‘అన్నదాత సుఖీభవ’కు ఆధార్‌ సీడింగ్‌ అడ్డుగా మారుతోంది. కొన్ని రైతు కుటుంబాలు బ్యాంకు ఖాతాలకు తమ ఆధార్‌ అనుసంధానం చేసుకోకపోవడం, వెబ్‌ల్యాండ్‌తో ఆధార్‌ అనుసంధానం కాకపోవడం వల్ల వారికి లబ్ధి చేకూరని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, వెంటనే స్పందించారు. అన్నదాత- సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ ఒక్క రైతు ఆందోళన చెం దాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పింది. ఈ పథకానికి ఆధార్ అడ్డంకిగా ఉందని, ఆధార్‌తో తమ బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసుకోని 11 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందలేదని జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

farmer 24022019

ఈ ఆరోపణలలో వాస్తవంలేదని ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసుకుని వాటిని వినియోగించని రైతులు, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోని రైతుల్లో ఇప్పటికి 3లక్షల మంది రైతుల ఖాతాలను ప్రభుత్వం గుర్తించిందని వారి ఖాతాల్లోకి పెట్టుబడి సాయం నగదు బదిలీ చేసినట్లు పేర్కొంది. ఇంకా ఇలాంటి వారు మరో 11 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరికి కూడా పెట్టుబడి సాయం అందుతుందని ఇందులో ఎలాంటి అపోహలకు గురికావద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రైతుల వాస్తవ ఖాతాలు నిర్ధారించటం ఒక్క రోజులో పూర్తయ్యేదికాదని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో అనుసంధానం చేసుకుని ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నగదు జమ చేస్తున్నట్లు వివరించింది.

farmer 24022019

ఇందుకోసం క్షేత్రస్థాయిలో అధికారులు, రియల్‌టైమ్ గవర్నెన్స్ అధికారులు రేయింబవళ్లు పనిచేస్తున్నారని పారదర్శకంగా అర్హులందరికీ పెట్టుబడి సాయం అందుతుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి.. అన్నదాత- సుఖీభవ పథకం అమలు తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులతో సమీక్షలు నిర్వహించి సక్రమంగా అమలు చేయాలని పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించింది. ఐదెకరాలలోపు రైతులకు రూ.9వేలు, ఐదెకరాలకు పైన ఉన్న రైతులకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఐదెకరాల లోపున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా రూ.6వేలు అందిస్తోంది. ఐదెకరాల పైన ఉన్న రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థికసాయం చేస్తోంది. ఈ పథకం కింద తొలి విడతగా రైతు కుటుంబాల ఖాతాల్లో వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమచేసే ప్రక్రియ ప్రారంభించింది.

రాజధాని అమరావతికి సంబంధించి జనంలో ఆందోళన నెలకొందని.. వేరే ప్రభుత్వం వస్తే ఇప్పటిదాకా జరిగిన పనులు ఆగిపోతాయన్న భయం వారిలో కనిపిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీకే అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల కింద పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరిశీలించిన వచ్చిన సబ్బం హరి.. శుక్రవారం ఏబీఎన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రాజధానిలో ఒక్క పని కూడా ప్రారంభం కాకుండా కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇప్పుడు శరవేగంగా పనులు సాగడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు.

sabbam 24022019

ఈ సందర్భంగా కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్గ్యలు చేసారు. "కేసీఆర్‌ చిల్లర రాజకీయాలకే పనికొస్తారు. ఆయన సీఎం కాకూడదని చంద్రబాబు ప్రయత్నించినా అయ్యారు. ఇక్కడ కేసీఆర్‌ చేసే ప్రయత్నాల వల్ల చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు. నెగటివ్‌ రాజకీయాలు చేసే వ్యక్తుల కంటే పాజిటివ్‌ రాజకీయాలు చేసే వ్యక్తులకు విలువ ఉంటుంది. చంద్రబాబువి పాజిటివ్‌ పాలిటిక్స్‌. మోదీని బాబు టార్గెట్‌ చేయడం వల్లే ఇక్కడి రాజకీయాలు కాస్త భిన్నంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 270కి పైగా స్థానాలను గెలిచింది. ఈసారి 150-160 స్థానాలకు పడిపోనుంది. మన రాష్ట్రంలో బీజేపీ ఖాతా కూడా తెరవదు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తే చంద్రబాబు కీలకంగా మారతారు." అని అన్నారు.

