ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై ఎన్‌ఐఏ విచారణ, కోడి ఈక కూడా పీకలేక పోయింది. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పలు అంశాలు పేర్కొంది. సిట్‌ రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్‌ఐఏ చెప్పింది. కోడి కత్తితో శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని సెక్షన్‌ 307 ప్రకారం సిట్ అభియోగాలు నమోదు చేసింది. శ్రీనివాసరావు.. జగన్‌ అభిమాని అని తెలిపింది. సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని సిట్ రిపోర్ట్ స్పష్టంచేసింది. సిట్ రిపోర్ట్‌తో ఎన్‌ఐఏ దాదాపుగా ఏకీభవించింది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడాడని తెలిపింది. సర్.. మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని జగన్‌తో శ్రీనివాసరావు చెప్పాడని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో వెల్లడించింది. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది.

jagan 31012019

ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది. ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది. సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా తెలిపింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.. వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్లు స్పష్టం చేసింది. ఎడమ భుజంపై గాయం అయిందని డాక్టర్‌ ఇచ్చిన నివేదికను ఎన్‌ఐఏ ప్రస్తావించింది. సెంటి మీటర్‌ పొడవు.. అర సెంటిమీటర్‌ వెడల్పు.. మూడున్నర సెంటిమీటర్‌ లోతు గాయమైనట్లు తెలిపింది.

jagan 31012019

వైజాగ్ లో కోడి కత్తితో 0.5 cm దాడి చేపించుకున్న తరువాత, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్. హైదరాబాద్ వెళ్ళగానే 0.5 cm గాయం కాస్తా 9 cm గాయం అయ్యి, కుట్లు కూడా పడ్డాయి. అంతే మనోడు మంచానికి అడ్డం పడుతూ స్టిల్స్ ఇచ్చి, లోటస్ పాండ్ కు వెళ్ళిపోయాడు. దాదపు 20 రోజుల తరువాత వచ్చి మీటింగ్ పెట్టారు. 0.5 cm గాయం అంటే ప్రతి రోజు మన ఇంట్లో ఆడవాళ్ళకు కూరాగయలు కోసే సమయంలో అయ్యే గాయం అంత.. దానికి 20 రోజులు డ్రామా ఆడి, మోడీతో కలిసి ఎన్‌ఐఏకి కేసు బదిలీ అయ్యేలా చేసారు. కాని, అక్కడ ఒక్క సాక్ష్యం కూడా చంద్రబాబు మీద తోయ్యటానికి లేకపోవటంతో, రిస్క్ ఎందుకులే అనుకుని కేసు మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి, ఎన్‌ఐఏ ని అడ్డు పెట్టుకుని, మరో డ్రామా ఆడాలని చూసిన జగన్ బాబు మరో డ్రామా ఇలా ఫెయిల్ అయ్యింది.

మోడీ, అమిత్ షా కక్ష కడితే, అది మాములుగా ఉండదు. వారి ఇగో తృప్తి పరుచుకోవటానికి, ఒక రాష్ట్రాన్నే ఇబ్బంది పెడుతున్న చరిత్రకు, మనమే సాక్షులం. వారికి ఎవరు అడ్డు వచ్చినా, ఇలాగే కక్ష తీర్చుకుంటారు. తాజగా సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో పాత కుంభకోణాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హయాం నాటి గనుల తవ్వకాల కుంభకోణంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మాయావతి అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న స్మారకాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు జరిపారు. 2007-12 మధ్య మాయావతి యూపీ సీఎంగా ఉన్న సమయంలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌, పార్టీ గుర్తు ఏనుగు లాంటి అనేక స్మారకాలను నిర్మించారు.

akhilesh 31012019

అయితే స్మారకాల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందని, కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు వ్యక్తులు లబ్ధి పొందినట్లు రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. లఖ్‌నవూలోని కొందరు అధికారులు, ప్రయివేటు వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల అఖిలేశ్‌ యాదవ్‌ హాయం నాటి మైనింగ్‌ కుంభకోణం కేసులో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

akhilesh 31012019

ఐఏఎస్‌ అధికారిణి నివాసం సహా పలు అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. కాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా యూపీలో సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ తమ వైరాన్ని సైతం పక్కనబెట్టి చేతులు కలిపాయి. మహాకూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌, మాయావతి హయాం నాటి కుంభకోణాలపై ఈడీ సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వారికి ఎదురు తిరిగిన, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల పై కేంద్రం అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది. అలాగే దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలను కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఒక్క జగన్, కేసీఆర్ ని తప్ప..

