పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ కదులుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఔదార్యం చాటుకొన్నారు. రూ.30 కోట్ల ఆర్థికసహాయాన్ని అందించాలని ఎన్జీవోలు నిర్ణయించారు. ఎన్జీవో కేడర్‌ నుంచి గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయుల వరకు రూ. 500 చొప్పున, నాలుగో తరగతి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి రూ. 200 చొప్పున సేకరించనున్నారు. ఇలా పోగుచేసిన రూ. 30 కోట్లను బాధిత కుటుంబాలకు సాయంగా అందించనున్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల తరఫున రూ.25 లక్షల సాయం అందించామని ’అప్పా’ ప్రతినిధులు తెలిపారు.

ngo 1902209

వివేకానంద స్కూలు యాజమాన్యం రూ.లక్ష , తణుకు ప్రగతి జూనియర్‌ కళాశాల యాజమాన్యం రూ.1.05 లక్షల విలువైన చెక్‌లను సీఎంకు అందజేసింది. కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన కొందరు దాతలు రూ.1.16 లక్షలు విరాళంగా సీఎంకు అందజేశారు. ముదినేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు శోభనాద్రిచౌదరి, డాక్టర్‌ వైఎల్‌ ప్రసాద్‌, పీ కుమారి నాయకత్వంలో వారు చెక్కును సీఎంకు అందజేశారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది ఎస్‌ఎస్‌ వర్మ తన వంతుగా రూ. 64,100 విలువైన చెక్‌ను తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సీ ప్రవీణ్‌కుమార్‌కు అందించారు. సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌కు ఆ చెక్‌ను జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేర్చారు.

ngo 1902209

ఆపన్నులకు సీఎం సాయం.. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్య ఖర్చుల కోసం తనను కలిసిన పలువురికి సీఎం మానవతా దృక్పథంతో సాయం ప్రకటించారు. మానసిక వికలాంగుడైన తన కుమారుడు ఓం ప్రకాశ్‌కు వైద్య సాయం చేయాలని తిరుపతికి చెందిన వీ బుజ్జి అనే మహిళ అభ్యర్థించగా, సీఎం రూ.లక్ష మంజూరు చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బంధపల్లికి చెందిన ఎం మునికృష్ణగౌడ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతని వైద్యం నిమిత్తం సీఎం రూ.3.5లక్షలు మంజూరు చేశారు. అదే గ్రామానికి చెందిన బీ రామకృష్ణప్ప విద్యుత్‌ వైర్లు లాగుతుండగా, షాక్‌ తగిలి ఎడమ భుజం పోగొట్టుకున్నాడు. ఆయనకు సీఎం రూ. లక్ష మంజూరు చేశారు.

 

అమలాపురం లోక్‌సభ స్థానం నుంచి తెదేపా అభ్యర్ధిగా దివంగత లోక్‌సభ స్పీకర్‌ జి.ఎం.సి. బాలయోగి కుమారుడు హరీశ్‌ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సెంటిమెంటు పరంగానూ ఇది అనుకూలిస్తుందనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. పోటీ విషయమై తల్లి అంగీకారం కోసం హరీశ్‌ ఎదురు చూస్తున్నారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు నాకు టికెట్ ఇవ్వనని చెప్పారు, అందుకే వైసీపీలో చేరుతున్నా అని చెప్పిన సంగతి తెలిసిందే. అమలాపురం లోక్‌సభ టీడీపీ టిక్కెట్టు లోక్‌సభ దివంగత స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీష్‌కి ఖరారు చేయడంతో పండుల టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పండుల రవీంద్రకి వైసీపీలో గన్నవరం అసెంబ్లీ సీటు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

harish 19022019 1

టీడీపీ నుంచి మంత్రి హామీ కావాలని పట్టుబడుతున్న మరో ఎమ్మెల్యే కూడా వైసీపీతో టచ్‌లో ఉన్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. సదరు ఎమ్మెల్యే వైసీపీలో చేరితే అక్కడ ప్రత్యర్థి పార్టీ నేత వెంటనే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో టీడీపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు, వైసీపీ కోఆర్డినేటర్లలో టెన్షన్‌ పెరుగుతోంది. ఎవరు వచ్చి పార్టీలో చేరతారు, ఎవరిని తప్పిస్తారన్న ఆందోళన ఇరుపార్టీల నేతల్లోనూ కనిపిస్తోంది. టీడీపీ జిల్లాలో ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ 12 చోట్ల స్పష్టత ఇచ్చింది.

harish 19022019 1

మరో పక్క కాకినాడ ఎంపీ సీటు కూడా ఫైనల్ అయినట్టు సమాచారం. దీని కోసం చలమలశెట్టి సునీల్‌ ని తెలుగుదేశం రంగంలోకి దించుతుంది. టీడీపీలో ఈనెల 28న చేరడానికి చలమలశెట్టి సునీల్‌ సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో అమరావతిలో చేరాలని సునీల్‌ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మూడు నెలలుగా సునీల్‌ చేరిక ముహూర్తాలు వాయిదాపడుతూ వస్తున్నాయి. చివరకు ఈనెల 28వ తేదీ చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాకినాడ లోక్‌సభ టీడీపీ టిక్కెట్టు సునీల్‌కి ఇవ్వనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తెదేపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోమవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