sabbam 24022019

"రాష్ట్రంలో ప్రస్తుతం వినూత్న రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా టీడీపీని దెబ్బతీయడానికి కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. కనిపించీ, కనిపించని స్నేహితులతో కలిసి కొంతమంది టీడీపీని దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు బలంగా ఉంటే మోదీకి కుర్చీ దక్కదన్న ఉద్దేశంతోనే కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రాంతీయ పార్టీలను మట్టుబెట్టాలని మోదీ యత్నించారు. ములాయంసింగ్‌, శశికళ, లాలూ వంటి వారిపై కేసులు పెట్టారు. అటువంటి నాయకులకు చంద్రబాబు టార్చ్‌లా కనిపించారు. ఆయన ఢిల్లీ దీక్షకు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన 90 శాతం మంది పెద్ద నాయకులు రావడాన్ని బట్టే ఆయన స్థాయి ఏమిటో అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రధానిని మార్చుకుంటే తప్ప ప్రాంతీయ పార్టీలు సపోర్ట్‌ చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా చంద్రబాబు కీలకం కానున్నారు." అని సబ్బం హరి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి కె.తారకరామారావు అన్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆదివారం మధ్యాహ్నం పలువురు ముఖ్యనేతలకు టీడీపీ కండువా కప్పిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్‌ సీఎం అవుతాడని కేటీఆర్‌ అంటున్నారని, మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని ఆయన హెచ్చరించారు. వాళ్లకు చేతనైతే అభివృద్ధిలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్‌ ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో అభివృద్ధి ఏమీ లేదు.. అంతా గ్రాఫిక్స్‌ అంటున్నారని, ముందు గ్రాఫిక్స్‌ వచ్చిన తర్వాతే భవనాలు వస్తాయని చంద్రబాబు గుర్తు చేశారు.

counter 24022019

ఏపీని ప్రశాంత్‌ కిషోర్‌ మరో బిహార్‌ చేయాలని చూస్తున్నారని, జగన్‌, పీకే కుప్పిగంతులు తన దగ్గర పనిచేయవని ఆయన అన్నారు. "ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్‌, మోదీ కుట్ర పన్నుతున్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని మోదీని నిలదీశాను. చీకటి రాజకీయాలు చేయొద్దు.. తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో మనం 25 ఎంపీ సీట్లు గెలవాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. రూ. 10 కోట్లు ఎక్కువ ఇస్తానంటే వాళ్లకే జగన్‌ టికెట్‌ ఇస్తారు. రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్‌ కోసం నేను పోరాడుతున్నాను. వచ్చే ఎన్నికల్లో సమర్థులైనవారిని ఎంపిక చేస్తున్నాం" అని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

counter 24022019

ఇదిలాఉండగా, శనివారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో టీడీపీ వంద శాతం ఓడిపోతుందని అన్నారు. అలాగే ఏపీకి కాబోయే సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. ఏపీలో వైసీపీ గెలుస్తుందని తనకు నమ్మకం ఉందని, జగన్‌కు మద్దతిచ్చేందుకు తాము ఏపీకి పోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో వైసీపీకి స్థానం కల్పిస్తామని, ఇప్పటికే చర్చలు జరిపామని వెల్లడించారు. కేసీఆర్‌ స్వయంగా వెళ్లి జగన్‌తో భేటీ అయ్యే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కలవాల్సిన సమయంలో జగన్‌ను కలుస్తారని వ్యాఖ్యానించారు. బాబు కలలో కూడా కేసీఆర్‌ పేరునే కలవరిస్తున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం, ఇతర పార్టీ వాళ్లపై ఏడవకుండా.. ఐదేళ్లలో తానేం చేశారో ఏపీ ప్రజలకు చెప్పాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయంలో ఈరోజు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నామనీ, ఫ్లైట్ ను పాకిస్తాన్ కు తరలిస్తామని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అధికారులను హెచ్చరించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హైఅలర్ట్ ను ప్రకటించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో అదనపు బలగాలను మోహరించిన అధికారులు, లగేజ్, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలకు అనుమతిస్తున్నారు. కాగా, ఈ ఫోన్ కాల్ ఆకతాయి పని అయ్యుండొచ్చనీ, అయినా ఛాన్స్ తీసుకోలేమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

gannavaram 240222019

పుల్వామా దాడి జరిగి పదిరోజులైనా కాకముందే , ఇలాంటి హెచ్చరికులు దేశమంతా వస్తున్నాయి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి పాకిస్థాన్‌కు తీసుకుపోబోతున్నామంటూ ముంబైలోని ఎయిరిండియా కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చిన ఫోన్‌కాల్‌తో బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) అప్రమత్తమైంది. భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను కఠినంగా అమలుచేయాలంటూ దేశంలోని అన్ని విమానాశ్రయాలకూ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని విమానాశ్రయాల భద్రతా విభాగాలు, విమానయాన సంస్థలు తప్పనిసరిగా, తక్షణమే పాటించాల్సిన ఎనిమిది భద్రతా చర్యలతో ఒక నోట్‌ విడుదల చేసింది.

gannavaram 240222019

అంతేకాదు, గల్ఫ్‌ దేశాలకు, పాకిస్థాన్‌కు వెళ్లే విమానాలకు సంబంధించి సెకండరీ లాడర్‌పాయింట్‌ చెకింగ్‌కు (ఎస్‌ఎల్‌పీసీ.. అంటే అన్ని చెకింగ్‌లూ ముగించుకుని వచ్చిన ప్రయాణికులను విమానం ఎక్కే సమయంలో మరోసారి తనిఖీ చేయడం) ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ప్రయాణికులు నిర్ణీత సమయానికన్నా ముందుగా రావాలని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎ్‌ఫ)కు చెందిన ఒక ఉన్నతాధికారి విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ రాకపోకలపై కఠిన నియంత్రణలు విధించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Latest Articles

Most Read