ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ పంచాయితీ హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌కు చేరింది. చాప కింద నీరులా ఉన్న అసమ్మతి ఊవ్వెత్తున ఎగిసింది. తమ నాయకుడికి సీటు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ అధినేత వద్దే తాడోపేడో తేల్చుకోవడానికి వైసీపీ కార్యకర్తలు లోట్‌సపాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. సోమవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు బ స్సుల్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లా రు. మంగళవారం ఉదయం లోటల్‌పాం డ్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ బైఠా యించి శివరామిరెడ్డికి ఉరవకొండ సీటు కేటాయించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. అదే సమయంలో కార్యాలయంం నుంచి బయటకు వస్తున్న వైఎస్‌ వివేకానందరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుని తమగోడును వెల్లబోసుకున్నారు.

police 13032019

ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఏకపక్షధోరణితో తమను, తమ నాయకున్ని దూరంగా ఉంచారని ఆరోపించా రు. అధికార పార్టీ దూకుడుకు కళ్లేం వేసే సత్తా శివరామి రెడ్డికి మాత్రమే ఉందన్నారు. వివేకానందరెడ్డి పార్టీ నాయకుల కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు సమ్మతించలేదు. దీంతో పార్టీ అధినేతతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మంగళవారం రాత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం ఉంటుందని శివరామిరెడ్డి వర్గీయులు తెలిపారు. లోట్‌సపాండ్‌ కు తరలివెళ్లిన వారిలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ రమణ యాదవ్‌, ఎంపీటీసీ సభ్యుడు విజయ్‌, పార్టీ నాయకులు కోనాపురం హనుమంతు, ముష్టూరు ఎర్రిస్వామి, రేణుమాకుల పల్లి రామాంజినేయులు తదితరులు ఉన్నారు.

 

అక్రమాస్తుల కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోడీ, కేసీఆర్ ల జోడీ ఎలా రక్షిస్తోందో ఒక్క లేఖ బట్టబయలు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకి 2017లో రాసిన లేఖ బయటపడి కలకలం రేపుతోంది. అడుగడుగునా అక్రమాలతో కోట్లు కొల్లగొట్టిన జగన్ క్విడ్ ప్రోకో పక్కా ప్రణాళిక ప్రకారం ఎలా అమలు అయ్యిందో లేఖలో ఈడీ డైరెక్టర్ ఆధారాలతో సహా పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలంటూ సీబీఐని కోరారు. ప్రస్తుతం కాక పుట్టిస్తున్న ఈ లేఖపై సీబీఐ పట్టించుకోకపోవడం వెనుక మోడీకి జగన్ లొంగిపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తనయుడు జగన్ కోసం చేసిన ఈ అక్రమ భూకేటాయింపులను తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయకపోవడమూ అనుమానాలకు తావిస్తోంది.

police 13032019

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కర్నల్ సింగ్ మే 30, 2017 తేదీన , సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మకి రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖలో భూకేటాయింపుల కోసం తొక్కిన అడ్డదారులు, జగన్ కు మేలు చేకూర్చేందుకు వేసిన ఎత్తులన్నీ వివరించారు. కూకట్ పల్లిలో హిందూజా గ్రూపు సంస్ధ గల్ఫ్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ `నాలెడ్జ్ పార్క్’ కోసం 100 ఎకరాలు కేటాయించాలని 2005 నుంచి కోరుతూ వస్తోంది. అయితే 2009 ఎన్నికలకు ముందు సీ.ఎం. వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నీ నిబంధనలను తుంగలో తొక్కి మరీ 100 ఎకరాలు కేటాయింపులు చేశారు. ఈ అడ్డగోలు జీవో తీగలాగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ క్విడ్ ప్రోకో గుట్టురట్టు చేసింది. తాము కోరుకున్న వంద ఎకరాలకు ప్రతిఫలంగా జగన్ కి 11 ఎకరాల భూమి తమ సొమ్ముతోనే కట్టబెట్టిన హిందూజా గ్రూప్ వ్యవహారం ఈడీ బట్టబయలుచేసింది. తమ భూమి, తమ డబ్బుతో కొని జగన్ కు అమ్మినట్టు డ్రామా క్రియేట్ చేయాల్సిన దుస్థితి హిందూజా గ్రూప్ నకు ఎలా ఏర్పడిందో ఈడీ డైరెక్టర్ ఆధారాలతో సహా సీబీఐకి పంపారు.

