మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి, అతనిపరివారం సకుటుంబ సపరివారసమేతంగా రూ.3లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూఠీచేశారని, ప్రజలప్రాణాలుపోతున్నా, రాష్ట్రం నామరూపాలు లేకుండా పోతున్నా ముఖ్యమంత్రి, మంత్రివర్గం, వైసీపీనేతలు అవినీతి, అక్రమార్జన వదలడంలేదని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం...! కేబినెట్ సమావేశంలో జగన్ రెడ్డి ఉపదేశాలు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి.... “మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో 3లక్షలకోట్ల ప్రజాధనం లూఠీ. జగన్ రెడ్డి, అతని పరివారం సకుటుంబసపరివారంగా దోపిడీలో మునిగి తేలుతోంది. వైసీపీ అలీబాబా దొంగలముఠా ఇప్పటివరకు దోచుకుందిచాలు, ఇకనుంచి జాగ్రత్త పడండి అని కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. కేబినెట్ సమావేశంలో జగన్ రెడ్డి ఉపదేశం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. జగన్ రెడ్డి అవినీతి తెలిసిన ప్రజలంతా ఆవుచేలో మేస్తుంటే, దూడలు గట్టున మేస్తాయా అని ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలోని సహజవన రులు, ప్రజలసంపద లూఠీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు పోటీలు పడుతు న్నారు. మూడున్నరేళ్లలోనే మూడుతరాలకు సరిపడినంత దోచేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో వై.వీ.సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి బంధువు వై.ఎస్.అనిల్ రెడ్డి రూ.15వేలకోట్ల విలువైన లాటరైట్ ఖనిజాన్ని అడ్డగోలుగా దోచేశారు. విజయసాయి రెడ్డి , జేగ్యాంగ్ కలిసి ఉత్తరాంధ్రలో రూ.40వేలకోట్ల విలువైన భూముల్ని కాజేసింది వాస్తవంకాదా? రాష్ట్రవ్యాప్తంగా రూ.25వేలకోట్ల విలువైనభూముల్ని ఇతర వైసీపీనేతలు స్వాహాచేశారు. దానికి సంబంధించిన సర్వేనంబర్లు, ఇతరవివరాలను తాము ఇదివరకే ప్రజలముందు ఉంచలేదా? వైసీపీనేతల లూఠీపై మూడేళ్లుగా ప్రజలు, పత్రికలు ఘోషించినా తాడేపల్లి ప్యాలెస్ లో ఉలుకూ, పలుకూ లేదు. ఏ2 కొట్టేసిన భూముల జాబితాలో 22-ఏలోని భూములు, రుషికొండభూములు, దసపల్లాల్యాండ్స్, చర్చిభూములు, వృద్ధాశ్రమభూములు, దేవాలయ, మాజీ సైనికులు భూములు, ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ తాము బయటపెడితే, అవి కొట్టేసింది తాను కాదు, తనకూతురు అల్లుడని విజయసాయే బయటపడ్డాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వీ. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, లాంటి వాళ్లంతా రాష్ట్రాన్ని జోన్లుగా మార్చి దోపిడీకి తెగబడుతున్నారు. దోచినదాన్ని సమానంగా పంచుకుంటూ, తాడేపల్లి ప్యాలెస్ కు ఇవ్వాల్సిన దాన్ని లెక్కతప్పకుండా సక్రమంగా అప్పగిస్తున్నారు.

