రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయం పై, గత సంవత్సర కాలం నుంచి పోరాడుతున్న చంద్రబాబు, ఇప్పుడు మరింతగా పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పోయిన ఏప్రిల్ 20న , తన పుట్టిన రోజు నాడు ‘ధర్మ పోరాట దీక్ష’కు శ్రీకారం చుట్టి, రాష్ట్రమంతటా సభులు పెట్టి , ఇప్పుడు ఢిల్లీని, ఢిల్లీ లోనే డీ కొట్టటానికి రెడీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఒక రోజు దీక్ష చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా దీక్షకు కూర్చుంటే ఎలా ఉంటుందనే అంశంపై టీడీపీపీ భేటీలో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపీ సుజనాచౌదరి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర సమస్యలను బడ్జెట్లో పరిష్కరించపోతే దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు దీక్ష ద్వారా ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్యాయం ... మరోసారి జాతీయ స్థాయిలో ప్రధాన అంశం అవుతుందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు ఏపీ గొంతును వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రజల తరుపున మాట్లాడేందుకు ఎప్పటికప్పుడు టీడీపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలను గమనిస్తూ వీడియో కాన్ఫరెస్స్ ద్వారా ఎంపీలకు పలు సూచనలు చేస్తున్నారు. చివరకు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ, మోడీ పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు.
ఇప్పుడు చివరి అస్త్రంగా, పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఒక రోజు దీక్ష చెయ్యనున్నారు చంద్రబాబు. విభజన చట్టంలో ఉన్నవి అమలు చెయ్యకుండా, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవి ఇస్తూ, మనకు ఎదో చేసేస్తున్నట్టు హడావిడి చేస్తుంది కేంద్రం. విభజన చట్టంలో ఉన్న ఒక్కటి కూడా నెరవేర్చకుండా మనకు అన్యాయం చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి బహిరంగ సభలో ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఆర్ధిక లోటు భర్తీ కాదు, EAP నిధులు, రైల్వ జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గిరజపట్నం పోర్ట్, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు, వివిధ విద్య సంస్థల నిధులు , ఉమ్మడి ఆస్తుల విభజన, 9,10 షడ్యుల్ సంస్థలు, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు పోరాడుతున్నారు...