నిన్న చంద్రబాబు ఇచ్చిన కోటింగ్ కి, మోడీకి మరో సారి దిమ్మ తిరిగింది. రాష్ట్రానికి సాయం ప్రకటించేందుకు మోదీ ప్రభుత్వానికి చిట్టచివరి అవకాశం ఇచ్చేందుకు తలపెట్టిన ఈ దీక్షకు భారీ ఎత్తున ప్రతిస్పందన లభించింది. సార్వత్రిక ఎన్నికల ముందు విపక్షాల ఐక్యతను మరోసారి చాటిచెప్పేందుకు ఇది వేదికగా మారింది. గత నెల 19న కోల్‌కతాలో ఆమె ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి 23 ప్రతిపక్షాల నేతలు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం బాబు దీక్షకు కూడా వారంతా హాజరై మరోసారి తమ ఐకమత్యాన్ని చాటారు. ‘మోదీ హటావో, దేశ్‌ బచావో..’ అన్న నినాదాలకు కేంద్రమైంది. ఎన్డీయే పక్షాలు, ఒకటి రెండు తటస్థ పార్టీలు మినహా... మిగిలిన విపక్ష నేతలంతా నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.

modied 12022019

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు... అప్పట్లో రాజ్యసభలో ప్రధాని హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేసిన మన్మోహన్‌ సైతం దీక్షకు రావడం అందరినీ ఆకర్షించింది. ప్రధాని మోదీ గుంటూరు సభలో చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడాన్ని అందరూ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు చేపట్టిన దీక్ష దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని పార్టీలు, మోడీ ఏపికి చేసిన ద్రోహం గురించి చెప్పటంతో, మోడీ దేశ ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. అంతే కాదు, మోడీ దిగజారుడు మాటలకు, చంద్రబాబు కూడా అదే స్థాయిలో వాయించారు. దీంతో మోడీ, షా లకు దిమ్మ తిరిగింది. వారు చెయ్యగలిగేది వ్యవస్థలను అడ్డు పెట్టుకుని సాదించటం. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈడీ ని రంగంలోకి దించారు.

modied 12022019

చంద్రబాబుని సాధించాలి అంటే వాళ్లకు ఉన్న ఒకే ఒక పిల్ల కేసు ఓటుకి నోటు కేసు. అయితే ఇది తెలంగాణా ఏసిబి నుంచి, ఎప్పుడు ఈడీ చేతిలోకి వెళ్లిందో కాని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, ఇప్పుడు మరోసారి ఈడీని రంగంలోకి దించారు. కోడి కత్తి కేసు పై ఎన్ఐఏ చేతులు ఎత్తేయటంతో, ఇప్పుడు ఈ కేసు పట్టుకుని చంద్రబాబుని ఎలా అయినా దీంట్లో దోషిగా చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఈడీ అధికారులు తాజాగా కాంగ్రెస్‌నేత రేవంత్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం. మరో పక్క ఈ రోజు వేం నరేందర్‌రెడ్డి ఈ కేసు విషయంలో ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ ఈడీ ఎందుకు విచారిస్తుందో అర్థం కావట్లేదన్నారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. తన పిల్లల్ని కూడా విచారణకు పిలిచి వేధిస్తున్నారని నరేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు తెలిపారు.

దొంగే దొంగ దొంగ అని అరవటం, మన A2 దొంగకి బాగా అలవాటు. ఈ A2 గత కొన్ని రోజులుగా, ట్విట్టర్ లో కూసే సీ గ్రేడ్ కూతలు చూస్తే, రోడ్ వెంట ఉండే పని చేసుకునే వారు కూడా ఇలాంటి భాష మాట్లాడరు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదే ట్విట్టర్ లో కూసిన పిచ్చి కుతలకు బ్యాండ్ పడింది. అందరూ చంద్రబాబు అంత మంచిగా ఉండరు కదా, లెఫ్ట్ అండ్ రైట్ వాయించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంతకీ విషయం ఏంటి అంటే, సోమవారం దేశరాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయన ఈ దీక్ష చేపట్టారు.అయితే.. ల్లీలో దీక్షలో పాల్గొనే వారి కోసం తెలుగుదేశం పార్టీ ఛార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే కీలక నేతలు ఉన్నారు. అదే ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ హరిబాబు కూడా ఉన్నారు.

vijay 12022019 1

ఈ ఫోటోలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్నా, రహస్యంగా టీడీపీ-బీజేపీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారంటూ తన డకోటా బుద్ధి చూపిస్తూ ట్వీట్ చేశారు. అది ఒక షడ్యుల్డ్ ఫ్లైట్, అందులో సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. అయితే A2 మాత్రం, తన దొంగ బుద్ధి ఇక్కడ కూడా చూపించాడు. రాజ్యసభలో మోడీ కాళ్ళ మీద పడటం, ప్రతి రోజు ప్రధాని ఆఫీస్ లో వ్యవహారాలు చెయ్యటం, ఇవన్నీ మీడియాలో వచ్చి దొరికిపోయినా, మోడీ, షా లకు బహిరంగ భజన చేస్తున్న A1, A2 లు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టుకుని, డ్రామాలు ఆడుతున్నారు.