ఇసుక, మద్యం, మైనింగ్, మాదకద్రవ్యాలు... కాదేదీ జగన్ దోపిడీకి అనర్హం. ఇసుకదోపిడీకోసం చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డి, జేపీ వెంచర్స్ సంస్థను తెరపైకి తెచ్చిన జగన్ రెడ్డి, మూడేళ్లలో రూ.10వేలకోట్లు దిగమింగాడు. మైనింగ్ లో రూ.25వేలకోట్లు, మద్యం అమ్మకాల్లో రూ.25వేలకోట్లు కొల్లగొట్టారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బేవరేజెస్ అన్నీ వైసీపీ నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. రూ.50లు విలువచేసే చీప్ లిక్కర్ బాటిల్ ను రూ.250కు అమ్ముతూ, ప్రజల్ని పీల్చిపిప్పిచేస్తున్నారు. వైసీపీప్రభుత్వం అమ్మేదంతా కల్తీమద్యమని, ప్రాణాంతకమైనదని తామే ప్రయోగశాలల్లో పరీక్షించి మరీ నిరూపించాం. మద్యం అమ్మకాలతో ఆగకుండా, అదనంగా రాష్ట్రానికి డ్రగ్స్, గంజాయిని పరిచయంచేసిన ముఖ్య మంత్రి, అతని జేగ్యాంగ్ వాటి అమ్మకాలతో రూ.25వేలకోట్లు కొల్లగొట్టింది. ఎర్రచందనం అమ్మకాలతో రూ.25వేలకోట్లు, రేషన్ బియ్యం మాఫియాద్వారా రూ.7వేల కోట్లు, సిమెంట్ ధరలపెంపుతో రూ.15వేలకోట్లు దిగమింగారు. పేదలకు ఇళ్లునిర్మిస్తామని స్థలాలకొనుగోలు పేరుతో రూ.7వేలకోట్లు కాజేశారు. ఇళ్లుకాదు గ్రామాలునిర్మిస్తున్నానని ప్రజల్ని నమ్మించిన జగన్ రెడ్డి బాగోతాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రగృహనిర్మాణశాఖ మంత్రే బయటపెట్టాడు. మూడున్నరేళ్లలో ఈ ముఖ్యమంత్రి కట్టింది కేవలం 5ఇళ్లేనని కుండబద్ధలుకొట్టి, వైసీపీ ప్రభుత్వ దుష్ప్రచారంపై నీళ్లుకుమ్మరించాడు. సంకల్ప సిద్ధి కుంభకోణం కింద వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు రూ.1100కోట్లు కొట్టేశారు. స్కామ్ పై విచారించాల్సిన సీఐడీ అధికారులు, అవినీతిపరులతో చేతులుకలిపి, మోసపోయిన పేదలకు అన్యాయంచేశారు.

కారుచౌకగా లేపాక్షి భూముల్ని కాజేశారు... లేపాక్షి భూముల వ్యవహారంలో గతంలో జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ జైలుకువెళ్లింది. ఇప్పుడు అధికారంచేతిలో ఉందని కంపెనీస్ యాక్ట్ పేరుతో కొత్తనిబంధనలు తెచ్చి రూ.25వేలకోట్ల విలువైన లేపాక్షి భూముల్ని కారుచౌకగా దక్కించుకున్నారు. లేపాక్షి భూముల కుంభ కోణంలో జగన్ మేనమామ రవీందర్ రెడ్డి కొడుకు ఉన్నది వాస్తవంకాదా? 108, 104 అంబు లెన్సులు, ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతోవాహనాల కొనుగోలు పేరుతో రూ.1000కోట్లు కొట్టేశారు. విద్యుత్ కొనుగోళ్ల ముసుగులో గ్రీన్ ఎనర్జీ కింద రూ.65వేలకోట్లు దోచేశారు. రూ.లక్షకోట్ల విలువైన పవర్ ప్రాజెక్ట్ లను, నామినేషన్ పద్ధతిలో సొంత బంధువులకు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. లక్షకోట్లలో ఎన్నివేలకోట్లు ముఖ్యమంత్రికి వచ్చాయో చెప్పలేం. రాష్ట్రంలోని హైడ్రోపవర్, సోలార్, విండ్, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లను గాలికొదిలేసి, బయటనుంచి అధికధరకు విద్యుత్ కొంటూ, వైసీపీప్రభుత్వం ప్రజలపై మోయ లేని భారం వేసింది. జగన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్ల టెండర్లను, అడ్డగోలుగా తనవాళ్లకు అప్పగించబట్టే, ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో మూడున్నరేళ్లలో రూ.46వేలకోట్ల భారం పడింది.

మూడున్నరేళ్లలో ఏ కేబినెట్ మీటింగ్ లోనైనా తాను, తనప్రభుత్వం అవినీతి చేయలేదని జగన్ రెడ్డి చెప్పగలిగాడా? మూడున్నరేళ్లలో లక్షలకోట్లు దోచేసిన జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టి, పేదలకు మాత్రం పేలాలు పంచాడు. మూడున్నరేళ్లలో ఏ కేబినెట్ సమావేశంలో అయినా జగన్ రెడ్డి, తనప్రభుత్వం, మంత్రులు అవినీతి చేయలేదని చెప్పగలిగాడా? చెప్పలేడు..ఎందుకంటే అవినీతి బురదలో పొర్లుతున్నాడుకాబట్టి. నిన్నటి కేబినెట్ సమావేశమే తనచివరి సమావేశమన్నట్లుగా ముఖ్యమంత్రి తీవ్ర నిరాశానిస్పృహలతో మాట్లాడాడు. అధికారం దక్కిందే దోపిడీకోసం అన్నట్టుగా ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మూడున్నరేళ్లలో పేట్రేగిపోయాడు. ఇవన్నీ ప్రజలకు తెలియవన్నట్లు నిన్న కేబినెట్ మీటింగ్ లో జగన్ రెడ్డి, తన జేగ్యాంగ్ కు జాగ్రత్తలు చెబుతున్నాడు.

