చివరి కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత కూడా, ఇంకా బీజేపీని వెనకేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే, వాళ్ళు నిజంగా బానిసలే. రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఊడిగం చెయ్యటమే వీళ్ళకు ఇష్టం. మొన్నటి దాక, కనీసం అరకోర నిధులు అయినా కేటాయించే వారు, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మాటల్లో చెబుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు... చేతల్లో మాత్రం ఆ ఉదారత చూపెట్టలేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలు చేశారు. రాష్ట్ర హక్కులు, హామీల అమలు కోసం అధికార టీడీపీ సహా రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనలను కేంద్రం తన బడ్జెట్‌ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోలేదు.

modi 02022019

ఫలితంగా 2019-20 మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో కనీసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రస్తావనే లేదు. పెండింగ్‌ ప్రాజెక్టులపై ఊసే ఎత్తకపోగా... ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులకూ నిధులు కేటాయించలేదు. నూతన రాజధాని అమరావతి... దుగరాజుపట్నం.. కడప స్టీల్‌ ప్లాంట్‌... విశాఖ రైల్వే జోన్‌ వంటి ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రతిపాదనలే లేవు. మరీ ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ నిఽధులపై కేంద్రం నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు వడ్డీ రాయితీలు ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. గతేడాది ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ. 100 కోట్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

modi 02022019

ఇక విద్యాసంస్థల విషయానికి వస్తే, మనం ఈ దేశంలో భాగమేనా అనే అనుమానం కలుగుతుంది. కేంద్రియ విశ్వవిద్యాలయానికి రూ. 13 కోట్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి(ఐఐపీఈ) రూ. 31.82 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఉమ్మడిగా రూ. 8 కోట్లు కేటాయించారు. ప్రతిష్ఠాత్మకమైప ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌)లకు ఒక్క రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు. ఈ రకమైన కేటాయింపులు చేస్తే విద్యాసంస్థలు అందుబాటులోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, మోడీ గారే చెప్పాలి.

మొన్న కియా దెబ్బతో, హీరో మంచు మనోజ్ అలెర్ట్ అయ్యారు. కియా మొదటి కారు వచ్చిన రోజు, ఏపి ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేసారు. అయితే దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేసీఆర్ కు భయపడి డిలీట్ చేసారని, మోహన్ బాబుకి చంద్రబాబు అంటే పడదు కాబట్టి డిలీట్ చేసారని, ఇలా అనేక రకాలుగా కామెంట్ లు వచ్చాయి. అయితే, ఈ రోజు మళ్ళీ ట్వీట్ చేసారు మనోజ్. ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో, ఏపికి జరిగిన అన్యాయం పై ట్విట్టర్ లో స్పందించారు. మంచు మనోజ్ తన ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భారత ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ఈ ట్వీట్ చేశారు.

manoj 01022019 1

ఇది మనోజ్ చేసిన ట్వీట్ ‘‘పీఎం నరేంద్రమోదీ, ఇన్నాళ్లూ మీరు చేస్తున్న ఫైట్‌లో మేమంతా మీతోనే ఉన్నాం. మాకు మీరేదో చేస్తారని, మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారని.. ఇంతకాలం మిమ్మల్నే సపోర్ట్ చేస్తూ వేచి చూశాం. అయితే స్పెషల్ స్టేటస్‌ కాదు కదా.. కనీసం కృతజ్ఞతాభావం కూడా మీ నుంచి రాలేదు. ఇప్పటికైనా మా డిమాండ్‌ను గౌరవించి, మా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో.. ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాకతప్పదు..’’ అంటూ మంచు మనోజ్ ఘాటుగా ట్వీట్ చేశారు. అయితే వెంటనే మరో రిప్లై కూడా ఇచ్చారు. చివరి లైన్ బాగోలేదు అంటూ, ఒక నెటిజెన్ పెట్టిన కామెంట్ కి స్పందించారు.

manoj 01022019 1

ఎవరికి ఆ భాషలో చెప్పాలో, అదే భాషలో చెప్పాలి అంటూ, ఆ నెటిజెన్ కు బదులు ఇచ్చారు మనోజ్. మరో పక్క మంచు మనోజ్ చేసిన ట్వీట్, నారా లోకేష్ రీట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఉన్న మాటే మీరూ చెప్పారు అంటూ, లోకేష్ అన్నారు. ఈ రోజు ఉదయం కూడా బంద్ లో పాల్గున్న అనేక మంది, సినీ పరిశ్రమ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రజలు నుంచి ఆదరణ పొంది, హైదరాబాద్ లో కూర్చుని, ఇక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటూ, ఆందోళన చేస్తుంటే, హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులకు పట్టదా అంటూ, చాలా మంది విమర్శలు చేసారు. అయితే ఇప్పటికి మంచు మనోజ్ ఒక్కరే సినీ ఇండస్ట్రీ నుంచి స్పందించారు.

