వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ మైనింగ్ కింగ్ చ‌క్రం తిప్పుతున్నాడు. అర్ధ‌బ‌లం అంగ‌బ‌లం తొడుచేసుకొని పార్టీ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్నాడు. సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టి నెంబ‌ర్ పొజిష‌న్ కోసం ప‌క్కా యాక్ష‌న్ ప్లాన్ అమ‌లు అమ‌లు చేస్తున్నారు. చాప‌కింద నీరులా త‌న ప‌రిధిని విస్త‌రించుకుంటూ వైసీపీలో ప్ర‌భావాన్ని పెంచుకుంటున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌లో మ‌నుగ‌డ సాధించాలంటే డ‌బ్బు చాలా అవ‌స‌రం. ఇదిగో ఇదే విష‌యాన్ని త‌న‌కు అన్వ‌యించుకోని ప‌క్క ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకుపోతున్నాడు నెల్లూరు వైసీపీ నేత వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి. త‌న అర్ధభ‌లం తో పార్టికి ఆర్ధిక శ‌క్తిగా నిలిచారు. ఎమ్మెల్యేలు సెకండ‌రి గ్రేడ్ నేత‌లకు ద‌న్నుగా నిలిచారు. ఎన్నిక‌ల భ‌రిలో నిలిచేందుకు అయ్యే ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు సిద్ద‌మ‌నే సంకేతాలు పంపుతున్నారు. ఫ‌లితంగా వైసీపీలోని నేత‌లంద‌రికీ జ‌గ‌న్ ప్ర‌త్యామ్నాయ నేత‌గా వేమిరెడ్డి నిలుస్తున్నారు. వైసీపీ నెంబ‌ర్ టూ స్థానం త‌న‌దేన‌నే ఇండికేష‌న్ ఇస్తున్నారు.

jagan 2602019

వేమిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీల‌క నేత‌. రాజ్య‌స‌భ స‌భ్యులు. స్వ‌త‌హాగా వ్యాపారవేత్త అయిన ప్రభాకర్ రెడ్డికి మ‌న రాష్ట్రంలోనే కాకుడా క‌ర్ణాట‌క త‌మిళ‌నాడు రాష్ట్రాల‌లో కూడా ఘ‌నుల లీజులున్నాయి. అంతేకాకుండా ఇండోనేషియా దేశంలో కూడా మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. దీంతో రెండు చేతులా డ‌బ్బు పుష్క‌లంగా సంపాదిస్తున్న స‌ద‌రు నేత.. ఆ డ‌బ్బుల‌తో జ‌గ‌న్ వ‌ద్ద త‌న ప్రాభ‌వాన్ని పెంచుకుంటున్నార‌నీ విమ‌ర్ష‌లు వినిపిస్తున్నాయి. ఎంపిగా కాక‌మునుపే కోట్ల‌కు పైగా ఫండ్ ను పార్టికి అందించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుతుండ‌గా ఎన్నిక‌ల‌లో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, రోజా, అనీల్ యాద‌వ్ ల‌కు పూర్తిస్థాయిలో ఆర్థిక స‌హ‌కారం అందించి గెలిపించుకున్న‌ట్లు స‌మాచారం. కాగా ప్ర‌స్తుతం త‌న ప‌రిది పెంచి చిత్తూరు, నెల్లూరు జిల్లాల అభ్య‌ర్థుల‌కు పూర్తి స్థాయిలో ప్ర‌కాశం, క‌ర్నూలు, కృష్ణా జిల్లాల‌తో పాటు అంత‌ర్గ‌తంగా త‌న‌కు స‌న్నిహితంగా వుండే నాయ‌కుల‌కు ఆర్థిక స‌హ‌కారాన్ని అంద‌జేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధిష్టానం నెల్లూరు, చిత్తూరు అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ఆర్థిక స‌హ‌కారం అందించాల‌ని చెప్ప‌గా.. వేమిరెడ్డి మాత్రం త‌న‌కు అడిగిన ప్ర‌తి ఒక్క‌రికి వీలైనంత స‌హ‌కారం చేస్తుండ‌టంతో వైసిపిలో ఆయ‌న హ‌వా రోజురోజుకు పెరిగితోంది.