వైసీపీ ఎమ్మెల్యే దోచుకున్న భూముల్లో జగన్ రెడ్డికి అందిన వాటా ఎంతో ఆయనే చెప్పాలి. జగన్ రెడ్డి, వైసీపీప్రభుత్వ అవినీతి వల్ల అంతిమంగా ప్రజలు బలవుతున్నారు. ఒక్క ఛాన్స్ అని నమ్మించి, అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, తనదోపిడీతో చివరి ఛాన్స్ కూడా లేకుండా చేసుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఏరాజకీయపార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనంత అవినీతి జగన్ రెడ్డి చేశాడు. కొండలు, గుట్టలు, అడవులు, ఊళ్లకు ఊళ్లే వైసీపీనేతల అవినీతికి కనుమరుగయ్యాయి. జగన్ రెడ్డి దోపిడీదెబ్బతో నామరూపాల్లేకుండా పోయిన రాష్ట్రాన్ని, దిక్కుతోచని స్థితిలోఉన్న ప్రజల్ని కాపాడే శక్తి, ఒక్క చంద్రబాబుకే ఉంది. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా చంద్రబాబుతో, తెలుగుదేశంతో కలిసి నడవాలి” అని బొండా పిలుపునిచ్చారు.

ప్రభుత్వాధినేతగా ఉండి, ప్రభుత్వరంగ డెయిరీలను, వాటితాలూకా ఆస్తుల్ని కాపాడి, పాడి రైతులకు న్యాయంచేయాల్సిన ముఖ్యమంత్రి, గుజరాత్ సంస్థ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, తనపై ఉన్న కేసులభయం, కమీషన్లకక్కుర్తితోనే జగన్ రెడ్డి రాష్ట్రపాడిపరిశ్రమను, డెయిరీలను అమూల్ పరంచేయడానికి సిద్ధమయ్యాడన్నారు. విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడిన వివరాలు క్లుప్తంగా మీకోసం...! "అమూల్ సంస్థకోసం చిత్తూరు, ఒంగోలు డెయిరీలను నిర్వీర్యంచేయడం దుర్మార్గం. రాష్ట్రంలోని కోఆపరేటివ్ డెయిరీలను అమూల్ పరంచేయడంలోని ఆంతర్యం ఏమిటో జగన్ సమాధానం చెప్పాలి. తనపై ఉన్న అవినీతికేసుల్ని మాఫీచేసుకోవడానికి, కమీషన్లకక్కుర్తితోనే ముఖ్యమంత్రి రాష్ట్ర పాడిపరిశ్రమను అమూల్ పరంచేస్తున్నాడు. చిత్తూరు డెయిరీ ఆస్తుల విలువ రూ.350కోట్లు. చిత్తూరు డెయిరీ 25ఎకరాల విస్తీర్ణంలో, పట్టణం నడిబొడ్డున ఉంది. వి.కోట, మదనపల్లె, పీలేరు, కాళహస్తి, పిచ్చాటూరు ప్రాంతాల్లో 50వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 5 చిల్లింగ్ సెంటర్లు చిత్తూరు డెయిరీ కింద ఉన్నాయి. ఒక్కో చిల్లింగ్ కేంద్రం 5 ఎకరాలకు విస్తీర్ణంలో ఉంది. చిత్తూరుడెయిరీకి సంబంధించిన యంత్రసామగ్రి దశాబ్దాలక్రితమే జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాలనుంచి తెప్పించారు. ఆ సామగ్రి విలువే రూ.30కోట్లు పైన ఉంటుంది. దేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచి, 1982లో ఎంఎన్ పీవోగా ప్రారంభమైన చిత్తూరు డెయిరీని నేడు ఎక్కడినుంచో వచ్చిన అనామకసంస్థ పరంచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

