కియ కార్ల పరిశ్రమ అధ్యక్షుడు, సీఈవో డబ్ల్యు.హెచ్‌.పార్క్‌ ఇక దక్షిణకొరియాలో ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కియ ప్లాంటు ట్రయల్‌రన్‌ కార్యక్రమంలో అనూహ్య ప్రకటన చేశారు. ‘‘దక్షిణకొరియాకు చెందిన మరిన్ని కంపెనీలు, పెట్టుబడుల్ని ఏపీకి తెచ్చేందుకు సహకారం అందిస్తానని పార్క్‌ నాకు మాటిచ్చారు. కొరియాలో ఏపీకి అతనే బ్రాండ్‌ అంబాసిడర్‌’’ అని చెప్పాను. అయితే ఆయన తన మాటను పాక్షికంగా నిలబెట్టుకున్నారని, కొన్ని పరిశ్రమలను తీసుకొచ్చినా, ఇంకా చాలా రావాల్సి ఉన్నదని అన్నారు. ‘‘అందుకే ఆయన్ను అడుగుతున్నా. ఆయనకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే అఽధికారికంగా అంబాసిడర్‌గా ప్రకటిస్తాను’’ అని సీఎం అనగా, పార్క్‌ అంగీకరించారు. ఏపీని రెండో ఇల్లుగా చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రపంచ పెట్టుబడిదారులకు పార్క్‌ పిలుపునిచ్చారు.

kia 30012019

‘పెట్టుబడులకు దక్షిణ కొరియా తొలి ఇల్లు. ఏపీ రెండో ఇల్లు. ఇక్కడకు వచ్చే కొరియా పెట్టుబడులకు నేను హామీ ఇస్తాను’’ అని పేర్కొన్నారు. ఏపీలో ప్రకృతి సేద్యం చేస్తున్నామని, దీంతో పర్యావరణం బాగుంటుందని సీఎం ఆయనకు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 0.3శాతం మంది ప్రకృతి సేద్యం చేస్తుండగా, భారత్‌లో ఇది 0.6శాతంగా ఉందని, రాష్ట్రంలో మాత్రం ఎనిమిది శాతం మేర సేద్యం చేస్తున్నారని తెలిపారు. ‘‘స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన గాలి, నీరు అందిస్తాం. విద్యుత్‌, గ్యాస్‌ దేనికీ కొదవలేదు. ఏది అడిగితే అది కల్పిస్తాం. దక్షిణకొరియా కంటే మెరుగైన జీవన పరిస్థితులను ఇక్కడ కల్పిస్తాం’’ అని సీఎం భరోసా ఇచ్చారు.

kia 30012019

కియా అధ్యక్షుడు, సీఈవో పార్క్‌ మాట్లాడుతూ.. ఇక్కడ 536 ఎకరాల్లో ఏర్పాటుచేసిన ప్లాంట్‌ ద్వారా ఏటా మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నామన్నారు. ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని తెలిపారు. భారత్‌లో వాహనరంగంలో విప్లవానికి ఈ పరిశ్రమ దోహదపడుతుందని పేర్కొన్నారు. కియా ఎండీ షిమ్‌ మాట్లాడుతూ.. సాంకేతికంగా అత్యాధునికమైనది, పర్యావరణపరంగా అనుకూలమైన ప్లాంట్‌ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. భారతీయులను ఆకట్టుకునేలా మోడళ్లు తీసుకురానున్నామని వివరించారు.

ఏపి పై కేంద్రం బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటి దాకా రాష్ట్రపతి పాలన పెడతాం అని చెప్పిన వారు, ఇప్పుడు మీ మీద నిఘా పెట్టాం అంటూ, ఏపి ప్రజలను ఈ ఢిల్లీ బానిసలు హెచ్చరిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు క్యాంపు కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన 900కోట్ల కరువు సాయం ఈ రాష్ట్ర ప్రభుత్వ దొంగల బారిన పడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఈ నిధులను పక్కదారి పట్టనివ్వకుండా ఏపీపై కేంద్రం గట్టి నిఘా ఏర్పాటుచేసిందన్నారు. మాణిక్యాలరావు లాంటి ఎమ్మెల్యే ఉండడం మీ అదృష్టమని.. దోచుకుని తినే ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్రంలో వున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

gvl 30012019

మిలటరీ మాధవరం కోసం మాణిక్యాలరావు 11కోట్ల నిధులను తీసుకు రావడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కియా మోటార్స్‌కూ, ఏపీ సీఎం చంద్రబాబుకూ సంబంధం లేదని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే కియా మోటార్స్ ఏపీకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లు జులాయిగా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దుబారా చేస్తున్న సొమ్ము ప్రజలదని.. సోకులు చేసుకోవడానికి కాదని.. కేంద్రం ప్రకటించిన రూ.900 కోట్ల నిధులను కరవు ప్రాంతాలకే వాడాలని అన్నారు. ఈ ఖర్చులపై నిఘా ఉంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మారుస్తోందని ఆరోపించారు.