పైసామే ప‌ర‌మాత్మ అనే ఇక్వేష‌న్ తో పార్టీలో గ్రాఫ్ అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నవేమిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి, విజ‌య‌సాయి రెడ్డి వంటి ప‌లువురు కొర్ నేత‌లకు చెక్ పెట్టి త‌నకు పార్టీలో త‌న‌కు ఎదురేలేద‌నే వాయిస్ ను బ‌లంగా వినిపిస్తున్నారు. దీంతో స‌ద‌రు నేత‌లు డైల‌మాలో ప‌డ్డ‌ట్టు స‌మాచారం. భ‌విష్య‌త్తులో జ‌గ‌న్, విజ‌య‌సాయి రెడ్డి జైలుకు వెళితే పార్టీని టెకోవ‌ర్ చేసే దిశ‌గా వేమిరెడ్డి అడ‌గులు వేస్తున్నార‌ని పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు ఇందుకు స‌మాధానంగా చెప్పుకొస్తున్నారు. టెకోవ‌ర్ చేసే క్ర‌మంలోనే అడిగినా, అడ‌గ‌కున్నా కీల‌క నాయ‌కుల‌కు డ‌బ్బులు అప్ప‌జెప్పుతున్నార‌నేది వారి వాద‌న‌. ఇదిలా ఉంటే నియోజ‌క వ‌ర్గాల వారిగా ప‌క్కా యాక్ష‌న్ అమ‌లు ప‌రుస్తున్నారు వేమిరెడ్డి. ఇటీవ‌ల‌ కావ‌లిలో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ్గా.. విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ని పార్టీ వీడ‌కుండా చూసే బాధ్య‌త‌ను వేమిరెడ్డి తీసుకున్నారంట‌. ఓక‌వేల‌ విష్ణువ‌ర్ధ‌న్ పార్టీ వీడినా త‌మ వైపు ప‌నిచేసేలా ఒప్పందం కూడా చేసుకున్నార‌ట‌. మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు లో కూడ వేమిరెడ్డి కీరోల్ పోషిస్తున్నారు. ఇక్క‌డి అభ్య‌ర్తి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో వేమిరెడ్డి పైనే ఆర్థికంగా ఆధార‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఇక సూళ్ల‌రుపేట‌, నాయుడు పేటతో పాటు ఇత‌ర‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న మ‌నుషులు వుండేలా పార్టీ పై ఒత్తిడి తెస్తోన్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఒక ప‌క్క‌ త‌నకంటూ ఓ వ‌ర్గాన్ని త‌యారు చేసుకుంటూనే.. మ‌రో ప‌క్క సేవా కార్యక్ర‌మాలలో పాల్గొంటూ ప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతున్నారు. జిల్లాలో మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్ల పంపిణీ ఉచిత విద్యా వైద్యం వంటి సేవా కార్య‌క్ర‌మాలు విస్త్రతంగా చేస్తున్నారు.

ఇలా అన్నీ కోణాల్లోనూ త‌న చాక‌చ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ పార్టీలో జ‌గ‌న్ ఏత‌ర ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతున్నారాయ‌న‌. దీంతో జిల్లాల‌ వైసీపీ నేత‌లంతా ఈయ‌న వెనుక క్యూ కడుతున్నారు. మండ‌ల స్థాయి నాయ‌కుల వ‌ర‌కూ కూడా ఆర్థికంగా స‌హాయం చేయ‌డం వ‌ల్ల గ్రౌండ్ లెవ‌ల్ లో వేమిరెడ్డి త‌న ప్ర‌భావాన్ని విస్త్రతం చేసుకుంటున్నారు. కాగా పార్టీలో వేమిరెడ్డి ప్రాభ‌వం అంచెలంచెలుగా పెరుగుతుండ‌డంతో జిల్లాకు చెందిన ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు త‌మ ఉనికిని కాపాడుకునే ప‌నిలో ప‌డుతున్నారు. పార్టికి ముందునుండి అండ‌గా ఉంటూ ప‌నిచేస్తుంటే కేవ‌లం ఆర్ధిక అండ‌దండ‌లతో వేమిరెడ్డి త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌నీ ఆవేద‌న చెందుతున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాలు ఎటుదారితీస్తాయో అవి పార్టికి ఎంత‌టి చేటు చేస్తాయోన‌నీ అందోళ‌న చెందుతున్నారు. మ‌రి ఈ ప‌రిస్తితుల‌పై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు...భార్య బీజేపీలో, ఈయన వైసిపీలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈయనగారు, రేపు జగన్ సమక్షంలో వైసిపీ లో చేరుతున్నారు. జగన్ ని సంతోషపెట్టటానికొ, విజయసాయి రెడ్డిని ఆనందపరచటానికో కాని, ఈ రోజు తప్పుడు భాష మాట్లాడుతూ, "నా తోడల్లుడు వింత జాతికి చెందిన వ్యక్తి" అంటూ అనూహ్య వ్యాఖ్యలు చేసారు. ఇదే సందర్భంలో, ఇన్నాళ్ళు దగ్గుబాటిని అభిమానించిన అభిమానులు, జగన్ పార్టీలో ఆయన చేరటం జీర్ణించుకోలేక ఉత్తరం రాసారు. "గౌరవనీయులైన దగ్గభాటి వెంకటేశ్వరరావు గారికి , . . అయ్యా మీ తోడల్లుడుగారైనా చంద్రబాబు గారికి ఇంగ్లీష్ రాకపోయినా ఆయన గారి పనితనాన్ని ప్రపంచమే మెచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబు గారి ఒక్కరినే తిట్టరండి మీరు చేరతున్న దొంగలపార్టీ నాయకుడిని , మిమ్మలని తిడుతున్నారు , మిమ్మలని తిడుతుంటే మా ఇంటి మనిషి ని తిట్టినట్లు మేము ఫీలయ్యాము , మేము ఫీలవుతున్నామని మీరు ఖైదీనంబర్ 6093 పార్టీలో చేరకుండా ఉన్నారా లేదే తిట్లు కామన్ అని తిరిగి అదే పార్టీలో చేరుతున్నారు, అలాంటి మీరు ఇలా మాట్లాడటం అసలు భాగా లేదు సర్"

