రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయం పై, గత సంవత్సర కాలం నుంచి పోరాడుతున్న చంద్రబాబు, ఇప్పుడు మరింతగా పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పోయిన ఏప్రిల్ 20న , తన పుట్టిన రోజు నాడు ‘ధర్మ పోరాట దీక్ష’కు శ్రీకారం చుట్టి, రాష్ట్రమంతటా సభులు పెట్టి , ఇప్పుడు ఢిల్లీని, ఢిల్లీ లోనే డీ కొట్టటానికి రెడీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఒక రోజు దీక్ష చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా దీక్షకు కూర్చుంటే ఎలా ఉంటుందనే అంశంపై టీడీపీపీ భేటీలో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే జాతీయ నేతలంతా వచ్చి మద్దతు తెలుపుతారని ఎంపీ సుజనాచౌదరి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.

parliament 26012019

రాష్ట్ర సమస్యలను బడ్జెట్‌లో పరిష్కరించపోతే దీక్షకు దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు దీక్ష ద్వారా ఏపీకి ఎన్డీయే ప్రభుత్వం చేసిన అన్యాయం ... మరోసారి జాతీయ స్థాయిలో ప్రధాన అంశం అవుతుందని నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు ఏపీ గొంతును వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై ప్రజల తరుపున మాట్లాడేందుకు ఎప్పటికప్పుడు టీడీపీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలను గమనిస్తూ వీడియో కాన్ఫరెస్స్ ద్వారా ఎంపీలకు పలు సూచనలు చేస్తున్నారు. చివరకు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ, మోడీ పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు.

parliament 26012019

ఇప్పుడు చివరి అస్త్రంగా, పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఒక రోజు దీక్ష చెయ్యనున్నారు చంద్రబాబు. విభజన చట్టంలో ఉన్నవి అమలు చెయ్యకుండా, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేవి ఇస్తూ, మనకు ఎదో చేసేస్తున్నట్టు హడావిడి చేస్తుంది కేంద్రం. విభజన చట్టంలో ఉన్న ఒక్కటి కూడా నెరవేర్చకుండా మనకు అన్యాయం చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి బహిరంగ సభలో ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఆర్ధిక లోటు భర్తీ కాదు, EAP నిధులు, రైల్వ జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గిరజపట్నం పోర్ట్, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు, వివిధ విద్య సంస్థల నిధులు , ఉమ్మడి ఆస్తుల విభజన, 9,10 షడ్యుల్ సంస్థలు, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు పోరాడుతున్నారు...

తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపై కూడా చర్చించబోతున్నారు. చివరి పార్లమెంట్ సమావేశాలు ఇవే అయ్యే అవకాసం ఉండటంతో, ఈ సమావేశాల్లో, మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై పెద్ద ఎత్తున ఆందోళన చెయ్యనున్నారు. తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ, వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. తెదేపా ఎంపీలు పార్లమెంటు లోపల, బయట రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పారు.

modi 26012019

సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎస్పీవై రెడ్డి, సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ బడ్డెట్ సమావేశాల్లో ఏపీ విభజన హామీలు సహా రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఎంపీలు గట్టిగా పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఏపీని దేశంలో ఒక రాష్ట్రంగా చూడటం లేదని, అన్నింటిలోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. వెనక్కి తగ్గాల్సిన అవసరం తామకు లేదని, సస్పెండ్‌ చేసినా వెనకాడమని హెచ్చరించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, మిగతా పక్షాలతో రెండు రోజుల్లో సమావేశమవుతామన్నారు. సమావేశాల రోజు తమ ప్రతిఘటన ఉంటుందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

modi 26012019

ఈవీఎంల అంశంపై ముందు అన్ని పక్షాలతో ఈసీని కలుస్తామని, ఆ తర్వాత న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల ముందురోజు మిగతా పక్షాలతో సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని, 2 నెలలు మాత్రమే ఉండే ఎన్డీఏకు సంవత్సరానికి అయ్యే బడ్జెట్‌ పెట్టే అర్హత ఎక్కడుందని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. ఏపీకి న్యాయం కోసం పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లోనూ పోరాటం కొనసాగిస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టిన చరిత్ర తమదే అన్నారు. ఈవీఎంలపై కూడా తమ వాదన గట్టిగా వినిపిస్తామని చెప్పారు. సస్పెండ్‌ చేసినా వెనకాడేది లేదని ఎంపీ అవంతి తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై తమ పోరాటం సాగుతుందని ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. దేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకోవడం ఏపీ విషయంలోనే జరిగిందని మండిపడ్డారు. ఏపీపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లా కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన కాటమనేని భాస్కర్‌ తొలిరోజే తన పాలన ఎలా వుంటుందో చూపించారు. ప్రవీణ్‌కుమార్‌ నుంచి ఉదయం పది గంటలకు బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌ వెనువెంటనే కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘మీకోసం-ప్రజావాణి’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక వైపు ప్రజా సమస్యలు వింటూనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశ మందిరంలో తన సీటులో కూర్చుంటూనే కలెక్టర్‌ రాగానే లేచి నిలబడడం వంటి ప్రొటోకాల్‌ పద్ధతులు పాటించనవసరం లేదని, మంత్రులు, ఎంపీలు వచ్చినప్పుడు లేచి నిలబడితే సరిపోతుందన్నారు. సమావేశ మందిరంలో ఒక్కరు కూడా నిలబడి వుండడం తనకు ఇష్టం వుండదని, అందరూ కూర్చుని మాట్లాడాలని సూచించారు.

