పులివెందుల అనేది నిన్నమొన్నటివరకూ వైఎస్‌ ఫ్యామిలీకి కంచుకోట! అక్కడ వారు చెప్పిందే వేదం. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు! రాజకీయాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎదుగుతూ వచ్చే క్రమంలో పులివెందులపైనా తన పట్టు పెంచుకున్నారు. నాటినుంచి నేటివరకూ సుమారు నాలుగు దశాబ్దాలపాటు పులివెందులలో ఇదే పరిస్థితి! వార్డుమెంబరు సహా అన్ని పదవులు వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే ఉంటాయి. దాదాపు చాలా పదవులను ఆ కుటుంబ సభ్యులే అనుభవిస్తుంటారు. ఇతర పార్టీల నేతలు ఆ ప్రాంతంలో తిరిగే సాహసం కూడా చేయరు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు. ఈ తరుణంలో ఆయన పులివెందులకు వెళితే ఆ ప్రాంతవాసులు చిరంజీవిపై దాడులకు సిద్ధపడ్డారు. నల్లజెండాల ప్రదర్శనతో వ్యతిరేకించారు.

pulivendula 0802019

పులివెందుల గతంలో కరువుతో అల్లాడింది. దాహంతో అలమటించింది. సాగునీరు లేక రైతాంగం తల్లడిల్లింది. అలాంటి ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఇప్పుడు సస్యశ్యామలం చేశారని ఆ ప్రాంత వాసులు సంబరపడుతున్నారు. ఈ అంశం వారి మదిలో బలంగా నాటుకుపోయిందట! శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను గండికోట ప్రాజెక్టుకు రప్పించి.. అక్కడినుంచి ఆ నీటిని కాలువల ద్వారా పులివెందులకు పారించారు. అలాగే పులివెందుల ప్రాంతంలో ఉన్న పైడిపాలెం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో పులివెందుల ప్రాంత రైతుల పంట పండింది. కనీవినీ ఎరుగని రీతిలో వారు పంటలు సాగుచేశారు. ఇప్పుడు పులివెందుల ప్రాంతం ఆకుపచ్చని కళతో అలరారుతోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై పులివెందుల వాసులకు ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడింది.

pulivendula 0802019

రెండేళ్ళ క్రితం పులివెందుల రైతులు సీఎం చంద్రబాబును ఆశ్రయించారు. కాపుకి అందుకున్న తమ పండ్లతోటలు నీరులేక ఎండిపోతున్నాయని మొరపెట్టుకున్నారు. వారి బాధలు విన్న చంద్రబాబు వెంటనే స్పందించారు. ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ట్యాంకర్లతో నీటిని తోలించారు. ఎండిపోతాయనుకున్న పంటలను కాపాడారు. ఈ అనుభవంతో పులివెందుల రైతులు ఎంతో ఆనందపడ్డారు. తాము ఎప్పటికీ చంద్రబాబు చేసిన మేలును మరచిపోమని డైరక్టుగానే చెబుతున్నారట. నాడు చంద్రబాబుపై దాడికి పాల్పడిన వారే నేడు తమ ప్రాంతం సస్యశ్యామలం కావడాన్ని చూసి తెగ మెచ్చుకుంటున్నారట. పులివెందులలో జగన్ కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబు అమలుచేసిన రైతు ఋణమాఫీ పథకం లబ్ధిదారులుగా ఉన్నారట. చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎన్నడూ జగన్ బంధువులు ప్రభుత్వ ఫలాలను అందుకోలేదు. ఈసారి మత్రం వారి వైఖరిలో మార్పు సుస్పష్టం! ఒక్క మాటలో చెప్పాలంటే పులివెందుల ప్రజల్లో మార్పు వచ్చిన సంగతి వాస్తవం. గత రెండు సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ ప్రాంతంలో తెలుగుదేశానికి మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి పులివెందులలో ఓట్లశాతం బాగా పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా పులివెందులలో పరిస్థితి బాగా మారిపోయింది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భారీగా ఓట్లు పడతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

