వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన విహార యాత్రను ముగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ప్రతి వారం ఇంటికి వెళ్తూ చేసిన ఫ్యాన్సీ యాత్రకు పవిత్రత ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. తాను అర్ధరాత్రి దాటాకా కొన్ని రోజులు నడిచిన సందర్భాలున్నాయని, కానీ ఏనాడైనా రాత్రి 7 గంటల తరువాత జగన్‌ పాదయాత్ర చేశారా? అని నిలదీశారు. రోజుకు 8 కిలోమీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా? వారానికోసారి విశ్రాంతి తీసుకుని చేసేది పాదయాత్రా? అని ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజా వేదికలో విలేకరులతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగానూ, అంతకుముందు ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లోనూ చంద్రబాబు మాట్లాడారు. ప్రజల మనోభావాలకు తగ్గట్లే రాష్ట్రంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్‌తోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

cbn jagan 10012019

ఈనెల 19న కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించే సభ రోజున అమరావతిలో ధర్మపోరాట సభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సరైన సమయంలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అప్పట్లో జగన్‌ చేసిన అవినీతి కారణంగా రాష్ట్రం ఎన్నో ఆస్తులను కోల్పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం పరపతి పోయింది. అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారు. ఆస్తులు నిరుపయోగమయ్యాయి’ అంటూ అప్పటి వాన్‌పిక్‌ భూముల వ్యవహారాన్ని గుర్తు చేశారు. ‘ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఎన్నికలకు ముందు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి. అదీ తెదేపా ఎంపీలను సస్పెండు చేసి మరీ బిల్లును ప్రవేశపెట్టారు."

cbn jagan 10012019

"అత్యంత కీలకమైన ఈ బిల్లులో తెదేపాను భాగస్వామిని చేయలేదు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. కోడి కత్తి కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు. ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం రాష్ట్ర అధికారాల్లోకి కేంద్రం చొరబడటమే. గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ జోక్యాన్ని మోదీ వ్యతిరేకించారు. ఇప్పుడు దాన్నే మన రాష్ట్రంపై ప్రయోగిస్తున్నారు. భవిష్యత్తులో నేను ఎవరినో కొట్టానంటూ తప్పుడు కేసులు బనాయించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమరావతి భూముల్లో అవినీతి అంటున్నారు. ఆ భూములను రైతులే ముందుకొచ్చి ఇచ్చారు. వారికి తిరిగి 30 శాతం అధికంగానే ప్రయోజనం చూపిస్తాం. రాష్ట్రంలో మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

చంద్రబాబుని గెలిపించింది నేనే... చంద్రబాబుకి అనుభవం ఉందని, నేనే మద్దతు ఇచ్చి గెలిపించా... నేను కాపుని, కాని నాకు అన్ని కులాలు ముఖ్యం... చంద్రబాబుకి ఎలా పాలించాలో తెలియదు.. ఏపిలో మార్పు రావాలి, నేను మార్చేస్తా... ఏపి యువత అంతా నా వెంటే ఉన్నారు... తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే టైం నాకు లేదు, ముందస్తు రాకుండా ఉంటే పోటీ చేసే వాడిని, తెలంగాణాలో నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు... చంద్రబాబు నన్ను చూస్తే భయపడి పోతున్నారు.. చంద్రబాబు నాకు పర్మిషన్ ఇవ్వటం లేదు.. పోయిన ఎన్నికల్లో టిడిపిని నేనే గెలిపించా, ఈ సారి మాత్రం గెలిపించను... ఈ మాటలు అన్నది ఎవరో చెప్పుకోండి ? పవన్ కళ్యాణ్ ఏ కదా, ఇంత సిల్లీ ప్రశ్న ఏంటి అనుకుంటే, మీరు పొరపాటు పడినట్టే..

paul 10012019

అచ్చం జనసేన లాగా, అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఆలోచించే ఇంకో కొత్త పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలు ఇవి. మత ప్రచారకులు, ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కె.ఎ.పాల్‌ చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు ప్రధాని మోడీ పైనే ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ చంద్రబాబునే కాదు, అక్కడ మోడీ కూడా నా వల్లే గెలిచాడు అంటున్నాడు పాల్.. మోదీకి సపోర్ట్ చేయొద్దని ఎల్‌కే ఆడ్వాణీగారు చేతులు జోడించి మరీ తనను రిక్వెస్ట్ చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ వ్యవహారాల గురించి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. 2014లో తాను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. మోదీయే తన వద్దకు వచ్చి అడగడం, సెక్యులరిజం అని చెప్పడంతో ప్రచారం చేశానన్నారు.

