పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌కు మంగళవారం హైదరాబాదులో జగన్‌ నివాసం వద్ద జరిగిన అవమానం పట్ల జిల్లావ్యాప్తంగా దళిత వర్గాలు భగ్గుమంటున్నాయి. టికెట్‌ ఇవ్వకపోతే పోయారు... అంతగా అవమానించాలా? అంటూ మండిపడుతున్నాయి. అదే సొంత సామాజికవర్గానికి చెందిన మరో సిట్టింగ్‌కు టికెట్‌ ఇవ్వకపోయినా ఫ్యామిలీతో గ్రూపు ఫొటో కూడా దిగి బుజ్జగించి పంపించడం వివక్ష కాక మరేమిటి అంటూ ధ్వజమెత్తుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచీ ఎస్సీ సామాజిక వర్గంతో పాటు సామాన్య దళితుల్లోనూ, సామాజిక స్పృహ కలిగిన వారినీ తీవ్రంగా మధనపెడుతోందీ వ్యవహారం. పూతలపట్టు నుంచీ గత ఎన్నికల్లో డాక్టర్‌ పి.సునీల్‌కుమార్‌రెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయన నివాసం పలమనేరులో. అక్కడ వైద్యవృత్తి కొనసాగిస్తున్నారు. గత ఎన్నికలప్పుడే నియోజకవర్గంలో వైసీపీకి చెందిన మెజారిటీ నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. అయినా అధిష్ఠానం టికెట్‌ ఇచ్చింది. ఆయన గెలిచారు. తర్వాత కూడా పార్టీ నేతలు ఆయనకు పెద్దగా సహకరించింది లేదు. కొంతకాలం చూశాక ఇక నేతల తీరు మారదని గ్రహించిన సునీల్‌ తన పాటికి తాను నియోజకవర్గంలో ఒంటరిగా పర్యటించడం మొదలుపెట్టారు. ఐరాల, యాదమరి, బంగారుపాళ్యం వంటి టీడీపీ నేతలు దూకుడుగా వుంటే మండలాల్లో కూడా ఒంటరి పోరాటం చేశారు. మండల పరిషత్‌ సమావేశాల్లో సమస్యలపై గట్టిగా వాదించడం, టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడిచేస్తే ప్రతిఘటించడం చేశారు. పలు సందర్భాల్లో రాస్తారోకోలు, ధర్నాలతోనూ అధికార వర్గాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇక జడ్పీ సమావేశాల్లో కూడా ప్రజా సమస్యలపై మంత్రిని, అధికారులను గట్టిగా నిలదీశారు. వ్యక్తిగతంగా సౌమ్యుడని, మంచివాడని, వివాద రహితుడని ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో ఆయన్ను ప్రశంసిస్తుంటారు.

అవన్నీ పక్కన పెడితే జిల్లాలో వైసీపీనే కాదు టీడీపీ అధిష్ఠానం కూడా రిజర్వుడు సీట్లలో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏనాడూ దళిత ఎమ్మెల్యేలు, అభ్యర్థుల పట్ల అవమానకరంగా వ్యవహరించింది లేదు. రెండు నెలలుగా జీడీనెల్లూరు, పూతలపట్టు ఇన్‌ఛార్జులను, సత్యవేడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేను అనేకసార్లు పిలిపించి చర్చించారు. టికెట్‌ ఇచ్చినా ఇవ్వకున్నా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా అవమానించలేదు. వైసీపీ అధినేత జగన్‌ కూడా ఇతర వర్గాల ఎమ్మెల్యేల పట్ల అలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఉదాహరణకు మదనపల్లె సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డికి కూడా ఆయన ఈసారి టికెట్‌ ఇవ్వలేదు. ఆయనకు బదులు ముస్లిం మైనారిటీ అభ్యర్థి నవాజ్‌ను ఎంపిక చేశారు. తిప్పారెడ్డిని, ఆయన కుటుంబసభ్యులనూ పిలిపించి వారిని బుజ్జగించి పంపించారు. వారితో గ్రూపు ఫొటో కూడా దిగారు. అదే పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ విషయానికొచ్చేసరికి ఆ పార్టీ అధినేత మంగళవారం వ్యవహరించిన తీరు జిల్లాలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా దళిత వర్గాలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. సాంప్రదాయకంగా మెజారిటీ దళిత వర్గాలు తొలి నుంచీ కాంగ్రెస్‌కు తర్వాత వైసీపీకి మద్దతిస్తున్నాయి.