విజయవాడ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసు ప్రక్రియ ఊపందుకుంది. మరో నెల రోజుల్లో దుబాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) ఆధ్వర్యంలో బిడ్లను ఆహ్వానిస్తూ జనవరి 23న నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 02 వరకూ స్వీకరించారు. అతి తక్కువకు బిడ్‌ను దాఖలు చేసిన విమానయాన సంస్థకు అవకాశం కల్పించనున్నారు. ఫిబ్రవరి 11న విమానయాన సంస్థల ప్రతినిధుల సమక్షంలోనే బిడ్లను తెరిచి తక్కువకు కోట్‌ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో దుబాయికి సర్వీసు ఆరంభమయ్యే అవకాశం ఉంది. గతంలో సింగపూర్‌కు సర్వీసును నడిపినప్పుడు కూడా ఇలాగే తొలుత బిడ్లను ఆహ్వానించి అనంతరం ఇండిగోను ఎంపిక చేశారు. దుబాయికి సర్వీసును ఏర్పాటు చేస్తే.. సింగపూర్‌ కంటే రద్దీ రెట్టింపు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

pulivendula 0802019

దుబాయికి సర్వీసులను నడిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఏడీసీఎల్‌ చేపట్టింది. గతంలో సింగపూర్‌కు సర్వీసును ఆరంభించే ముందు కూడా ఇలాగే సర్వే చేపట్టారు. తాజాగా దుబాయికి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్తో పాటూ ఈమెయిల్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సర్వేను చేపట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రుల నుంచి మద్దతుగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్‌లోనే 2,42,594 మంది దుబాయి సర్వీసుకు ఓటేశారు. 950 మంది ఈమెయిళ్ల ద్వారా తమ సమ్మతిని తెలిపారు. మరో 25 మంది వాట్సాప్‌, 30 మంది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆసక్తిని తెలియజేశారు. ఫిబ్రవరి 23 వరకూ వచ్చిన ఈ స్పందనను చూసిన రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ వెంటనే బిడ్లను ఆహ్వానించింది. బిడ్లను దాఖలు చేసిన విమానయాన సంస్థల్లో.. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌)ను అత్యంత తక్కువకు కోట్‌ చేసిన వారిని ఎంపిక చేయనున్నారు.

pulivendula 0802019

దుబాయి సర్వీసును బుధ, శుక్రవారాల్లో వారంలో రెండు రోజులు నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్‌కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు మంగళ, గురువారాల్లో గన్నవరం నుంచి నడుస్తున్నాయి. అందుకే.. బుధ, శుక్రవారాల్లో నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి సర్వీసును ఆరంభిస్తే.. స్పందన భారీగా ఉండబోతోంది. సింగపూర్‌కు వీసాల సమస్య ఎదురవుతోంది. దీంతో ఆరంభంలో సర్వీసులు సగం వరకూ నిండేవి. ప్రస్తుతం 70శాతం పైగా నిండుతున్నాయి. దుబాయికి సింగపూర్‌ మాదిరిగా వీసా సమస్య లేదు. అమెరికా వీసా ఉన్న ప్రతి ఒక్కరూ దుబాయికి నేరుగా వెళ్లిపోవచ్చు. అమెరికా వీసా ముద్ర ఉంటే.. దుబాయికి ప్రత్యేకంగా అవసరం లేదు. దానితోనే వెళ్లిపోవచ్చు.

సరిగ్గా 27 రోజులు... రాజకీయ పరిస్థితులన్నీ సమూలంగా మారాయి. ప్రస్తుతం సామాన్యుడి నోట చంద్రబాబు మాటే పదేపదే వినిపిస్తోంది. నలుగురు మహిళలు ఒక చోటచేరినా.. ఏ ఇద్దరు వృద్ధులు ఎదురుపడినా వారి మాటల్లోనూ బాబు ప్రస్తావనే.. కిల్లీ కొట్టు నుంచి పొలంగట్ల వరకు సీఎం చంద్రబాబు పథకాలపైనే చర్చ జరుగుతోంది. కారణం... 27 రోజుల వ్యవధిలో ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా పరిధిలోని 55 శాతం మంది ఓటర్లు ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. ఫిబ్రవరి ఆరంభం నుంచి ఒక పథకం గురించి మరచిపోకముందే మరోవరంతో చంద్రబాబు ప్రజలను మురిపిస్తున్నారు. ఊహకందని విధంగా అధికార పార్టీకి పెరుగుతున్న అనుకూలతను చూసి, టీడీపీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. కంగుతిన్న ప్రతిపక్షాలు మౌనంగా పరిస్థితిని అంచనా వేస్తున్నాయి.

