ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై, ఎలాంటి దాడి జరుగుతుందో చూస్తున్నాం. అవతల వాళ్ళు సొల్లు, సోది చెప్తుంటే, మనం పోలవరం రికార్డులు, అమరావతి అవార్డులతో వారికి సామాధానం చెప్తున్నాం. విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఆంధ్రలు, నిలదొక్కుకుని, పరిగెడుతుంటే, చూడలేని వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు, పక్క రాష్ట్ర రాబందులు, మన రాష్ట్ర అభివృద్ధిని చిన్నాభిన్న చెయ్యటానికి రెడీ అయ్యారు. ఢిల్లీ సూత్రదారులు, పన్నిన వికృత క్రీడలో, జగన్ ఒక పావు . ఇక కేసీఆర్ ఏడుపులు సరే సరి. మన రాష్ట్రం చేస్తున్న పనుల్లో సగం కూడా చెయ్యలేడు, చంద్రబాబుతో పోటీ పడలేడు, కియా లాంటి కంపెనీలు తేలేడు, మన రాష్ట్రంలో జరుగుతున్నంత సంక్షేమ కార్యక్రమాలు చెయ్యలేడు, అందుకే మన రాష్ట్రం పై ఏడుపు. అందుకే జగన్ లాంటి వాడు ఏపి ముఖ్యమంత్రి అయితే, ఈ రాష్ట్రం తన గుప్పిట్లో పెట్టుకోవచ్చని ప్లాన్. అందుకే ఈ వికృత క్రీడలో, గిఫ్ట్ ఇస్తాను అంటూ జాయిన్ అయ్యాడు.

ktr 15012019

ఇక్కడ జగన్, హైదరాబాద్ నుంచి వచ్చి, పార్టీ టైం రాజకీయాలు చేస్తున్నా, చంద్రబాబు ముందు నిలబడలేక పోతున్నారు. అందుకే కేసీఆర్ హెల్ప్ ఆడుతున్నారు. ఇందులో భగంగానే, కేసీఆర్ అత్యంత ఆప్తుడు అయిన, ఒవైసీనీ కూడా వాడటానికి, జగన్ ప్లాన్ చేసాడు. ఇటీవల, మోడీ పై చంద్రబాబు యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి, అనేక సంక్ష్టేమ పధకాల ద్వరా లబ్ది పొందటం, మోడీ తెచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్ లోని లోపాలు ఎత్తి చూపటంతో, ఏపిలో ముస్లింలు, చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో జగన్ అలెర్ట్ అయ్యాడు. ఒవైసీ ద్వారా, ముస్లింలు చంద్రబాబు వైపు వెళ్ళకుండా ఉండేందుకు ప్లాన్ చేసాడు. దీనిలో భాగంగా, అమిత్ షా డైరెక్షణ్ లో, కేసీఆర్ ఆదేశాల మేరకు, జగన్‌కు అత్యం త సన్నిహితుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు.

ktr 15012019

ఇప్పుడు ఇక కుట్రలు పరాకాష్టకు తీసుకువెళ్తూ, రహస్యంగా ఎంతో కాలం రాజకీయం చెయ్యలేమని, ఇక అఫీషియల్ గా కలవటానికి రెడీ అయ్యారు. దీనికి ఫెడరల్ ఫ్రంట్ అనే, ఒక మోడీ ముందు వాయించే ఫిడేల్ ఫ్రంట్ పేరుతో రాజకీయం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్‌తో చర్చలు జరపాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో రేపు ఉదయం కేటీఆర్‌ బృందం చర్యలు జరపనుంది. జగన్‌ నివాసంలో మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది. కేసీఆర్ చెప్తున్న మోడీకి వాయించే ఫిడేల్ ఫ్రంట్ కంటే, చంద్రబాబుని ఎలా ఓడించాలి, ఏపికి జగన్ ని ముఖ్యమంత్రిని చేసి ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనే ప్లాన్ వేస్తున్నారు కేసీఆర్. ఇక వీరందరికీ సరైన బుద్ధి చెప్పాల్సింది ఏపి ప్రజలే...

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న పొలిటికల్ పార్టీ ఏదంటే అనుమానం లేకుండా జనసేన అని చెప్పొచ్చు. బహిరంగ చర్చలకంటే సోషల్ మీడియా ద్వారానే పార్టీ అధ్యక్షుడు పవన్ కార్యకర్తలు, అభిమానులకు ఎక్కువ అందుబాటులో ఉంటారు. అభిమానులు సైతం సోషల్ మీడియాను వినియోగించుకునే పార్టీ ప్రచారాలను ఉదృతంగా నిర్వహిస్తున్నారు. అందుకే పార్టీలో కొందరు అదే సోషల్ మీడియా వేదికగా పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలో భాగంగానే జనసేన అధికారిక లెటర్ ప్యాడ్ పై పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అభ్యర్థులను ఖరారు చేసినట్లు ప్రచారం మొదలుపెట్టారు.

