ఈ రోజు చూస్తున్నాం... కియా మేడ్ ఇన్ ఆంధ్రా అంటూ, కొంత మంది గుజరాతీ బానిసలు, ఎలా చించేసుకుంటున్నారో... మా మోడీ పెట్టిన భిక్ష మీకు కియా అంటూ హడావిడి చేస్తున్నారు. వీళ్ళు కియాని ఎలా గుజరాత్ తీసుకోపోటానికి పన్నాగాలు పన్నారో అందరికీ తెలుసు. ఇక అతి పెద్ద ప్లాంట్ పెడదాం అనుకున్న ఫాక్స్ కాన్ ని, మహారాష్ట్ర తీసుకుపోయారు.. ఇవన్నీ మర్చిపోక ముందే, ఇప్పుడు మరో కంపెనీ ఎత్తేయటానికి మోడీ ప్లాన్ చేసారు. ఇదే విషయం లోకేష్ దావోస్ పర్యటనలో బయట పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట.

lokesh 29012019

రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ "మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది" అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ.. అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.

lokesh 29012019

అయితే ప్రధాని మోదీ మాత్రం వత్తిడిచేయడం మానలేదట. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను పదేపదే కోరారట. ఇదే విషయాన్ని లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట. ప్రధాని మోడీ గారికి మనం అంటే ఎందుకో మరి ఇంత కక్ష...

 

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి గర్వకారణమైన అద్భుత ఘట్టం ఈ రోజు మొదలైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్‌ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు మంగళవారం దర్జాగా.. దర్పంగా బయటకు వచ్చింది. మేడిన్‌ ఏపీ అంటూ రాష్ట్ర కీర్తి పతాకను సగర్వంగా రెపరెపలాడించింది. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా, రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల తయారీ కేంద్రంగా ఖ్యాతిగడించింది. అనంతపురం జిల్లా ఎర్రమంచి వద్ద కియా తొలికారును చంద్రబాబు ప్రారంభించారు. ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ నుంచి తొలి కారు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో కియా మోటార్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టామని సీఎం చెప్పారు. 2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్‌ ప్రొడక్షన్‌ స్థాయికి చేరుకుందని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ఎక్కడైనా నెగ్గుకురాగలరని అన్నారు.

ram 29012019 2

కియా పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హీరో మోటార్స్‌, అపోలో టైర్, అశోక్‌ లేలాండ్‌, భారత్‌ ఫోర్డ్‌ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ వంటి విధానాలు తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. కియా మోటార్స్‌కు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అవుతుందని.. ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సీఎం సూచించారు.

ram 29012019 3

ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ కి, సినీ హీరో రాం, స్పందించారు. చంద్రబాబు పెట్టిన ట్వీట్ ఇది... "Just a few years ago nobody would’ve believed that so many industries would come to @anantapurgoap. Due to State govt’s relentless efforts to ensure water supply in this area, we could attract major investments. Now Rayalaseema has become the industrial hub of AP. #KiaMadeInAP"... దానికి సినీ హీరో రాం స్పందిస్తూ, "This is so true..a Massive step forward for our state! Many more to come! #KiaMadeInAP". సినీ హీరో రాం స్వస్థలం విజయవాడ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇది సినిమా హీరోల కోసం కాదు, కులం కోసం కాదు... జీవితంలో ఎంతో మందిని దాటుకుని, అన్నీ చూసి, జీవిత చరమాంకంలో, స్వచ్చమైన మనసుతో ఇచ్చే దీవెనలు అవి... ఆమె పేరు , ముత్యాలమ్మ.. చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టం చూసి, తన వంతుగా 50 వేల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది. మా అనంతపురం జిల్లాకు కృష్ణా నీళ్ళు ఇచ్చావ్, అమరావతి కడుతున్నావ్, మాకు పెన్షన్ లు ఇస్తున్నావ్, నాలాంటి ఎంతో మందిని ఆదుకుంటున్నావ్.. అందుకే నువ్వు నాకు ఇవ్వడం కాదు...నేనే నీకు రూ 50వేలు ఇస్తున్నా అంటూ ఆ అవ్వ, చంద్రబాబుకి 50 వేల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రం పై కుట్రలు, అమరావతిని హేళన చేస్తున్న మనుషులని గుర్తు చేసుకుని, ఆ అవ్వ స్పూర్తి మన అందరికీ మార్గదర్శం కావలి అంటూ, చంద్రబాబు ఆ అవ్వ కాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున పాదాభివందనం చేసారు.