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రానికి చేసిన ద్రోహం ఒక వైపు, అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని నాశనం చేస్తున్న తీరు మరో వైపు చూసి, ప్రజలు బీజేపీని చీదరించుకుంటున్నారు. ఇక జీవీఎల్, కన్నా లాంటి వారు మాట్లాడే మాటలతో వాళ్ళకి ఎంత లాభం వస్తుందో కాని, బీజేపీని మాత్రం, ఒక్కో అడుగు పాతాళంలోకి తోక్కిస్తుంది. ఈ క్రమంలో, సొంత పార్టీపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీనైనా ముందుకు వస్తుందా? అంటూ విష్ణుకుమార్‌రాజు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తారా?... అనే ప్రశ్నకు మాత్రం విష్ణుకుమార్ సమాధానం దాటవేశారు.

vishnu 3101201

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నది నోటిఫికేషన్ వచ్చాకే చెబుతానని వెల్లడించారు. ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తే సరైన కవరేజ్ రాదంటూ ఛమత్కరించారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు సాయం అంశాలపై తెలుగుదేశానికి మైలేజ్ ఇచ్చే అంశంగా పేర్కొన్నారు. డబ్బులిచ్చినప్పుడు సహజంగానే సానుకూలత వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ తరహా నిర్ణయాలు తీసుకోకుంటే రాజకీయ పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. బీజేపీతో కలిసున్నంత వరకు టీడీపీ పాలన బాగానే ఉందని ఆయన చెప్పారు. కానీ విడిపోయాక మాత్రం రాజకీయం తప్ప మరేమీ చేయడం లేదని విమర్శించారు.

vishnu 3101201

దేశంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీపై భారీ స్థాయిలో బురద జల్లింది టీడీపీనేనని స్పష్టంచేశారు. లగడపాటి రాజగోపాల్లా ఏ పార్టీ గెలుస్తుందో తాను ముందే చెప్పలేనన్నారు. పవన్‌కల్యాణ్ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. ఎందుకంటే గతంలో విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు అంతగా విమర్శించడం లేదంటే ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే విష్ణు వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన టీడీపీలో చేరొచ్చని గతంలో ప్రచారం జరిగింది. మాజీమంత్రి కామినేని శ్రీనివాసరావు టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

సీఎం చంద్రబాబు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారిగా పోర్టులను తీసుకున్న ఆయన గెలుపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీఎల్పీ సమావేశంలో వెల్లడించారు. అయితే తాను కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సి ఉందని, ఆ పక్రియ ముగిశాక అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంపై కూడా ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. నెల రోజుల పాటు తనకు సమయం ఉంటుందన్నారు. ఆ సమయంలో ప్రతి రోజు రెండు జిల్లాల్లో పర్యటించడం.. లేదా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం... లేకపోతే బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు సమాచారం.

bruti 31012019

నెల రోజుల ప్రచారంపై ఎమ్మెల్యే అభిప్రాయాలను తీసుకున్నారు. మీరు కూడా ఆలోచించాలని, మీరు ఎలా చెబితే అలా చేస్తామని వారికి చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంపై రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని నేతలను సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేది నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ షెడ్యూల్ ఉంటుందని, ఆ తర్వాత మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో షెడ్యూల్ వల్ల ఎలాంటి కార్యక్రమాలను చేసేందుకు వీలుండదని అందువల్ల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

bruti 31012019

ఫిబ్రవరి 2,3,4 తేదీలలో పించన్ల పండుగ జరపాలని చంద్రబాబు ఆదేశించారు. ఫిబ్రవరి 5న రైతుల సమస్యలపై చర్చ.. తర్వాత ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని చంద్రబాబు పేర్కొన్నారు. 9న 4లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామన్నారు. 17 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామని, మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. 22 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, కొత్తగా 14 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. వీటన్నింటిని శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత, కాపు రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Advertisements

Latest Articles

Most Read