pk 115012019

జనసేన లెటర్ ప్యాడ్ మీద, పవన్ కళ్యాణ్ సంతకంతో సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రకటన జనసేన అభిమానులలో గందరగోళం సృష్టించింది. విజయవాడ సెంట్రల్ శాసనసభ అభ్యర్థి గా కోగంటి సత్యం, తూర్పు శాసనసభ అభ్యర్థిగా పోతిన మహేష్, పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా కొరడా విజయ్ కుమార్ గారిని ఖరారు చేయడం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ సంతకంతో వచ్చిన జనసేన లెటర్ ప్యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది జనసేన అభిమానులు కూడా అభ్యర్థుల ఎంపిక ఈ మూడు స్థానాలకు ఖరారయింది ఏమో అని అనుకున్నారు. అయితే తరువాత తెలిసిన అంశమేమిటంటే ఇది ఎవరో సృష్టించిన నకిలీ లేఖ అని. దాంతో ఇదే సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఖండన ప్రకటనను విడుదల చేసింది.

pk 115012019

మొదట ఈ ప్రెస్ నోట్ చూసి జనసేన శ్రేణులు దాదాపుగా నమ్మేశాయి. సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలుపెట్టాయి. అయితే ఆ లెటర్ విడుదలైన వెంటనే విషయాన్ని పసిగట్టిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం అది నిజమైంది కాదని, అభ్యర్థులను అధ్యక్షుడు మాత్రమే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారని క్లారిటీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా ఆధారంగానే ఎక్కువగా ప్రచారాన్ని ప్రకటనలను విడుదల చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నకిలీ లెటర్‌పై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ కేసు ఫైల్ చేయాల్సిందిగా జనసేన లీగల్ వింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు విచారణ చేసి, ఇది ఎవరు చేసారో బయట పెడితే కానీ, ఇది చేసింది ఎవరో తెలియదు.

సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని తితిదే కల్యాణ మండపంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. ‘‘ప్రజలకు మేలు జరగాలని 24 గంటలు కష్టపడ్డాం. దాని ప్రభావం రాబోయే రోజుల్లో చూస్తారు. నరేంద్రమోదీ, కేసీఆర్‌, జగన్‌ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు. విభజన చట్టంలో హామీలు భాజపా అమలు చేయలేదు. దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. సీబీఐ, ఈడీ దాడులతో అణచివేయాలని చూశారు. అన్యాయం చేసినప్పుడే తిరుగుబాటు చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.

cbn pk 15012019 2

అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు స్పందించారు. కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కయ్యారని పవన్‌ చెప్పారని, ఆఖరికి తాము చెప్పిందే పవన్‌ కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాన్ని ఏపీ తిప్పికొట్టబోతోందని ఆయన చెప్పారు. ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయ పార్టీ నడుపుతూ ఏపీలో వ్యవస్థపై నమ్మకం లేదంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, మోదీ, జగన్‌ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరని, ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbn pk 15012019 3

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసిరావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీతో కలిసి టీఆర్‌ఎస్‌ ఇక్కడ పోటీ చేయొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరానికి ఎందుకు అడ్డంపడ్డారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ఎందుకు మాట్లాడదని మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మోదీ ప్రభుత్వం పోవాలని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెబుతున్నారని, టీఆర్‌ఎస్, జగన్, మోదీ అంతా ఒకటే కదా.. హోదాపై ఎందుకు ప్రకటన చేయించరని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలుంటే ముందుకు రావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మోదీ ఈ మధ్య చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే, అది అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం. దానికి మంత్రివర్గం ఆమోదం పలికిన తరువాత ప్రకటన చేయగా.. వెంటనే పార్లమెంటు ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం కూడా పూర్తయ్యాయి. దీంతో... ఈ చట్టం అమలు చేయడానికి అన్ని దారులూ తెరుచుకున్నాయి. ఇది రాజకీయం కోసం చేసినా, ఓట్లు కోసం చేసినా, ప్రజలకు మంచి కాబట్టి, ఎవరైనా స్వాగతిన్చాల్సిందే. రాజకీయ పార్టీలు ఎవరైనా, ఓట్లు కోసమే చేస్తారు. ప్రజలకు మించి జరిగితే అదే చాలు. ఇప్పుడీ చట్టాన్ని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ పోయిన వారం అమలు చేయడానికి నిర్ణయించింది. దీంతో... అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్ క్రెడిట్ కొట్టేసింది.

reservation 15012019

అయితే, ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాష్ట్రానికి సంబంధించి ఆయా వర్గాల వివరాలు, రిజర్వేషన్ల అమలులో కేంద్రం విధించిన నిబంధనలకు అనుగుణంగా విధివిధానాలు ఖరారు చేసే పనిలో పడింది. ఈ బిల్లు గత వారమే పార్లమెంట్‌లో ఆమోదం పొంది.. ఆ తర్వాత రాష్ట్రపతి ఓకే చెప్పినా.. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆయా రాష్ట్రాలు కొన్ని నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఈబీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీని పై అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి.

reservation 15012019

నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో పెద్దగా అడ్డంకులు లేకుండానే ఆమోదం పొందింది. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లును రెండు రోజుల క్రితం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించడంతో చట్టంగా మారింది. అన్ని పార్టీలు ఆమోదించటంతో, మిగతా రాష్ట్రాలూ దీన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా కేంద్రం 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా సుధీర్గ చర్చల అనంతరం ఆమోదం లభించింది. పార్లమెంట్ ఉభయ సభలతో ఆమోదం పొందిన రాజ్యాంగ సవరణ బిల్లును తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. రాజముద్రతో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం చట్టరూపం దాల్చినట్టైంది.

 

Advertisements

Latest Articles

Most Read