paul 10012019

‘‘మీరు బీసీ, నేను బీసీ. నాకు ఫ్యామిలీ లేదు. మీకూ ఫ్యామిలీ లేదు. దేశమే మన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని గంటా నలభైఐదు నిమిషాలపాటు నాతో చర్చించారు. బీజేపీ ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు, ట్రెజరర్లు.. ఇలా అందరినీ అమెరికా పంపించి.. మసాజ్ చేసి.. రిక్వెస్ట్ చేసి.. ఇది చేసి, అది చేసి ఎంతగా నన్ను వేడుకున్నారంటే.. ఒక చిన్న కుర్రాడిలా మోదీ బిహేవ్ చేశారు. అయితే ఆడ్వాణీగారు మాత్రం వద్దన్నారు. 2013 అక్టోబర్ 1న చేతులు జోడించి గంటన్నరపాటు చెప్పారు. మోదీకి సపోర్ట్ చేయొద్దు. అతను ఒక్క హామీని కూడా నెరవేర్చడని చెప్పారు. ఆయనే తన ఇంటికి డిన్నర్‌కు పిలిచి ఈ విషయం చెప్పారు. నేను మోదీగారి ఇంటికి వెళ్లలేదు. ఆయనే నా దగ్గరికి వచ్చారు. కానీ ఆడ్వాణీగారి ఇంటికి వెళ్లాను.’’ అని కేఏ పాల్ వెల్లడించారు.

 

వైద్య రంగంలో ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయ్యాయని, విద్యారంగంలో ఆ పరిస్థితి రానీయొద్దని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌, ఏయూ కులపతి నరసింహన్‌ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేటు వర్సిటీలతో పోటీ పడాలంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలా అనడం నేరమని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వేదికపై బుధవారం చోటుచేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 85, 86వ ఉమ్మడి స్నాతకోత్సవాన్ని బుధవారం విశాఖపట్నంలోని సర్‌ సీఆర్‌రెడ్డి మందిరంలో నిర్వహించారు.

governor 10012019

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్య అతిథిగా ఐఐటీ- దిల్లీ సంచాలకులు వి.రామ్‌గోపాల్‌రావు పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యారంగానికి ఏటా రూ.25 వేల కోట్లు వెచ్చిస్తూ రాష్ట్రంలో విజ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తున్నాయని, వాటితో పోటీ పడి ప్రభుత్వ వర్సిటీలు ఎదగాలని సూచించారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో ప్రభుత్వ వర్సిటీలు పోటీ పడలేవని పేర్కొన్నారు.

governor 10012019

వర్సిటీల్లో పలు నియామకాలకు, పదోన్నతులకు పీహెచ్‌డీ చేసి ఉండాలన్న నిబంధన విధిస్తుండడంతో చాలా మంది వ్యక్తిగత ఆసక్తితో సంబంధం లేకుండా పీహెచ్‌డీ చేస్తున్నారని వాపోయారు. ‘‘ఎంతమంది పరిశోధనలు నాణ్యంగా ఉంటున్నాయి? ఎన్ని పరిశోధనలు సమాజానికి ఉపయుక్తంగా ఉంటున్నాయి? ఒక ఆచార్యుడు ఎంతోమందితో పీహెచ్‌డీలు చేయిస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? బీఏ, బీకాంల మాదిరిగానే పీహెచ్‌డీలను కూడా ఒక డిగ్రీ తరహాలో చేస్తున్నారు. కట్‌, కాపీ, పేస్ట్‌’ సంస్కృతి ఎక్కువగా ఉంటోంది. దీనిపై దేశవ్యాప్తంగా సమీక్ష జరగాలి’’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అమరావతిలోని, స్టార్టప్ ఏరియా ఫేస్1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరయ్యారు. లింగాయపాలెం స్టార్టప్‌ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. బిజినెస్‌ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరుగనుంది. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ అంకుర అభివృద్ధిలో భాగంగా వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారి రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. సింగపూర్‌ ప్రభుత్వం మద్దతుతో.. టెక్నాలజీ డెవలెప్‌ చేయాలన్నా, ప్రొజెక్టు చేయాలన్నా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. చాలా అంశాల్లో సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు.

startup 10012019

ఏంటీ ప్రాజెక్టు? అమరావతిలో 1,691 ఎకరాల్ని స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంను రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేసింది. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్‌ ఏరియాని అభివృద్ధి చేయనున్నాయి. ఈ రెండూ కలసి ఏర్పాటు చేసిన సంయుక్త భాగస్వామ్య సంస్థే ఏడీపీ. 1,691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన.

startup 10012019

ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... ఉత్ప్రేరకాభివృద్ధిగా 50 ఎకరాల్ని మొదట ఏడీపీ అభివృద్ధి చేయాలి. దానిలో భాగంగానే ‘వెల్‌కం గ్యాలరీ’ ప్రాజెక్టుని ఏడీపీ చేపట్టింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి కోసం మొదట ఒప్పందం చేసుకున్నప్పుడు వెల్‌కం గ్యాలరీ ప్రాజెక్టు ప్రతిపాదన లేదు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో... మొదట ఐదు ఎకరాల్లో ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. దీన్ని ‘వెల్‌కం గ్యాలరీ’గా మార్చారు. భవిష్యత్‌ అవసరాల కోసం 75 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాన్ని ఇక్కడ నిర్మిస్తారు.

Advertisements

Latest Articles

Most Read