bhaskar 26012019

చిన్నోడ్ని...చెబితే వింటానని అనుకోవద్దు... కలెక్టర్‌ భాస్కర్‌ మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తూనే పలువురు అధికారులకు చురకలు అంటించారు. ఆనందపురంలో తాగునీటి కుళాయికి పైపు ఏర్పాటుచేయడం లేదని అందిన ఫిర్యాదుపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రవికుమార్‌ను కలెక్టర్‌ పిలిచి ఇంత చిన్న సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. దీనికి ఆయన పంచాయతీ వారు చూడాలని చెప్పడంతో, కలెక్టర్‌ కాస్త అసహనానికి గురయ్యారు. ‘నాకు తెలిసినంత వరకు రక్షిత పథకాల నిర్వహణ బాధ్యతలు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లే చూడాలి. మరి మీరు పంచాయతీలు చూస్తున్నాయని చెబుతున్నారు. నేను చిన్నోడ్ని...ఏం చెప్పినా వింటాను అని అనుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. పైపులైను సమస్యకు తక్షణం పరిష్కారం చూపాలని ఆదేశించారు.

 

bhaskar 26012019

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 11 ఫోన్‌ కాల్స్‌... ఈ సందర్భంగా ముందుగా డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు ఫోన్‌ చేసిన కాలర్స్‌తో భాస్కర్‌ మాట్లాడారు. అనకాపల్లి మండలం కొత్తూరు నుంచి సంధ్య అనే మహిళ మాట్లాడుతూ తమ గ్రామంలో కాలువలు లేవని ఫిర్యాదు చేశారు. కాలువలు లేకపోతే డ్వామా అధికారులను పంపి కాలువలు ఏర్పాటుచేస్తామని, అయితే స్థానికులు కాలువల నిర్మాణానికి సహకరించాలని కోరారు. రెండు రోజుల్లో గ్రామానికి వెళ్లాలని డ్వామా అధికారులను ఆదేశించారు. మిగిలిన కాలర్స్‌ నుంచి అందిన సమస్యలకు కూడా పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

కొన్ని రోజుల క్రితం అనంతపురంలో జరిగిన ఘటనలో, సీనియర్‌ నేత, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్‌ విసిరి వార్తల్లోకి వచ్చిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ గుర్తున్నాడా ? ఈయన్ను చూసి, పోలీస్ అంటే ఇలాగే ఉండాలి, రాజకీయ నాయకులతో ఇలాగే ఉండాలి అని అందరూ అనుకున్నారు. కాని, ఇప్పుడు ఈ మాధవుడు చేసిన పని చూసి, దీని వెనుక కూడా రాజకీయ కోణం ఉందని, ఉద్యోగాల్లో ఉండి కూడా, ప్రభుత్వాల పై ఎంత ద్వేషం ఉందో తెలుస్తుంది. దివాకర్ రెడ్డి పై అంత ఇదిగా మీసం మెలేసి, చివరకు లోటస్ పాండ్ ల తేలాడు, ఈ మాధవుడు. మరి జగన్ దగ్గర అలా మీసా మెలేస్తే ఏమి చేస్తాడో ఏంటో..

madhav 26012019

హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి, జగన్ పార్టీలో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద గొడవలు జరిగిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో పోలీసులను ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దూషించారు. దీంతో మాధవ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసు అధికారుల సంఘం కార్యదర్శిగా ఉన్న మాధవ్ "తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే నాలుక కోస్తాను'' అని నేతలను హెచ్చరిస్తూ మీసం మెలేశారు. మాధవ్‌ తీరుపై జేసీ స్పందించారు. "ఒక సీనియర్‌ పొలిటీషియన్‌, పైగా ఎంపీ అయిన తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మాధవ్‌పై చర్యలు తీసుకోవాలి'' అని తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు తిరస్కరించారు.

madhav 26012019

ఈ నేపథ్యంలో హైకోర్టులో ఎంపీ దివాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. పార్లమెంట్‌కు కూడా ఫిర్యాదుచేశారు. ఈ అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు మాధవ్‌ వ్యవహారంపై 20 రోజుల్లోగా తమ అభిప్రాయం చెప్పమని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే, మాధవ్ తన పదవికి రాజీనామా చేసి, వైసిపీ లాంటి పార్టీ అండ ఉంటే, ఇంకా జేసి పై రేచ్చిపోవచ్చని, ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మరో పక్క జేసి వర్గం మాత్రం, మరోలా స్పందించింది. ఆయన పోలీస్ కాబట్టి, ఎంపీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, న్యాయ పరంగా ఎదురుకుంటున్నారని, ఇప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయంగా వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీసం మెలేస్తే, ఏమి చెయ్యాలో అది చేస్తామని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read