దిల్లీలో ఫిబ్రవరి 11న నిర్వహించే ధర్మపోరాట దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి రెండు ప్రత్యేక రైళ్లును విజయవాడ నుంచి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించారు. శుక్రవారం సభ్యులందరూ ఉభయసభలకు నల్లచొక్కాలతో హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. అసెంబ్లీలో పునర్విభజన చట్టం అమలుపై చర్చ జరగనుందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభ సాక్షిగా చర్చ జరుపుతున్నామని అన్నారు. చర్చ అనంతరం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.

nirasana 31012019

ఇదే సమయంలో ప్రత్యేక హోదా సాధన సమితి, ఇతర సంఘాలు బంద్‌కు పిలుపిచ్చాయని, బంద్‌కు వ్యతిరేకం కాబట్టి నిరసనగా ర్యాలీలు చేపట్టాలని నేతలకు సూచించారు. మనం అటు ద్రోహులతో, ఇటు నేరస్థులతో పోరాటం చేస్తున్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. నేరస్థుల మైండ్ గేమ్ విభిన్నంగా ఉంటుందని, ఇందులో జగన్‌ నిష్ణాతుడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భాజపాకు ఆంధ్రప్రదేశ్‌లో బలమేమీ లేదని, ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా 0.5 శాతం ఓట్లు కూడా రావని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. భాజపా గురించి ఆలోచిస్తూ మనం సమయం వృథా చేయడం అనవసరమన్నారు. వైకాపాకు మేలు చేసేందుకే భాజపా రాష్ట్రానికి వస్తోందని ఆయన విమర్శించారు. రెండేళ్లుగా అసెంబ్లీకి రాకుండా ఉన్నవాళ్లు ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరని సీఎం మండిపడ్డారు.

nirasana 31012019

యువనేస్తం భృతిని రూ.2వేలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తెలిపారు. రైతులకు, కౌలు రైతులకు మేలు చేసే విధంగా వినూత్న పథకాలు తెస్తున్నామని చెప్పారు. ప్రజలకు చేసిన పనిని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో పింఛన్ల పండుగ జరపాలని నేతలకు స్పష్టం చేశారు. దీన్ని పేదల పండుగగా నిర్వహించాలని, ఈ 3 రోజులు సంక్షేమ ఉత్సవాలుగా జరపాలని సూచించారు. ఫిబ్రవరి 9వ తేదీన 4 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ వంద శాతం అమలు చెయ్యటానికి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయాలను అందిస్తున్నారు. అయితే ఎన్నికలకు వెళ్తున్న వేళ, దీన్ని రెట్టింపు చేసి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ-పేరుతో పదివేల రూపాయలిస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి పెంచుతామని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.

bruti 31012019

నిరుద్యోగ భృతి రూ. 1000 నుంచి రూ. 2000 వరకు పెంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లోపే నిరుద్యోగ భృతి పెంపును అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014లో హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన చేసి ఆంధ్రులను కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి నెట్టేశారు. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో చంద్రబాబు పాలన ప్రారంభించారు. అయినా ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ ఉపశమనం, పింఛను మొత్తం ఐదురెట్లు పెంచడం, 24 గంటల విద్యుత్‌ సరఫరా..ఇలా అన్నీ నురవేర్చారు.

bruti 31012019

నిరుద్యోగ భృతిని ఈ తరహాలో అమలు చేయడం దేశంలోనే ప్రథమం. కేరళ, పశ్చిమబెంగాల్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో అమలుచేశారని.. కానీ ఆయా రాష్ట్రాల్లో నెలకు రూ.120, రూ.200, రూ.500 చొప్పునే ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చారు కానీ ఆరు నెలల్లోనే పథకాన్ని ఎత్తేశారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ, కుటుంబంలో ఒకరికి అనే పరిమితి లేకుండా ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఏపీయే . ఆయా రాష్ట్రాలతో పాటు అమెరికా, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో అమలుచేస్తున్న నిరుద్యోగ భృతిని కూడా పరిశీలించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని, సమాజానికి ఉపయోగపడేలా, విజ్ఞాన సమూహంలా యువతను తీర్చిదిద్దుతామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజకీయాల్లో తన జూనియర్ అని, అయినా మోదీ అహాన్ని సంతృప్తిపరచడానికి తాను ‘సార్’ అని పిలిచేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. తాను అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలిసిన సందర్భంలో కూడా ఆయనను మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించానని.. ‘సార్’ అని పిలవలేదని చెప్పారు. కానీ మోదీ ప్రధానిగా అయిన తర్వాత ఆయనను ఇప్పటిదాకా దాదాపు 10సార్లు ‘సార్’ అని పిలిచానని చంద్రబాబు తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. మోదీ అహం సంతృప్తి చెందేలా ‘సార్’ అని పిలిచానని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. 2014లో రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని.. పొత్తు పెట్టుకోకుండా ఉంటే 10సీట్లు ఎక్కువే గెలిచేవాళ్లమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

