తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక నుంచి తాను ఏర్పాటుచేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. అమరావతిలో శుక్రవారం రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్‌ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

murali 010322019

మరో పక్క, నెల్లూరు జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులపై స్పష్టత వచ్చింది. గురువారం జరిగిన నెల్లూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై జరిగిన సమీక్షలో ఈ దిశగా సంకేతాలు వెలువడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమీక్షలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆరు అసెంబ్లీ స్థానాలు నెల్లూరు లోక్‌సభ స్థానంలో.. మిగతా నాలుగు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ స్థానం కూడా నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడెనిమిది చోట్ల టీడీపీ అభ్యర్థులెవరో ఇప్పటికే స్పష్టత వచ్చింది.

murali 010322019

నెల్లూరు అర్బన్‌లో పురపాలక మంత్రి పి.నారాయణ, నెల్లూరు రూరల్‌లో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, సర్వేపల్లిలో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య, వెంకటగిరిలో ఎమ్మెల్యే కె.రామకృష్ణ, కావలిలో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, కోవూరులో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. గూడూరులోనూ పోటీ ఉన్నా ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌కు అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఉదయగిరి, సూళ్లూరుపేట స్థానాలపె అస్పష్టత కొనసాగుతోంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును కొందరు నియోజకవర్గ నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోకి వచ్చే కందుకూరు సీటు ఎమ్మెల్యే పోతుల రామారావుకు ఇవ్వడం ఖాయమేనంటున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్‌ విభజించిందని, టీడీపీ నాశనం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. అందుకే, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌, టీడీపీలపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీకి మంచి ఫలితాలే వస్తాయన్నారు. ‘మేరా బూత్‌ సబ్‌సే మజ్బూత్‌’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ఆయన మెగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో కాన్ఫరెన్స్‌గా బీజేపీ దీనిని అభివర్ణిస్తోంది. దేశంలోని 15,000 ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను రద్దు చేసుకోవాలని, వైమానిక దాడులను రాజకీయం చేయవద్దని బుధవారం ఎన్డీయేతర ప్రతిపక్షాలు హితవు పలికాయి. అయినా.. ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలతో మోదీ ప్రత్యక్షంగా మాట్లాడే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే బీజేపీ నిర్ణయించింది.

modi 01032019

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులో పటిష్ఠ కూటమిని ఏర్పాటు చేశాం. ఆ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విజయం ఎన్డీయేకు దక్కబోతోంది. కేరళలోని విద్యావంతులైన యువత ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌లపై విసిగిపోయారు. ఇక, కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్‌ సర్కారు ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయడం లేదు. అందుకే, దక్షిణాదిలో ఈసారి ఎన్డీయేకు మరిన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘దేశాన్ని సుదీర్ఘ కాలంపాటు ఓ అవినీతి ప్రభుత్వం పాలించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు రెండు సంప్రదాయాల్లో ఒకదానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది ప్రజాస్వామికంగా పనిచేసే బీజేపీ. రెండోది, వారసత్వ రాజకీయాలు నడిపే కాంగ్రెస్‌, ఇతర పార్టీలు’’ అని అన్నారు.

modi 01032019

నేడే విశాఖకు మోదీ... ప్రధాని మోదీ శుక్రవారం విశాఖపట్నం రానున్నారు. సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో ఏపీకి వస్తున్న ప్రధాని.. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌తోనే సరిపెడతారా.. కొత్త/పాత వరాలు గుప్పిస్తారా.. లేక గుంటూరు సభలో మాదిరిగా చంద్రబాబుపై విమర్శలకే పరిమితమవుతారా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చని ప్రధానికి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదంటూ టీడీపీ నేతలు జిల్లావ్యాప్తంగా ‘మోదీ గో బ్యాక్‌’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు ఆమరణ నిరాహారదీక్ష కూడా ప్రారంభించారు. దారి పొడవునా ప్రధానికి నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నాయి.

ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని టీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రకటించడం, రాష్ట్రానికి వచ్చిన టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వైసీపీ పెద్దలు ఘనస్వాగతం పలకడం, వంటివి చూసాం. అయితే, ఇక్కడ వీళ్ళు వచ్చి ఇలా వాగుతున్నారు అంటే, దానికి జగన్ మోహన్ రెడ్డే కారణం. జగన్ ఎప్పుడూ ఆంధ్రా పోలీసులు పై, ఆంధ్రా డాక్టర్ల పై, ఆంధ్రా అధికారుల పై నిందలు వేస్తూ, వారిని తిడుతూ ఉంటారు. ఈ అలుసో ఏమో కాని, ఇప్పుడు ఏపీ పోలీసులపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మార్చి 3న ఆంధ్రప్రదేశ్‌లో యాదవ గర్జన సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీసులు అనవసర నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు.

talasani 28022019

ఏపీలో ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదన్న సంగతి పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామన్నారు. మేము ఏపీలో సభ నిర్వహించుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. ఏపీలో మా పార్టీ లేకపోయినా అక్కడ ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించాలని బహిరంగంగానే చెబుతామని వెల్లడించారు. ఎవరికి ఓటేయాలో చెప్పకపోయినా.. ప్రభుత్వాన్ని ఓడించాలని మాత్రం చెబుతామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుని ఓడించటమే మా ధ్యేయం అంటూ, తలాసాని చెప్పుకొచ్చారు. గతంలో కూడా, తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలో తలపెట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో అప్పట్లో అనుమతి నిరాకరించారు.

talasani 28022019

అయితే ఈ వ్యాఖ్యల పై ఏపి పోలీసులు ఇంకా స్పందించలేదు. ఎక్కడా లేని స్వేఛ్చ, ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుదని, అందుకే ప్రతోడు ఇక్కడ తోక జాడిస్తారని, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, వారు నిబంధనలు ప్రకారమే నడిచుకుని ఉంటారంటూ, తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్, వైసీపీ కలిసి రాజకీయం చేయబోతున్నాయనీ, ఆంధ్రావాళ్లను పదేపదే దూషించిన కేసీఆర్, కేటీఆర్‌లతో జగన్ ఎలా చేతులు కలుపుతారనీ వారు నిలదీశారు. ఏపీలో కూడా సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వద్దన్న నేతలతో జగన్‌ ఎలా భేటీ అవుతారని కూడా వారు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లోనూ ఆంధ్రావాళ్లను టీఆర్ఎస్ నేతలు దూషించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలోని చదిపిరాళ్ల శివనాథరెడ్డిని శాసనమండలి సభ్యుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. గవర్నర్‌ కోటాలో ఈ నియామకం రెండు రోజుల్లో పూర్తి కానున్నది. జమ్మలమడుగు టీడీపీ టికెట్‌ ఖరారు విషయంలో జరిగిన ఒప్పందం మేరకు రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానాన్ని మంత్రి ఆది కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే నిర్ణయం మేరకు శివనాథరెడ్డి పేరును ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం, ఆ వెంటనే అమాత్య పదవి వరించింది. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి దీనిని వ్యతిరేకించడంతో ఆయనను శాంతింపజేస్తూ గవర్నర్‌ కోటాలో 2017 జూన్‌ 26న ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

mlc 01032019

జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌పై మంత్రి ఆది, రామసుబ్బారెడ్డిలు పట్టుబడడంతో రాజీ ఫార్ములా తీసుకొచ్చిన అధినేత చంద్రబాబు ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని కోరారు. ఎంపీగా పోటీ చేయాలంటే తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ మంత్రి ఆది కుటుంబ సభ్యులు కోరారు. ఈ ఒప్పందం మేరకు ఈనెల 9న శాసనమండలి సభ్యత్వానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసే సమయానికి పంతొమ్మిదినెలల పాటే ఎమ్మెల్సీగా కొనసాగారు. ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. మంత్రి ఆది కుటుంబ సభ్యులు చర్చించుకుని మంత్రి ఆది చిన్నాన్న శంకర్‌రెడ్డి కుమారుడు శివనాథరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

mlc 01032019

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఐదు స్థానాలు ఎమ్మెల్యే కోటాలోవి కాగా, ఒకటి వైసీపీకి పోను, నాలుగు టీడీపీకి దక్కుతాయి. గవర్నర్‌ కోటాలో 2, విశాఖ స్థానిక సంస్థల కోటాలో ఒకటి మొత్తం ఏడు స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ఎంపిక చేయాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈ ఏడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. నిన్నటి వరకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని మంత్రి ఆది కుటుంబ సభ్యులకు ఒప్పందం మేరకు కేటాయించాల్సి ఉండడంతో నారాయణరెడ్డి కుమారుడు శివనాథరెడ్డికి అవకాశమిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నర్‌ కోటాలో కేటాయింపు కావడంతో నామినేషన్‌ వేయాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండు రోజుల్లో గవర్నర్‌ కోటా భర్తీ చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీగా అధినేత చంద్రబాబు ఎంపిక చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని శివనాథరెడ్డి తెలిపారు.

 

Advertisements

Latest Articles

Most Read