తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్‌ అయ్యారు . కుట్ర రాజకీయాలతో ఏపీకి చెందిన వారి పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా టీడీపీపై ముప్పేట దాడికి కుట్ర జరుగుతోందని అన్నారు. మోదీ డైరెక్షన్‌లో వైసీపీ అధినేత జగన్,తెలంగాణ సీఎం కేసీఆర్‌ కలిసి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తిప్పికొడతామని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలను సహాకారం ఆందిస్తున్న సాప్ట్ వేర్ కంపెనీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమైన సమాచారాన్ని చౌర్యం చేసేందుకు విఫలయత్నం చేశారని దుయ్యబట్టారు. ఏ అధికారంతో తమ ప్రభుత్వానికి చెందిన కంపెనీలపై దాడులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cbn 002032019

హైదరాబాద్ కేంద్రంగా టీడీపీపై ముప్పేటదాడికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ముఖ్య సమాచారం అపహరించేందుకు భారీగా కుట్ర పన్నుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో జగన్‌, కేసీఆర్‌ కలిసి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ సభ్యత్వం, సేవామిత్ర, ఎన్నికల వ్యూహాల సమాచారం చౌర్యానికి ప్రయత్నం జరిగిందంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రయత్నం విఫలమవడంతో తెలంగాణ పోలీసులను ప్రయోగించి.. టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి ఐటీ సపోర్ట్ ఇస్తున్న సంస్థల‌పై దాడులు చేస్తున్నారని, పార్టీ స‌భ్యత్వాలు, సేవామిత్రల స‌మాచారం ఇవ్వాలని ఉద్యోగుల‌పై ఒత్తిడి పెంచుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

cbn 002032019

ఐటీ కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. నలుగురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్‌ చేసి సమాచారమివ్వాలని పోలీసులు వేధిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. పార్టీ స‌మాచారం అపహరించి టీడీపీని దెబ్బతీసేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారని, కుట్రలను తిప్పికొడతామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ కేంద్రంగా ఏపీపై కుట్ర జరుగుతోందని వెల్లడించారు. మోదీ, జగన్‌, కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీతో కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో సామంతరాజు వ్యవస్థ తీసుకురావాలన్నదే వీరి ఆలోచనన్నారు. ఏపీపై ద్వేషం చూపిన కేసీఆర్‌, కేటీఆర్‌లు జగన్‌పై ప్రేమ చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బిహార్‌ చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ సాయంతో కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు హెచ్చరించారు.

అమరావతి అంటే జగన్ మోహన్ రెడ్డికి ఎంత ద్వేషం ఉందో అందరికీ తెలిసిందే. అమరావతి రాజధానిగా చంద్రబాబు ప్రకటించి, అమరావతిని డెవలప్ చెయ్యటం మొదలు పెట్టిన దగ్గర నుంచి, జగన్ ఎంత విషం చిమ్మరో తెలిసిందే. తన టీవీ, పేపర్ లో, ప్రతి రోజు అమరావతి పై తప్పుడు వార్తలు రాస్తూ, అమరావతిలో భూకంపం వస్తుంది అని, అమరావతిలో వరదలు వస్తాయని, అమరావతి బురద నేల అని, అమరావతి అంటే భ్రమరావతి అని ఇలా, అనేక విధాలుగా అమరావతి పై ద్వేషం చిమ్మారు. అయితే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత గమనించి, అక్కడ ఒక ఇల్లు కట్టుకుని హడావిడి చేసి, మరుసటి రోజే హైదరాబాద్ చేక్కేసారు. జగన్ మోహన్ రెడ్డికి, అమరావతి మీద ఎంత ద్వేషం అంటే, మొదటి సారి అమరావతి వచ్చిన జగన్ ను, అక్కడి రైతులు భోజనానికి పిలిస్తే, నేను రాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

jagan 02020230219

అయితే ఇప్పుడు ఢిల్లీ వేదికగా, అమరావతి పై జగన్ మరోసారి విషం చిమ్మారు. అదీ ఢిల్లీ వేదికగా. ఢిల్లీలో ఇండియా టుడే 18వ ఎడిషన్‌ కాంక్లేవ్‌లో భాగంగా జర్నలిస్ట్‌ రాహుల్‌ కన్వల్‌తో వైఎస్‌ జగన్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా అమరావతి పై అడిగిన ప్రశ్నే ఇందుకు సాక్ష్యం. జర్నలిస్ట్‌ రాహుల్‌ మాట్లాడుతూ, మీరు అధికారంలోకి వస్తే, అమరావతిని అలాగే ఉంచుతారా, లేక రాజధానిని మారుస్తారా అని అడగగా, జగన్ మోహన్ రెడ్డి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. అమరావతిలో చంద్రబాబు అవినీతి చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అంటూ ఎప్పుడూ చెప్పే సోదే చెప్పారు కాని, అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తాను అనే మాట మాత్రం చెప్పలేదు.