cbn modi 31012019

మరో పక్క అఖిలపక్ష సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సమావేశాలు జరిగే 13 రోజుల పాటు రాష్టవ్య్రాప్తంగా వివిధ రూపాల్లో నిరసన.. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున నల్లబ్యాడ్జీలతో బ్లాక్‌డే పాటించి నిరసన తెలపాలని, 11న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష.. 12న రాష్టప్రతిని కలసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని బుధవారం రాత్రి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ప్రత్యేక హోదా, విభజన హామీల జేఏసీ పేరిట కమిటీ ఏర్పాటయింది. శుక్రవారం ప్రత్యేక హోదా
సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే బంద్‌కు బయట నుంచి మద్దతివ్వాలని నిర్ణయించారు.

cbn modi 31012019

ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే దీన్ని పరిగణిస్తామని ఇది రాజకీయ పోరాటం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసే వ్యక్తులు, పార్టీలకు మద్దతిస్తే రాష్ట్రానికి అన్యాయమే మిగులుతుందని రాష్ట్రానికి న్యాయం జరిగి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నామని వివరించారు. అందరినీ కలుపుకుని ఐక్య పోరాటం చేయటం ద్వారా హక్కులు సాధించుకుందామని ఉద్ఘాటించారు. కొంతమందికి రాజకీయ అజెండా ఉంది.. మేం రాష్ట్ర భవిష్యత్ కోసం ఉద్యమిస్తున్నాం.. చివరి బడ్జెట్‌కు వచ్చింది.. ఇప్పుడేదో చేస్తారని కాదు.. మనకు అన్యాయం చేసిన వాళ్లకు మన సత్తా ఏంటో చూపాలన్నారు. బడ్జెట్‌ను అంతా వ్యతిరేకించాలని దేశం మొత్తంగా నిరసన ధ్వనులు వినిపించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్నారు.. మతాలు, కులాల వారీగా విడదీస్తున్నారు.. విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు.. విభజించి పాలించాలని కుట్ర పన్నుతున్నారు.. రాష్ట్రాల్లో అశాంతిని ప్రేరేపించి అస్థిరత సృష్టించటమే ఆయన అజెండా అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు పరమభక్తులన్న విషయం అందరికీ తెలిసిందే. స్వామివారిపై తన భక్తిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. రాజధాని నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు గురువారం జరిగాయి. సీఎం చంద్రాబు చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి వచ్చారు. ఆయన మా కులదైవం. ఆయన పాదాల దగ్గర పుట్టాను. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు. 2003లో అలిపిరిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో బతికి బయటపడతానని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ప్రమాదం నుంచి నన్ను రక్షించారు. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఆగమశాస్త్రానుసారం భూకర్షణ జరిపి పనులు ప్రారంభించాం. 25 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలనే తలంపుతో ... ఉచితంగా టీటీడీకి భూమి ఇస్తున్నాం. నేను కానీ, పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కానీ.. వెంకటేశ్వరుని సేవలో సాంప్రదాయబద్ధంగా, నియమనిబద్ధలతో ఉన్నాం. అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం కట్టడం... దానికి ప్రత్యక్షసాక్షులు కావడం మనందరి అదృష్టం. ప్రపంచమంతా హిందువులు భక్తిభావంతో కొలిచేదైవం .. మన రాష్ట్రంలో ఉండటం మనందరి పూర్వజన్మ సుకృతం. అమరావతికి వెంకటేశుడి ఆశీస్సులు కావాలి. కృష్ణానదికి ఈ పక్కన వెంకన్న.. ఆ పక్కన దుర్గమ్మ ఉన్నారు. దీని రక్షణగా ఉన్నారు. వీరిద్దరి ఆశీస్సులతో అభివృద్ధిలో దూసుకుపోతాం. పవిత్ర దివ్యక్షేత్రంగా.. శాశ్వతంగా ఈ ఆలయం నిలిచిపోవాలని టీటీడీని కోరాను’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.

ttd 31012019

ఈసందర్భంగా ఈవో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పదిరోజుల పాటు వైదిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో 7 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో రాతి కట్టడంతో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. టెండర్లు పూర్తియ్యాయని, రెండు సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. మిగిలిన 18 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా పెద్ద పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

ttd 31012019

ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో రూ.34.60 కోట్లతో, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించామన్నారు. ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.7.5 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో రూ. 7.90 కోట్లతో, ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాల్లో కలిపి రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. చెన్నైలో రూ. 5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ది, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేది వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస యాగం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అనిల్ కుమార్ వివరించారు.

Advertisements

Latest Articles

Most Read