వైసీపీని వీడుతున్న ప్రతీ నేత చెప్పే కామన్ డైలాగ్ ఒకటేనన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అదే వ్యక్తిస్వామ్యం. వైసీపీలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని.. జగన్ ఎవరి మాట వినడని.. తన మాట ప్రకారమే అందరూ నడుచుకోవాలనే మనస్తత్వం అతనిదని గతంలో పార్టీ మారిన నేతల్లో చాలామంది విమర్శించారు. ఇప్పుడు తాజాగా వైసీపీని వీడిన వంగవీటి రాధా కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడంతో ‘జగన్ వన్‌మ్యాన్ షో’పై మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం గురువారం మీడియాతో మాట్లాడిన వంగవీటి రాధా జగన్‌పై చేసిన ఆరోపణలు ఈ చర్చకు కారణమయ్యాయి.

jaggan 25012019

తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లినప్పుడు ‘ఎవడికి చెప్పి వెళ్లావు నువ్వు.. నీ ఇష్టమా.. నీ ఇష్టమొచ్చినట్టు వెళ్లిపోతే కుదురుతుందా.. ఇది నా పార్టీ’ అని జగన్ తనను హెచ్చరించారని రాధా వ్యాఖ్యానించారు. అయితే.. జగన్‌పై, వైసీపీపై వస్తున్న ఇలాంటి ఆరోపణలు, విమర్శలు కొత్తేమీ కావు. గతంలో వైసీపీని వీడిన మెజారిటీ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, చెప్పిన సలహాలను పాటించే స్థితిలో జగన్ లేరని మాజీ మంత్రి మైసూరారెడ్డి వైసీపీని వీడిన సందర్భంలో వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా వైసీపీని వీడిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వైసీపీలో తనకు కనీస గౌరవం దక్కలేదని.. ఆనం చేరిక గురించి జగన్ తనతో మాట మాత్రం కూడా చెప్పలేదని బొమ్మిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

jaggan 25012019

జగన్ ఒక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని, తాను చెప్పిందే అందరూ వినాలన్నదే జగన్ మనస్తత్వమని బొమ్మిరెడ్డి అప్పట్లో ఆరోపించారు. అంతేకాదు, వైసీపీని వీడి టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో జగన్‌కు రాసిన లేఖలో కూడా జగన్ నియంతృత్వం పోకడలు నచ్చకే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. జగన్‌కు ఎదుటి మనిషిని గౌరవించే సంస్కృతి లేదని, ఆయన వైఖరి నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు 22 మంది ఎమ్మెల్యేలు సంయుక్తంగా జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. వైసీపీలో జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇలా పదేపదే వినిపిస్తుండటంతో ఆ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదనే అంశం స్పష్టమవుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా జగన్‌ వ్యవహార శైలిపై పదేపదే వస్తున్న ఇలాంటి ఆరోపణలు వైసీపీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

తరాల కరవును కసితీరా తరిమికొట్టేలా కృష్ణమ్మ బిరబిరా పరుగులెత్తింది. బీడు వారిన భూముల్లో సిరులు కురిపించేలా గలగలా కదిలి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప దీక్ష.. అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలించింది. అనంతపురం జిల్లాకు చిట్ట చివరన, ఎక్కడో మూలకు విసిరేసినట్లు, కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉండే మడకశిర నియోజకవర్గానికి కృష్ణమ్మ బుధవారం తరలివచ్చింది. దశాబ్దాల స్వప్నం సాకారమై.. లోగిళ్లు సస్యశ్యామలం కానున్న శుభ తరుణంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంలో, ఈనాడులో వచ్చిన "మడకశిర మురిసింది" అనే శీర్షిక చూసి, 30 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసిన జర్నలిస్ట్..

