సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి నియోజకవర్గంలో కనీసం 50శాతం వీవీప్యాట్లు లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక పోలింగ్‌ కేంద్రంలోనూ, పార్లమెంటు పరిధిలో అయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం లెక్కిస్తోంది. వీవీప్యాట్‌ల లెక్కింపు ఏదో ఒక్క పోలింగ్‌ కేంద్రానికి నమూనాగా పరిమితం చేయకూడదని, కనీసం 50శాతం పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్‌లు లెక్కించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈ నెల 2న పిటిషన్‌ నమోదు కాగా, పత్రాలను రిజిస్ట్రీ ఈ నెల 6న పరిశీలించింది.

thota 29102018 1

పిటిషన్‌ విచారణకు స్వీకరించే అంశంపై శుక్రవారం జాబితాలో కేసును పొందుపరిచింది. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు 21మంది ఈ అంశంపైనే పిటిషన్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్లపై శుక్రవారం చీఫ్‌జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ విచారణ సందర్భంగా విపక్ష నేతలు రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరులు కోర్టుకు హాజరుకానున్నారు. గత నెలలో ఈసీని కలిసిన విపక్షాలు తిరిగి బ్యాలెట్ పేపర్ పద్ధతి లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. 2019 ఎన్నికలకు సమయం అంతగా లేదు కాబట్టి కనీసం 50 శాతం వీవీ-ప్యాట్-స్లిప్‌ లను పోలైన ఓట్లతో సరి చూడాలని కోరారు.

thota 29102018 1

టిడిపి అధినేత‌..ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇవియం ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసారు. ఇవియంల స్థానం లో బ్యాలెట్ కు వెళ్లాల‌ని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పత్రాలతోనే నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈవీఎం చిప్ ఆధారిత మిషన్ అని, దాన్ని సులభంగా ఏమార్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని పై అన్ని పార్టీల‌తో క‌లిసి పోరాడ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు అనుగుణంగానే కోర్ట్ లో కేసు వేసారు. ఈ కేసు విషమై రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నానని, బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నానని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో తాము పోరాడితేనే వీవీ ప్యాట్‌లు వచ్చాయని చెప్పారు. అవీ సరైన కాంతి లేకుండా చూసుకోవాలని, దాని వల్ల సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రపంచ యువ నాయకుడిగా ఏపీ మంత్రి లోకేశ్‌ను ప్రపంచ ఆర్థిక వేదిక మరోసారి ఎంపిక చేసింది. 2019 యంగ్‌ గ్లోబల్‌ లీడర్ల జాబితాను ప్రపంచ ఆర్థిక వేదిక బుధవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో లోకేశ్‌ కీలకపాత్ర పోషించారని జాబితాలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 127 మందిలో దక్షిణ ఆసియాకు చెందిన 12 మంది ఉన్నారు. భారత్‌ నుంచి ఇప్పటివరకు ‘ప్రజాకర్షక’ జాబితాలో ఆరుగురికి అరుదైన గౌరవం లభించింది. ఐదేళ్లపాటు యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌గా ప్రపంచ ఆర్థిక వేదికలో మంత్రి లోకేశ్‌ ఇదివరకే కొనసాగుతున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించారు.

 

thota 29102018 1

మరో పక్క, నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. తొలుత విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి పోటీ చేయాలని భావించినా... వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకుని మంగళగిరిని ఎంచుకున్నారు. భిన్నమైన రాజకీయ, సామాజిక సమీకరణాలుండే ఈ నియోజకవర్గం పాక్షికంగా రాజధాని అమరావతి పరిధిలో ఉంది. లోకేశ్‌ నివాసముండే ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా పలు బాధ్యతల నేపథ్యంలో రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం అయితేనే వెసులుబాటు ఉంటుందని, ప్రజలకూ అందుబాటులో ఉండవచ్చనే ఆలోచనతోనే మంగళగిరిని ఎంచుకున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ యంత్రాంగం హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అధికంగా వచ్చి స్థిరపడింది మంగళగిరి ప్రాంతంలోనే. రాష్ట్రానికొచ్చిన ఐటీ సంస్థల్లోనూ అత్యధికం మంగళగిరి, తాడేపల్లిల్లోనే ఏర్పాటయ్యాయి.

