వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ఎమ్మల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆ మేరకు అమరావతిలోని సీఎం నివాసగృహంలో వారితో విడివిడిగా భేటి అయిన చంద్రబాబు పోటీకి సిద్ధమవ్వాలని ఆదేశించటంతో పాటు పలు సూచనలు, హెచ్చరికలతో కూడిన ప్రత్యేక నివేదికలను వారికి అందజేశారు. దర్శి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు, గిద్దలూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలకు ఆయన తిరిగి పోటీకి పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలోని పదిహేను మంది టీడీపీ నేతలకు బుధవారం ముఖ్యమంత్రిని కలవాలన్న సమాచారం అందింది. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలకు సీఎం ఫేషీ నుంచి పిలుపొచ్చింది.

cbn green signal 24012019

ముగ్గురు నేతలతో బుధవారం రాత్రి ఆయన విడివిడిగా మాట్లాడారు. తొలుత మంత్రి శిద్దాతో బాబు మాట్లాడారు. ముందుగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని కూడా శిద్దా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అనంతరం దర్శి విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ రావచ్చు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండని సూచించినట్లు తెలిసింది. ప్రత్యేక నివేదికలను ఆయనకు అందజేశారు. ఎంత మెజారిటీ సాధించగలమన్న నమ్మకం ఉందో తెలపాలంటూ శిద్దా చెప్పిన సమాచారానికి బదులుగా ఇంకా మెజారిటీ పెరగాలని సూచించినట్లు తెలిసింది. ఆయా అంశాలకు సంబంధించిన సమాచారంతో కూడిన నివేదికను కూడా ఇచ్చినట్లు తెలిసింది.

cbn green signal 24012019

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోటీకి సిద్ధం కమ్మని స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటంతో పాటు పలురకాల అంశాలకు సంబంధించి ఏలూరి ద్వారా తెలుసుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి సాధనలో ముందున్నారు, రాజకీయంగా నిర్థిష్ట విధానంతో నడుస్తున్నారు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే చక్కగా పరిష్కరించుకుంటున్నారు అని అంటూ గతం కన్నా మెజారిటీ పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏలూరికి కూడా పలు అంశాలకు సంబంధించిన నివేదికను ఇచ్చి వాటిని పరిశీలించి అనుసరించమని ఆదేశించినట్లు తెలిసింది. బాగా పొద్దుపోయిన తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో కూడా ఆయన మాట్లాడారు. తిరిగి గిద్దలూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూనే పలు అంశాలపై సూచనలు, జాగ్రత్తలు చెప్పినట్లు తెలిసింది. అయితే ముందుగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినందున మరోసారి వారిని పిలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రాకాష్ రెడ్డి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. విజయవాడలో నిన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు కోట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కోట్ల కూడా తన సన్నిహితులతో పార్టీ మారే విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. కర్నూలులో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.

kotla 24012019 2

మరో పక్క, గ‌త కొన్నాళ్లుగా ఈయ‌న వైసీపీలో వెళ్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేత‌ల నుంచి కూడా సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈయ‌న కోసం ఓ ప్ర‌త్యేక ప‌ద‌విని సైతం ఏర్చి కూర్చి పెట్టార‌ని, ఈయ‌న కోసం కొంద‌రిని కూడా వ‌దులుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, ఇటీవ‌ల జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌ర్నూలుకు చేరుకున్న స‌మ‌యంలో కోట్ల ఇక జ‌గ‌న్ పంచ‌న చేరి పార్టీ జెండా మారుస్తార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఇదేమీ జ‌ర‌గ‌లేదు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న ప్ర‌త్యామ్నాయంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

kotla 24012019 3

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. అంతేకాదు ఆయన కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎంతోమంది నేతలు వీడినా.. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో సీఎంగా ప‌నిచేసిన కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి అప్ప‌ట్లో వైఎస్‌తో విభేదించేవారు దీనిని దృష్టిలో పెట్టుకున్న కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి తమ తండ్రితో పోరు సల్పిన వై.ఎస్‌ కుటుంబం కంటే..టీడీపీలో చేరితేనే బాగుంటుందని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. శుక్రవారం కోట్ల అనుచరులు, కార్యర్తల సమావేశం ఏర్పాటు చేశారట. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట. అనుచరుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించాలనుకుంటున్నారట. అయితే సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం ఖాయమనే ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కొందరు బహిరంగంగానే చెబుతున్నారట. వైసీపీ నేతలు కూడా కోట్లకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ అనే పేరు ఉండేది. నాయకత్వం ఏది చెప్తే, అదే శాసనం. అయితే కాలం మారిందో, పద్ధతులు మారుతున్నాయో, లేకపోతే చంద్రబాబు ఏమి అనరులే, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు అనే ధీమా నో కాని, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల టైములో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అడుగులు వెయ్యాలని, చంద్రబాబు ప్రతి పని సమీక్షిస్తూ, ఒక పధ్ధతి ప్రకారం చేస్తుంటే, నేతలు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ చంద్రబాబుకు తలనొప్పులు తీసుకు వస్తున్నారు. అసలకే అటు బీజేపీ, కేసీఆర్, జగన్, పవన్ కలిసి, ఆయాన మీద పడుతుంటే, వాటిని ఎదుర్కోవటంలో, సహాయం చెయ్యల్సింది పోయి, వీరు కూడా ఇబ్బంది పెడుతున్నారు.

