రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం... చాలా పర్సనల్ గా తిట్టుకుంటారు... విజయసాయి రెడ్డి, జగన్ లాంటి వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో కూడా తెలీకుండా తిడతారు... ఇవన్నీ ఒకెత్తు అయితే, ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పిన మాట పట్టుకుని, వారాలు వారాలు అదే మాట చెప్పటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం... అశోక్ గజపతి రాజు గారు, దాదాపు సంవత్సరం క్రితం, విలేకరులు ఎదో అడగగా "పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలీదు" అన్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఎంపీలను, మంత్రులను, పార్లమెంట్ లో గోడలు చూడటం తప్ప ఏమి చెయ్యరు అని అంటే, ఆ విషయం విలేకరులు రాజు గారి దగ్గర ప్రస్తావిస్తూ, మీ రియాక్షన్ ఏంటి అంటే, అప్పుడు అన్నారు, పవన్ అంటే ఎవరో నాకు తెలీదు అని...

ashok 28012019

ఆ వెంటనే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నేను తెలీదు అంటారా అని ఎదో నాలుగు మాటలు అన్నారు... ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం... అయితే, సంవత్సరం క్రితం అయిపోయిన విషయం తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్, మళ్ళీ తన పోరాట యాత్రలో మొదలు పెట్టారు.. నేను తెలియదు అంటారా అంటూ ఊగిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ, తాజాగా.. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి.. పవన్ కళ్యాణ్ తనకు తెలియదని మరోసారి చెప్పుకొచ్చారు. " నేను సినిమాలు చూడను. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ల నాన్న కూడా నాకు తెలుసు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఒక పనికోసం నా దగ్గరకొస్తే చేసిపెట్టాను" అని ఎంపీ అశోక్‌గజపతి వ్యాఖ్యానించారు.

ashok 28012019

అశోక్ మాటలు విన్న జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మళ్ళీ నాగబాబు వీడియోలు చేస్తారు జాగ్రత్తా అంటూ అశోక్ గజపతి రాజు గారిని హెచ్చరిస్తున్నారు. మరో పక్క, దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీని పలువురు తీవ్రంగా తప్పుపడుతుండగా.. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. అశోక్‌గజపతి రాజు మాట్లాడుతూ.. "దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్‌ను కలవటం ఆయన విజ్ఞత. ప్రభుత్వంపై దగ్గుబాటి విమర్శలు కూడా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రతి పనిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. గతంలో దగ్గుబాటితో కలసి పనిచేశాను. ఎవరు ఎవర్ని కలసినా టీడీపీదే విజయం "అని అశోక్‌గజపతిరాజు జోస్యం చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయంపై టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్నారు. ఆర్ఎస్ఎస్ మొదలుకొని అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని విమర్శించారు. బీజేపీ.. కాంగ్రెస్‌.. బీజేపీ.. ఇప్పుడు వైసీపీ.. ఇలా రకరకాల పార్టీలు మారారని విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ హయాంలో ఆమె కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యే… ఆ తర్వాత కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీలో చేరారు. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ’ అని విమర్శించారు.

daggubati 28012019

ఇక.. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయ్యారని బాబు అన్నారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని.. వీళ్ల అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. వాళ్లు అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ బయోపిక్‌తో పాటు.. మళ్లీ ఎన్టీఆర్‌పై బయోపిక్‌ తీయాలని కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. దగ్గుబాటి వైకాపా అధినేత జగన్ తో భేటీ అయిన సందర్భంగా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటూ తెలుగుదేశంపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు.

daggubati 28012019

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జయహో బీసీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజమహేంద్రవరం సభ ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ కు నిదర్శనమన్నారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టిందన్నారు. బీసీ కులాల ఐక్యతను కాపాడుకోవాలన్నారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందన్నారు. బీసీలపై వైకాపా, తెరాస కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. తెరాస 29 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందన్నారు. తెరాసతో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమన్నారు. ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా అన్నారు. వైకాపా రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడరన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకించే టీఆర్ఎస్ తో వైకాపా కలయికను ప్రజలు వ్యతిరేకిస్తారన్నారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందన్నారు.

అసెంబ్లి ఎన్ని కల ముందు టీడీపీలో కీలక పరిణా మానికి తెరలేచింది. తమ పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖాముఖి భేటీలను నిర్వహి స్తున్నారు. వారి జాతకాలను వారి చేతిలోనే పెట్టి నియో జకవర్గాల్లో వారి బలాలు, బలహీనతలను చెప్పి ఎలా దిద్దుకోవాలో, ఏవి సరిచేసు కోవాలో వివరిస్తున్నారు. పరిస్థితి బాగోలేని వారికి మొహమాటం లేకుండా అక్షింతలు వేస్తున్నారు. ఈ భేటీలను బుధవారం నుండే ఆయన ప్రారం భించారు. రోజుకు 15 నుండి 20 మంది వరకూ పిలిపించుకుని మాట్లాడు తున్నారు. మొదటి రోజు మాట్లాడిన వారిలో మంత్రి శిద్ధా రాఘవరావు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజి కవర్గాలను కలిపి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బలంగా ఉన్న ఎమ్మెల్యేలు, బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలను కలిపి పిలవడం ద్వారా ఎవరికీ ఏ సంకేతాలు అందకుండా జాగ్రత్త పడుతున్నారు.