 

thota 29102018 1

రాజధాని పరిసరాల్లో అపార్టుమెంట్ల నిర్మాణంసహా అన్ని రూపాల్లో స్థిరాస్తి వ్యాపారం బాగా వృద్ధి చెందుతోందీ ఇక్కడే. మొదటి నుంచీ పార్టీకి కంచుకోటల్లాంటి భీమిలితోపాటు కృష్ణా జిల్లా పెనమలూరు, గుంటూరు జిల్లా పెదకూరపాడు వంటి పార్టీకి బలమైన నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనలొచ్చినా వదిలేసి ప్రస్తుతం వైకాపా ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచి పోటీ చేయాలని లోకేశ్‌ నిర్ణయించడం విశేషమే. 2 రోజుల్లో ప్రకటించనున్న తెదేపా అభ్యర్థుల మొదటి జాబితాలోనే ఆయన పేరు రానుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరఫున గంజి చిరంజీవి పోటీ చేసి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే లోక్‌సభకు పోటీ చేసిన గల్లా జయదేవ్‌కు ఈ శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5,896 ఓట్ల ఆధిక్యం రావడం విశేషం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి రాజధాని వ్యవహారాలపై వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. న్యాయస్థానాల్నీ ఆశ్రయించారు. వైఎస్‌ పేరుతో రాజన్న క్యాంటీన్లు, రాజన్న కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇటీవల నియోజకవర్గ పార్టీలో వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఆయన తిరిగి పోటీ చేయడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా అవన్నీ తొలగిపోయాయి. తిరిగి ఆయనే వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేస్తూ బీసీల ఆశాజ్యోతిగా పేరు తెచ్చుకున్న మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నారని చేస్తున్న ప్రచారాన్ని బీసీలు చూస్తూ సహించరని పెనుగొండ ఏఎంసీ చైర్మన్‌ సానబోయిన గోపాలకృష్ణ హెచ్చరించారు. పెనుగొండ టీడీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గస్థాయి నాయకులు హాజరై అసత్య ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా సాన బోయిన గోపాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలో పితాని చేస్తున్న పాదయాత్రలో ప్రతీ గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారని, కావాలనే కొందరు దుష్పచారం చేస్తూ బలహీనవర్గాల ఆశాజ్యోతి అయిన పితానిని ఈ విధంగా కించపరచడం తగదని అన్నారు.

thota 29102018 1

ఆచంట ఏఎంసీ చైర్మన్‌ ఉప్పలపాటి సురేష్‌బాబు మాట్లాడుతూ కేడరును ప్రజలను అయోమయంలోకి నెట్టేందుకు ఓ ఛానల్‌ ఈ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు ఆచంట నియోజకవర్గంలో అయిదారు వేల ఓట్లు తీయించేందుకు ఫారం 7 ద్వారా కుట్ర పన్నారని, ఇప్పుడు పితాని పార్టీ మారుతున్నారని ప్రచారానికి దిగారన్నారు. మీడియా ఆలోచించి నిజాలను ప్రచారం చేయాలన్నారు. ఆచంట నియోజకవర్గంలో పితాని ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. పితాని సత్యనారాయణ టీడీపీలోనే ఉంటారని అయిదు కోట్ల రూపాయలు పందెం కాయడానికి ఆయన తనయుడు వెంకట్‌ సిద్ధంగా ఉన్నారని టీడీపీ పెనుగొండ మండల అధ్యక్షుడు వెలిచేటి బాబూరాజేంద్రప్రసాద్‌ అన్నారు. వైసీపీ నుంచి పితాని రాజమండ్రి ఎంపీ స్థానానికి, ఆచంట శాసనసభకు పితాని తనయుడు వెంకట్‌ పోటీ చేస్తారని ఓ చానల్‌ ప్రచారం చేసిన దాంట్లో నిజం లేదన్నారు. ఆచంట స్థానంలో గెలిచే సత్తాలేకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి అసత్య ప్రచారం సాగిస్తుందన్నారు.