చిత్తూరు డెయిరీని ఏడాదికి రూ.కోటిచొప్పున 99ఏళ్లపాటు అమూల్ కు లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాదయాత్రసమయంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని డెయిరీలతో పాటు, రాష్ట్రంలోని కో ఆపరేటివ్ డెయిరీలను ఆదుకుంటానని, తాను ముఖ్యమంత్రి అయితే, ప్రభుత్వపరంగా వాటిని అదుకుంటానని జగన్ రెడ్డి చెప్పాడు. మూతపడిన డెయిరీలను తెరిపిస్తానని, వాటిపరిధిలోని షుగర్ ఫ్యాక్టరీలను కూడా రీ ఓపెన్ చేయిస్తానని నమ్మబలికాడు. పాడిరైతులకు లీటర్ కు రూ.4లు బోనస్ గా చెల్లిస్తానన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక పాడిరైతుల్ని పచ్చిగా మోసగించి, అమూల్ సంస్థకోసం అర్రులుచాస్తున్నాడు. ప్రభుత్వ డెయిరీ అయిన విజయడెయిరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిన ముఖ్యమంత్రి, అమూల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.ప్రైవేట్ డెయిరీలకంటే అమూల్ డెయిరీ పాడిరైతులకు లీటర్ పాలకు రూ.2, రూ.3లు తక్కువే ఇస్తోంది. పాడిరైతులు అమూల్ సంస్థకు పాలుపోయడాన్ని ఇష్టపడంలేదు. కానీ ప్రభుత్వం వారిని బెదిరించి అమూల్ కు అనుకూలంగా పనిచేయిస్తోంది. అమూల్ డెయిరీ గుజరాత్ సంస్థ. గుజరాత్ వ్యాపారులు రాష్ట్రంలోని పాడిపరిశ్రమపై వచ్చే సంపదను దోచుకుంటారు గానీ, పాడిరైతులకు ఎలాంటి న్యాయంచేయరు. పాడిరైతుల్ని బలిపశువుల్ని చేయడానికే జగన్ రెడ్డి అమూల్ సంస్థ సేవలో తరిస్తున్నాడు. రాష్ట్రంలో 13సహకార, 7 ప్రైవేట్ డెయిరీలు ఉండగా, వాటినిక కాదని గుజరాత్ కు చెందిన అమూల్ తో ఒప్పందంచేసుకోవడం జగన్ రెడ్డి స్వార్థప్రయోజనాలకు నిదర్శనం. అమూల్ సంస్థకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు. రాష్ట్రంలోని ఇతర పాడిపరిశ్రమలకు తీరనినష్టాలనే మిగులుస్తాయి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పొరుగువారికి మేలుచేయడం మానేసి, సొంతరాష్ట్రంలోని డెయిరీలకు అండగా నిలవాలి.

విశాఖపట్నంలో, రుషికొండకు కొట్టిన బోడి గుండు గురించి రాష్ట్రం మొత్తం ఆవేదన చెందుతుంటే, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాత్రం, సింపుల్ గా కొట్టి పడేసారు. వాటర్ మెన్ అఫ్ ఇండియా రాజేంద్రసింగ్‌ విశాఖ వచ్చి రుషికొండని చూసి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీని పై విలేఖరులు సజ్జలని అడగగా, ఆయన స్పందిస్తూ, రుషికొండ ఏమైనా పెద్ద అంతర్జాతీయ సమస్యా? అని ప్రశ్నించారు. తవ్వే వాళ్ళు గుట్టను టన్నుల్లెక్కన లెక్కగట్టి తవ్వాలా? అని ప్రశ్నించారు. గతంలో ఏ కొండ పైన ఎవరూ ఏమి తవ్వలేదా అని ప్రశ్నించారు. సజ్జల చేస్తున్న ఎదురు దా-డి చూసి విలేఖరులు షాక్ తిన్నారు. రుషికొండ పై ప్రభుత్వానికి ఏ మాత్రం సీరియస్ నెస్ ఉంది అనే విషయం, సజ్జల మాటలతోనే అర్ధం అవుతుందని, పలువురు అభిప్రాయ పడుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురు అవుతున్న వేళ, రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు కూడా జగన్ ని విమర్శించటం, ఇప్పుడు వైసీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. వైఎస్ఆర్ పాలన అందిస్తాను అంటూ, వైఎస్ పేరుతో వచ్చిన జగన్ , ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూసి, అప్పటి వైఎస్ సన్నిహితులు కూడా వైఎస్ఆర్ పేరు చెడగొడుతున్నారని బాధపడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ ఆత్మగా పేరున్న కేవీపీ రామచంద్రరావు కూడా, జగన్ పాలన పై విరుచుకుపడ్డారు. అయితే కేవీపీ జగన్ పాలనను విమర్శించటం పై, సజ్జల విలేఖరుల సమావేశంలో స్పందించారు. కేవీపీ రామచంద్ర రావు మాటలు తాను చూశానని, అవి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడి ఉంటారు తప్ప, ఆయన వ్యక్తిగతంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండరు అంటూ, కవర్ చేసే ప్రయత్నం చేసారు సజ్జల. దీనికి రాజకీయంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగానే చూడాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read