దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. 2019 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా గతంలో నేరాలకు పాల్పడి ఉన్నా, కేసులు నమోదై ఉన్నా చెప్పి తీరాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సోమవారం నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 2014 ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలకు భిన్నంగా 2019 నామినేషన్‌ పత్రాల్లో ఈసీ కొన్ని కీలకమైన మార్పులు తీసుకువచ్చింది. 2014లో అభ్యర్థులు తమ నేర చరిత్రను నామినేషన్‌ వేసే సమయంలో ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ ఇవ్వాల్సిన అసవరం లేదు.

108 26112018 1

కానీ, ఈసారి ప్రతి అభ్యర్థి తనకు నేర చరిత్ర ఉంటే ఉందని, లేదంటే లేదని పేర్కొంటూ ఒక అఫిడవిట్‌ను నామినేషన్‌తో పాటే రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. పత్రికలు, చానళ్లలో అభ్యర్థితో పాటు ఆయనకు సంబంధించిన పార్టీ ఆ అభ్యర్థికి ఉన్న క్రిమినల్‌ చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలి. గత, ప్రస్తుత క్రిమినల్‌ కేసులను స్పష్టంగా తెలియజేయాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తమ నేర చరిత్రను దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా.. దేశపౌరులెవరైనా ఆ అభ్యర్థిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పత్రికలు, వార్తా చానళ్లల్లో పెద్దసంఖ్యలో అభ్యర్థుల నేర చరిత్రపై ప్రకటనలు వెలువడే అవకాశాలున్నా యి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల నేర చరిత్ర ప్రకటనలకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం లభించనుంది.

108 26112018 1

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నేర చరిత్ర ప్రజల్లో చర్చకు దారితీయనుంది. ఓటెయ్యడానికి ముందే ప్రజలు తమ నేర చరిత్రను తెలుసుకోనుండడంతో.. నేరచరిత గల అభ్యర్థులకు ఎన్నికల ఫలితాలపై ఆందోళన తప్పేలా లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటే.. ఆ విషయాన్ని అభ్యర్థితో పాటు, ఆ అభ్యర్థికి చెందిన రాజకీయ పార్టీ బహిర్గతం చేయాల్సిందేనని గత సెప్టెంబర్‌ 25న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇకపై పార్లమెంట్‌ ఉభయ సభలు, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే నేర చరిత్ర గల అభ్యర్థులతో పాటు అలాంటి అభ్యర్థులను నిలబెట్టే రాజకీయ పార్టీలు నిర్దేశించిన ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం గత అక్టోబర్‌ 10న ఆదేశాలు జారీ చేసింది. అయితే, నేర చరిత్రపై పత్రికలు, వార్తా చానళ్లలో జారీ చేసే ప్రకటనల ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద జమ చేయరాదని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు ఈ వార్తా మన రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. జగన్ లాగా 11 కేసుల్లో A1 గా ఉన్నవారి పరిస్థితి అయితే మరీ ఘోరం. అయితే జగన్ వర్గం మాత్రం, మావాడిది నేర చరిత్ర కాదు, ఆర్ధిక నేరం అందుకే మేము ఇలాంటివి చేయనవసరం లేదు అంటున్నారు. మరి ఈసీ ఏమంటుందో చూడాలి.

బిహార్‌ తెలివితేటలు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయవని, వైసీపీ నుంచి ఫోన్లు వస్తే తిట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. సోమవారం నెల్లూరులో టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ధైర్యముంటే ముగ్గురు మోదీలు కలిసి రావాలని.. తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఏమీ చేయని కేసీఆర్‌ 88 సీట్లు గెలిస్తే.. అన్నీ చేసిన మనం 150 సీట్లు గెలవాలని చంద్రబాబు అన్నారు. తాను మూడు వేల సార్లు తిట్టానని కేసీఆర్‌ ఆరోపిస్తున్నారని.. మరి ఆంధ్రులను కేసీఆర్‌ ఎన్ని లక్షల సార్లు తిట్టారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌..ఆంధ్రా బిర్యానీని పేడ అన్నారని, ఉలవచారును పశువులు తింటాయని అనలేదా? అని ప్రశ్నించారు.