thota 29102018 1

కేడర్‌కు చెప్పకుండా పితాని ఏ నిర్ణయం తీసుకోరని, రాష్ట్రంలో ఏ మంత్రి గాని, ఎమ్మెల్యే గాని ఇప్పటికే పితాని చేసినంతగా ఎన్నికల ప్రచారం చేయలేదని అన్నారు. పెనుమంట్ర టీడీపీ మండల అధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాసరెడ్డి(బుల్లా) మాట్లాడుతూ పితానిని గెలవలేక ప్రజలను అయోమయంలోకి నెట్టి లబ్ధి పొందేందుకు ఆచంట వైసీపీ కన్వీనరు రంగనాథరాజు మైండ్‌ గేమ్‌ అడుతున్నారని విమర్శించారు. ఆచంట సీటు పితానికి ఇవ్వొద్దన్న రఘురామకృష్ణంరాజు మాటను సీఎం విననందునే ఆయన టీడీపీని వీడారన్నారు. సీటు ఖరారై ప్రచారం సాగిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. దళిత నాయకుడు బీరా నర్శింహమూర్తి మాట్లాడుతూ దళితులంతా పితాని వెంటే ఉంటారన్నారు. సమావేశంలో జడ్పీటీసీలు రొంగల రవికుమార్‌, సత్తి సాయి ఆదినారాయణరెడ్డి, బొక్కా నాగేశ్వరరావు, సిద్ధాంతం పీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కేతా సత్యనారాయణ, తేతలి రాజారెడ్డి, బీవీ రత్తయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు కటికిరెడ్డి నానాజీ, కార్యదర్శి వేండ్ర రాము, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కుక్కల రామకృష్ణ తదితురులు పాల్గొన్నారు.

ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు సంబంధించిన మరిన్ని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా, భాజపా, తెరాస సంబంధం ఆధారాలతో సహా బయటపడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు టెలీకాన్ఫరెన్స్‌లో గురువారం ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ 26 రోజులూ రేయింబవళ్లు కష్టపడి పార్టీ అఖండ విజయానికి కృషి చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ- భారతీయ జనతా పార్టీ మధ్య బంధం బయటపడిపోయిన నేపథ్యంలో దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

thota 29102018 1

బీజేపీ, వైసీపీ లాలూచీని ‘టైమ్స్‌ నౌ’ స్టింగ్‌ ఆపరేషన్‌ బయటపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థులపై వైసీపీ బలహీన అభ్యర్థులను దించుతారని ఆ పార్టీ నేతే చెప్పారు. పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న జగన్‌ను బీజేపీ వాళ్లు దాసోహం చేసుకున్నారు. అక్కడేమో మోదీకి దాసోహైన ఆయన.. ఇక్కడ మాత్రం కేసీఆర్‌కు అయ్యారు. ఇలాంటి వైసీపీ రాష్ట్రానికి అవసరమా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆంగ్ల వార్తా చానల్‌ ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారీ వైసీపీ, బీజేపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని ఒప్పుకున్న విషయం తెలిసిందే. బుధవారం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ... పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని ఆ వీడియోలో మనోజ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట సాదాసీదా, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు. వీటితో పాటు ఆయన మరెన్నో విషయాలు బయటపెట్టారు.

 

thota 29102018 1

‘వైసీపీ, బీజేపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోంది’... ఇది తెలుగుదేశం పార్టీ తరచూ చేసే ఆరోపణ! ‘ఇది నిజమే’ అని విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్‌ కొఠారీ అంగీకరించారు. వైసీపీ, బీజేపీ మధ్య బంధం ఉందని స్పష్టంగా చెప్పారు. ఆంగ్ల వార్తా చానల్‌ ‘టైమ్స్‌ నౌ’ జరిపిన స్టింగ్‌ ఆపరేషన్‌లో మనోజ్‌ కొఠారీ మరెన్నో విషయాలు బయటపెట్టారు. ఇరు పార్టీల మధ్య అధికారిక పొత్తు లేనప్పటికీ... పోటీ విషయంలో రహస్య అవగాహన ఉందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలాంటి వారు పోటీచేసే చోట సాదాసీదా, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలపాలన్నది తమ పార్టీ విధానమని మనోజ్‌ వెల్లడించారు. స్టింగ్‌ ఆపరేషన్‌లో ‘టైమ్స్‌ నౌ’ ప్రతినిధితో మనోజ్‌ కొఠారీ జరిపిన సంభాషణ ఇది....

Advertisements

Latest Articles

Most Read