ఇటీవల టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డికి టీడీపీ నేతలు, కేడరు ఝలక్ ఇచ్చారు. ఈనెల 31న వైసీపీలో చేరుతున్న సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలు, కేడరు తన వెంటేనని ప్రచారం చేసిన మేడాకు వారంతా తాము టీడీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడు మేడా విజయశేఖర్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగేలా ఆ పార్టీ నేతలతో మంతనాలు నిర్వహిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మేడా ఆకేపాటి అమరనాధరెడ్డి చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనసు వైసీపీతోనే అన్నట్లుగా వ్యవహరించారని మొదటి నుంచి టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.
కాంగ్రె్‌సలో ఉన్న కేడరును టీడీపీలోకి ఆహ్వానించి పదవులు, పనులు వారికే అన్నట్లు కట్టబెటి ్ట వారే ముఖ్య అనుచరులుగా టీడీపీలో ప్రచారం చేస్తూ వచ్చారు. మొదటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న నేతలు, కేడరు ఎమ్మెల్యే వ్యవహారాలపై విసుగెత్తి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఒకటి, రెండు చోట్ల బహిరంగంగానే ఎమ్మెల్యే విధానాలను వ్యతిరేకిస్తూ పత్రికలకు ఎక్కిన సందర్భాలున్నాయి. టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న మేడా మండలాల వారీగా అనుచరులు, నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వచ్చినా మేడా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మేడాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు మంగళవారం ప్రకటించారు. అదే రోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన మేడా ఈ నెల 31న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు, కేడరు వైసీపీలో చేరుతారని మేడా ప్రచారం చేస్తూ వచ్చారు.
నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన మేడా వివిధ అభివృద్ధి పనులు, పదవులు తన అనుచరులకే ఇప్పించుకున్నారు. వీరంతా తన వెంటే అనుకుని భావిస్తూ వచ్చారు. అయితే, సస్పెన్షన్ అనంతరం వైఎస్ జగన్‌ను మేడా కలిసినప్పుడు ఆయన బంధువులు తప్ప ముఖ్యమైన టీడీపీ నేతలెవరూ మేడా వెంట వెళ్లలేదు. సుండుపల్లె, వీరబల్లె మండలాల టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించే ఎమ్మెల్యే మే డా సోదరుడు ( సమీప బంధువు) మేడా విజయశేఖర్‌రెడ్డి (బాబు) బుధవారం రాత్రి రా యచోటి ఆర్అండ్బి అతిథిగృహంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ నేతలు, కేడరు ఎవరూ కూడా మేడా వెం ట వెళ్లవద్దని కోరారు. మేడా ఎ మ్మెల్యేగా ఉన్నంత కాలం ఆయన కు చేదోడువాదోడుగా ఉన్న విజయశేఖర్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగుతుండడం నియోజకవర్గంలో చర్చనీయంశమైంది. పలువురు మండల పార్టీ అధ్యక్షులు కూడా తాము పార్టీ వెంటే అంటూ 31న మేడా వైసీపీలో చేరే సమయంలో తాము వెళ్లడంలేదని చెిప్పినట్లు సమాచారం.