కాగా.. ఆ ట్వీట్ కి హరిబాబు ఘాటుగా సమాధానం ఇచ్చారు. విమానంలో ఏ పార్టీ వాళ్లయినా ట్రావెల్ చేయవచ్చని హరిబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిషేధం లేదని విజయసాయిరెడ్డి కి హరిబాబు సూచించారు. సహ ప్రయాణికులు ఎవరన్న విషయం తనకు అనవసరమన్నారు. తన విమానం ట్రావెల్ కి సంబంధించిన టికెట్లను కూడా ఈ సందర్బంగా హరిబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఒక సాధారణ విషయంపై రాజకీయం చేసి నా పైన దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాను.. నేను నేటి ఉదయం ఢిల్లీకి ఇండిగో విమానంలో సాధారణ ప్రయాణీకుడిలానే వెళ్ళాను.. ఇండిగో టికెట్ వివరాలు కూడా అందిస్తున్నాను. అసత్యాలతో దుష్ప్రచారం చేసిన వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. సత్యమేవ జయతే." అంటూ A2 అబద్ధాలకు తెర దింపారు.

కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్‌ చంద్రదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్‌ చెప్పారు.

kishore 12022019

ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్‌‌ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. కిశోర్‌ చంద్రదేవ్‌ అరకు పార్లమెంట్‌ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారన్నదానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కిశోర్ చంద్రదేవ్ మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిశారని అన్నారు. ముఖ్యమంత్రి కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు.

kishore 12022019

కిశోర్ చంద్రదేవ్ మంచి నాయకుడని బుద్దా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రజల్లోకి వెళ్లాయని, ప్రజలు కూడా టీడీపీవైపే ఉన్నారని సీఎంను కిశోర్ చంద్రదేవ్ ప్రశంసించారు. ఏది ఏమైనా కిశోర్ చంద్రదేవ్ లాంటి వాళ్లు టీడీపీలోకి రావడం సంతోషించదగ్గ విషయమని బుద్దా వెంకన్న అన్నారు. నైతిక విలువలు ఉన్న నాయకుడు టీడీపీలోకి రావడం శుభపరిణామమని అన్నారు. ఇది ఇలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేయనున్న నిరసనకు మద్దతు తెలపనున్నారు. అలాగే భవిష్యత్‌ కార్యాచరణపై ఎన్డీయేతర పక్షాలతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తూ వైకాపా అధ్యక్షులు, ప్రతిపక్షనేత వై.యస్‌ జగన్‌ అనంతపురం వైకాపా సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలక్షన్‌ కమీషన్‌ కు పిర్యాదు చేసింది. రానున్న ఎన్నికల్లో ఓటుకు 5 వేలు అడగాలన్న జగన్‌ వ్యాఖ్యలను టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్‌, తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణయ్య, పట్టాభి గార్లు ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఓటుకు 5 వేలు డిమాండ్‌ చేసి తీసుకోవాలని, ఓటుమాత్రం వైసీపీకి వేయాలని జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమ నిబంధనలకు తూట్లుపొడిచే విధంగా ఉందని తెలిపారు.

ec 12022019

ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 (ది రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ యాక్ట్‌)లోని సెక్షన్స్‌ 8జు, 9, 123 ప్రకారం జగన్‌ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాని విజయవాడలో కలిసి పిర్యాదు చేశారు. ఎన్నికలు స్వేచ్చగా, అవినీతి రహితంగా నిర్వహించటంలో జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యలు పెద్ద గొడ్డలిపెట్టని చెప్పారు. మూడు నెలల్లో జగన్‌ ముఖ్యమంత్రి అవుతానని, అధికారంలో వచ్చిన వెంటనే వైసీపీ నాయకులపై పెట్టిన కేసులు తొలగిస్తానని జగన్‌ చెప్పడం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని చెప్పారు.

ec 12022019

ఇలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంగిస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్‌ పై చర్య తీసుకుని రాబోయే ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో వుండి జగన్‌ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. సోమవారం అనంతపురం నగర శివారులో బూత్‌కమిటీ సభ్యులు, కన్వీనర్లతో సమర శంఖారావ సభ నిర్వహించిన జగన్, రానున్న ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలు అడగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలు తీసుకోండి. రూ.3 వేలు కాదు రూ.5 వేలు ఇవ్వాలని అడగండి. అవినీతి సొమ్ము తీసుకుంటే ఏ దేవుడూ చంద్రబాబుకు ఓటేయమని చెప్పడు’ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read