jagan 02020230219

జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఎంత ద్వేషమో, ఈ దెబ్బతో మరో సారి రుజువైంది. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అంటే, జగన్ మోహన్ రెడ్డికి అంత చులకన. ఒక ప్రతిపక్ష నేతగా వారికి భారోసా ఇవ్వాలి అనే ధ్యాస కూడా లేని వాడు మన ప్రతి పక్ష నాయకుడు. అమరావతి ఆపటానికి కేసులు వేస్తూ, అమరావతి నిర్మాణానికి నిధులు రాకుండా, రుణాలు రాకుండా అడ్డుపడుతూ, అమరావతికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాకుండా చేస్తూ, అమరావతిలో పంటలు తగలబెట్టి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అను నిత్యం, అమరావతి పై విషం చిమ్ముతూ, కుట్రలు పన్నుతూ, ఉండే జగన్ మోహన్ రెడ్డి, మరో సారి అమరావతి పై తనకున్న ద్వేషాన్ని ఢిల్లీ వేదికగా చూపించారు.

ఓ వైపు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతుంటే... మరోవైపు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. తమకు పాణ్యం టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ నిరాకరించడంతో... వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు గౌరు దంపతులు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కూడా పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉండటంతో... ఆయన కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారేమో అనే సందేహలు వ్యక్తమవుతున్నాయి. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...

alla 01032019

రాజధాని పరిధిలోని మంగళగిరి వైసీపీలో ముసలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు శుక్రవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం అధినేతపై అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారమంతా ఆయన ఎవరికీ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెక్‌ పెట్టేందుకు పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం నేతలు మున్నంగి గోపిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి పావులు కదిపారు. మంగళగిరికి చెందిన టీడీపీ, బీజేపీ, సీపీఎం కౌన్సెలర్లు ఉడతా శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర శకుంతలను జగన్‌ సమక్షంలో వైసీపీలో చేర్పించారు. ఈ పరిణామం ఆళ్ల వర్గానికి షాక్‌కు గురిచేసింది.

alla 01032019

ఉడతా శ్రీనును మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆళ్ల సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంగళగిరి పట్టణం, రూరల్‌, తాడేపల్లి పట్టణం, రూరల్‌, దుగ్గిరాల మండలాలకు చెందిన వైసీపీ కన్వీనర్లు, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మంగళగిరి ఎంపీపీ తమ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. మరోవైపు ఆళ్లతో సంప్రదింపులు జరిపేందుకు పలువురు వైసీపీ నేతలు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఎవరికీ టచ్‌లోకి రాలేదని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఆయన కూడా టికెట్ రాని పక్షంలో పార్టీని వీడతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ప్రజా క్షేత్రంలో లో గెలవడం సాధ్యం కాదు,అభివృద్ధి - సంక్షేమంలో చంద్రబాబు తో పోటీ పడలేం.మరి చంద్రబాబు ని దెబ్బతీయడం ఎలా?అని ఆలోచించిన జగన్ కన్నింగ్ బ్రెయిన్ కి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ని దెబ్బతియ్యడానికి అదే సరైన మార్గం అని లోటస్ పాండ్ లో స్కెచ్ వేసారు. లోటస్ పాండ్ లో జరిగిన యువరాజుల సమావేశంలో మాస్టర్ ప్లాన్ అమలు పై ఒక నిర్ణయానికి వచ్చారు.సమాచారాన్ని మోదీ గారికి అందించారు.ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే దాడులు మొదలుపెట్టారు.తెలుగుదేశం టెక్నాలజి వినియోగంలో జాతీయ పార్టీలు సైతం ఊహించని అంత ముందు ఉంది టెక్నాలజీ పై తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న చంద్రబాబు గారు పార్టీ లో టెలికాన్ఫరెన్స్ మొదలుకొని అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నారా లోకేష్ పూర్తి స్థాయి ఆన్ లైన్ సభ్యత్వ నమోదు,సేవ మిత్ర ఇలా అనేక కార్యక్రమాలు రూపొందించారు. దేశంలో ఏ పార్టీ తనకి ఉన్న కార్యకర్త ఎవరు?ఏ ఊరిలో ఎంత మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పలేరు.కానీ తెలుగుదేశం పార్టీ లో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్డు ఉంటుంది.కార్యకర్త కి ఒక గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలి అంటే ఈ సమాచారం దొంగలించాలి. ఆ సమాచారం ఆధారంగా వారి ఓట్లు తొలగించటం, బూత్ కన్వీనర్లను కొనేసే ఎత్తుగడ వేసారు. ఇదే జగన్ క్రిమినల్ మైండ్ ఆలోచన. దీనికి కేసీఆర్ అండదండలు.తెలుగుదేశం పార్టీ సబ్యత్వ నమోదు డేటా ఉండే వారి పై దాడి చెయ్యాలి,తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కంపెనీలను భయబ్రాంతులకు గురిచేయ్యాలి అనే కుహనా ఆలోచనతో జగన్ తెలంగాణ పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ కి ఐటీ సర్వీసులు ఇచ్చే ఐటీ గ్రిడ్స్ కంపెనీ పై దాడులు చేసారు.

 సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకూ సెర్చ్ ఆపరేషన్ అంటూ యుద్ధ వాతావరణం సృష్టించారు.20 మంది కానిస్టేబుల్లు,2 ఎస్ఐ,సిఐ ఆఖరికి ఏసీపీ కూడా రంగంలోకి దిగారు.కంపెనీ యజమాని పై ప్రశ్నల వర్షం, మీ దగ్గర ఉన్న డేటా మాకు ఇవ్వాలి అని ఒత్తిడి ,మీరు తయారు చేసిన యాప్స్ గురించి వివరించండి.ఇక్కడ ఉన్న సమాచారం అంతా మాకు కావాలి.పార్టీ లో ఉన్న కార్యకర్తల డేటా,బూత్ కన్వినర్లు,సేవ మిత్ర ఇలా మొత్తం సమాచారం కావాలి అంటూ ఒత్తిడి తెచ్చారు.అయ్యా మేము కేవలం టెక్నికల్ సపోర్ట్ మాత్రమే ఇస్తాం, డేటా మా దగ్గర ఉండదు అని యజమాని మొత్తుకున్నా వదలలేదు...నీ ఇల్లు ఎక్కడ,నీ ఫ్యామిలి సమాచారం చెప్పు అని పోలిసులు ఒత్తిడి తెచ్చారు.అంతే కాదు హెచ్ ఆర్ దగ్గర నుండి పనిచేసే ఉద్యోగస్తుల వరకూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేసి వారు కంపెనీ కి రిజైన్ చెయ్యాలి అని ఒత్తిడి చేసారు. తెలుగుదేశం పార్టీ కీలక సమాచారం తెలుసుకొని మోడీ సహకారం తో ప్రతి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీకి పక్కా అనుకున్న కనీసం 10 వేల ఓట్లు తొలగించడం,బూత్ కన్వినర్లు,సేవ మిత్రల సమాచారం తెలుసుకొని వారి పై దాడులు చేసేందుకు జగన్ పక్కా వ్యూహంతో ఈ దాడులకు తెగబడుతున్నారు అని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు.

దీని కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,కొడుకు కేటీఆర్ ప్రత్యేకంగా కొంత మంది ఆఫీసర్లను కేటాయించి సమాచారం తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని టిడిపి ఆరోపిస్తుంది. టిడిపి నేతలు చెప్పిన దాని ప్రకారం "తమ భూ భాగం లో ఉన్న ఐటీ కంపెనీ కాబట్టీ సమాచారం పోలీసుల ఒత్తిడి తో తీసుకుంటాం కాదు అంటే సైబర్ ఎక్స్పర్ట్స్ ని పెట్టి తెలుగుదేశం పార్టీ సమాచారం దొంగిలించి పూర్తి స్థాయి లో తెలుగుదేశం పార్టీని దెబ్బతిస్తాం అని పక్కా వ్యూహం సిద్ధం చేసారు. 840 విజయసాయి ఫిర్యాదు ని భూచి గా చూపించి తెలుగుదేశం పార్టీ కీలక సమాచారం దొంగలించి తెలుగుదేశం పార్టీ ని ఎన్నికల్లో దెబ్బతియ్యడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఫార్మ్ హౌస్ దొర కలలు కంటున్నాడు.లోటస్ పాండ్ వేదికగా బీహార్ గ్యాంగ్ పీకే కి ఎప్పటికప్పడు సమాచారం అందిస్తున్న కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద కుట్రే జరుగుతుంది.ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కి పక్కా అనుకున్న 5 నుండి 10 వేల ఓట్ల సమాచారం దొంగలించి వాటిని తొలగించాలి అని ఎన్నికల కమిషన్ కి 420 పార్టీ ఫిర్యాదు చేసింది.175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓట్లు తొలగించాలి అని దొంగ అబ్బాయి వేసిన ప్లాన్ కి కేసీఆర్ అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తున్నారు." అని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read