టీడీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ఓటాన్ అకౌంట్‌పై చర్చకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఏపీని తిరుగులేని శక్తిగా చేస్తామని, తమను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఐదేళ్లుగా ప్రధాని మోదీ దేశానికి ఏం చేశారో చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, దేశానికి ఏం చేద్దామన్న ఆలోచన కూడా మోదీకి లేదని, దీని వల్ల దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనకుండా, వారి కష్టాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం రాటుదేలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎదురుదాడికి పాల్పడుతున్న మోదీ సర్కార్ చాలా ఘోరంగా వ్యవహరిస్తోందని, నాయకత్వాన్ని చంపేస్తున్నారని, ఇది దేశానికి పెద్ద శాపం అని విరుచుకుపడ్డారు.

assembly 08022019

రాజకీయనాయకులపై బురద జల్లాలని, కార్పొరేట్ సెక్టర్ ని, మీడియాని కిల్ చేయాలని చూస్తున్నారని.. ఆయనొక్కడే ఉండాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసిన మరుసటి రోజు ఈ ప్రధాన మంత్రి ఏమవుతారో ఆలోచించుకోండంటూ ఏపీ బీజేపీ నేతలను హెచ్చరించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రే అక్కడి ఎమ్మెల్యేలకు డబ్బులు పంపించి బేరసారాలు చేస్తున్నారని, ఇది ఎంత వరకు కరెక్టు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి ఉందా? లేదా? అని ప్రశ్నించారు.

assembly 08022019

చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులందరూ లేచి చప్పట్లతో అభినందించారు. విజన్ 2024 ఇచ్చామని, చాలా ఆలోచనలు చేశామని, ఇంకా ఏమైనా ఉంటే సూచనలు చేయాలని సీఎం పిలుపు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుదని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ రాబోయే రోజుల్లో ప్రభుత్వపరంగ ఏం చేయబోతున్నామో విజన్ 1924 ఇచ్చామన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ఆశీర్వాదం కోసం వెళతామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు పట్టం కట్టాలని పవిత్రమైన శాసనసభ నుంచి ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.

తెలుగుదేశం పార్టీలో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పంచాయితీ కొలిక్కివచ్చింది. జమ్మలమడుగు పీటముడిని సీఎం చంద్రబాబు విప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇవాళ సీఎం చంద్రబాబు తెరదించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, వైకాపా అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి విజయం సాధించి... కొంత కాలం తర్వాత తెదేపాలో చేరారు. అప్పటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గ తెదేపా టికెట్‌ ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

aadi 08022019

ఇదే విషయంపై పలు మార్లు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి సీఎం చంద్రబాబు వద్ద చర్చలు జరిపారు. ఇద్దరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు నేతలు పరస్పర అంగీకారానికి వచ్చారు. జమ్మలమగుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీ చేయాలని, కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయాలని, ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం మేరకు రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు.

aadi 08022019

రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి ఒక్కటవ్వడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో తెదేపా విజయఢంకా మోగిస్తుందని తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా బద్ధ విరోధులుగా ఉన్న వీరిద్దరూ చంద్రబాబు సమక్షంలో పరస్పరం పలుకరించుకున్నారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యే సీటు కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నిర్ణయం మేరకు ఎమ్మెల్సీ పదవికి రామసుబ్బారెడ్డి రాజీనామాకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. చర్చల సారాంశాన్ని ఆది, రామసుబ్బారెడ్డి మరికాసేపట్లో మీడియా ముందు సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఏపీకి మరోసారి కేంద్రం మొండిచేయి చూపింది. కొత్త రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ, విజయవాడ-గుంటూరు కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం మొండిచేయి చూపింది. రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాల్సిందిగా 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించగా.. దీనిపై కేంద్రం ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా నీతి ఆయోగ్‌ చెప్పిందంటూ రైల్వే లైన్‌ పనుల ఆమోదానికి సంబంధించిన దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రైల్వేలైన్‌ ఏర్పాటుపై రాజ్యసభలో తెదేపా ఎంపీ రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానం ఇచ్చారు.

modi 08022019

దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, ఉపరితల రవాణా శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని.. అప్పటి వరకు రైల్వే లైన్‌కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని గోయల్‌ సభలో వెల్లడించారు. 2017-18 బడ్జెట్‌లో ప్రతిపాదించిన లైనుపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సిఫారసు అంటూ ప్రతిపాదించిన రైల్వే లైను పనులకు ఆమోదంపై కేంద్ర హోం శాఖ దస్త్రాలు పక్కన పెట్టె ప్రయత్నం చేసింది. ఎంపీ కనకమేడల మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి రైల్వేలైన్ హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించాలనడం దుర్మార్గమని చెప్పారు. రాష్ట్రాన్ని ఆశాస్త్రీయంగా విభజించిన వారే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీపై పోరాడేందుకే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు. మోదీని గద్దె దించడమే మా ఏకైక లక్ష్యమని స్పష్టంచేశారు.

modi 08022019

మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.

ఏపీలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతోంది. పేదవాడి కలలను సీఎం చంద్రబాబు నిజం చేయనున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్నీ వర్గాలకు ప్రభుత్వం దగ్గరవుతోంది. శనివారం ఒకే రోజు 4 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు కల్పించబోతోంది. అర్బన్ ఏరియాలో లక్ష ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. రూరల్ హౌసింగ్ కింద 3 లక్షల ఇళ్ల ఓపెనింగ్ చేస్తారు. నెల్లూరులో గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ పాల్గొననున్నారు. తిరుపతిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో మంత్రులు లోకేష్, కాల్వ శ్రీనివాసులు పాల్గొననున్నారు.

housnig 08022019

ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ అధికారులు రెండు విడతలుగా పేదల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించారు. తాజాగా మరో 4 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు పండగ వాతావరణంలో నిర్వహించి పేదలకు అంకితమివ్వాలని నిర్ణయించారు. ఇందుకు ఫిబ్రవరి 9వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. గ్రామీణ పరిధిలో 3 లక్షల ఇళ్లకు, పట్టణ పరిధిలో లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో మంత్రి కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

housnig 08022019

9న ఉదయం నెల్లూరులో నిర్వహించే పట్టణ గృహ ప్రవేశ మహోత్సవంలో, మధ్యాహ్నాం తిరుపతిలో గ్రామీణ గృహ ప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు.. మార్చిలోపు 19 లక్షల ఇళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు విడతల్లో 5.80 లక్షల ఇళ్లను పేదలకు అందజేశారు. తాజాగా మరో నాలుగు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలను నిర్వహించి, అందజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల ఇళ్లను నిర్మించాలని సంకల్పించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ పేదల గృహ నిర్మాణంపై పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. పట్టణ పేదల కోసం షీర్‌వాల్‌ సాంకేతికతతో ఒకే ప్రాంతంలో వెయ్యి మొదలు 10 వేల వరకు గృహాలుండేలా ఆధునిక వసతులతో నిర్మించి ఇస్తోంది. ఎన్టీఆర్‌ పథకం అమలుకన్నా ముందున్న, అసంపూర్తిగా మిగిలిన ఇళ్ల పూర్తికి ప్రాధాన్యం ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read