వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో కుప్పకూలినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివేకానందరెడ్డి సొంత తమ్ముడు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

viveka 15032019 2

పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. బాత్రూంలో వైఎస్ వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందారు. ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల గుండెపోటు రావడంతో వైఎస్ వివేకా స్టెంట్ వేయించుకున్నారు. 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

viveka 15032019 13

కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్‌ విజయమ్మపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వివేకానందరెడ్డి చివరిసారిగా కడప జిల్లా చాపాడు మండలం మద్దూరులో వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.30 వరకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయన తనయుడు అశోక్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా పులివెందుల పయనం అయ్యారు. వేకువజామున వాంతులవ్వడంతో బాత్‌రూంలోకి వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు.

బెజవాడ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగ వైరంగా ఉనన్ దేవినేని, వంగవీటి కుటుంబాలు, ఒకే పార్టీ గూటికి చేరాయి. కుటుంబాల మధ్య గొడవ, కులాల మధ్య గొడవగా మారి, ఎంత జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో, చంద్రబాబు అధ్యక్షతన, నవ్యాంధ్రను ముందుకు తీసుకువెళ్ళటానికి ఏకం అయ్యారు. బుధవారం రాత్రి రాధా తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాధాకు సీఎం కండువా కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైకాపా నేత యడం బాలాజీ కూడా తెదేపాలో చేరారు. రాధా చేరిక సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి తరలివచ్చారు.

thota 29102018 1

ఈ సందర్భంగా రాధా మాట్లాడుతు వైకాపా అధినేత జగన్‌పై విమర్శలు సంధించారు. రాజ్యాలున్నాయి పరిపాలిద్దామనే ఆరాటం వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డిదైతే, ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం తెదేపాదన్నారు. ఈ పోరాటంలో ఎవరికెవరికీ గిఫ్టులు కాదు.. మన ప్రజలకు మనమే గిఫ్టులు ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్‌ స్విచాఫ్‌ చేయాలనే నినాదంతో ముందుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెన్నుపోటులు గురించి జగన్‌ మాట్లాడుతుంటారని.. తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్‌.. వారితో, వీరితో అందరితో కలుస్తూ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. అంతకంటే వెన్నుపోటు ఉంటుందా అని నిలదీశారు. ఇప్పటికైనా జగన్‌ మారాలని సూచించారు.

thota 29102018 1

కాపులకు అండగా నిలిచింది తెదేపానే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వారికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 2014లో చివరి విడతలో ఎన్నికలు పెట్టారని, ఈసారి కావాలనే తొలి విడతలో పెట్టి సమయం చాలా తక్కువ ఇచ్చారని, అయినా ఫర్వాలేదని, ఎలాంటి సంక్షోభాన్నైనా అవకాశంగా మార్చుకునే సత్తా తమకుందని పేర్కొన్నారు. 2004లో కాపులకు కార్పొరేషన్‌ పెడతామని చెప్పిన వైఎస్‌ కేవలం కమిటీని వేసి వదిలేశారని, తాను పాదయాత్రకు వెళ్లినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశానని తెలిపారు. కాపుల కోసం తాను అసెంబ్లీలో తీర్మానం చేసి దిల్లీకి పంపిస్తే జగన్‌ అసలు అసెంబ్లీకే రాలేదని గుర్తు చేశారు. కేంద్రం పేదలకు ఇచ్చిన 10 శాతంలో తాను కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించానని వెల్లడించారు. 

రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశానికి ముందు సీఎం చంద్రబాబు ఎంతో సరదాగా వ్యవహరించారు. మీడియా ప్రతినిధులు కొందరు సకాలంలో ప్రెస్ మీట్ కు రాకపోవడంతో వారికోసం వేచిచూశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక ఉపోద్ఘాతాలు లేవు బుల్లెట్ లా దూసుకుపోవడమే అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎంతో పాప్యులర్ అయిన "సమయం లేదు మిత్రమా" అనే బాలకృష్ణ డైలాగ్ ను తనదైన శైలిలో "కాలం లేదు మిత్రమా" అంటూ మీడియా మిత్రుల ఆలస్యానికి అన్వయించారు టీడీపీ అధినేత. ఆ తర్వాత అందరూ వచ్చేశారా, ఇక ముందు మాటలు అక్కర్లేదు, దూసుకుపోవడమే అంటూ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, సినీ భాషలో 'మీరు టేక్ రెడీ అంటేనే మేం మాట్లాడతాం' అంటూ విలేకరులతో చమత్కరించారు. వారు చెప్పిన దానికి 'ఓకే అగ్రీడ్' అంటూ తనదైన శైలిలో మందహాసం చేశారు చంద్రబాబు.

thota 29102018 1

అక్రమ నిర్మాణం పేరిట ఏపీ డీజీపీ ఇంటి ప్రహరీని కూల్చివేసిన, ఏమీ లేకున్నా ‘డేటా చోరీ’ పేరిట పోలీసులను పంపిన కేసీఆర్‌... కూకట్‌పల్లిలో జగన్‌ అక్రమంగా సొంతం చేసుకున్న 11.10ఎకరాలను ఎందుకు వదిలేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రూ.500కోట్ల విలువైన భూమిని, వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కేసీఆర్‌ కాపాడారన్నారు. ‘ఏపీలో జగన్‌ గెలిస్తే నీ కాల్మొక్తా బాంచన్‌.. అని కేసీఆర్‌కు లొంగిపోతారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడతారు. రాష్ట్ర హక్కుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని అవమానకర పరిస్థితికి తీసుకెళ్తారు. ఏపీని కేసీఆర్‌కు సామంత రాజ్యం లా మార్చేస్తారు’ అని తెలిపారు. ‘విచారణ జరగకుండా మోదీ అడ్డుకోగా... అక్రమంగా జగన్‌ కొ ట్టేసిన భూకేటాయింపును కేసీఆర్‌ రద్దుచేయలేదు. వారి కుమ్మక్కుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు.