neta 24012019

టీడీపీలో నేతల వ్యక్తిగత ప్రకటనలు చంద్రబాబుకి తలనొప్పిగా మారుతున్నాయి. టీజీ వెంకటేష్ ఎపిసోడ్ మరువక ముందే తెరపైకి జలీల్‌ఖాన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తెకు ఇచ్చారంటూ జలీల్‌ఖాన్ ప్రకటించడంపై స్థానిక నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే సీట్లు ప్రకటించుకోవడం ఏంటంటూ జలీల్‌ఖాన్‌పై చంద్రబాబుకు ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా జలీల్‌ఖాన్‌ కుమార్తెను చంద్రబాబు ప్రకటించలేదని నాగుల్‌ మీరా అన్నారు. జలీల్‌ఖానే తనకు తానుగా అభ్యర్థిని ప్రకటించారని చెప్పారు.

neta 24012019

మా వర్గీయులు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించారు. తమను సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని మేము అనుకోవడం లేదని వెల్లడించారు. గురువారం తమ వర్గీయులతో కలిసి చంద్రబాబును కలవబోతున్నామని స్పష్టం చేశారు. ఇక మరో పక్క టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే లేపాయి. పవన్, మాతో కాలుస్తాడని, కలిసి పోటీ చేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన పై, పెద్ద ఎత్తున దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ కూడా టీజీ వెంకటేష్ కు ఘాటుగా బదులు ఇచ్చారు. మరో పక్క చంద్రబాబు కూడా, టీజీ పై ఫైర్ అయ్యారు. పొత్తులు లాంటి విషయాలు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు అలోచించాలాని, క్యాడర్ ను గందరగోళ పరచవద్దు అంటూ బదులిచ్చారు.

బాక్సైట్‌ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడతూ… గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదని ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి కిడారి ఆదేశించారు. గిరిజన విద్యార్ధుల కోసం స్కిల్ డెవలప్మెంట్, జాబు మేళాలు పెట్టమని చెప్పూర్. గిరిజనుల సంక్షేమం కోసం క్రృషి చేస్తున్న మా ప్రభుత్వంపై పవన్‌..తన స్వార్థం కోసం గిరిజనులను రెచ్చగొడ్తున్నారు అని మంత్రి కిడారి శ్రవణ్ ఆరోపించారు.

kidari 24012019

నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కిడారి, సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణం అని పాడేరు సభలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. బాక్సైట్‌ తవ్వకాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, గిరిజనులని చంద్రబాబు పట్టించుకోవటం లేదని, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే గిరిజన సమస్యలు లేకుండా చేస్తానని అన్నారు. బాక్సైట్‌ తవ్వకాలను ప్రోత్సహించి, కిడారి, సోమ, హత్య కాబడటానికి చంద్రబాబు కారణం అయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గిరిజనులకు సరైన సౌకర్యాలు లేవని, జీవితం మీద విరక్తితో వీరు మావోలుగా మారిపోతున్నారు అంటూ, పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గిరిజనులకు ఎంతో చేస్తున్నా, ఏమి చెయ్యటం లేదు అంటూ, ఆరోపణలు చేసారు.

kidari 24012019

బాక్సయిట్ మైనింగ్ పై ఎలాంటి పోరాటం మనం చేశామో, ఏ విధంగా ఎండ గట్టుపై నిల్చొని మైనింగ్ అడ్డుకునేలా పోరాటం చేశామో అందరికి తెలుసు,మన మన్యం ప్రాంతంలో మైనింగ్ జరగకుండా చేయడానికి పోరాడుతూనే ఉన్నామ‌ని..పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆశయంతో వచ్చిన జనసేనాని ఈ పోరాటానికి మద్దతుగా నిలిచి, అవసరమైతే ఆ ప్రాంతానికి వెళ్లి ధర్నా చేద్దాం తప్పించి అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు అని చెప్పారు.గిరిజన ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీటి పధకం, సరైన రహదారులు కల్పించి అటవీ హక్కుల ద్వారా లభించే ప్రయోజనాలు ప్రతీ గిరిజనుడికి అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.

Advertisements

Latest Articles

Most Read