pulivendula 0802019

జనవరి 11వ తేదీ కావలి పర్యటనలో సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్లను రెట్టింపు చేస్తూ ప్రకటన చేశారు. ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేరోజు సీజెఎఫ్‌ఎస్‌ భూముల పట్టాల పంపిణీ జరిగింది. సెంటు భూమిలేని వేలాదిమంది నిరుపేదలను భూ యజమానులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటి గురించి చర్చ ముగియకముందే త్వరలో చంద్రబాబు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రకటించనున్నారనే వార్తలు వచ్చాయి. అందరూ ఆశించిన విధంగానే ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెంచిన వృద్ధాప్య పింఛన్లతో పాటు పసుపు- కుంకుమ పథకం కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ. 10వేల ఆర్థిక సాయం అందించే భారీ పథకానికి బాబు శ్రీకారం చుట్టారు.

pulivendula 0802019

ఈ తీపి జ్ఞాపకాల నుంచి తేరుకోకమునుపే 5వ తేదీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రైతు, ఉద్యోగ, నిరుద్యోగ, కార్మిక వర్గాల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి, వాటికి నిధులు కేటాయించారు. ఇలా గడచిన 27 రోజులుగా ఒకటి తరువాత మరొకటిగా వరుస సంక్షేమ పథకాలు అమలులోకి తేవడంతో మెజారిటీ వర్గాల ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎక్కడ ఏ నలుగురు గుమికూడినా చంద్రబాబు ప్రవేశపెట్టిన కొత్త పథకాల గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. మొత్తం ఓటర్లలో సుమారు 55 శాతం మంది ఈ పథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్ధిపొందారు. కుటుంబాల పరంగా పరిశీలిస్తే పేద, మధ్య తరగతికి చెందిన మెజారిటీ కుటుంబాలు ఒకటి నుంచి నాలుగు రకాల లబ్ధిని పొందాయి. కొద్ది రోజుల వ్యవధిలో ఊహకందని విధంగా ఇంత భారీ సంఖ్యలో ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం కొత్త రూపు సంతరించుకుంది. కొత్త పథకాలు, వాటికి ప్రజల్లో లభిస్తున్న స్పందన గమనించిన వైరి పక్షాలు ఖంగుతిన్నాయి. అంతుపట్టని విధంగా కొత్త పథకాలు ప్రకటించడం, ఆ వెనువెంటనే వాటిని అమలు చేయడం, వీటి ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా లబ్ది పొందుతుండటంతో వీటిని ఎలా ఎదుర్కోవాలో అంతు పట్టక మౌనం దాల్చాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం నుంచి టిక్కెట్ ఇస్తామంటూ బీజేపీ నేతల బహిరంగ ప్రతిపాదనలపై ప్రముఖ మలయాళ నటుడు, సూపర్‌స్టార్ మోహన్‌లాల్ స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది కానీ, ఎన్నికల్లో పోటీ చేసేది కానీ లేదని అన్నారు. 'రాజకీయాలు నా పని కాదు. నటుడిగా ఉండటానికే నేను ఎప్పుడూ ఇష్టపడతాను. ఈ వృత్తిలో స్వేచ్ఛను నేను ఆస్వాదిస్తున్నాను. రాజకీయాల్లో అయితే అలా కాదు. ఎందరో ప్రజలు మనపై ఆధారపడతారు. ఆశలు పెట్టుకుంటారు. వాటిని నెరవేర్చడం అంత సులభం కాదు. నాకు రాజకీయాల గురించి తెలియదు' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ఇక్కడ జరుగుతున్న 'మరక్కర్' మలయాళ చిత్రం షూటింగులో ఉన్నారు. కేరళలో బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఓ.రాజగోపాల్ మాత్రమే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

pulivendula 0802019

ఈ నేపథ్యంలో పార్టీ నుంచి గెలుపు అవకాశాలున్న మోహన్‌లాల్‌కు లోక్‌సభ టిక్కెట్ ఇచ్చే ఆలోచన ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, ఇటీవల కాలంలో మోహన్‌లాల్ కేరళ బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉండటం, గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకోవడంతో మోహన్‌‌లాల్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వెలువడ్డాయి. తన ఆధ్వర్యంలోని విశ్వశాంతి ఫౌండేషన్ చేస్తున్న సేవాకార్యక్రమాలను ప్రధానితో కలిసిన సమావేశంలో మోహన్‌లాల్ వివరించారు. కాగా, ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం 'పద్మభూషణ్' ప్రకటించింది. సినీరంగంలో చేసిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు.

 

Advertisements

Latest Articles

Most Read