police 13032019

ఏపీ డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా ప్రహారీ గోడ కట్టారని, 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చి గడువు తీరకముందే ప్రొక్లయినర్లతో కూల్చేసిన ఘనమైన తెలంగాణ ప్రభుత్వం.. వందల కోట్ల ప్రజాధనం జగన్ భూదాహానికి కరిగిపోయినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు సంబంధంలేని డేటాని, వైకాపా ఫిర్యాదుతో జగన్ కి మేలు చేకూర్చేందుకు చోరీ చేసిన తెలంగాణ సర్కారు...అదే తెలంగాణా నడగడ్డలో వందల ఎకరాల భూములు మింగేసినా స్పందించకపోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ అక్రమంగా భూములు కేటాయించారనీ తెలుసు. భూములన్నీ క్విడ్ ప్రోక్వోలో జగన్ కే చేరాయని ఈడీ డైరెక్టర్ లేఖ స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు చేసి నిర్దారించింది. అయినా కేసీఆర్ వైఎస్ హయాంలో జరిగిన భూ విందులపై విచారణకూ ఆదేశించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య ఒప్పందంలో భాగంగానే అక్రమాస్తుల నిందితుడిని శిక్షించాల్సింది పోయి, రక్షిస్తున్నారని ఈ లేఖ ద్వారా మరోసారి వెల్లడైంది.

దొంగ ఓట్లను తొలగించాలని తామే ఫామ్‌-7 దరఖాస్తులు ఇచ్చామని గొప్పగా చెప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఓటుకే ఎసరొచ్చింది. తన ఓటును తొలగించాలని ఆయనే దరఖాస్తు చేసినట్లుగా ఎన్నికల అధికారికి ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 ద్వారా ఒక వినతి అందింది. పులివెందుల ఎన్నికల అధికారి(ఆర్వో) సత్యం మంగళవారం విలేకరులకు వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి. ‘పులివెందులలోని 134 బాకరాపురం పోలింగ్‌ కేంద్రంలో జగన్‌కు ఓటు హక్కు ఉంది. ఈ ఓటును తొలగించాలని జగనే స్వయంగా దరఖాస్తు చేసుకున్నట్లు ఫామ్‌-7లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు వచ్చింది. దీనిని చూడగానే జగన్‌ బంధువైన జనార్దన్‌రెడ్డికి సమాచారం ఇచ్చాం. ఆయన జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి కృష్ణమోహన్‌ రెడ్డికి తెలియజేశారు’ అని ఆర్వో వివరించారు.

police 13032019

అయితే ఓటు తీసేయాలని తాను ఫామ్‌-7 దరఖాస్తు చేయలేదని జగన్‌ బదులిచ్చారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులెవరో ఈ పని చేశారని భావించి, కలెక్టర్‌ హరికిరణ్‌కు ఆర్వో సమస్యను నివేదించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పులివెందుల పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తాను ఆన్‌లైన్‌లో ఫామ్‌-7 దరఖాస్తు చేయలేదంటూ లిఖితపూర్వకంగా బదులివ్వాలని జగన్‌కు స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌కు నివేదించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో పక్క, జగనే ఈ ప్రచారం కావాలని చేస్తున్నట్టు తెలుగుదేశం చెప్తుంది. దోచుకోవడానికే జగన్‌ పార్టీలోకి పారిశ్రామిక వేత్తలు వెళ్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.

police 13032019

కేసీఆర్‌కు జగన్‌ దత్త పుత్రుడు అని ఆరోపించారు. మోదీ.. జగన్‌ అవినీతికి కాపలాదారుని విమర్శించారు. జగన్‌ను కాపాడాలని సీబీఐకి మోదీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జగన్‌ నుంచి మోదీకి ఎన్ని ముడుపులు అందాయో చెప్పాలన్నారు. జగన్‌ మీద ఎంక్వైరీ ఎందుకు వేయలేదని అడిగారు. పులివెందులలో జగన్‌ ఓటు తొలగించాలని ఫామ్‌-7 దరఖాస్తు ఇచ్చారనేది అబద్ధం అన్నారు. జగన్‌ పాస్‌పోర్ట్ మీద ఎక్కడ అడ్రస్‌ ఉంది.. ఓటు ఎక్కడ నమోదు చేసుకున్నారన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే తన ఓటు కూడా పోయిందని జగన్‌ అబద్ధం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