అయినా కూడా వైసీపీ అధిష్ఠానం లోటస్‌ పాండ్‌ ఆవరణలో దిక్కులేని వ్యక్తిలా ఓ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పడిగాపులు పడే స్థితికి తెచ్చి పెట్టడాన్ని దళితవర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనేత ఒకరు ఆ సమయంలో వుండి కూడా కనీసం మొహమాటానికి కూడా పలకరించకుండా ముఖం తిప్పుకుని లోటస్‌పాండ్‌లోకి వెళ్ళిపోవడాన్ని ఆ వర్గాలు భరించలేకపోతున్నాయి.టికెట్‌ ఇవ్వడం ఇవ్వకపోవడమనేది వేరే అంశమని, అది పూర్తిగా ఆయా పార్టీల అధిష్ఠానాల హక్కని, దాన్ని తాము ప్రశ్నించడం లేదని అంటున్నాయి. అయితే సునీల్‌కుమార్‌ను అంతగా అవమానించాల్సిన అవసరమేమిటన్నది వారి ప్రశ్న. గతంలోనూ వైసీపీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధి ఒకరు ధర్నా చేస్తుండగా అక్కడి పోలీసు అధికారి దూరం నుంచీ మాట్లాడారు. దీనికి ఆమె తానేం ఎస్సీని కాదని, దగ్గరగా వచ్చి మాట్లాడవచ్చునని వ్యాఖ్యానించడం కూడా దుమారం రేపింది. దళిత సంఘాల నేతలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు దళిత సంఘాలు వైసీపీ అధిష్ఠానం తీరును ఖండించాయి. భారతీయ అంబేద్కర్‌ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌ సహా మదనపల్లె, వి.కోట, కుప్పం, బి.కొత్తకోట, పీలేరు తదితర ప్రాంతాలకు చెందిన ఎస్సీ సంఘాలు ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశాయి. మొత్తంమీద సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చిన వేళ పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ పట్ల వైసీపీ అఽధిష్ఠానం వ్యవహరించిన తీరుతో ఆ పార్టీ జిల్లాలో రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న సంగతి తాజాగా బయటపడింది. జాతీయ న్యూస్ చానల్ ‘టైమ్స్ నౌ’ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం వెల్లడైంది. స్వయంగా వైసీపీ ప్రతినిధే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఏపీలో బీజేపీకి వైసీపీ బి టీం అనడంలో సందేహం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి కొన్ని స్థానాల్లో బీజేపీపై బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీతో ఓ అవగాహనకు వచ్చినట్టు విజయవాడకు చెందిన వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ కొఠారి న్యూస్ చానల్ ప్రతినిధికి చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విషయంలో తాము ఇంతకుముందు వారి అభ్యర్థులకు మద్దతు తెలిపినట్టు ఆయన వివరించారు. బీజేపీతో వైసీపీకి రహస్య ఒప్పందం ఉందని, ఇది వందశాతం నిజమని మనోజ్ చెప్పుకొచ్చారు. బీజేపీ కోసం వైసీపీ పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో బుగ్గన బీజేపీ నేత రాంమాధవ్‌ను కలిశారు కదా? అన్న టైమ్స్ నౌ ప్రతినిధికి మనోజ్ బదులిస్తూ.. బుగ్గన విద్యావంతుడని, ఆయనెప్పుడూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరన్నారు. బుగ్గన కలిశాకే రెండు పార్టీల మధ్య ఓ అవగాహన ఏర్పడిందా? అన్న ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు.

