ప్రధానమంత్రి మోదీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైకాపా అధ్యక్షుడు జగన్‌లతో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ వ్యాఖ్యా నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గుజరాత్‌ తరహా రాజకీయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన తెదేపా నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రానికి మోదీ చేసిన ద్రోహాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టానన్న కక్షతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈడీ, ఐటీ దాడులతో ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. బడ్జెట్‌ ప్రసంగం తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చింది. 8 గంటలకు పైగా ప్రశ్నించారు.

108 26112018 1

దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడా భయపడకుండా ప్రశ్నలన్నింటికీ సూటిగా సమాధానమిచ్చాను. కొన్నాళ్ల తర్వాత మళ్లీ పిలిపించారు. ఎంత భయపెట్టాలని చూసినా మీరు భయపడలేదని ఈడీ అధికారులే నాతో చెప్పారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఇదంతా చేస్తున్నామని చెప్పి మొదటిసారి కంటే రెండోసారి బాగా మాట్లాడి పంపించారు. తెలుగు రాష్ట్రాల్లో పక్కాగా పన్ను చెల్లిస్తున్న నంబర్‌వన్‌ టాక్స్‌ పేయర్ని.. ఐటీ సంస్థ అవార్డులు కూడా ఇచ్చింది. అలాంటి నాపై దాడులు చేసి ఇబ్బందులకు గురిచేస్తే నవ్వులపాలవుతారు. నా వద్ద ఏమీ దొరకలేదని, నా బంధువులు, స్నేహితులను వేధిస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. బ్రిటీష్‌ వాళ్లతో పోరాడి మా తాతతో పాటు ఎన్‌.జి రంగా జైలుకు వెళ్లారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో పోట్లాడి జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంఐఎం అధినేత ఒవైసీతో కలిసి అవినీతి జగన్‌కు మద్దతు తెలుపుతూ చంద్రబాబునాయుడిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని ఎంపీ గల్లా జయదేవ్‌ వివరించారు.

108 26112018 1

ప్రధాని మోదీ, బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవెల్‌ త్రయం దేశంలో హిట్లర్‌ పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య విషయాలు సైతం వారు ముగ్గురే కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మోదీ, షాలు గుజరాత్‌ రాజకీయాన్ని దేశమంతా రుద్దాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌, కేసీఆర్‌లతో కలిసి మోదీ కుట్రలుచేస్తున్నారని.. ఇప్పుడు వారి దృష్టి తనపై పడిందని, ఆవిశ్వాస తీర్మాన ప్రసంగం అనంతరం తనను ఈడీ పిలిచిందని తెలిపారు. తనతో కఠినంగా వ్యవహరించారని చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగం తరువాత మళ్లీ పిలిచారన్నారు. ’నేను పక్కాగా ట్యాక్స్‌ కడుతున్నా.. రెండు తెలుగు రాష్ట్రాలో నెంబర్‌వన్‌ ట్యాక్స్‌ పేయర్‌ను నేను... నా వద్ద ఏమీ దొరకలేదు... దాంతో నా బంధువులు, స్నేహితులనూ ఐటీ అధికారులు వేధిస్తున్నారు’ అని గల్లా పేర్కొన్నారు.

మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఎంత మంది ఓట్లు లేపెసారో చూసాం. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ లో, రాజకీయ పార్టీలకు, ఈ ఓట్లు లేపెయ్యటం కూడా ఒక భాగం అయ్యింది. ఎప్పటికప్పుడు మన ఓటు ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే పోలింగ్ జరిగే రోజు, అక్కడకు వెళ్లి మీ ఓటు లేదని అవాక్కవ్వల్సిందే. ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఫారం-7 రూపంలో తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో అసలు తమ ఓటు ఉందా? లేదా? అనే సందిగ్ధత అర్హులైన ఓటర్లలో నెలకొంది. నిబంధనల ప్రకారం తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో విచారించాలి. ఎవరి ఓట్లు తొలగించాలని దరఖాస్తులు వచ్చాయో వారికి సమాచారం ఇవ్వాలి. అయితే లక్షల సంఖ్యలో తొలగింపు దరఖాస్తులు వస్తున్నందున క్షేత్ర పరిశీలన చాలా కష్టసాధ్యమని, విచారణ లేకుండానే అర్హుల ఓట్లు కూడా తొలగించే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో తమ పేరుందా? లేదా? అని ప్రతి ఓటరు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.