harsha 17032019

మరి రాజకీయం కోసం ఏపీని వాడుకుంటారా? అంటూ చంద్రబాబు నిలదీశారు. అసలు ఢిల్లీలో చక్రం ఉంటేగా.. కేసీఆర్‌ తిప్పడానికి అంటూ ఎద్దేవా చేశారు. 25 ఎంపీ సీట్లు గెలిస్తే ఏపీకి న్యాయం ఎందుకు జరగదో చూద్దామని చంద్రబాబు అన్నారు. అన్నీ పార్టీలను ఏకం చేసే శక్తి సైకిల్‌కే ఉందని ఆయన అన్నారు. టికెట్‌ ఇస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్క పార్టీతో లాలూచీ పడి పారిపోయారని విమర్శించారు. ఆయనను చూస్తే అసహ్యం వేస్తోందని చంద్రబాబు అన్నారు. స్వార్థం కోసం పార్టీలు మారే వ్యక్తులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీలో సంఘవిద్రోహశక్తులు ఉన్నాయని అన్నారు. 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఉన్నవారు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని విమర్శించారు.

harsha 17032019

65 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. వైసీపీ దొంగల పార్టీ, కోడి కత్తి పార్టీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక వారి పార్టీలో చేరిన నేతలనీ ఉద్దేశిస్తూ.. ఆ నేతలు ఐదేళ్లు వారి పనులకు, స్వార్ధానికి వాడుకుని అందరి మధ్య చిచ్చులు పెట్టి టికెట్ ఇచ్చాక పార్టీ మారిపోయారు. ద్రోహం చేసిన అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాలి అని ఆయన ప్రజలని కోరారు. కార్యకర్తల త్యాగాల వల్లే ఇవాళ టీడీపీ ఇంత స్థాయికి వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నాం. రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాం. గోదావరి, పెన్నాను అనుసంధానం చేసి నెల్లూరు జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తాం. నెల్లూరు జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.

మైలవరం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వసంత వెంకట కృష్ణప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనకు వరసకు సోదరుడయ్యే వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజ రాజ్‌కుమార్‌ పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలు సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో ఎంతో కొంత సొంత ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్న రాజ్‌కుమార్‌కు, కృష్ణప్రసాద్‌కు ఇటీవల బాగా గ్యాప్‌ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్‌ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. కృష్ణప్రసాద్‌ తన ప్రత్యర్థి అయిన దేవినేని ఉమా మీద ఉన్న రాజకీయ కక్షను తీర్చుకునేందుకు ఉమా సోదరుడు చంద్రశేఖర్‌ను వెంట పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, తన బంధువు, వరసకు తమ్ముడయ్యే రాజకుమార్‌ను దూరం పెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు.

konatala 18032019

నియోజకవర్గంలో వసంత నిర్వహిస్తున్న రోడ్డు షోలకు జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. రాజ్‌కుమార్‌ వసంత వెంట ఉండి ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని వారు భావిస్తున్నారు. జ్యేష్ఠ రమేష్‌బాబు మైలవరం సమన్వయ కర్తగాను, జోగి రమేష్‌ పార్టీలో ఉన్న సమయంలో కాజ సొంత ఖర్చులతో షర్మిల, జగన్‌ పాదయాత్రలను విజయవంతం చేశారని, జగన్‌ బావ క్రైస్తవ మత బోధకుడు బ్రదర్‌ అనిల్‌ నిర్వహించిన క్రైస్తవ సభలకు తానే ఏర్పాట్లు చేయించాడని, పలు చర్చిల నిర్మాణానికి సాయం చేశాడని, అటువంటి రాజ్‌కుమార్‌ను దూరం పెట్టడం కృష్ణ ప్రసాద్‌కు, పార్టీకీ అంత శ్రేయస్కరం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్‌కుమార్‌ వైసీపీలో కొనసాగుతారా? తనకు సముచిత స్థానం ఇచ్చే పార్టీలోకి వెళ్లిపోతారా? స్వతంత్ర అభ్యర్థిగా మైలవరం నుంచి రంగంలోకి దిగుతారా? అనేది వేచి చూడాలి.