సీఎం చంద్రబాబును ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ రాజధాని అమరావతిలో కలిశారు. బీజేపీయేతర కూటమి, తాజా రాజకీయ పరిస్థితులపై రెండున్నర గంటలపాటు చర్చించారు. తొలిసారిగా అమరావతికి సీఎం కేజ్రీవాల్‌‌కు రావడంతో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అంతకుముందు గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నకేజ్రీవాల్‌ను మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమ, కలిశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కేజ్రీవాల్‌కు వివరించారు. కాగా సీఎం చంద్రబాబు... కేజ్రీవాల్ ఇటీవల చేపట్టిన దీక్షకు మద్దుతు తెలిపారు. అంతేకాదు ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ దీక్షలో కూడా పాల్గొన్నారు. రాత్రి బాగా పొద్దు పోయేంత వరకు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. దేశ రాజకీయాలు, జాతీయ స్థాయిలో భాజపాయేతర పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

kejriwal 19022019

భాజపాయేతర పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల అవగాహన, అది కుదరని చోట ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ ఎలా ఉండాలి? ఎన్నికల అనంతర పొత్తులకు ఒక ప్రాతిపదిక సిద్ధం చేయడం వంటి అంశాలపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో దిల్లీలో భాజపాయేతర పార్టీ నాయకులంతా మరోసారి భేటీ కానున్నారని, ఆ అంశంపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. జాతీయ స్థాయిలో భాజపాయేతర కూటమిలో కాంగ్రెస్‌, ఆప్‌ కూడా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దిల్లీలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ అవగాహన ఏ విధంగా ఉండాలి? వంటి అంశాలపైనా చంద్రబాబుతో కేజ్రీవాల్‌ చర్చించినట్టు తెలిసింది.

kejriwal 19022019

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల మోదీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ యేతర పార్టీలతో ఏర్పాటు అవుతున్న కూటమిని బలహీన పరిచేందుకు మోదీ అనుసరిస్తున్న కుట్రలను ఛేదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు. ఎన్నికలకు ముందు పొత్తు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై కూడా వీరిద్దరు చర్చించారు. విజయవాడ వచ్చే ముందు కేజ్రీవాల్ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి సంఘీభావం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, పోలింగ్‌కు ముందుగా మార్చిలో అమరావతిలో ధర్మపోరాట దీక్ష నిర్వహించేందుకు సూత్రప్రాయంగా ప్రతిపాదించారు. సహకరించని పార్టీల నేతలపై సీబీఐ దాడులతో బెదిరింపులు, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కూటమిలో కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకోవడంపై విభేదిస్తున్న నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపకల్పన చేసేందుకు ప్రతిపాదించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, దేశాన్ని కాపాడేందుకు కొంత సర్దుబాటు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తాను టీడీపీలో చేరుతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ అశోక్‌బంగ్లాలో ఎంపీ అశోక్‌గజపతిరాజును కలిశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని, అందుకోసం టీడీపీయే సరైనదని భావించి ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గతంలో తాను టీడీపీ సహకారంతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, టీడీపీ బలంగా ఉందని అన్నారు. కాగా, ప్రధాని మోదీ, అమిత్‌షాలు లౌకికవాదాన్ని పక్కన పెట్టి సామ్యవాద సిద్ధాంతాలతో పరిపాలన చేస్తున్నారని విమర్శించారు.

kishore 19022019 1

అందువల్లనే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తున్నాయన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇస్తామని చెబుతున్నారని, ఈ దఫా చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెప్పిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. కాగా, ఒకే ఇంట్లో తండ్రి ఒక పార్టీలోను, కుమార్తె మరో పార్టీలో ఉండటాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా తన కుమార్తె శృతి ఆలోచనలను నియంత్రించడం సరికాదని బదులిచ్చారు. కాగా, ఎంపీ అశోక్‌గజపతిరాజుతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, ఆయనతో కలసి పనిచేసే అవకాశం లభించడం తనకు ఆనందంగా ఉందని అన్నారు.

kishore 19022019 1

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో భాజపాను, రాష్ట్రంలో వారికి సహకరిస్తున్న పార్టీల్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 24వ తేదీన అమరావతిలో తెదేపాలో చేరుతున్నట్లుగా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన కుమార్తె శృతీదేవి కాంగ్రెస్‌లో కొనసాగడంపై ప్రశ్నించినప్పుడు ఆమె స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. తన కుమార్తె శ్రుతీదేవి ఆమెకు నచ్చిన పార్టీలో ఉన్నారని, రాజకీయంగా ఆమెతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎంపీ టికెట్‌ ఆశించి టీడీపీలో చేరుతున్నారా అని అడుగగా.. టికెట్లు ఆశించి రావడం లేదని.. కేంద్రాన్ని ఢీకొట్టే పార్టీ టీడీపీ ఒక్కటేనని భావించి వచ్చానని బదులిచ్చారు. అశోక్‌గజపతిరాజు, తాను స్నేహపూరిత వాతావరణంలో పనిచేస్తామన్నారు.

Advertisements

Latest Articles

Most Read