బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఇది ఇరు పార్టీల్లోను చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన తరువాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తానని విష్ణుకుమార్‌రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖకు రైల్వే జోన్‌ కేటాయించినా ఎందుకనో ఆయన సంతృప్తిగా లేరని పార్టీ వర్గాల సమాచారం. విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, గతంలో అవకాశం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో దానిపై చర్చించేందుకే సీఎంను కలిశారనే ప్రచారం జరుగుతోంది.

vishnu 07032019 2

అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... సీఎంను కలిసిన విష్ణు తాను బీజేపీలోనే కొనసాగుతానని, తెలుగుదేశంలోకి రానని చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల వద్ద ప్రస్తావించినట్టు ఒక ఎమ్మెల్యే ధ్రువీకరించారు. దీని పై విష్ణుకుమార్‌ను ప్రశ్నించగా, రాజకీయాల గురించి మాట్లాడేందుకు సీఎంను కలవలేదని, కొన్ని నిధులు, పనుల విషయమై చర్చించేందుకు కలిశానని వివరించారు. అయితే విష్ణుకుమార్ రాజు కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కాంట్రాక్టు లు ఉండటం, వాటిని బూచిగా చూపించి, టీఆర్ఎస్, బీజేపీ బెదిరిస్తున్నారేమో, అని కొంత మంది తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. ఎలా అయితే కొంత మందిని బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారో, అలాగే విష్ణు కుమార్ రాజుని పార్టీ మారకుండా చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది.

vishnu 0703201 39

ఇదిలావుండగా విష్ణుకుమార్‌రాజుకు ఢిల్లీ నుంచి పార్టీ పిలుపు వచ్చింది. అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని వర్తమానం అందడంతో ఆయన గురువారం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అమిత్‌షాతో పాటు ఇతర పార్టీ నాయకులను కలవనున్నట్టు తెలిపారు. అయితే బుధవారం రాత్రి ఆయన మీడియాకు ఫోన్‌ చేసి తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నానని, విశాఖపట్నం వచ్చాక పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. కొన్నాళ్లు ఆయన టీడీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు కూడా ఆశిస్తున్నారనే ప్రచారమూ జరిగింది. మరి ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో, ఈ ఒత్తిడిలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంపై వైసీపీ నేతల సూచన మేరకు తెలంగాణ పోలీసుల దాడికి సంబంధించి మొత్తం కుట్ర ఆంధ్రలోనే జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. బుధవారం గుంటూరు రూరల్‌ ఎస్సీపి కలిసి ఫిర్యాదు చేశాక.. ఎంపీ కనకమేడల రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో దొడ్డిదారిన విజయం సాధించాలనే దుర్బుద్ధితో వైసీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా దశాబ్దాలుగా టీడీపీ డేటాను నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఈ కుట్రలో తెలంగాణ పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారన్నారు. డేటా మొత్తం తెలంగాణా పోలీసులే దొంగతనం చేసి, వైసీపీకి అందించారని చెప్పారు.

telangana police 07032019

‘పథకం ప్రకారం గత నెల 23న అక్రమంగా ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంపై దాడి చేశారు. తెలంగాణ పోలీసులు మఫ్టీలో వెళ్లి దాడి చేసి టీడీపీ డేటాను సేకరించారు. ఉద్యోగులు వారికి సహకరించకపోవడంతో నలుగురిని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై హైకోర్టులో హెబియ్‌సకార్పస్‌ పిటీషన్‌ దాఖలు చేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో వారిని కోర్టులో హాజరు పరిచారు. వారిని కేసులో సాక్షులుగా పేర్కొన్నారు. అంతేకాక ఖాళీ పేపర్లపై వీఆర్‌వోల సంతకాలను పెట్టించుకున్న పత్రాలు కూడా కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు వారికి చీవాట్లు పెట్టింది. ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదం కావడంతో గత్యంతరం లేక ఈ నెల 2న కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం తెలంగాణ పోలీసులకు కేసు నమోదు చేసే అధికారం లేదు. ఒకవేళ ఏపీ ప్రభుత్వ డేటా చోరీకి గురైతే కేసు నమోదు చేయాల్సింది ఏపీలో. సంబంధం లేకపోయినా కేవలం కుట్ర పూరితంగా చట్టాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేసి తెలంగాణ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ విధంగా సేకరించిన టీడీపీ డేటాను వైసీపీ నేతలకు అందించారు. వారు అందులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్‌లు చేసి ప్రలోభాలకు గురి చేశారు.