thota 29102018 1

చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌లాగా నేరాల్లో జగన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ అని చంద్రబాబు విమర్శించారు. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అన్నట్లు.. తాను చెడిందే కాకుండా ఏపీని కూడా చెడగొట్టాలని జగన్‌ చూస్తున్నారన్నారు. ‘దొంగ వ్యాపారాలు, బోగస్‌ షేర్లు, షెల్‌ కంపెనీలు, ఫెమా ఉల్లంఘన... ఆయన నేరాలకు అంతేలేదు. ఇప్పడు రాజకీయంలోనూ నేరాలను చొప్పించే కుట్రలు చూశాం. లక్షలాది ఓట్ల తొలగించాలనే ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? 9లక్షల ఫామ్‌-7 దరఖాస్తులు పంపడం దేశ చరిత్రలో చూశామా? ప్రత్యర్థి పార్టీ డేటా ఎత్తుకుపోవాలన్న ఆలోచన ఎవరైనా చేశారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈడీ రాసిన లేఖలో పీవీపీ బిజినెస్‌ వెంచర్స్‌ పేరు కూడా ఉందని చెప్పారు. ‘దాని అధినేత పొట్లూరి వరప్రసాద్‌కు ఇప్పుడే జగన్‌ వైసీపీ కండువా కప్పారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి అంటారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని కూడా జగన్‌ పట్టించుకోరు’ అని చంద్రబాబు అన్నారు.

రాయచోటిలోని వైసీపీకి ముస్లింలు షాక్‌ ఇస్తారా అంటే నిజమేనంటున్నారు ముస్లిం వర్గాలు. పులివెందుల తర్వాత వైసీపీకి అత్యంత ఆదరణ ఉన్న నియోజకవర్గం రాయచోటి. ఇందుకు కారణం ముస్లిం ఆదరణ పార్టీకి ఉండడమే. వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీకే నియోజకవర్గ ఓటర్లు నీరాజనం పలుకుతూ వస్తున్నారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డికి దాదాపు 60 వేలకు పైగా మెజార్టీ వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాంత్‌రెడ్డి పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగిపోయింది. అదేవిధంగా 2014 ఎన్నికల్లోనూ శ్రీకాంత్‌రెడ్డి సుమారు 40 వేల మెజార్టీతో గెలుపొందారు. ఫలితంగా రాష్ట్ర స్థాయిలో రాయచోటి నియోజకవర్గం అంటేనే.. వైసీపీ కంచుకోట అనే రీతిలో పేరు నిలిచిపోయింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి ముస్లిం మైనార్టీల నుంచి షాక్‌ తప్పదని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు ఆవేదన చెందుతున్నారు. తమకు రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం చెందుతున్నారు. తమను కూరలో కరివేపాకులా చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ఈసారి తమ సత్తా ఏంటో చూపిస్తామని యువకులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీకి అండగా ఉంటూ వస్తున్న ముస్లింల ఆగ్రహానికి కారణాలు ఒకసారి పరిశీలిస్తే..

thota 29102018 1

ఎమ్మెల్సీ ఇస్తామంటూ.. మొండిచేయి... నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారని చెప్పవచ్చు. గతంలో రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగేవి. బాంబులు యథేచ్ఛగా వేసుకునే వారు. బూత్‌లు ఆక్రమించి రిగ్గింగులు జరిగేవి. ఈ పరిస్థితులలో ముస్లింలకు అండగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచారు. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేకుండా ముస్లింలు వైఎస్‌ వెంట నడిచారు. అయితే ఆయన మరణానంతరం జరిగిన అనేక పరిణామాల నేపధ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ముస్లింలు నడిచారు. 2012 ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్‌ జగన్‌ సైతం రాయచోటి ముస్లింలకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లింల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పడ్డాయనే చెప్పవచ్చు. 2012 తర్వాత జిల్లాలో పలువురికి వైసీపీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. అయితే రాయచోటి ముస్లింలకు మాత్రం ఆ కోరిక తీరలేదు. దీంతో ప్రస్తుతం పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.

thota 29102018 1

దీంతో ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించిన వైసీపీ అధినాయకత్వం పలువురు మైనార్టీలను లోట్‌సఫాండ్‌కు పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. అయితే ఇక్కడ కూడా స్పష్పమైన హామీ ఇవ్వకుండా.. కేవలం కంటితుడుపు చర్యగానే మాట్లాడినట్లు మైనార్టీలు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ అధినాయకత్వం వ్యవహార శైలితో మనోభావాలు దెబ్బతిన్న మైనార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి షాక్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. దీంతోనే కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీలో ఉన్న ప్రముఖ బంగారు వ్యాపారి అల్లాబకాష్‌ను పలువురు మైనార్టీలు బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. తమకు గౌరవం ఇచ్చే పార్టీకే అండగా ఉందామనే ఆలోచనలో మైనార్టీలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మైనార్టీల మనోభావాలు దెబ్బతినడంతో.. ఈసారి శ్రీకాంత్‌రెడ్డి పరిస్థితి ఏంటో.. అని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

 

Advertisements

Latest Articles

Most Read