జగన్‌ కేసుల్లో సుమారు రూ.46,500 కోట్లకు సంబంధించిన అక్రమాస్తులు/పెట్టుబడులపై సీబీఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇది అంతటితో ఆగలేదని... సీబీ‘ఐ’ గుర్తించని మరిన్ని అక్రమాలు ఉన్నాయని ఈడీ తేల్చింది. హిందూజా సంస్థలకు చేసిన మేళ్లకు ప్రతిఫలంగా... విజయసాయిరెడ్డి బినామీ కంపెనీగా భావిస్తున్న ‘యాగా అసోసియేట్స్‌’కు రూ.177 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేశారని తేల్చింది. ఇక... ఇందూ ప్రాజెక్ట్స్‌కు చెందిన ‘మ్యాక్‌’ అనే సంస్థ పురుడు పోసుకోకముందే వైఎస్‌ నుంచి భూములు పొందిందని నిర్ధారించింది. ఇవి రెండూ ‘క్విడ్‌ ప్రో కో’ పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. అలాగే... సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో 73 మందిని నిందితులుగా పేర్కొని... 28 మంది/సంస్థల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగిందనే వాదనలతో ఈడీ ఏకీభవించలేదు. స్వయంగా సీబీఐ చార్జిషీట్లో నమోదు చేసిన అభియోగాలనే గుర్తు చేస్తూ... ‘మీరు చెప్పింది నిజం కాదు’ అని ఈడీ సూటిగా చెప్పింది.

police 13032019

మోదీ చుట్టూ వైసీపీ... ‘‘అవినీతి విశృంఖలంగా జరిగింది. క్విడ్‌ప్రోకోలో మీరు చూడని లోతులున్నాయి. ఇవిగో ఆధారాలు... మళ్లీ సమగ్రంగా విచారించండి. త్వరగా నివేదిక ఇవ్వండి. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఈడీ కోరి దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. అయినా దీనిపై సీబీఐ నుంచి ఉలుకూ పలుకూ లేదు. జగన్‌ను అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకు కేంద్రం దీనిని వాడుకుందని... కొత్త చిక్కులు తెచ్చుకోకుండా మోదీకి జగన్‌ దాసోహమయ్యారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అసలే కేసుల దెబ్బకు కేంద్రానికి అణిగిమణిగి ఉంటున్న వైసీపీ... 2017 మే నెలలో ఈడీ రాసిన లేఖ దెబ్బకు మరింత విలవిలలాడిందని, ఇంకా లోతుగా విచారిస్తే. మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని బెంబేలెత్తిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో, విజయ సాయిరెడ్డి ప్రధాని కార్యాలయం చుట్టూ అనేకమార్లు ప్రదక్షిణలు చేయడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పార్లమెంటు లోపల, బయట కూడా పలుమార్లు ప్రధాని మోదీని కలిసి ప్రసన్నం చేసుకునేందుకు ఆయన తహతహలాడటం గమనార్మం.

police 13032019

ఒకవైపు... మోదీ సర్కారుపై టీడీపీ యుద్ధం ప్రకటించగా... అనేక విషయాల్లో వైసీపీ మోదీకి అనుకూలంగా వ్యవహరించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడగకుండానే మద్దతు ఇచ్చింది. పార్లమెంటులో, బయటా ఎప్పుడూ... ఎక్కడా మోదీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హోదా గురించి ఎప్పుడూ నిలదీయలేదు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఉన్నప్పటికీ... లేనట్లుగానే వ్యవహరించారు. హోదాపై చర్చలో పాల్గొన్నప్పుడు కూడా... ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలేసి, చంద్రబాబుపైనే విమర్శలు గుప్పించారు. ఇదంతా కేసుల భయంవల్లే అని టీడీపీ మొదటి నుంచీ విమర్శిస్తోంది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా తాము దర్యాప్తు జరుపుతుండగా... మరో రెండు ‘క్విడ్‌ ప్రో కో’లు బయటపడినట్లు ఈడీ తెలిపింది. హిందూజా గ్రూప్‌ కంపెనీకి చెందిన గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఐడీఎల్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌లకు చెందిన వంద ఎకరాల స్థలం ఇండస్ర్టియల్‌ జోన్‌లో ఉంది. దీన్ని వైఎస్‌ సర్కారు రెసిడెన్షియల్‌ జోన్‌గా మార్చింది. అలాగే... విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలసలోని హిందూజా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పునరుద్ధరణకు అనుమతి ఇచ్చింది. దీనికి ‘ప్రతిఫలం’గా జగన్‌కు చెందిన యాగా అసోసియేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 11.10ఎకరాలను హిందూజా సంస్థ కట్టబెట్టినట్లు ఈడీ గుర్తించింది. అప్పట్లోనే దీని మార్కెట్‌ విలువ రూ.177.60కోట్లుగా తెలిపింది.

 

 

Advertisements

Latest Articles

Most Read