27 days

ఓటరు జాబితాలో మీ పేరున్నదీ లేనిదీ ఇప్పుడే పరిశీలించుకోవచ్చు. ఇందుకు నాలుగు మార్గాలున్నాయి. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. చివరి నిమిషంలో నిరాశ చెందకుండా.. మీ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ముందుగా పేరు ఉందో లేదో చూసుకోండి, పేరు లేకపోతే ఫారం-6లో దరఖాస్తు చేసుకుని ఇప్పటికైనా ఓటరుగా చేరొచ్చని స్పష్టం చేస్తోంది. ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనేది తెలుసుకోవడం ప్రతి ఓటరు ప్రాథమిక బాధ్యత. సంక్షిప్త సందేశాలు పంపించడం ద్వారా, వెబ్‌సైట్‌ల్లో చూసుకోవడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కాల్‌సెంటర్‌లకు ఫోన్‌ చేయడం ద్వారా జాబితాలో పేరుందా? లేదా అనేది తెలుసుకోవొచ్చు. పోలింగ్‌ కేంద్రాల్లో నుంచి కూడా జాబితాలు చూసుకుని తనిఖీ చేసుకోవచ్చు. పేరు లేకపోతే తక్షణమే ఫారం-6లో దరఖాస్తు చేసుకోండి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ ఈ అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.

27 days

ఇంకా సందేహాలు ఉంటే ఈ 1950 నెంబరుకు ఫోన్‌ కాల్స్‌ ద్వారా కూడా సంక్షిప్త సందేశం లేదా వాట్సాప్‌ సందేశం పంపించి నివృత్తి చేసుకోవచ్చు. వాటికి నేనే నేరుగా స్పందిస్తా. ప్రత్యేక యాప్‌ ఉంది. మెసేజ్ ద్వారా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవాలి అంటే, ఈసీఐ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను టైప్‌ చేసి 1950 నెంబరుకు పంపించాలి. రెండో విధానం, www.ceoandhra.nic.in, www.nvsp.in వెబ్సైటు లో చెక్ చేసుకోవటం, మూడో విధానం, కాల్ సెంటర్ కు ఫోన్ చెయ్యటం 1950 , నాలుగో విధానం, నేరగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి చూడటం. ప్రతి శనివారం, మీ పోలింగ్ కేంద్రంలో ఈ జాబితా ఉంటుంది. ఇలా నాలుగు విధాలుగా, మీ ఓటు ఉందో లేదో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండవచ్చు.

తెలుగు రాష్ట్రాల మధ్య తాజాగా రేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఐటీ గ్రిడ్‌ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులను తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 కల్లా వారిని తమ ముందుకు తీసుకురావాలంది. కేసు డైరీలో ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకోవడం చూస్తుంటే ఉద్యోగులను అక్రమంగానే అదుపులోకి తీసుకున్నారని స్పష్టమవుతోందని పేర్కొంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీగ్రిడ్‌ అనే కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగుల్ని తెలంగాణ పోలీసులు తీసుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తమ సహచర ఉద్యోగులు కనిపించడం లేదంటూ ఆ కంపెనీ డైరక్టర్‌ అశోక్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ అనే నలుగురు ఉద్యోగుల ఇళ్లల్లోకి తెలంగాణ పోలీసులు బలవంతంగా చొరబడి నిర్బంధంలోకి తీసుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

108 26112018 1

భాస్కర్‌తోపాటు ఆయన భార్య ఫోన్‌ కూడా లాగేసుకున్నారన్నారు. అడిగితే తాము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పోలీసులు దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఫణీంద్ర తండ్రి అప్పన్నదొరను నిర్బందించి.. మీ కుమారుడు వస్తేనే వదులుతామని బెదిరించారని వివరించారు. ఈ పిటిషన్‌ను ఆదివారం హైకోర్టు హౌస్‌ మోషన్‌లో విచారించింది. తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీ, సైబర్‌క్రైం వింగ్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. మొదటగా పిటిషనర్‌ తరపు న్యాయవాది జి.సుబ్బారావు వాదనలు వినిపిసూ నలుగురు ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగులను వారి ఇళ్ల నుంచి మాదాపూర్‌ పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారని తెలిపారు.