 

konatala 18032019

ఇది ఇలా ఉంటే, నిన్న నదీ తీర గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ శనివారం చేపట్టిన ప్రచారం జనం లేక వెలవెల బోయింది. దాములూరు, కాచవరం, కొటికలపూడి గ్రామాల్లో వైసీపీ నేతలు ప్రచారం నిర్వహించారు. కొటికలపూడిలో జరిగిన ప్రచారంలో గ్రామానికి చెందిన స్థానికులు పెద్దగా పాల్గొనకపోవటంతో మండల స్థాయి నాయకులు సైతం ప్రచారం మధ్యలో అభ్యర్థిని వదిలివెళ్లి పోవటం గమనార్హం. వైసీపీ నేతలు మాత్రం అధికార పార్టీ మంత్రి ప్రచారం వలన ఒత్తిడి చేశారని అందుకనే మధ్యాహ్నం సైతం ప్రచారం నిర్వహించాల్సి వస్తుందని, అందుకని జనం స్పందన తక్కువుగా ఉందని దాటవేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు ఒక్కరూ కూడ గ్రామాలు వైపు రాకుండా ఓట్లు ఎలా అడుగుతారని, సామాన్య ప్రజలు ప్రశ్నించారు.

కార్యకర్తల నిరసనల మధ్య వైసీపీ అధినేత జగన్‌ గుంటూరు జిల్లాలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. జిల్లాలో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు మళ్లీ పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా చివరి నిమిషంలో పొన్నూరు నుంచి రావి వెంకటరమణను తప్పించి కిలారి రోశయ్యకు కేటాయించారు. జిల్లాలో పార్టీకి తొలి నుంచి గుంటూరు పశ్చిమకు సమన్వయకర్తగా వ్యవహరించిన లేళ్ళ అప్పిరెడ్డి, పెదకూర పాడుకు కావటి మనోహర్‌ నాయుడు, చిలకలూరి పేటకు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌, తాడి కొండకు కత్తెర క్రిస్టియానాలను ఇటీవలనే సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. అయితే మధ్యలోనే వారికి మొండి చేయిచూ పటంతో వారు కాస్త సీటు విషయంలో మానసికంగా వెనక్కి తగ్గారు. అయితే పొన్నూరు సమన్యయ కర్తగా వ్యవహరిస్తూ ఎన్నికలకు సిద్ధమ వుతున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను ఆఖరి క్షణంలో తొలగించి కిలారి రోశయ్యకు ఆ సీటును కేటాయించటంతో రావి వర్గీయులు తీవ్ర ఆగ్రహా వేశాలు వ్యక్తం చేస్తున్నారు.

konatala 18032019

ముందుగానే సీటు మార్పు విషయం తెలుసుకున్న రావి వర్గీయులు భగ్గుమన్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం విది తమే.రావి వర్గీయుల ఆగ్రహంతో మోదు గుల కార్యాలయంలో అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. చివరకు అభ్యర్థు జాబితాలో పొన్నూరు స్థానానికి కిలారి రోశయ్యని ప్రకటించటం, గుంటూరు ఎంపీగా మోదుగులను ప్రకటించటంతో రావి వర్గీయులను మరింత ఆగ్రహావేశా లకు గురిచేస్తోంది. రావి వెంకటరమణకు పొన్నూరుతోపాటు ప్రత్తిపాడు నియోజక వర్గంలో వర్గీయులున్నారు. 2004 ఎన్నిక ల్లో రావి వెంకటరమణ కాంగ్రెస్‌ తరపున ప్రత్తిపాడు నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావి మార్పు తో ఆ రెండు స్థానాల్లోనూ వైసీపీకి ఇబ్బం దేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రావి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొన్నూరు, ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థుల ను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా (గుంటూరు తూర్పు), డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట), ఆళ్ళ రామకృష్ణారెడ్డి (మంగళగిరి), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కోన రఘుపతి (బాపట్ల)లకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి మరోసారి పోటీకి అవకాశం ఇచ్చారు.

konatala 18032019

ఎంపీ స్థానాలూ ఖరారు.. వైసీపీ శనివారం రాత్రి ప్రకటించిన 9 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో బాపట్ల ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి తుళ్ళూరు మండలం ఉద్దండరాయపాలే నికి చెందిన నందిగం సురేష్‌ను ప్రకటిం చారు. ఆదివారం ప్రకటించిన జాబితాలో గుంటూరు ఎంపీ స్థానానికి మోదుగుల వేణుగోపాలరెడ్డి, నరసరావుపేట లోక్‌సభ స్థానానికి విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయులు అభ్యర్థి త్వాలను ఖరారు చేశారు. బాపట్లలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు కోన పోవాలి... జగన్‌ రావాలంటూ కార్యకర్తలు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్‌ను ఖరారు చేయటంతో స్థానికేతరుడికి సీటు ఎలా ఇస్తారంటూ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read