరంట్ల మాధవ్.. జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసులను అనవసరంగా విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ మీడియా సాక్షిగా మీసం మెలేసి చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకున్న మాధవ్ వైసీపీలో చేరారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని.. సుకర్లబాద్‌లో పెట్రో కెమికల్ బాంబులు కలకలం రేపాయి. ఓ ఇంటి మెయిన్ తలుపునకు, వంటగది తలుపునకు, అక్కడున్న బైక్‌కీ పెట్రో కెమికల్ బాంబులు అమర్చి ఉన్నాయి. తెల్లవారు జామున ఇంటి తలుపు తీసిన ఆ మహిళ... తలుపునకు తాడుతో కట్టి ఏదో కట్టినట్లు ఉండటంతో... అదేంటా అని లాగింది. అంతే... ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. తలుపు విరిగిపడింది. లక్కీగా ఆమెకు ఏమీ కాలేదు. షాకైన ఆ మహిళ కాసేపటికి వంటగది తలుపుకి కూడా అదే విధంగా పెట్రో కెమికల్ బాంబు అమర్చి ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు కాల్ చేసి, కంప్లైంట్ ఇచ్చింది. అక్కడకు వచ్చిన పోలీసులు ఇల్లంతా గమనించారు.

bomb 20032019 1

అప్పుడు తెలిసింది... అక్కడున్న బైకుకి కూడా అలాంటి బాంబే అమర్చి ఉందని. బాంబు స్క్వాడ్ టీం ఆ బాంబుల్ని జాగ్రత్తగా తొలగించింది. ఈ విషయమై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపామనీ, విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బాంబును ఎవరు తెచ్చారు? దాడి చేయడానికి సిద్ధమవుతున్నారా? ఎవరినైనా లక్ష్యంగా చేసుకున్నారా? అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు చెప్పారు.

bomb 20032019 1

ఇది ఇలా ఉంటే, గోరంట్ల మండలం కరావులపల్లిలో నాటు బాంబుల కలకలం రేపింది. వైసీపీ నేత ఆర్.వెంకటరెడ్డి ఇంటి వెనుక చెత్తకుప్పలో నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో నాటు బాంబులు దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబులు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బధ్రత నడుమ ఎన్నికలు నిర్వహించే కసరత్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ, చెక్ పోస్ట్ లు పెట్టి, వాహనాలు చెక్ చేస్తూ, డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు.

కాసేపట్లో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. నామినేషన్‌ సందర్భంగా న్యాయమూర్తి ముందు సీఎం ప్రమాణం చేయనున్నారు. ప్రమాణం చేసిన సర్టిఫికెట్‌ను చంద్రబాబు కుప్పం పంపనున్నారు. కుప్పంలో నామినేషన్‌కు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నందున.. వేరే వ్యక్తితో చంద్రబాబు నామినేషన్‌ పత్రాలను పంపుతున్నారు. చంద్రబాబు ఈనెల 22న కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్‌ వేయడానికి మంచి ముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు. అయితే చంద్రబాబు గత మూడు దఫాలుగా ఎన్నడూ స్వయంగా వచ్చి నామినేషన్‌ వేయలేదు. ఆయన తరఫున పార్టీలోని స్థానిక ముఖ్యులే ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ కుప్పం వచ్చి తండ్రి తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు.

metropoliten 2032019

ఈసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరఫున నామినేషన్‌ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాలేకపోయిన పక్షంలో గతంలో మాదిరే టీడీపీకి చెందిన స్థానిక ముఖ్యులు టీడీపీ అధినేత తరఫున నామినేషన్‌ పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేస్తారని సమాచారం. చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఆరుసార్లు గెలిచారు. ఏడోసారి పోటీ చేసి గెలిచేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. 1989లో కుప్పం నుంచి తొలిసారి పోటీచేసిన చంద్రబాబు అలుపెరుగని జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ఓ సెంటిమెంట్ ఉంది.

 

metropoliten 2032019

సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి వద్ద కొంత నగదు డిపాజిట్ చేయాలి. ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు వచ్చిన అభ్యర్థులకు ఆ డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. అంతకంటే తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోయాడు అంటారు. అయితే చంద్రబాబు నామినేషన్ వేసే సమయంలో తన సొమ్మును డిపాజిట్ చేయరు. ఆయన డిపాజిట్ సొమ్ము కోసం కుప్పం టీడీపీ నేతలు ప్రజల నుంచే విరాళాలు సేకరిస్తుంటారు. 1999 ఎన్నికల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో కూడా చంద్రబాబు డిపాజిట్ నగదు కోసం టీడీపీ నేతలు విరాళాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీఎస్ మునిరత్నం తదితరులు సోమవారం రామకుప్పంలో ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. మరో నాలుగురోజుల పాటు విరాళాలు సేకరించిన తర్వాత ఈ నెల 22న చంద్రబాబు తరపున వెలుగు సంఘాలు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మంత్రి నారా లోకేశ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన లోకేశ్, ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తుండగా పై నుంచి హోల్డింగ్ పడింది. అయిదే, ఆ బోర్డు కాస్తా ఆయనకు దూరంగా పడటంతో నేతలు ఎవరూ గాయపడలేదు. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి నిడమర్రులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద లోకేశ్ మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు కుప్పకూలింది. లోకేశ్ సహా మిగిలిన నేతలంతా దానికి దూరంగా ఉండటంతో అది కార్యకర్తల మీద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో లోకేశ్‌తోపాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ సహా ముఖ్య నేతలు కూడా ఉన్నారు.

lokesh 20032019 1

అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో లోకేశ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాపీ పట్టి భవన నిర్మాణ కార్మికులతో కాసేపు సరదాగా గడిపారు. ఇస్త్రీపెట్టె పట్టుకొని బట్టలు ఇస్త్రీ చేశారు. కూరగాయల మార్కెట్‌లో మహిళలతో ముచ్చటించారు. స్కూల్ విద్యార్థులతోనూ లోకేష్ ముచ్చటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్దిపొందిన ఆనందం, సంతృప్తి ఇక్కడ ప్రతి ఒక్కరిలో కనిపించిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకముందు టీడీపీలో చేరిన బ్రాహ్మణ సేవా సమితి సభ్యులకు పసుపు కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాజధానికి సమీపంలోని నియోజకవర్గం కావడంతో టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

lokesh 20032019 1

అమెరికాలోని స్టాన్‌ఫర్డు యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన నారా లోకేశ్...దేశానికి తిరిగొచ్చాక కొంతకాలం కుటుంబ వ్యాపారాల్లో తలమునకలయ్యారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. 2009 నుంచి నారా లోకేశ్ టీడీపీ వ్యవహారాల్లో తెరవెనుక నుంచి పని మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ 2009 మానిఫాస్టోలో చేర్చిన కాష్ ట్రాన్స్‌ఫర్ స్కీము నారా లోకేశ్ ఐడియాగా టీడీపీ నేతలు చెబుతారు. 2013 మేలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన...తెలుగుదేశం యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. పార్టీలో లోకేశ్ ప్రవేశంతో పాటు 2017 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికై...ఆ తర్వాత కొంతకాలానికే చంద్రబాబు కేబినెట్‌లో చేరారు. ఇప్పుడు లోకేశ్ ప్రజామోదం కోసం ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మంగళగిరి శాసనసభ నుంచి గెలిచి...నాయకుడిగా తనను నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read