పోలవరానికి జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చారని.. ఏ జాతీయ ప్రాజెక్ట్ పనులైనా పోలవరం అంత వేగంగా జరుగుతున్నాయా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తిచేశామన్నారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ పనులైనా ఈ స్థాయిలో జరుగుతున్నాయని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉద్వేగానికి గురయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ వస్తే.. ఏపీ బాగుపడితే.. తమిళనాడుకి నీళ్లు ఇస్తే.. తప్పా అన్నారు. నదుల అనుసంధానం చేస్తామని తిరుపతిలో మోదీ చెప్పారని.. కానీ దాన్ని పట్టించుకోలేదన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం ఏపీయేనన్నారు. పోలవరం, పట్టిసీమలపై వైసీపీ కోర్టులకు వెళుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటుందని విమర్శించారు.

ccbn 01022019

2014 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా 14 సీట్లు ఇస్తే నాలుగు సీట్లలో గెలిచారని చంద్రబాబు తెలిపారు. ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదన్న సంగతి తనకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎన్డీయే కన్వీనర్ గా ఉండి హిందుత్వ నేత తొగాడియా అనంతపురానికి వస్తే అరెస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ లౌకికవాద విలువలకు కట్టుబడ్డామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నలుపు రంగు దుస్తులు ధరించి వచ్చిన సీఎం.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. తాను నానా కష్టాలు పడి అనంతపురంలో కియా మోటార్స్ కంపెనీని తెప్పిస్తే అది తామే తెచ్చామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఏమనాలో తనకు తెలియడం లేదన్నారు.

ccbn 01022019

నరేంద్ర మోదీ వల్లే రాజ్యసభలో ఏపీ విభజన బిల్లు విషయంలో బీజేపీ మనసు మారిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఏపీకి అన్యాయం జరుగుతుందని తాను బీజేపీ అగ్రనేత అద్వాణీని కలిస్తే, ఆయన మౌనంగా మారిపోయారని ఏపీ సీఎం గుర్తు చేసుకున్నారు. రాజ్యసభలో విభజన బిల్లు సందర్భంగా ‘పెద్దమ్మ(సోనియా)నే కాదు.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి’ అని ప్రస్తుత కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ అన్నారని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం ఈ బాధలన్నీ దిగమింగానని వ్యాఖ్యానించారు. గతంలో బడ్జెట్ లో కనీసం ఏపీ పేరును ప్రస్తావించేవారనీ, ఈసారి అది కూడా పట్టించుకోలేదేని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన జీవితంలో తొలిసారి నలుపు రంగు దుస్తులు ధరించి నిరసన తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే తాను సీనియర్ నేత అని గర్వంగా ప్రకటించుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీ 2002లో సీఎం అయ్యారనీ, అమిత్ షా రాజకీయాల్లోకి నిన్న వచ్చారని తెలిపారు. కానీ తాను 1978లోనే ఎమ్మెల్యేను అయ్యానని గుర్తుచేశారు.

ఏపీకి విభజన హామీలను అమలుచేయాలని, ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ, శాసనమండలిలో తీర్మానం చేసింది. అయితే ఈ ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియా సమావేశంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తీర్మానం కాపీలను చింపేశారు. లోపభూయిష్టమైన తీర్మాన కాపీలుగా ఆరోపిస్తూ చింపేశారు. కేంద్రం రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకున్నామని.. కేంద్రం చొరవతోనే అన్ని ప్రాజెక్ట్‌లు ప్రారంభం అవుతాయని.. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు సొంత నిర్మాణాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ విషయంలో సహకారం లభించలేదని, మిగతా అన్నీ ఇచ్చేసామని, లక్షల లక్షల కోట్లు ఇచ్చామని అన్నారు.

veerraju 01022019

ఏపీకి విభజన హామీలు అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసిన ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చింపడంపై మంత్రి లోకేష్ స్పందించారు. ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయమని తీర్మానం చేస్తే.. ఆ కాపీలను బీజేపీ ఎమ్మెల్సీలు చించేస్తారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణను చీల్చినట్లు కాపీలను చించేశారని వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి అక్కర్లేదన్న మంత్రి లోకేష్. అన్యాయం జరిగిన రాష్ట్రంగా బడ్జెట్ లో కనీసం రాష్ట్ర ఊసేలేదని.. అమలుచేయాల్సిన హామీలపై కేంద్రానికి అసలు చిత్తశుద్దే లేదన్నారు.

veerraju 01022019

రాష్ట్రంపై అన్యాయం జరిగిందని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఆ ప్రతులను బీజేపీ నేతలు చింపేస్తారా? బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేదని మరోసారి స్పష్టమైందన్నారు. అంతకు ముందు శాసనమండలి సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. డొక్కా వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లు ఛైర్మన్ పోడియం దగ్గరకు దూసుకురాగా.. పరిస్థితులను చక్కదిద్దేందుకు చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ రంగంలోకి దిగారు. సభ్యులకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్ధుమణిగింది.

Advertisements

Latest Articles

Most Read