daggubati 26022019 2

"మీరు చెప్పినట్లు కలెక్టర్లు నవ్వుకోనుండవచ్చు , మీరు చెప్పేవన్ని ప్రభుత్వంలో కోన్ని నిజాలుండవచ్చు , మాయావతి , అఖిలేశ్ నవ్వుకోని ఉండవచ్చు తప్పులేదు . . . . అలా నవ్వితే వాళ్ళ పళ్ళే భయటపడుతాయి . . . మీకు , నాకు వచ్చిన భాద ఏముంది సర్ , ప్రభుత్వలోపాలను చక్కగా చెప్పి మంచి ప్రతిపక్ష పాత్రని హూందాగా పోషించఉండవచ్చు అలా చేయకుండా రాజకీయాలకు స్వస్తి అని చెప్పి మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టటం అనేది మీ విశ్వసనీయత మీద అనుమానం గా ఉంది సర్. చంద్రబాబు గారు మీ కోత్త నాయకుని వలే వ్యవస్ధలను లూటీ చేయలేదు . . . మీ స్దాయికి మీరు ఆ 420 నాయకత్వం లో పనిచేయటం అనేది మాకు ఆత్మహత్య సదృశ్యం సర్ మీకు కాదు ఎందుకంటే మీరు అభిమానుల అభిప్రాయాలను ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు , నిర్ణయం తీసుకోని అప్పుడు అభిమానులను అభిప్రాయాలడుగుతారు . . . అప్పుడేమంటారు పిచ్చి జనాలు అయిష్టంగా తలలూపుతారు ఎక్కడ మీరు నోచ్చుకుంటారోనని . . ."

daggubati 26022019 3

"కాని ఈ సారి అలా కాదు సార్ మీ సెంటిమెంట్ రాజకీయాలకు తెరపడినట్లే మీరు భారీ మెజార్టీతో ఓడిపోబోతున్నారు ఎందుకంటే విలువలు , విశ్వసనియత కి కేరాఫ్ అడ్రస్ మచ్చ లేని మా నాయకుడు అని చెప్పుకునే మా నాయకుడు పప్పులో కాదు సార్ తప్పులో కాలేసారని చాలా భాదపడుతున్నారు , భాద కాదు సరిగ్గా చెప్పాలంటే ఆగ్రహంతో ఉన్నారు . . .చెంచురామ్ గారిని తెలుగుదేశం నుంచి పోటీ చేపిద్దామనుకున్నారు అప్పుడు ఇప్పుడు మీరు చెప్పే బాబు గారి లోపాలు కప్పిపుచ్చేవారా సర్ చేరినట్లైతే. రోజకు పద్దేనిమిది గంటలు కష్టపడి పనిచేసే నాయకుడిని మీరు సమర్ధించకపోయినా పరవాలేదు గజదోంగ పంచన చేరి రాష్ట్ర భవిష్యత్త్ ని ఏమి చేద్దామనుకుంటున్నారు , దీనిని బట్టి మీ భాద్యతను శంకించవలసోస్తుంది.సార్ చివరగా ఒక్క మాట మీకు మీకు ఎన్నైనా ఉండవచ్చు , బాబు గారి పాలనలో అన్ని సరిగ్గా ఉన్నాయని చెప్పము కోన్ని లోపాలుండవచ్చు అంతమాత్రానా దోంగల చేతికి అధికారం అప్పగించాలని మీరు చేస్తున్న రాజకీయం మీరు జీవితంలో చేస్తున్న పెద్దచారిత్రాత్మక తప్పిదం . . . చంద్రబాబు గారి నాయకత్వాన్నే ఆంద్రప్రదేశ్ కోరుకుంటున్నది ఇది నిజం ఇదే నిజం" అంటూ దగ్గుబాటి అభిమాని ఉత్తరం రాసారు.