cbn 29012019 1

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాననిఅన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటని తెలిపారు. అనంతపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా చేస్తానని ప్రకటించారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామన్నారు. సుపరిపాలనకు నాంది పలికినట్లు తెలిపారు. అలాగే 13 కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని వివరించారు. పోలవరం ద్వారా నీళ్లు కృష్ణానదికి వస్తాయన్నారు. ప్రతి సోమవారం నీరు- ప్రగతిపై సమీక్ష చేస్తున్నామని, నీరు- ప్రగతి వల్ల అనంతపురం జిల్లా లాభపడిందన్నారు. దేశంలోనే రెండో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం అని తెలిపారు. హంద్రీనీవాకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పుంగనూరు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటి విడుదల చేశామన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ హిందూపురం నుంచే పోటీచేసేవారని గుర్తుచేశారు.

cbn 29012019 1

వైసీపీ నేతలు చేయాల్సింది జలదీక్ష కాదని, కృష్ణా జలాల్లో స్నానాలు చేసి పాపాలు కడుక్కోవాలని సూచించారు. కియ కంపెనీతో 16 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రపంచానికే అనంతపురం పండ్లు పంపించే పరిస్థితి వస్తుందని వివరించారు. భవిష్యత్‌లో అనంతపురం నుంచి వలసలు ఉండవన్నారు. బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యత ఇచ్చామని, యువత వ్యవసాయం వైపు మొగ్గుచూపుతుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం ఎక్కడా జరగలేదన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసినట్లు చెప్పారు. పోలవరం పనులకు గిన్నిస్ రికార్డ్ లభించిందని గుర్తుచేశారు. ఎన్ని అవార్డులు వచ్చినా మోదీకి కనికరం లేదని ధ్వజమెత్తారు. 2019లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడా లేదని, భవిష్యత్‌లో కూడా రాదన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ద్వారా సీమకు నీళ్లిచ్చామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో అడుగుపడింది. అందరూ కియా ఫస్ట్ కార్ మీద ఫోకస్ చేసిన వేళ, రాష్ట్రంలో మరో టాప్ కంపెనీ వైజాగ్ లో ఉత్పత్తి ప్రారంభించింది... ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్, మోటార్స్ రంగంలో పలు జిల్లాలలో ఉత్పత్తి ప్రారంభంకాగా ఇప్పుడు విశాఖలో మరో సంస్థ నుండి ఉత్పత్తి ప్రారంభమైంది. పెయింట్ల తయారీలో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏషియన్ పెయింట్స్ తన విశాఖపట్నం ప్లాంట్ లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 25కి పైగా ఉన్న ఏషియన్ ప్లాంట్లలో ఇది అత్యాధునికమైన అతిపెద్ద ప్లాంట్ కావడం విశేషం కాగా మార్చి 10, 2015లో కుదిరిన ఎంఓయు ప్రకారం ఏషియన్ పెయింట్స్ 1,750 కోట్ల వ్యయంతో ఉత్పత్తి యూనిట్ ను ఏర్పాటు చేసింది.