cbnreview 27012019

ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో వారిపై ఉన్న అభిప్రాయం, ప్రజలు, పార్టీ వారితో సం బంధాలు, బలాలు, బలహీనతలపై ఈ సమాచారం సేకరిస్తున్నారు. వాటిని నివేదిక రూపంలో తయా రుచేసి ఇప్పుడు వారి చేతికి ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు గతంలో కూడా కొన్ని నివేదికలు ఇచ్చారు. అప్పుడవి సంక్షిప్తంగా ఉండేవి. సరిదిద్దుకోవాల్సిన అంశాలు దూరంగా ఉన్న పార్టీ నేతలు, వివిధ అంశాల్లో వారికి వచ్చిన మార్కులతో ఉండేవి. ఈ సమాచారాన్ని ఇప్పుడు మరికొంత విపులంగా ఎమ్మెల్యేల చేతికి ఇవ్వబోతున్నానని సోమవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చెప్పిన సంగతి పాఠక విధితమే. ఈనేపథ్యంలోనే ఆయన ఆ కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసు కొచ్చారు. అయితే, అన్నీ చెబితే సమాచారం ఇచ్చిన వారిపై దండెత్తుతారని గతంలో కొన్ని చెప్పలేదు. కానీ, ఇప్పుడు సమయం వచ్చినందున నిర్మొహమాటంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టా విప్పుతున్నారు.

cbnreview 27012019

మీ లోపాలు, సమస్యలు ఏమిటో అన్నీ చెప్పదలిచాను. కొందరు బాగా చేసుకుం టున్నారు, కొందరు బాగా పనిచేస్తున్నా సరైన సంబంధాలు నిర్వహించ లేకపోతు న్నారంటూ ముఖ్యమంత్రి వారికి చెబుతు న్నారు. మరి కొందరు వివాదాల్లో చిక్కుకుంటున్నారని, ప్రజల్లో మంచిపేరు ఉండటం మీకు, నాకు అవసరం, అందుకే మీ లోపాలు ఏమిటో మీ చేతికే ఇస్తాను. దిద్దు కుంటే మంచిది. లేకపోతే నష్టపో తారని ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి నిష్కర్షగా చెప్పేస్తు న్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు బయటకు వచ్చాక పైకి గంభీరంగానే కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన లోపాలు నిజమే అని మాకు తెలుసు, వాటిని సరిచే సుకునే ప్రయత్నంలో ఉన్నాంమని చెప్పారు. శాసనసభ్యుల పనితీరుపై ప్రతి నియోజక వర్గంలోనూ ప్రతి నెలా 25 వేల మంది నుండి వివిధ మార్గాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని సంక్షేమ కార్యకమాలు చేసినా, శాసన సభ్యులు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోతే ప్రజలు ఆమోదించడం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సిట్టింగులకు హితబోధ చేస్తున్నట్లు తెలిసింది.

ఎప్పుడో తెలంగాణా ఎన్నికలు జరిగిన సమయంలో అర్ధాంతరంగా, గోదావరి జిల్లాల పర్యటన ముగించుకుని, సడన్ గా విదేశాలకు వెళ్ళిపోయి, కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సమీక్షలు అంటూ హడావిడి చేసి, పోరాట యాత్రకు పూర్తిగా రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్, దాదాపుగా రెండు నెలల తరువాత మళ్ళీ హడావిడి మొదలు పెట్టారు. రెండు రోజుల క్రితం పాడేరులో మొదలు పెట్టినా, ఎదో పై పైన లాగించేసి, ఈ రోజు గుంటూరులో మాత్రం, మళ్ళీ పాత ఫ్లో లోకి వచ్చారు. మళ్ళీ తన అజ్ఞాన, అర్ధం లేని ఆవసేపు డైలాగులతో , తన ఫాన్స్ ని అలరింప చేస్తూ, ఎంటర్టైన్ చేస్తున్నారు. ఉన్నట్టు ఉండి, పవన్ కళ్యాణ్ మళ్ళీ మొదలు పెట్టటం వెనుక, నిన్న కేసీఆర్, గవర్నర్ తో జరిగిన చర్చలు కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

pk 27012019

చంద్రబాబు పై దాదపుగా సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్, మొన్నా మధ్య, కేసీఆర్, జగన్ ల పై విమర్శలు చేసారు. అయితే నిన్న మీటింగ్ పుణ్యమో ఏమో కాని, మళ్ళీ చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు. గుంటూరులోని ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో ‘జనసేన శంఖారావం’ పేరిట నిర్వహించిన సభలో పవన్‌ ప్రసంగించారు. అంతకుముందు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అమరావతి గడ్డపై జనసేన జెండా ఎగురవేస్తామని తెలిపారు. జనసేన బలం చూపిస్తామని.. బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకోని అమరావతిని స్వాదీనం చేసుకుంటామన్నారు.

pk 27012019

అమరావతిలో జనసేన జెండా పాతి తీరుతాం అని స్పష్టం చేశారు. జనసేనను అణచివేయడానికి ఎన్ని వ్యూహాలు వేసినా ప్రతి వ్యూహాలు తానూ వేస్తానని చెప్పారు. "2019లో జరిగే త్రిముఖ పోరులో జనసేనదే విజయం. నేనేమీ అన్నా హజారేలా జెండా పట్టుకుని అంతా మంచే జరగాలని కోరుకోవడం లేదు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బురదలోకి దిగాల్సిందే. నేనేం చేయాలనుకున్నా అది ప్రజలకు చెప్పే చేస్తా. నేను మీకు అండగా ఉంటా. మీరు నాకు అండగా ఉండండి. నేనూ చదువుకుని వచ్చిన వాడినే. వ్యూహాలను రూపొందించగలను. ఏ అణగారిన వర్గాలను అధికారానికి దూరం చేశారో వారిని అక్కున చేర్చుకుని అమరావతిని స్వాధీన పరుచుకుంటాం. అమరావతిలో జెండా పాతుతాం’’ అని పవన్‌ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read