రాష్ట్రంలో ఫిబ్రవరి 9న మూడు లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించన్నుట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు. గతంలో కంటే మిన్నగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని అధికారులకు సూచించారు. తాడేపల్లిలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో 13 జిల్లాల ప్రాజెక్టు డైరక్టర్లతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు విడుతల గృహ ప్రవేశాలను చాలా బాగా నిర్వహించారన్నారు. ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రికి ఎక్కువ సంతృప్తి ఇచ్చే పథకం పేదలకు సొంత ఇంటి కల అని చాలా సందర్భాల్లో చెప్పడాన్ని గుర్తు చేశారు. ఈ సారి వేడుకలను అంకితం పేరుతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి కారణంగా గతంలో స్కోచ్ అవార్డులను పొందిందని, ఈ సారి కూడా ప్రతిపాదనలను పంపాలన్నారు.

housing 01022019

గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, అనంతపురం జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 33 మంది ఖైదీలకు విముక్తి కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే 5 నుంచి 7 సంవత్సరాల జైలుశిక్ష అనుభవించిన వారు 65 ఏళ్ల పైబడి వ్యాధులతో బాధపడే వారిని ప్రత్యేక పరిస్థితుల్లో విడుదల చేయాలని నిశ్చయించింది. ఈ నెల 9న నెల్లూరులో పెద్దఎత్తున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మంత్రివర్గం సూత్రప్రాయంగా అంగీకరించింది.

housing 01022019

అర్బన్‌లో లక్ష, రూరల్ పరిధిలో 3లక్షల ఇళ్లకు ఒకే రోజు సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తారు. తరువాత ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులు హాజరవుతారు. గత నెలలో జరిగిన జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు జీవోలు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిబంధనలు రూపొందించాలన్నారు. బీసీలలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో పనిచేయాలన్నారు. వివిధ బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చే అంశం మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వివిధరకాల పింఛన్లను పెంచుతూ గత నెల 25 వ తేదీన విడుదల చేసిన జీవోలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. రాష్టవ్య్రాప్తంగా కొత్తగా 3.55 లక్షల మందికి పింఛన్లను పెంచుతూ గత నెల 28వ తేదీన విడుదలైన జీవోను సమావేశంలో ఆమోదించారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పింఛన్లను పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీలైతే ప్రతి ఇంటికీ వెళ్లి పెన్షన్ అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తూ వారి మధ్యలోనే నివసిస్తూ వారు తినేదే తింటూ తనను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంచిన తండ్రి సర్వేశ్వరరావు మరణవార్తతో షాక్‌కు గురైన తనకు కళ్లవెంట నీరు కూడా రాలేదని, అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తమను ఓదార్చిన తీరు చూసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యానని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఎంతో భావోద్వేగంతో అన్నారు. శాసనసభలో గురువారం సర్వేశ్వరరావు సంతాప తీర్మానంపై సీఎంతోపాటు అనేక మంది సభ్యులు మాట్లాడిన తర్వాత చివరగా శ్రావణ్‌కుమార్ తన తండ్రి గురించి ఇంత గొప్పగా చెబుతాన్నారంటే ఆయన ఎంతటి పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు తెలుస్తోందంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

kidari 01022019

తన తండ్రి హత్య కంటే ఓ మంచి వ్యక్తి, తెలివైన యువ నేత హత్యకు గురికావటంతో ఒక గిరిజనుడిగా తాను బాధపడుతున్నానన్నారు. అసలు నక్సల్స్ ఏం సాధించారు.. దీనివల్ల గిరిజన ప్రాంతాల అభివృద్ధి 30ఏళ్ల వెనక్కి పోయిందనేది గుర్తించగలరన్నారు. వారికి పోయింది రెండు బుల్లెట్లేనన్నారు. అయితే పోయింది రెండు ప్రాణాలు, ఇద్దరు ఆడపడుచులు తమ భర్తలను కోల్పోయారు, పిల్లలు తమ తండ్రులను కోల్పోయారు, వారి బాధను ఎవరు తీర్చగలరన్నారు. నక్సల్స్ కనీసం ముందస్తు హెచ్చరిక చేసి ఉంటే తన తండ్రి తన వైఖరిలో ఏమైనా లోపముంటే ఆలోచించి మార్చుకుని ఉండేవారు కదా అని అన్నారు.

kidari 01022019

గిరిజన నేతలను మట్టుపెట్టుకుంటూ పోతే గిరిజనుల బతకుల్లో ఎలా దీపాలు వెలుగుతాయన్నారు. శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ బడాబాబులు, పెత్తందారులు, బూర్జువాలకు తాము వ్యతిరేకమనే నక్సల్స్ అతి సామాన్య గిరిజనులను ఎలా హత్య చేశారని ప్రశ్నించారు. అసలు వారిని ఎందుకు చంపారో చెప్పలేదంటే కేవలం తమ ఉనికి లేదా సంచలనం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. చివరగా సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కొత్త రాష్ట్రం వస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి కేసులతో వేధించుకుని తింటున్నారని మండిపడ్డారు. దక్షిణాది నుంచి ఒక్క కేంద్ర మంత్రి అయినా మోదీ కేబినెట్ లో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. సౌత్ ఇండియాలో బీజేపీకి ఒక్క లీడర్ లేరని, ఉన్న ఒక్క వెంకయ్యనాయుడిని కేబినెట్ నుంచి పంపేశారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుంచి పక్కన పెట్టారన్నారు. దక్షిణ భారత నేతలకు ఏం గౌరవం ఇచ్చారో బీజేపీ చెప్పాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