108 26112018 1

దీంతో ఆ నలుగురిని ఎందుకు అరెస్టు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. మీకు కంపెనీపై ఫిర్యాదు వచ్చిందన్నారు. అలాంటప్పుడు కంపెనీ ఉద్యోగులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించింది. నలుగురు ఉద్యోగులకు సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశామని, వాళ్లను నిందితులని అరెస్టు చేయలేదని, సాక్షులుగా తీసుకెళ్లామని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. సాక్షులుగా అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా అరెస్ట్‌ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కేసు రికార్డులు ఏమున్నాయని అడగ్గా.. అన్నీ ఉన్నాయంటూ రికార్డులను తెలంగాణ పోలీసులు అందించారు. అందులో తెల్లకాగితాలపై సంతకాలు ఉండడం చూసి ఇవేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. పంచనామా కోసం వీఆర్‌వో సంతకం తీసుకున్నామని తెలంగాణ పోలీసులు బదులిచ్చారు. ‘పంచనామా నివేదిక రాసి సంతకాలు పెట్టిస్తారా? లేకుంటే సంతకాలు పెట్టించుకుని.. ఏదైనా రాసుకుంటారా?’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి ఇల్లు లేదా సంస్థలో సోదాలు నిర్వహించి పంచనామా పూర్తయిన తర్వాత ఆయా విషయాలు అందులో పొందుపర్చి.. అక్కడే స్థానిక వీఆర్వో సంతకం తీసకుంటారు. మీరు తెల్లకాగితాలపై సంతకాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇది చూస్తేనే మీ ఉద్దేశం అర్థమవుతోంది. వెంటనే అరెస్ట్‌ చేసిన నలుగురు ఐటీగ్రిడ్‌ ఉద్యోగులను సోమవారం కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని ఆదేశించింది.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని చాలావరకు ఖరారు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... లోక్‌సభ అభ్యర్థులపై మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. లోక్‌సభ నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించి... వాటి పరిధిలోకి వచ్చే శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై మాత్రమే ఆయన స్పష్టతనిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై మాత్రం సమయం తీసుకుంటున్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని ఆయన దీనిపై ఒక నిర్ణయానికి రానున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండటంతో... నాలుగు లోక్‌సభ స్థానాల్ని ఆ పార్టీకి కేటాయించి, తెదేపా 21 చోట్ల పోటీ చేసింది.

108 26112018 2

రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను ఇంతవరకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, చిత్తూరు లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై మాత్రమే స్పష్టత వచ్చింది. సిట్టింగ్‌ ఎంపీల్లో కె.రామ్మోహన్‌నాయుడు (శ్రీకాకుళం), పి.అశోక్‌గజపతిరాజు (విజయనగరం), కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని నాని (విజయవాడ), గల్లా జయదేవ్‌ (గుంటూరు), నిమ్మల కిష్టప్ప (హిందూపురం), శివప్రసాద్‌ (చిత్తూరు) మళ్లీ బరిలోకి దిగనున్నారు. అరకులో కిశోర్‌చంద్ర దేవ్‌, కాకినాడలో చలమలశెట్టి సునీల్‌, అమలాపురంలో హరీష్‌ మాథుర్‌ (దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడు), కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి, కడపలో మంత్రి ఆదినారాయణరెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్టే.

108 26112018 2

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, కుమారుడు పవన్‌ కుమార్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. కిశోర్‌చంద్రదేవ్‌, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, చలమలశెట్టి సునీల్‌ ఇటీవలే తెదేపాలో చేరిన విషయం తెలిసిందే. మిగతా లోక్‌సభ స్థానాల్లో ఆశావహులు ఎక్కువే ఉన్నా... మరింత విస్తృత కసరత్తు తర్వాతే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ తెదేపాలో చేరితే ఆయనే అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఏలూరు టికెట్‌ను ప్రస్తుత ఎంపీ మాగంటి బాబుతో పాటు, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్‌ ఆశిస్తున్నారు. నరసాపురం అభ్యర్థిపై ఇంకా స్పష్టత లేదు. నెల్లూరులో బలమైన అభ్యర్థి కోసం పార్టీ వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోంది. గుంటూరు జిల్లాలో నరసరావుపేట నుంచి సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈసారి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read