madakasira 25012019 1

"1986 లో అనంతపురంజిల్లా “ఎప్పమాను” వద్ద టీ దుకాణం పక్కన ఒక రైతు ఆరోజు ఈనాడు పేపర్ నేలమీద పరచి గోదావరి వరద ఫొటోలను చూస్తూ “ఇన్ని నీళ్ళా” అని ఆశ్చర్యపోయారు. రాయలసీమ కరువుకథలు రాసే టూర్ లో వున్న నాకూ (ఈనాడు - XXXX) న్యూస్ టైమ్-XXXX కి ఈ ఒక్క సన్నివేశంలోనే, “ఇన్నినీళ్ళా” అన్న ఒక్కమాటతోనే అక్కడ కరువులోతు తెలిసింది. ఫొటోగ్రాఫర్ XXXX రైతు నీళ్ళ ఫొటో చూస్తున్న ఫొటో తీశాడు. పతంజలిగారు ఫస్ట్ పేజీలో దాన్ని బాగా ఫీచర్ చేశారు. “మడకశిర మురిసింది” వార్త చూశాక “ఇన్నినీళ్ళా సంఘటన 32 ఏళ్లకు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చింది. దీంతోనే రాయలసీమ కరువుతీరిపోతుందని కాదు.అయితే, ఆదిశగా ఒక అడుగుపడింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు." అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. (నోట్ : వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదని, పేరులు ఉన్న చోట XXXX అని పెట్టటం అయినది)

madakasira 25012019 1

ఇది మడకశిర స్వరూపం : హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో భాగమైన మడకశిర బ్రాంచి కాల్వలో చివరి ప్రాంతానికి కృష్ణమ్మ చేరుతోంది. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 304.400 కి.మీ.వద్ద మడకశిర బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఇది మొత్తం 171.015 కి.మీ.ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అక్కడ అగళి మైనర్‌ కాల్వ (33.340 కి.మీ.లు), అమరాపురం మైనర్‌ కాల్వ (25.100 కి.మీ.)గా విడిపోతుంది. మొత్తంగా ఈ మడకశిర బ్రాంచి కాల్వ ద్వారా 275 చెరువులను నింపడంతోపాటు 43 వేల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీరివ్వడం, ఈ కాల్వ పరిధిలో ఉన్న గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీర్చాలనేది లక్ష్యం. మడకశిర బ్రాంచి కాల్వపై మొత్తం 17 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ కాల్వపై 8.65 వ కి.మీ. వద్ద గొల్లపల్లి జలాశయం ఉంది. అక్కడి నుంచి గత ఏడాది లేపాక్షి వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లగలిగారు. మరికొన్ని చోట్ల పనులు పూర్తికాకపోవడంతో, మడకశిర వరకు నీరు చేరలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా నీరివ్వాల్సిందే అని హంద్రీనీవా ఇంజినీర్లకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా, ప్రతి సోమవారం దీనిపై సమీక్ష జరుపుతూనే ఉన్నారు. దీంతో గుత్తేదారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి చివరకు మడకశిర నియోజకవర్గ కేంద్రం వరకు కాల్వ పనులు పూర్తిచేయగలిగారు. ప్రస్తుతం ఈ కాల్వలో 11 ఎత్తిపోతల పథకాలు దాటి మడకశిర మండలంలోని 127వ కి.మీ. వద్ద సి.కొడిగేపల్లిలోకి బుధవారం ఉదయం నీరు చేరింది.

రెండు రోజుల క్రితం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, కేటీఆర్, ఆంధ్రా పై చిమ్మిన విషం గుర్తుందా ? ఆంధ్రప్రదేశ్ లో అన్నీ కాపీ కొట్టినవే అంట.. ఏపి ప్రభుత్వం అన్నీ, తెలంగాణా నుంచి చూసి కాపీ కొడుతుంది అంటూ, ఆంధ్రులకు ఏమి తెలియనట్టు, ఆంధ్రులకు బుర్ర లేదు అన్నట్టు, ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఎవరు ఎవర్ని చూసి కాపీ కొడుతున్నారో, చివర్లో మాట్లాడుకుందాం.. అయితే చంద్రబాబు మమ్మల్ని కాపీ కొడుతున్నాడు అని చెప్పి 24 గంటలు అవ్వలా, తెలంగాణా అధికారులని విజయవాడ పంపిస్తున్నాడు కేసీఆర్.. ఎందుకో తెలుసా, మన రాష్ట్రంలో, విజయవాడలో బస్ స్టాండ్ లలో, జరుగుతున్న మోడరనైజేషన్ చూసి, విజయవాడలో బస్ స్టాండ్ లో లాగా, సినిమా హాల్స్ పెట్టటానికి.

