ఇది సినిమా హీరోల కోసం కాదు, కులం కోసం కాదు... జీవితంలో ఎంతో మందిని దాటుకుని, అన్నీ చూసి, జీవిత చరమాంకంలో, స్వచ్చమైన మనసుతో ఇచ్చే దీవెనలు అవి... ఆమె పేరు , ముత్యాలమ్మ.. చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టం చూసి, తన వంతుగా 50 వేల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చింది. మా అనంతపురం జిల్లాకు కృష్ణా నీళ్ళు ఇచ్చావ్, అమరావతి కడుతున్నావ్, మాకు పెన్షన్ లు ఇస్తున్నావ్, నాలాంటి ఎంతో మందిని ఆదుకుంటున్నావ్.. అందుకే నువ్వు నాకు ఇవ్వడం కాదు...నేనే నీకు రూ 50వేలు ఇస్తున్నా అంటూ ఆ అవ్వ, చంద్రబాబుకి 50 వేల రూపాయలు ఇచ్చింది. రాష్ట్రం పై కుట్రలు, అమరావతిని హేళన చేస్తున్న మనుషులని గుర్తు చేసుకుని, ఆ అవ్వ స్పూర్తి మన అందరికీ మార్గదర్శం కావలి అంటూ, చంద్రబాబు ఆ అవ్వ కాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున పాదాభివందనం చేసారు.

cbn 29012019 1

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాననిఅన్నారు. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటని తెలిపారు. అనంతపురాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా చేస్తానని ప్రకటించారు. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామన్నారు. సుపరిపాలనకు నాంది పలికినట్లు తెలిపారు. అలాగే 13 కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని వివరించారు. పోలవరం ద్వారా నీళ్లు కృష్ణానదికి వస్తాయన్నారు. ప్రతి సోమవారం నీరు- ప్రగతిపై సమీక్ష చేస్తున్నామని, నీరు- ప్రగతి వల్ల అనంతపురం జిల్లా లాభపడిందన్నారు. దేశంలోనే రెండో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం అని తెలిపారు. హంద్రీనీవాకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. పుంగనూరు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటి విడుదల చేశామన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ హిందూపురం నుంచే పోటీచేసేవారని గుర్తుచేశారు.

cbn 29012019 1

వైసీపీ నేతలు చేయాల్సింది జలదీక్ష కాదని, కృష్ణా జలాల్లో స్నానాలు చేసి పాపాలు కడుక్కోవాలని సూచించారు. కియ కంపెనీతో 16 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రపంచానికే అనంతపురం పండ్లు పంపించే పరిస్థితి వస్తుందని వివరించారు. భవిష్యత్‌లో అనంతపురం నుంచి వలసలు ఉండవన్నారు. బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యత ఇచ్చామని, యువత వ్యవసాయం వైపు మొగ్గుచూపుతుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం ఎక్కడా జరగలేదన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసినట్లు చెప్పారు. పోలవరం పనులకు గిన్నిస్ రికార్డ్ లభించిందని గుర్తుచేశారు. ఎన్ని అవార్డులు వచ్చినా మోదీకి కనికరం లేదని ధ్వజమెత్తారు. 2019లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడా లేదని, భవిష్యత్‌లో కూడా రాదన్నారు. హంద్రీనీవా, గాలేరు నగరి ద్వారా సీమకు నీళ్లిచ్చామని తెలిపారు.