telangana police 07032019

టీడీపీ డేటాను తస్కరించి పెద్ద సంఖ్యలో టీడీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు. దానిలో భాగంగానే కుప్పలు తెప్పలుగా ఫామ్‌-7 దరఖాస్తులు వెల్లువెత్తాయి. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఏపీ రాజకీయాల గురించి పట్టించుకోవు. తెలంగాణ మాత్రం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది. జగన్‌ గవర్నర్‌ను కలవడం ఆ వెంటనే డేటా తస్కరణపై సిట్‌ వేయడం వంటివి చూస్తుంటే టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేపీల కుట్ర స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ మొత్తం కుట్రపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయి. కుట్రలో భాగస్వాములైన వైసీపీ నాయకులు, తెలంగాణ పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం’ అని వెల్లడించారు. ఐపీసీ 120బి, 418, 420, 380, 409, 167, 177, 182 రెడ్‌విత్ 511, ఐటీ యాక్ట్ 66సీ, 67, 70 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. వైసీపీ నాయకులు, తెలంగాణ పోలీసులను నిందితులుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మరింత రాజుకుంటోంది. తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ గ్రిడ్‌లోని తమ పార్టీ సమాచారాన్ని వైసీపీకి ఇచ్చారని టీడీపీ ఆరోపించింది. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనిపై గుంటూరు పోలీసులకు పిర్యాదు చేయాలని నిర్ణయించింది. సజ్జనార్ తీరును ఇప్పటికే చంద్రబాబు సహా ఏపీ మంత్రులందరూ తప్పుపట్టారు. తమ డేటాను చోరీ చేశారని నిర్ధారణ కావడంతో సాక్ష్యాలతో సహా పిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించి, అవసరమైతే కోర్టు వెళ్లాలని నిర్ణయించింది.

case 06032019

తమ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఏపీ అంటుంటే.. గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులపై కేసులు నమోదే చేయడమే కాకుండా.. అవసరమైతే అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై కేసు పెట్టాలని టీడీపీ నిర్ణయించడంతో వివాదం మరింత ముదిరింది. టీడీపీకి సంబంధించిన డేటా చోరీ జరిగిందని పార్టీ తరుపున ఒక కేసు, అలాగే ఏపీ ప్రజలకు సంబంధించిన డేటాను దొంగతనం చేసారంటూ ప్రభుత్వం తరుపున మరో కేసు ఫైల్ చేయనున్నట్లు తెలుస్తుంది.

case 06032019

ఆంధ్రప్రదేశ్ మీద లేని పోని నిందలు వేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవాలని నిన్ననే ముఖ్యమంత్రి కేబినెట్ లో నిర్ణయించారు. టీడీపీ కి సంబంధించిన డేటాను దొంగలించి వైసీపీకి మేలు చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. తెలంగాణ పోలీసుల తీరు కూడా శృతి మించడంతో న్యాయపరంగానే వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు న్యాయనిపుణులతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో సీబీఐ అధికారులు ఆ రాష్ట్ర పోలీసులు నిర్భంధంలోకి తీసుకొన్నారని, ఇక్కడ కూడా అదే పరిస్థితి సృష్టించవచ్చునని ఒక మంత్రి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రూ.5వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, పోలవరం ప్రాజెక్టు ఆపాలని కోర్టుల్లో కేసులు వేశారని, అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో విషం చిమ్ముతున్నారని మరోమంత్రి ఆక్రోశించారు. హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్‌ కంపెనీని ఫిబ్రవరి 23వ తేదీ నుంచే వేధిస్తున్నారని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె, ఎంపీ రామ్మోహన్ నాయుడు సోదరి భవానీ శ్రీనివాస్ ను రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఎర్రన్నాయుడు కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు, రామ్మోహన్ నాయుడు క్రేజ్ అన్నీ కలిసి భవానీ విజయం ఖాయమని టీడీపీ అంచనా వేస్తోంది. ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీడీపీ... మెరికల్లాంటి అభ్యర్ధుల కోసం అన్వేషణ సాగిస్తోంది. ఇందులో భాగంగా రాజమండ్రి అసెంబ్లీ స్ధానానికి పార్టీకి చెందిన దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ను రంగంలోకి దించబోతోంది. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు స్వయానా సోదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు కూడా అయిన భవానీని బరిలోకి దింపడం ద్వారా ఇక్కడి బీసీ ఓటర్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవచ్చనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

yerramnaidu 06032019 2

2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్ధి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. ఆయన తాజాగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు కాగానే రాజమండ్రి అసెంబ్లీ సీటులో వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆదిరెడ్డి భవానీకి చంద్రబాబు టికెట్ ఓకే చేశారు. మామ ఆదిరెడ్డి అప్పారావుకు నియోజకవర్గంలో ఉన్న పట్టు, మంత్రిగా చిన్నాన్న అచ్చెన్నాయుడు, ఎంపీగా సోదరుడు రామ్మోహన్ నాయుడు అండదండలు కూడా ఉండటంతో భవానీ ఇక్కడ గట్టి అభ్యర్ధి అవుతారని టీడీపీ అంచనా వేస్తోంది.

yerramnaidu 06032019 3

బీసీ ఓటర్లు అధికంగా ఉన్న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ... ఈ మధ్యే జయహో బీసీ సభ కూడా నిర్వహించింది. బీసీలకు తాము పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీడీపీ... ఆయా వర్గాల కోసం ప్రత్యేక కార్పోరేషన్లు ప్రకటించడంతో పాటు సబ్ ప్లాన్ కూడా అమలు చేస్తోంది. ఇవన్నీ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తమకు కలిసొస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె అయిన భవానీకి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో లోకేష్ టీమ్ తయారీకి పనికొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు రామ్మోహన్ నాయుడుకు పార్టీలోని యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈసారి భవానీ కూడా గెలిస్తే టీడీపీలోనూ ఆమె కీలకం కానున్నారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోనూ భవానీ శ్రీనివాస్ పైనే అందరి దృష్టీ నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read