thota 29102018 1

రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థులే లేరు కదా? మరి, వైసీపీ అభ్యర్థులు ఎవరైనా బీజేపీ తరపున పోటీ చేస్తారా? అన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు మనోజ్ మాట్లాడుతూ.. అలా జరగదన్నారు. ఇది తన అభిప్రాయం మాత్రమేనన్న ఆయన.. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారిపై చాలా బలహీనమైన వ్యక్తులను నిల్చోబెడతామన్నారు. ఇదే పార్టీ నిర్ణయమని తేల్చి చెప్పారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడు జగన్ నుంచి డైరెక్టుగా ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదని వివరించారు. జగన్‌తో ఎవరైతే నిత్యం టచ్‌లో ఉంటారో వారి నుంచే ఇటువంటి ఆదేశాలు వస్తుంటాయన్నారు. పెద్దిరెడ్డి వంటి వారు చెబుతుంటారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని మనోజ్ పేర్కొన్నారు. జగన్‌కు రాజకీయం అంటే ఏంటో నేర్పింది విజయసాయిరెడ్డేనని పేర్కొన్నారు. ఒకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు ఏమవుతారో అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

thota 29102018 1

‘టైమ్స్‌ నౌ’ చానల్‌ స్టింగ్‌ ఆపరేషన్‌తో జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చిన మనోజ్‌ కొఠారీ విజయవాడ నగర వైసీపీ అధికార ప్రతినిధి. వన్‌టౌన్‌లో హోల్‌సేల్‌ ప్లాస్టిక్‌ వ్యాపారం చేస్తుంటారు. ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన పేరు... మనోజ్‌ కొఠారీ! మొదటి నుంచీ వైఎస్ కు వీరాభిమాని. వైఎస్‌ మరణం తర్వాత వైసీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. పార్టీ కోసం, ప్రచారం కోసం భారీగా ఖర్చు పెడుతుంటారు. మనోజ్‌ వీలైనప్పుడల్లా జగన్‌ను కలుస్తుంటారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావుకు అనుచరుడిగా ఉన్నారు.

అమరావతి రోడ్డులోని వేళంగిణినగర్‌ దగ్గర చేసిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. వాహనంలో తరలిస్తున్న రూ.కోటి పది లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు నగదుగా అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో తరలిస్తున్న సొమ్ముగా పోలీసులు భావిస్తున్నారు. ఈ డబ్బు ఏ పార్టీకి చెందిన నేతదన్నది తెలియాల్సి ఉంది. మరో చోట, వోల్వో బస్సులో తరలిస్తున్న రూ. 88.88లక్షల నగదు, 1.28 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామం దగ్గర బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇద్దరు వ్యక్తుల దగ్గర రూ.88.88 లక్షలు, 1.28 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

police 13032019

డబ్బును ఒకచోట నుంచి మరోచోటుకు తీసుకెళ్లడం చట్ట ప్రకారం అక్రమం కాదు. కానీ ఎన్నికల కోడ్‌ అమలో ఉన్నప్పుడు నగదు, బంగారం భారీ మొత్తంలో తీసుకెళ్లొద్ధు ఎన్నికల కమిషన్‌ కొంత పరిమితిని నిర్దేశించింది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే.. వాటికి సరైన ఆధారాలు చూపించాలి. లేకుంటే అంతే సంగతులు. నియోజకవర్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటి వద్ద రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. ఆదాయ పన్నుశాఖకు జప్తు చేస్తారు. అక్కడి నుంచి నగదును పొందాలంటే కష్టం. ఆధారాలు, వివరణ సరిగా లేకపోతే 30 శాతం పన్ను కింద తీసుకుని మిగతా సొమ్ము ఇస్తారు. ఈ నిబంధనలు తెలియక చాలామంది పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్తూ దొరికిపోతున్నారు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్‌ 69-ఎ ప్రకారం ఏ వ్యక్తి అయినా తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులుంటే వాటికి ఆధారం చూపించాలి. సరైన వివరణ ఇవ్వాలని స్పష్టంగా చట్టంలో ఉంది.