హైదరాబాద్ లో ఉండే కొత్త స్నేహితులు ఇద్దరూ, అమరావతిని నాశనం చెయ్యటానికి, ఏపిలో అడుగు పెడుతున్నారు. ఇంతకీ ఎవరూ వారు అనుకుంటున్నారా ? సింపుల్ ఏపి ద్రోహులు, అమరావతి పై విషం చిమ్మే వారు.. వల్లే కేసీఆర్, జగన్. కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చేనెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ పొలిటికల్ స్వామీజీ బ్రోకరేజ్ చేస్తేనే, జగన్, కేసీఆర్ ఒక్కటయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తా..

kcr 2912019

కేసీఆర్ ఏపి కి వెల్తున్న వేళ‌ వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్ గుంటూరులో గృహ‌ప్ర‌వేశం చేస్తున్నారు. అదే 14న జగన్ తన గృహ ప్రవేశం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నుంచి, కేసీఆర్ ఈ కార్యక్రమానికి వస్తారని వార్తలు వచ్చాయి. కేటీఆర్ కూడా కేసీఆర్ అమరావతి వెళ్లి జగన్ తో భేటీ అవుతారు అన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏపి పర్యటన 14న ఉండటం, అదే రోజు జగన్ గృహ ప్రవేశం చెయ్యటంతో, కేసీఆర్ ఇక్కడకు కూడా వస్తారని సమాచారం. లోట‌స్ పౌండ్ లో జ‌గ‌న్ ని క‌లిసిన కేసీఆర్ ఏపికి వెళ్లి జ‌గ‌న్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే కేసీఆర్ ఎప్పుడు ఏపికి వెల్తార‌న్న దానిపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటి లేక‌పోయినా త్వ‌ర‌లో విశాఖ‌కు కేసీఆర్ వెల్తుండ‌టంతో జ‌గ‌న్ ను క‌లుస్తారనే చర్చ జరుగుతుంది.

kcr 2912019

రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్ తో చేతులు కలిపి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టాడంటూ జగన్ పై, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశాయి అధికార, విపక్ష పార్టీలు. అంతేనా… అధికార టిడిపి ఒకడుగు ముందుకేసి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి పరుష పదజాలంతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ అక్షరం పొల్లు పోకుండా ఏపీ ప్రజల ముందు ఆవిష్కరించి, విభజన సెంటిమెంట్ ని రెచ్చగొట్టింది. దాంతో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందనే చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఏపీలో పర్యటిస్తే అదెక్కడ తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుందో అని వైసీపీ నేతలు హడలి పోతున్నారట.

మోదీ వల్లే కియా వచ్చిందని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం టీడీపీ ముఖ్యనేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగానన్నారు. మొదట గుజరాత్, తమిళనాడును కియా కోసం సిఫారసు చేసిందని, అయితే అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ, వైసిపి కుమ్మక్కై రాష్ట్రానికి అప్రతిష్ఠ తెస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా కుతంత్రాలు పన్నుతున్నారన్నారు. అవినీతిరహిత రాష్ట్రాలలో మూడవ స్థానంలో ఏపీ ఉందని సీఎం చెప్పుకొచ్చారు. కరవుసీమలో కియా కార్లు పరుగెత్తడం, సీమలో కృష్ణా జలాల పరవళ్లు తొక్కనుందన్నారు. ఒకే రోజు రెండు శుభకార్యాలలో పాల్గొనడం తన అదృష్టమని సీఎం పేర్కొన్నారు.

kia 29012019

కియా పరిశ్రమ ద్వారా రూ.13,500కోట్ల పెట్టుబడులు, అనుబంధ విద్యుత్‌ కార్ల పరిశ్రమతో మరో రూ.3వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. కియా ద్వారా 11వేల మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా 4వేల మందికి ఉపాధి కలుగనుందని తెలిపారు. ఏడాదికి సగటున 3 లక్షల కార్ల తయారీ చారిత్రాత్మకమని అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని చేశామన్నారు. తయారయ్యే 10ఫోన్లలో మూడు ఏపీలోనే అని తెలిపారు. ఇప్పుడు కార్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తెచ్చామన్నారు. వైఎస్, బొత్స వోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొట్టారని, ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారని విమర్శించారు. కానీ తాము మాత్రం కియా తెచ్చి తొలి కారును విడుదల చేస్తున్నామన్నారు. అదే టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉన్న తేడా అని సీఎం చంద్రబాబు అన్నారు.