ktr 25012019

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌లో ఇలాంటి మినీథియేటర్‌ నడుస్తోంది. ఈ మినీ థియేటర్‌ నిర్వహణ పని తీరును పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్‌ నేతృత్వం లోని బృందం విజయవాడ వెళుతుందని తెలంగాణా అధికారులు చెప్తున్నారు. మరి అన్నీ మా నుంచి చంద్రబాబు కాపీ కొడుతున్నాడు అంటున్న కేటీఆర్, దీనికి ఏమి సమాధానం చెప్తారు ? మంచి ఎవరి దగ్గర నుంచి చూసైనా నేర్చుకోవాల్సిందే. దాంట్లో తప్పు లేదు. అయితే అసలు అన్నీ కాపీ కొట్టింది చంద్రబాబు నుంచి, ప్రతి విషయం చంద్రబాబుని ఫాలో అవుతూ, ఆయనే మా గురించి కాపీ కొడుతున్నాడు అంటూ దబాయిస్తున్నాడు కేటీఆర్. ఇంతకీ కేటీఆర్ ఏమి కాపీ కొట్టాడు అంటారా..

ktr 25012019

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఐ-కేంద్రం, ఫిబ్రవరి 1st 2018లో ప్రారంభం అయితే, తెలంగాణాలో కంటి వెలుగు, ఆగష్టు 15th 2018న ప్రారంభం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ డివైజస్ పార్క్, ఆగష్టు 19th, 2016న శంకుస్థాపన అయ్యి, ఇప్పటికే పనులు మొదలు పెడితే, తెలంగాణాలో జూన్ 17th, 2017న శంకుస్థాపన అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో, ఎన్టీఆర్ బేబీ కిట్స్ 2015లో ప్రారంభం అయితే, తెలంగాణాలో కేసీఆర్ కిట్ - 2017లో ప్రారంభం అయ్యింది. నిరుద్యోగ బృతి, ఆంధ్రప్రదేశ్ లో, యువనేస్తం పేరుతో సెప్టెంబర్ 2018 నుంచి ఇస్తున్నారు, అదే తెలంగాణాలో 2018 మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పటి వరకు చెయ్యలేదు. ఇలా చెప్పుకుంటూ పొతే, ఒక వంద ఉంటాయి. ఎవరు, ఎవరిని కాపీ కొడుతున్నాడు కేటీఆర్ ? ఎక్కడైనా టాప్ మార్కులతో పాస్ అయ్యే వాడు, ఫెయిల్ అయ్యే వాడి దగ్గర కాపీ కొడతారా ?

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్ని ప్రధాన రాజకీయ పక్షాలతో కలిసి ఈనెల 29 న అమరావతిలో ఉండవల్లి ఇన్ కెమెరా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. ఇందులో ప్రధాన ఎజెండా వచ్చే కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది చర్చిస్తారు. ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై ఈనెల 29 న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ఇందులో కూలంకషంగా చర్చిస్తామని ఆయన తెలిపారు.

undavalli 25012019 2

ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని ఉండవల్లి ప్రకటించారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ, జనసేన సహా ఏడు రాజకీయ పార్టీలను ఆహ్వానించామని, అయితే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వైసీపీ అంగీకరించలేదని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించలేని స్థితిలో రాజకీయ పార్టీలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఉండవల్లి, పవన్ కళ్యాణ్ తరువాత ఆ విషయం గురించి మర్చిపోవటంతో, తానే స్వయంగా రంగంలోకి దిగారు.

undavalli 25012019 3

ఇప్పటికే పవన కళ్యాణ్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ, లోక్ సత్తా జేపీ కమిటీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై స్పందించాయి. ఇప్పుడు మరోసారి ఉండవల్లి కూడా తన లెక్క ఏంటో చెప్తాను అంటూ వస్తున్నారు. ఉండవల్లి స్కెచ్ ఎంతో తెలియదు కాని, ప్రతి సందర్భంలో జగన్ ను వెనకేసుకుని వచ్చి, చంద్రబాబుని విమర్శించే ఉండవల్లి, ఈ సమావేశం పెట్టటం, ఆ సమావేశానికి వైసీపీ రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ ఉండవల్లి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించలేని స్థితిలో వైసీపీ ఉంది అంటూ చెప్పటం, మరో వింత. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారో, ఏదన్నా రాజకీయ కారణం ఉందో తెలియాలంటే, 29 వరకు వేచి చూడాల్సిందే.

Advertisements

Latest Articles

Most Read