police 13032019

తనిఖీ బృందంలో ఎవరుంటారు? నియోజకవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉప తహసీల్దారు, పోలీసు విభాగం నుంచి ఏఎస్సై, కానిస్టేబుల్‌ ఉంటారు. గమనించాల్సిన విషయాలు ● ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్‌ 40(3) ప్రకారం ఒకరోజు ఒక వ్యక్తి లేదా సంస్థకు రూ.10 వేలకు మించి నగదు ఇవ్వొద్ధు ● సెక్షన్‌ 269 ఎస్‌ఎస్‌ ప్రకారం రూ.20 వేలకు మించి అప్పు తీసుకోకూడదు. ● సెక్షన్‌ 269 ప్రకారం రూ.20 వేలకు మించి అప్పు చెల్లించరాదు. అప్పు తీసుకుంటే.. అవసరం నిమిత్తం రూ.లక్షల్లో అప్పు తీసుకుంటారు. ఆ సొమ్ము తీసుకెళుతున్నప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి రాయించుకున్న ప్రామిసరీ నోటు నకలు వెంట తీసుకెళ్లాలి. వైద్య సేవలకైతే.. ఆసుపత్రిలో వైద్య సేవలకు బిల్లు కట్టడానికి ఎక్కువ మొత్తం తీసుకెళ్తుంటారు. ఆ సమయంలో చికిత్సకు ఎంత మొత్తం ఖర్చవుతుందని తెలిపే బిల్లు, అది కాకపోతే ఎస్టిమేషన్‌ కాపీ చూపించాలి. పంట అమ్మితే.. ప్రస్తుతం రబీ పంట కొనుగోళ్లు, ఉద్యాన పంటల అమ్మకాలు జరుగుతున్నాయి. విపణిలో పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. నగదు తీసుకెళ్లే సమయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అమ్మకం పట్టీ దగ్గర ఉంచుకోవాలి.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యలో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. క్షణక్షణం ఆసక్తి రేపుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి ఇలా వసల జోరు కొనసాగుతున్నాయి. ఇదేకోవలో కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి భార్య తోట వాణితో కలిసి వైసీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా తోట నరసింహం తెలుగుదేశం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యంతో ఉన్న తనను టీడీపీ కనీసం పలకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ తోట నరసింహం వ్యాఖ్యలకు టీడీపీ ఘాటుగానే స్పందించింది. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పరామర్శించిన ఫోటోలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.

thota 29102018 1

తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు లోకేష్ పరామర్శించిన ఫోటోలను విడుదల చేశారు. ఆ సమయంలో లోకేష్ తోపాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. మెుత్తానికి ఎంపీ తోట నరసింహం ఆరోపణలకు టీడీపీ ఆధారాలతో సహా దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందన్నమాట. అయితే వైసీపీలో చేరిన సందర్భంగా తోట నరసింహం టీడీపీ కోసం తాను ఎంతో చేశానని అలాంటిది ఆ పార్టీ తనను కనీసం గుర్తించలేదని వాపోయారు. టీడీపీలో అవమానించారని అందుకే పార్టీ మారుతున్నానని చెప్పుకొచ్చారు. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు టీడీపీ కనీసం పరామర్శించలేదని తోట నరసింహం విమర్శలు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. అందుకే పార్టీని వీడుతున్నానని వెల్లడించారు.

thota 29102018 1

మరోవైపు తోట నరసింహం వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరామర్శించిన ఫోటోలు పబ్లిష్ చేశారు. ఈ సందర్భంగా సాక్షిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి రాతలకు ఉండదు మనస్సాక్షి అంటూ చెప్పుకొచ్చారు. అది దొంగబ్బాయి పెంచుకున్న మాయ పక్షి దేనికైనా మసిపూసి చిటికెలో మారేడుకాయ చేస్తుంది. జరిగింది జరగనట్టు, జరగనిది జరిగినట్టు చెప్తుంది అంటూ ట్వీట్ చేశారు. మెుత్తానికి ఎంపీ మాటకు ఆధారాలతో సహా మాట అప్పగించారు ఐటీ మంత్రి నారా లోకేష్.

Advertisements

Latest Articles

Most Read