paintas 29012019

పూడి గ్రామంలో 110 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఏషియన్ పెయింట్స్ ప్లాంట్ ద్వారా ఇప్పటికే 700 మందికి ఉద్యోగాలు రాగా ఏడాదికి 5 లక్షల కిలోలీటర్ల పెయింట్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం కాగా దశలవారీగా ఏర్పాటయ్యే ప్లాంట్ లో ఇప్పుడు ఏడాదికి 3 లక్షల కిలోలీటర్లు ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అదనంగా 11 లక్షల కిలో లీటర్ల కలర్స్‌ను ఉత్పత్తి చేయడానికి రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. వీటిలో రూ.1,785 కోట్లతో ఏడాదికి 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను వైజాగ్‌లోనూ, రూ.2,300 కోట్లతో 6 లక్షల కెపాసిటీ కలిగిన యూనిట్‌ను మైసూరులో నెలకొల్పారు.

paintas 29012019

అయితే ముందుగా విశాఖ ప్లాంట్ రెడీ అయ్యింది. అయితే తొలి దశలో ఈ రెండు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం మూడు లక్షల కిలో లీటర్లు మాత్రమే. కరెన్సీ మారకం సమస్యలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ మార్కెట్లు పెద్దగా కలిసి రాలేదని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఈ రెండు సమస్యలతో ఈజిప్టు, ఇథోపియా, శ్రీలంక దేశాల్లో సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపింది. పెద్దగా అమ్మకాలు లేకపోవడంతో కరేబియన్‌ దేశాల మార్కెట్‌ నుంచి కంపెనీ పూర్తిగా తప్పుకుంది. దేశీయ కలర్స్ రంగంలో దూసుకుపోతున్న ఈ సంస్థ..16 దేశాల్లో 25 ప్లాంట్లను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్ లో ఉండే కొత్త స్నేహితులు ఇద్దరూ, అమరావతిని నాశనం చెయ్యటానికి, ఏపిలో అడుగు పెడుతున్నారు. ఇంతకీ ఎవరూ వారు అనుకుంటున్నారా ? సింపుల్ ఏపి ద్రోహులు, అమరావతి పై విషం చిమ్మే వారు.. వల్లే కేసీఆర్, జగన్. కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చేనెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ పొలిటికల్ స్వామీజీ బ్రోకరేజ్ చేస్తేనే, జగన్, కేసీఆర్ ఒక్కటయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తా..

kcr 2912019

కేసీఆర్ ఏపి కి వెల్తున్న వేళ‌ వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ గుంటూరులో గృహ‌ప్ర‌వేశం చేస్తున్నారు. అదే 14న జగన్ తన గృహ ప్రవేశం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నుంచి, కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తారని వార్తలు వచ్చాయి. కేటీఆర్ కూడా కేసీఆర్ అమరావతి వెళ్లి జగన్ తో భేటీ అవుతారు అన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏపి పర్యటన 14న ఉండటం, అదే రోజు జగన్ గృహ ప్రవేశం చెయ్యటంతో, కేసీఆర్ ఇక్కడకు కూడా వస్తారని సమాచారం. లోట‌స్ పౌండ్ లో జ‌గ‌న్ ని క‌లిసిన కేసీఆర్ ఏపికి వెళ్లి జ‌గ‌న్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే కేసీఆర్ ఎప్పుడు ఏపికి వెల్తార‌న్న దానిపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటి లేక‌పోయినా త్వ‌ర‌లో విశాఖ‌కు కేసీఆర్ వెల్తుండ‌టంతో జ‌గ‌న్ ను క‌లుస్తారనే చర్చ జరుగుతుంది.

kcr 2912019

రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ తో చేతులు కలిపి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడంటూ జగన్ పై, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశాయి అధికార, విపక్ష పార్టీలు. అంతేనా… అధికార టిడిపి ఒకడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి పరుష పదజాలంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ అక్షరం పొల్లు పోకుండా ఏపీ ప్రజల ముందు ఆవిష్కరించి, విభజన సెంటిమెంట్ ని రెచ్చగొట్టింది. దాంతో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏపీలో పర్యటిస్తే అదెక్కడ తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుందో అని వైసీపీ నేతలు హడలి పోతున్నారట.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read