gvl 30012019

అఖిల పక్ష సమావేశంలో చంద్రబాబు ఏకాకిలా మిగిలారని.. రెండు పార్టీలను కూడా కలుపుకోలేని చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం పోరాడుతారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోకెళ్లా ఏపీకే ప్రధాని మోదీ అధిక నిధులు ఇచ్చారని జీవీఎల్ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు, తనయుడు లోకేష్ లు విమానాలు, స్టార్ హోటళ్లలో విలాసవంతంగా గడుపుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నారేళ్లు జులాయిగా తిరిగి ఇప్పుడు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హస్యాస్పదం. టీడీపీలో చేరేవారంతా ప్యాకేజీల కోసమే... అని ఎంపీ జీవీఎల్ ఘాటుగా విమర్శించారు.

ఈ రోజు అసెంబ్లీలో అరుదైన సన్నివేసం కనిపించింది. కేంద్రానికి సన్నిహితుడుగా ఉన్న గవర్నర్ చేతే, అదే కేంద్రాన్ని తిట్టించారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఏపి ప్రభుత్వం ఇచ్చిన సందేశం చదువుతూ, కేంద్రం చేసిన మోసం, దగా, గవర్నర్ నోటి వెంటే వచ్చేలా చేసారు చంద్రబాబు. రాష్ట్రం విభజన నష్టాల నుంచి కోలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విభజనహామీలతో పాటు ప్రత్యేకహోదా అమలుకాలేదని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు

governor 30012019

పొరుగు రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఏపీ చేరే వరకూ కేంద్రం చేయూత అవసరమని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం ఊహించని పరిణామమని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. కేంద్రం సహాయ నిరాకరణకు పాల్పడుతూ తోడ్పాటు అందించడం లేదని.. సహకరించకపోయినా ఆదర్శంగా నిలవడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని చెప్పారు. సగటున రాష్ట్ర వృద్ధిరేటు 10.66గా ఉందన్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద 2014-15 నుంచి 2018-19 వరకు రూ.24,618.39 కోట్లు పంపిణీ చేశామని గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు.

governor 30012019

విభజన హామీలపై కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందని, ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదన్నారు. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మౌలిక, సేవా రంగాల్లో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 10 అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేశామని, పారదర్శక పాలన అందిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఈ నాలుగున్నరేళ్లలో రూ.64,333 కోట్లు ఖర్చు చేసిందని.. దీంతో 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు.

విభజన హామీల సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, బీఎస్పీ, ఎస్పీ, ప్రజాశాంతి పార్టీ, నవతరం పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, వివిధ ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోలు, గెజిటెడ్‌ అధికారులు, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. వైకాపా, కాంగ్రెస్‌, భాజపా, జనసేన, వామపక్షాలు హాజరుకాలేదు. ఏపీ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. 11న ఢిల్లీలో ఆందోళన చేస్తామని, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షం వెళుతుందని ఈ మేరకు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చూసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

akhila paksahm 30012019

‘‘నేను చేయాల్సినంత చేశాను. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి ఇప్పటికే రెండు సార్లు అఖిలపక్ష భేటీ నిర్వహించాం. హోదా సహా చట్టంలో అంశాల అమలుకు విశ్వప్రయత్నాలు చేశాం. లోటు బడ్జెట్‌లో భర్తీ చేయాల్సిన మొత్తం కూడా ఇంత వరకు సరిగా ఇవ్వలేదు. విభజన జరిగినప్పుడు రాజకీయ పక్షాలు, వివిధ రకాల నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాలన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశాయి. విశాఖ రైల్వే జోన్‌ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒడిశా అభ్యంతరం లేదని చెప్పినా రైల్వేజోన్‌ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. లాభాలొచ్చే పోర్టులైతేనే కావాలని కేంద్రం అంటోంది. మహారాష్ట్రకు భారీగా కరవు నిధులిచ్చి మనల్ని చిన్న చూపు చూశారు’’ అని సీఎం వివరించారు.

akhila paksahm 30012019

‘‘హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారు. నన్నుదొంగదెబ్బ తీసేందుకే కన్నాతో కేసు వేయించారు. దొడ్డి దారిలో వస్తున్నారు. అందుకే సీబీఐకి అనుమతి ఇవ్వలేదు. ఈడీని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. గజ తుపానులో కేంద్రం నిర్లక్ష్యాన్ని మధురై ప్రజలు మరచిపోలేదు. మోదీ పర్యటనలో నల్ల జెండాలు, బెలూన్లతో నిరసన తెలిపారు. ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పకుండా కేసులు పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులన్నీ ఎత్తివేస్తాం. రేపు జరిగే కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకుంటాం. కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకుని కేసులు ఎత్తివేస్తాం. ఈవిషయమై ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తాం. ’’ అని చంద్రబాబు వివరించారు.

Advertisements

Latest Articles

Most Read