kia 29012019

వైఎస్, బొత్స ఫోక్స్ వ్యాగన్ కార్ల పరిశ్రమను పోగొడితే తాము కియా తెచ్చి తొలి కారును విడుదల చేస్తున్నామని అన్నారు. ముడుపుల కోసం వారు అధికారులను జైలు పాలుచేస్తే అవినీతిరహిత రాష్ట్రంగా ఏపీని తాము తీర్చిదిద్దామని చెప్పారు. అందుకే కియా వచ్చిందని స్పష్టం చేశారు. ఫ్యాక్షనిస్టుల అడ్డాగా సీమకు వారు చెడ్డపేరు తెస్తే అదే సీమను తాము ఫ్యాక్టరీల అడ్డాగా మార్చామని సీఎం అన్నారు. అనంతపురం జిల్లా గొల్లపల్లికి నీరు తేవడం వల్లే కియా పరిశ్రమ వచ్చిందని ఆయన వివరించారు. తెదేపా, వైకాపాకు ఉన్న ఈ తేడాను ప్రజలు గమనించాలని సీఎం కోరారు. ఇవాళ రాయలసీమకు రెండు శుభవార్తలున్నాయన్న ఆయన.. ఒకటి కరవుసీమలో కియా కార్లు పరుగెత్తడం అయితే రెండోది కృష్ణా జలాల పరవళ్లు అని చెప్పారు. ఒకే రోజు రెండు శుభకార్యాల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు. మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని చేశామన్న చంద్రబాబు అన్నారు.

మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయితే తప్ప తాము అసెంబ్లీకి రామన్న వైసీపీ నేతలు పంతం వీడతారా? త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా? లేక మా పంతం మాదేనని గతంలో లాగానే సమావేశాలను బహిష్కరిస్తామని చెబుతారా ? వైసీపీ మళ్ళీ అసెంబ్లీకి డుమ్మా కొట్టబోతోందా? ప్రజల కోసం బెట్టుదిగతారా? జగన్ ఏం ఆలోచిస్తున్నారు? ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు ఉన్నారా? ప్రభుత్వంలో ప్రతిపక్షం అన్నది కీలకపాత్ర పోషించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన పోరాడాలి. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుంది.

kodlea 29012019

ప్రభుత్వం మీద అలిగిన ప్రతిపక్షం ప్రజల తరపున చట్టసభలో పోరాటం ఆపేసింది. కారణం ఏదైనా సరే ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారని ఎమ్మెల్యేని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి గైర్హాజర్ అవుతుండడంపై ప్రజలలో అసంతృప్తి ఎక్కువవుతుంది. మరోపక్క ప్రత్యేకహోదా కోసం కేంద్రంలో పోరాడాల్సిన ఎంపీలు హోదా కోసమే అంటూ రాజీనామాలు చేసి తమతమ పనులలో నిమగ్నమయ్యారు. అక్కడ ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిదులుగా ప్రజల పక్షాన లేకపోవడంతో పార్టీపై సంకేతాలు మారే అవకాశం ఉంది. ప్రజలలో కూడా ప్రభుత్వం మీద అలక ప్రజల మీద చూపిస్తారా? అనేలా అసంతృప్తి రగులుతుంది.

kodlea 29012019

ఈ విషయం పై స్పీకర్ కోడెల కూడా స్పందించారు. ఈ సారి కూడా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తానని ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అయితే మాట్లాడేందుకు జగన్‌ తనకు అవకాశం ఇవ్వడంలేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షం లేదనే అసంతృప్తి సభాపతిగా తనకు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇరుపక్షాలు ఉంటే సభాపతికి సవాల్‌గా ఉంటుందన్నారు. అటువంటప్పుడు నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌కు బదులు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అలా చేయడం పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టదని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.

Advertisements

Latest Articles

Most Read