తిరుమల అంటే ప్రతి ఒక్కరకీ ఎంతో పవిత్రమైన స్థలం... ఆ వెంకన్నను దర్శించుకుని, జీవితంలో ముందుకు పోతూ ఉంటాం... అలాంటి తిరుమలని అప్రతిష్టపాలు చెయ్యటం ప్రారంభించిన వైఎస్ఆర్ దగ్గర నుంచి ఆయన వారసుడు జగన్ తో పాటు, ఆయన పార్టీ నాయకులు కూడా, తిరుమల వచ్చిన ప్రతి సారి, ఎదో ఒక రచ్చ చేసి కాని వెళ్ళరు... నెలకి ఒకసారి వైసీపీ ఎమ్మల్యే రోజా, అలాగే తిరుమల వెళ్ళిన ప్రతి సారి జగన్, ఇలాంటి రచ్చ చేస్తారు. అయితే ఈ రోజు కూడా జగన్ తిరుమల వచ్చారు. తన పాదయాత్ర పూర్తయిన సందర్భంలో, జగన్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, జగన్ ప్రతి తిరుమల పర్యటన లాగే, ఈ పర్యటన కూడా వివాదాల మధ్యే నడించింది...

jagantirumala 1012019

జగన్ బ్యాచ్ అంతా హడావిడి చెయ్యటంతో, తిరుమల శ్రీవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ పార్టీ అధినేత జగన్‌తోపాటు పార్టీ కార్యకర్తలు లోపలికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో గందరగోళం ఏర్పడింది. టోకెన్ లేకుండా క్యూ కాంప్లెక్స్‌లోకి కార్యకర్తలు ప్రవేశించారు. అక్కడ సిబ్బంది ఎంత అడ్డుకున్నా, తోసుకుని వెళ్ళిపోయారు. దీంతో వైసీపీ కార్యకర్తలపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలినడక మార్గంలో పలు చోట్ల జై జగన్, సీఎం జగన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని వైసీపీ నాయకులు, టీటీడీ సిబ్బంది వారించారు. అయినా ఆపలేదు. గోవింద నామస్మరణ ఉండాల్సిన చోట, సియం జగన్, జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు.

jagantirumala 1012019

నిజానికి జగన్ కు, ఆలయాల్లో ఎలా ఉండాలి అనే నియమాలు తెలీవు... తను క్రీస్టియన్ కనుకే, హిందువుల వోట్లు తనకి పడట్లేదు అని, అందుకే హిందువులను మంచి చేసుకోవటానికి, అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను మచ్చిక చేసుకోవటానికి, జగన్ ఈ గుడులు, స్వామీజీల కాళ్ళ మీద పడటం లాంటి పనులు చేస్తున్నారు... భారత దేశంలో ఏ మతం వారైనా, వెంకన్నను దర్శించుకోవచ్చు కాని, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. అన్యమతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అంటే, ముందుగా శ్రీ వారి పట్ల మాకు నమ్మకం ఉంది అని, డిక్లరేషన్ ఇవ్వాలి... ఎంత పెద్ద వారు వచ్చినా అది ఆనవాయతీ... జగన్ ఎప్పుడూ అవి పాటించలేదు. జగన్ శ్రీ వారి పట్ల, నమ్మకం ఉంది అని సంతకం పెట్టటానికి, బాధ ఏంటో ఎవరికీ తెలియదు. దీనికి తోడు, ఈ జై జగన్ నినాదాలు ఒకటి...

చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన మహిళ నౌహీరా షేక్‌! జిల్లాలు, రాష్ట్రాలు దాటి పలు దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. వేలకోట్ల మోసాలకు పాల్పడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను సైతం షేక్‌ చేస్తోన్న హీరా గ్రూప్‌ సంస్థల అధినేతకు బీజేపీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఏర్పాటు చేసే కార్యక్రమాలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముఖ్య అతిథిగా హాజరవడం, బుల్లెట్‌ రైలు శంకుస్థాపన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోదీ ఫొటోతో నౌహీరా షేక్‌ భారీగా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, హోర్డింగులు ఏర్పాటు చేయడం, సంస్థ వెబ్‌సైట్‌లో బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమాలు ఉండటంపై ఏపీ పోలీసులు ఆరా తీస్తోంటే కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. గొలుసుకట్టు పథకం పేరుతో వందల కోట్లు మోసం చేశారంటూ తెలుగు రాష్ట్రాల్లో నౌహీరా షేక్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. విదేశీ మారక ద్రవ్య నిబంధనలను కూడా ఆమె ఉల్లంఘించినట్లు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల విచారణలో తేలింది. హీరాగోల్డ్‌, హీరా ఫుడెక్స్‌, హీరా టెక్స్‌టైల్స్‌.. ఇలా తన గ్రూపు సంస్థల్లోకి వందల కోట్ల విలువైన డాలర్లు, రియాళ్లు, దినార్లను మళ్లించడం ఎలా సాధ్యమైందనే విషయం చర్చనీయాంశమైంది.

చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరులో నిరుపేద కుటుంబంలో నౌహీరా జన్మించారు. పీలేరు సమీపంలోని వాల్మీకిపురంలో ఒక మండి కూలీని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు, ముంబైకి మకాం మార్చారు. అక్కడి ధనవంతుల పిల్లలకు విద్య బోధించేవారు. ఆ తర్వాత తిరుపతికి వచ్చి మదర్సా ఏర్పాటు చేసి విదేశీ నిధులు సేకరించడం మొదలు పెట్టారు. ఆపై చైన్‌లింక్‌ వ్యాపారంతో మధ్య తరగతిని టార్గెట్‌ చేసి భారీగా డిపాజిట్లు సేకరించారు. ఆఫ్రికా వెళ్లి బంగారం ట్రేడింగ్‌ మొదలుపెట్టి.. లక్ష రూపాయలకు నెలకు రూ.2700 నుంచి రూ.3500 అకౌంట్లలో డిపాజిట్‌ చేయడంతో బడా బాబులు సైతం ఆకర్షితులయ్యారు. కొందరు ఏకంగా రూ.2కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. అమెరికా నుంచి రూ.45 కోట్లు సేకరించిన హీరా... యూఏఈ నుంచి ఏకంగా రూ.2300 కోట్లు సేకరించినట్లు కంపెనీ కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌ల పరిశీలనలో తేలినట్లు సమాచారం.

 

ఏడాదిన్నర క్రితం షార్జాలో టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించిన నౌహీరా రాజ్యాధికారం వైపు మొ గ్గు చూపారు. ‘మహిళా సాధికార పార్టీ’ పేరుతో తానే ఒక రాజకీయ పార్టీ స్థాపించారు. కర్ణాటక ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో నిలిపారు. ‘మాది ఆషామాషీ పోటీ కాదు’ అనేలా భారీ స్థాయిలో ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా మైనారిటీల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. కాంగ్రె్‌సకు పడాల్సిన మైనారిటీల ఓట్లను చీల్చి, బీజేపీ గెలుపునకు సహకరించేందుకే నౌహీరా షేక్‌ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. తమకు బీజేపీతో సంబంధం లేదని ఆమె చెబుతున్నా.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వెబ్‌సైట్‌లలో మాత్రం బీజేపీ నేతల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇది నౌహీరాతో కమల నాథులతో సఖ్యతను తెలియజేస్తున్నాయని ప్రస్తుత ఆమె కేసుల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు అనుమానిస్తున్నారు. 2015 నుంచే హీరాగ్రూప్‌ ఆర్థిక కార్యకలాపాలపై రిజర్వ్‌ బ్యాంకు కన్నేసింది. భారీ ఎత్తున వినియోగదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందన్న ఫిర్యాదుల నేపధ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలు, వాణిజ్య లావాదేవీలపై ఆర్‌బీఐ దృష్టిపెట్టింది. వాస్తవాల నిర్ధారణకు ఈ అంశాన్ని సమన్వయ కమిటీలో చర్చకు పెట్టింది. 2016లో మరిన్ని ఫిర్యాదులు పెరగడంతో ఈడీతో విచారణ చేయించారు. ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో హీరాగ్రూప్‌ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని 2016లోనే ఆర్‌బీఐ పోలీసు శాఖను కోరింది. అప్పట్లో అనేక ఒత్తిళ్లతో అది ముందుకు సాగేలేదు.

ప్రకాశం జిల్లా ప్రజానీకం కల సాకారమైంది. మహా ప్రకాశం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో కీలకమలుపు తీసుకురానున్న రామాయ పట్నం పోర్టుకు, ఆసియా పల్ప్‌ సంస్థ ఆధ్వ ర్యంలో భారీ కాగితపు పరిశ్రమకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాలోని ఉలవపాడు మండలం రామాయపట్నం వద్ద శం కుస్థాపన చేశారు. మేజర్‌ పోర్టా, నాన్‌ మేజర్‌పోర్టా అన్న సంశయాలు అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టును 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు. కాగితపు పరిశ్రమలో దిగ్గజమైన ఆసియా పల్ప్‌ కంపెనీ ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు రావడం శుభసూచక మన్నారు. పోర్టు, భారీ పరిశ్రమ కలిపి ఏర్పాటు చేయడం ద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధికి హితోధికంగా ఉపయోగపడు తుందని చంద్రబాబు పేర్కొ న్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి పైలాన్‌లను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి భారీ కాగితపు పరిశ్రమకు సంబంధించి అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద నైసర్గికమైన అన్ని అనుకూలతలు ఉన్నాయని, ఇక్కడ పోర్టు నిర్మిస్తే లాభాలు ఆర్జిస్తున్న అనేక పోర్టుల కంటే మెరుగైన పోర్టుగా మారుతుం దని చాలా కాలంగా జిల్లా ప్రజానీకం డిమాండ్‌ చేస్తోంది.

రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన దుగ రాజపట్నం పోర్టుకు సానుకూలత లేదని, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన తరుణంలో రామాయపట్నం పోర్టుపట్ల మరింత డిమాండ్‌ పెరిగింది. రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మి స్తుందని, అందుకు అనుగుణంగా అడ్డంకిగా ఉన్న కృష్ణప ట్నం పోర్టు యాజమాన్య హక్కులు కుదింపు చేస్తూ నవయుగ కంపెనీని చంద్రబాబు అంగీకరింపచేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లతో నిర్మాణం చేయడానికి సంక ల్పించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రకాశం జిల్లా రామాయపట్నం నుంచి నెల్లూరు జిల్లా చెన్నూరు వరకు మూడు వేల ఎకరాల్లో భూసేకరణ పూర్తిచేసి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. తొలివిడత గా 5 బెర్త్‌ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మేజర్‌, నాన్‌మేజర్‌ పోర్టంటూ ప్రతిపక్షాలు గొడవచేసే ప్రయత్నం చేస్తున్నాయని, దీనిని 2022 నాటికి పూర్తిచేస్తామని ప్రకటిం చారు. మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారి జీవనోపాధికి ఎలాంటి సమస్య రాకుండా పోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి వేళ రామాయపట్నం పోర్టు నూతన కాంతు లు తీసుకువస్తుందని సీఎం ప్రకటించారు. పోర్టుతో పాటు భారీ కాగితపు పరిశ్రమ కూడా రావడం జిల్లా ప్రజల అదృష్ట మని పేర్కొన్నారు.

ఆసియా పల్ప్‌ కంపెనీ రూ. 24,500 కోట్ల పెట్టుబడితో కాగితపు పరిశ్రమ స్థాపిస్తుందని, సుబాబుల్‌, జామాయిల్‌ రైతాంగానికి ఈ పరిశ్రమ ఓ వరం కానుందన్నా రు. ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఏపీపీ కంపెనీ ముందుకు రావడం ఓ రికార్డన్నారు. అనంతపురంలో ఏర్పా టైన కియా మోటార్స్‌ కంపెనీ కూడా రూ. 15 వేల కోట్ల పెట్టు బడి పెట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని, వీటన్నింటి ద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంద బోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు కావాల్సినంత ప్రోత్సాహం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇటువంటి పరిశ్రమలు రావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. పెట్టుబడి పెట్టేవారు ఊరికేరారని వారికి తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. కాగితపు పరిశ్రమ నిర్మాణానికి ఆసియా పల్ప్‌ కంపెనీ 2.5 సంవత్సరాలు గడువు కోరిందని, అయితే వారి కి 18 నెలల నుంచి 20 నెలలు మాత్రమే గడువు ఇస్తున్నామని, ఈలోగా పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ ప్రాజెక్టుకు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ను ప్రత్యేక అధి కారిగా నియమిస్తు న్నా నని, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహ కారం కావా లన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కంపెనీ కూడా అగ్రిమెంట్‌ చేసుకొని మౌనంగా ఉంటే కుదరదని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు లైట్ ఆటో కంపోనెంట్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది. మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా సమక్షంలో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) సీఈఒ జాస్తి కృష్ణకిషోర్, సంస్థ ఎండీ బాలానంద్ జాలాది ఒప్పంద అవగాహనా పత్రాలపై సంతకాలు చేశారు. వాహనాల విడిభాగాల తయారీలో రూ. 300 కోట్ల పెట్టుబడికి లైట్ ఆటో సంస్థ ముందుకొచ్చింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అనువైన ప్రాంతాలను గుర్తించి పరిశ్రమ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొదటి దశలో 100 కోట్లు, రెండో దశలో మరో 200 కోట్లు పెట్టుబడికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

light 10012019

దీనివల్ల 250 మందికి ప్రత్యక్షంగా, మరో 350 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అల్యూమినియానికి ప్రత్యామ్నాయంగా మెగ్నీషియంతో వాహనాల విడిభాగాలు తయారు చేయటం వల్ల బరువును నియంత్రించడంతో పాటు ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని సంస్థ సీఈఒ సుభాచరణ్ తెలిపారు. మరో పక్క, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రూ.150 కోట్ల పెట్టుబడితో ప్రింటింగ్‌, ప్యాకింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు దేశంలోనే పేరొందిన కళాజ్యోతి ప్రింటింగ్‌ కంపెనీ ముందుకొచ్చింది.

light 10012019

వీటి ఏర్పాటుతో ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా 800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలో సంస్థ డైరెక్టర్‌ అలపాటి రామనాథ్‌, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. 1946లో ఏర్పాటై ఆఫ్‌సెట్‌ ముద్రణలో ఎంతో ప్రాచుర్యం కలిగిన ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై ఈడీబీ సీఈవో కృష్ణకిశోర్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read