venkayya 01022019

చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ..‘వెంకయ్య నాయుడు దక్షిణాది నుంచి ఒకే ఒక కేంద్ర మంత్రిగా ఉండేవాడు. ఆయన అన్ని రాష్ట్రాలకు తిరిగేవాడు. ఆయన్ను కూడా పదవి నుంచి తీసేసి ఉప రాష్ట్రపతిని చేసేశారు. ఎంత అసూయ అధ్యక్షా.. పాపం వెంకయ్య నాయుడు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చారో, లేక పనిష్మెంట్ ఇచ్చారో ఆ దేవుడికే తెలియాలి. దక్షిణాది నుంచి ఒక్కరైనా కేంద్ర మంత్రి ఉన్నారా? దత్తాత్రేయ ఉంటే ఆయన్ను తీసేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాది వ్యక్తికి ప్రధాని పదవి పోతే, దక్షిణాదికి రాష్ట్రపతి పదవి ఇచ్చి బ్యాలెన్స్ చేసేవారు’ అని చెప్పారు.

venkayya 01022019

చంద్రబాబు ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న వేళ, బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుపడటంతో తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. "గుజరాత్ కు వెళ్లి చూడవయ్యా... కంపేర్ చెయ్యి... కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసిది పోయి, సిగ్గు వదిలిపెట్టి, మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ కూర్చోవాలా? రోషం లేదా మాకు" అన్నారు. ఈ సమయంలో 'అబ్జెక్షన్' అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనగా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. "ఏం అబ్జెక్షన్ నీది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యూ ఆర్ అన్ ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. తమాషాగా ఉందా? నీ అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? అబ్జెక్షనా..? న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టను. తిరగనివ్వను మిమ్మల్ని. వినేవాళ్లుంటే చెవుల్లో పూలు పెడతారండీ వీళ్లు" అని అన్నారు.

కవ్వింపో.... కుళ్ళుబోతు బుద్దో... అభద్రతో... ఆంధ్రుడు అంటే చులకనో.... ఏమైనా గాని అడుగడుగునా నయవంచన చేసారు... అడ్డంకులు సృష్టించారు... రైల్వేజోన్ లేదు... ఆర్థిక లోటు పూడ్చలేదు.. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు లేవు...హోదా లేదు... పోనీ ప్యాకేజీ అనుకుంటే చట్టబద్దం చేయలేదు... రాజధాని నిర్మాణ హామీ ఏమైందో తెలియదు... కనకదుర్గ ఫ్లై ఓవర్ ఊసులేదు... విభజనహామీలు... తిరుపతి హామీలు అన్నీ హుళక్కే! ఈ రోజు ఇచ్చిన బడ్జెట్ లో అనుకున్నదే అయ్యింది... కాంగ్రెస్ డైరెక్ట్ గా గొంతు కొస్తే, బీజేపీ తడి గుడ్డతో నొప్పి తెలియకుండా గొంతు కోస్తుంది... చివరి బడ్జెట్ లో అయినా, ఎన్నికలు వస్తాయి అంటున్నారు కాబట్టి, మన కొత్త రాష్ట్రము, ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి, సహాయం చేస్తారేమో అని ప్రజలు అందరు ఆశక్తిగా ఎదురు చూసారు...

jagan 01022019 2

ఎప్పటిలాగే, మన మీద ఢిల్లీ పాలకుల చిన్న చూపు కొనసాగింది... విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ వచ్చేసినట్టే అని రాష్ట్ర బీజేపీ నేతలు ఊదరగొట్టారు... చివరకు చిప్ప ఇచ్చారు... అమరావతి రాజధాని నగర నిర్మాణానికి సొమ్ముల ప్రస్తావన లేదు ? లోటు బడ్జెట్ లోటు లెక్క లేదు ? శంకుస్థాపన చేసిన విద్యాసంస్థలకు నిధుల లేవు ? పోలవరం పై ఇవ్వాల్సిన నిధుల ప్రస్తావన లేదు.. కడపలో స్టీల్ ప్లాంట్ , పోర్ట్, ప్యాకేజీకి చట్టబద్ధత లాంటి ఊసు లేదు... చివరకు ఒక్క భారీ ప్రాజెక్ట్ పై కూడా నవ్యాంధ్ర పై మోడీ కరుణ లేదు... మొత్తంగా నవ్యాంధ్ర పై కేంద్రం చిన్న చూపు కొనసాగిస్తూనే ఉంది... ఎప్పటి మాదిరిగానే కఠినంగా ఉంది.

jagan 01022019 3

ఈ బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రం సంతృప్తికర స్థాయిలో కాదు, అసలు ప్రస్తావనే లేదు... మన రాష్ట్రం అసలు దేశంలో ఉందో లేదో కూడా కేంద్రమే చెప్పాలి... ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మన రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా, మీరు చెయ్యల్సింది మీరు చెయ్యండి... ప్రతి ఆంధ్రుడు మీ వెనుక ఉంటాం... ఆంధ్రా వాడి దెబ్బ మాములుగా ఉండదు... కొట్టినట్టు కూడా తెలియదు... చూసుకుంటే, చివరకు ఏమి మిగలదు.... 125 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ బ్రతుకు, మా రాష్ట్రంలో ఎలా ఉందో చూసి, నేర్చుకోవాల్సింది... ఢిల్లీ పెద్దలారా, గెట్ రెడీ... ప్రధాని మోడీ, నిలదీయని జగన్, పవన్ లు అయిదున్నర కోట్ల ఆంధ్రులకు క్షమాపణ చెప్పాలి. ఏపీకి కేంద్రం చేస్తున్నఅన్యాయంపై వైకాపా, బీజేపీ, జనసేన వంటి ప్రతిపక్ష నేతలు నోరు మెదపక పోవడం ఆంధ్రులను వంచించడమే...

Advertisements

Latest Articles

Most Read