రాష్ట్రంలో మరో భారీ విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటు కానుది. దాదాపు 7వేల ఎకరాల్లో రూ.9వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద హైబ్రిడ్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ సౌర, పవన, థర్మల్‌... ఇలా విద్యుత్‌ ప్రాజెక్టులను విడివిడిగానే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒకేచోట సోలార్‌, పవన విద్యుదుత్పత్తి జరిగేలా కర్నూలు- కడప జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి రెండు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్‌ పవర్‌ ప్రాజెక్టు అవుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న జనరల్‌ ఎలక్ర్టిక్‌(జీఈ) కంపెనీ, మరో కంపెనీ సంయుక్తంగా దీని ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు తెలిసింది.

pettubadi 2622019

దీనికి అవసరమైన భూమిని కూడా ఆయా కంపెనీలే సమకూర్చుకుంటాయి. అయితే దానిమధ్యలో ప్రభుత్వ భూమి ఉంటే అది మాత్రం ఇవ్వాల్సి ఉంటుందనే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపితే పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఇది అత్యంత భారీ ప్రాజెక్టు కావడంతో సీఎం చంద్రబాబు స్వయంగా దీనిపై దృష్టి పెట్టారని తెలిసింది. ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పాటైతే కడప-కర్నూలు జిల్లాల అభివృద్ధికి మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కర్నూలు జిల్లా అవుకు, కడప జిల్లా మైలవరం ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సదరు కంపెనీలు సుముఖత చూపించాయని సమాచారం. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్టే విశాఖ శివారులో క్లౌడ్‌ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ నుంచి భోగాపురం వరకు ప్రత్యేకంగా మరో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికతో ముందుకెళుతున్న ప్రభుత్వం పచ్చని కొండలు, విశాలమైన రోడ్డు, సముద్రతీరం కలిగిన విశాఖ శివార్లో 1,350 ఎకరాల్లో ఈసిటీని నిర్మించబోతోంది. దేశంలోనె సముద్రం మీదుగా విమా నం ల్యాండ్‌ అయ్యే అవకాశం ఒ క్క భోగాపురం విమానా శ్ర యంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అదె వి ధంగా విశాఖ పట్ట ణంలోని కాపుల ప్పాడులో ఏర్పాటవుతన్న అదానీ డేటా సెంటర్‌ పార్క్‌ కోసం అదాని గ్రూప్‌ 20ఏళ్లలో దాదాపు రూ.70వేల కోట్లు పెట్టుబడి పెట్ట నుంది.

vizag 26022019 2

దీంతో 28వేల మందికి ప్రత్యక్షంగా, 85వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్టణంలోని కాపులప్పాడులోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1గిగా వాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసేకున్న ఈసెంటర్‌ ప్రపంచంలోనే మొట్టమెదటి పర్యావరణహిత డేటా సెంటర్‌ పార్క్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దీనిలో భాగంగానే 5గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈడేటా సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కి ఇంటర్నెట్‌ సేవలు అందించే కీలక కేంద్రంగా మారనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్‌ వేర్‌ సప్లయిర్స్‌, సాఫ్ట్‌వేర్‌, స్టార్టప్‌, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

vizag 26022019 3

ఇది ఇలా ఉంటే, మధురువాడ హిల్‌ నెంబర్‌ 3లో నిర్మాణం పూర్తి చేసుకున్న మిలీనియం టవర్‌ని ఈమధ్యకాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రూ.145కోట్లతో నిర్మించిన ఈమిలీనియం టవర్‌ మొత్తం గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా ఏడు అంతస్తులుగా నిర్మించారు. 2లక్షల స్క్యేర్‌ ఫీట్ల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈటవర్‌ తొలిదశలో 1600 మంది ఉద్యోగులతో ప్రారంభమై ఏడాదిలోగా 4500మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇప్పటికే విశాఖలో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు కల్పించి, కంపెనీలకు అనుగుణంగా పాలసీలు రూపొందించి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దీంతోపాటు మంత్రి లోకేష్‌ దేశంతోపాటు ఇతర దేశాల్లో పర్యటించి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉండే అవకాశాలను వివరిస్తూ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఐటీ కంపెనీలు ఏపీలో పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ అనుకూల వాతావరణం ఉండే విశాఖపట్టణంలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read