ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ప్రధాని న్యాయమూర్తి బెంచ్ ముందు, విశాఖపట్నంలోని రుషికొండ విధ్వంసం పై విచారణ జరిగింది. రుషికొండ పై అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటి పై గత విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఉన్న అయుదు మంది అధికారులతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీ వెంటనే సర్వే చేసి, ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో, తమకు తెలపలాని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సర్వే అఫ్ ఇండియా, ఎన్విరాన్మెంట్ల్ డిపార్టుమెంటు, అదే విధంగా మైనింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, ఇలా అయుదు మంది అధికారులతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అందుకు భిన్నంగా, ఈ కమిటీలో ముగ్గురు రాష్ట్ర అధికారులను నియమించడంపై, ఈ రోజు విచారణ సందర్బంగా పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాదులు వీరా రెడ్డి, అశ్వినీ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.

rushikonda hc 14122022 2

దీని పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ముగ్గురిని నియమిస్తే మేము ఎలా ఆమోదిస్తామని, మీరు మాత్రం అసలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులని ఎలా నియమిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీన్ని వెంటనే సరి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురినీ తొలగించి, కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారులను మాత్రమే వేయాలని ఆదేశించింది. రుషికొండలో కొంత మేర అక్రమ తవ్వకాలు జరిగాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేవలం కొద్ది వరుకే జరిగాయని చెప్పింది. అయితే పిటీషనర్ తరుపున న్యాయవాదులు మాత్రం, చాలా వరకు అక్రమ తవ్వకాలు జరిగాయని కోర్టుకు చెప్పారు. దీంతో ఈ నిజా నిజాలు నిగ్గు తేల్చి, విషయం తమకు చెప్పాలని, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఒక కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముగ్గురిని రాష్ట్రము నుంచి పెట్టటంతో, హైకోర్టు సీరియస్ అయ్యింది.

టీఆర్ఎస్ ని బీఆర్‍ఎస్ గా మార్చిన కేసీఆర్, ఆ పార్టీని పక్క రాష్ట్రాల్లోకి తీసుకుని వెళ్ళటానికి తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్‍ఎస్ ఎంట్రీ కోసం, కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. అక్కడక్కడా బీఆర్‍ఎస్ పేరుతో కొంత మంది బ్యానర్లు పెడుతున్నా, అవి ఎవరో పెట్టిస్తున్నట్టే అర్ధం అవుతుంది. ఏపి బీఆర్‍ఎస్ బాధ్యతలు తీసుకోవటానికి మాత్రం, ఏపి నుంచి ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో కేసీఆర్ ఏపిలో బీఆర్‍ఎస్ బాధ్యతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పచెప్పారు. ఏపీలో బీఆర్‍ఎస్ ఎంట్రీ బాధ్యతలు అప్పచెప్పారు.అంతే కాకుండా, సంక్రాంతి పండుగ రోజు, అమరావతిలో భారీ సభ ఒకటి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సభ ఏర్పాట్లు కూడా తలసానికి అప్పచెప్పారు కేసీఆర్. ముఖ్యంగా తన పార్టీకి జాతీయ అధికారిక గుర్తింపు రావాలి అంటే, ఏపీ సహా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగు వారు ఉండే చోటు పోటీ చేసి, ఓట్లు తెచ్చుకోవాలని కేసీఆర్ ప్లాన్. అయితే ఏపిలో కేసీఆర్ ప్లాన్ ఏ మాత్రం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.

ఆంద్రప్రదేశ్ అనకాపల్లిలో ఆరిలోవలో అటవీ అధికారులపై, రంగురాళ్ళ మాఫియా రాళ్ల దా-డి చేయడం కలకలం రేపింది. ఆ గ్రామంలో  తనిఖీలు చేయడానికి వెళ్లిన అటవీ అధికారులపై ఈ రంగురాళ్ళ పనిచేసుకునే కూలీలు రాళ్ల దా-డి చేసారు. అధికారులు పై దా-డి చేసి అక్కడి నుంచి వెంటనే తప్పించుకున్నారు. దీంతో అటవీ అధికారులు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో ఈ దా-డిపై   ఫిర్యాదు చేసారు. ఈ మైనింగ్ మాఫియా వెనుకు ఎవరు ఉన్నారు అనేది తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇలాగే అధికారులు పై దా-డి చేసారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బయట పడుతున్నారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య,  ముఖ్యమంత్రి జగన్‍కు లేఖ రాసారు. ఈ లేఖలో, ఆయన  అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఇచ్చిన హామీల గురించి జగన్ ను ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసినప్పుడు  దళితులు తమ ఆత్మబంధువులు అని, దళితులు అందరి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఎందుకు జగన్ అబద్దాలు, అసత్య వాగ్దానాలు చేసారని ఆయన లేఖలో ప్రశ్నించారు. మీకు ఓట్లేసి గెలిపించిన ఈ  దళితులపై ఇనుప పాదం మోపి ఎందుకు అణిచివేస్తున్నారని, ఇలా చేయడం ఈ ముఖ్యమంత్రికి  ఎమన్నా న్యాయంగా ఉందా అని, అంతే కాకుండా దళితులుపై జరిగే అఘాయిత్యాలను కూడా ఈ ప్రభుత్వం  అరికట్టాలని ఆయన డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read