వైఎస్ కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వైఎస్ మరణం తర్వాత పలు అంశాల్లో వైఎస్ కుటుంబంలోనే పదేపదే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఏకంగా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి… తన సోదరుడి ఇంటి ముందే ఆందోళనకు దిగే పరిస్థితి ఏర్పడింది. పులివెందులలో వైఎస్ ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళనకు దిగారు. వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి తన సోదరుడు వైఎస్ ప్రతా్‌పరెడ్డి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఆస్తుల పంపకం విషయంలో ప్రతాప్ రెడ్డికి, వైఎస్ వివేకానందరెడ్డికి మధ్య విభేదాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఆర్ధిక వ్యవహారాల గొడవ కారణంగా ప్రతాప్ రెడ్డి, వివేకానందరెడ్డి మధ్య గొడవ జరుగుతోందని చెబుతున్నారు.
కడప జిల్లా పులివెందులలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళితే.. వివేకానందరెడ్డి అనుచరుడు రవీంద్రనాథరెడ్డి, వివేకానందరెడ్డి చిన్నాన్న కొడుకు వైఎస్ ప్రతా్‌పరెడ్డి బావమరిది రాజశేఖర్‌రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం వద్ద గ్రానైట్ క్వారీని భాగస్వామ్యంతో లీజుకు తీసుకున్నారు. ఈ క్వారీ దాదాపు రూ.600 కోట్ల విలువ చేస్తుందని అంచనా. 2008లో మొదలైన ఈ క్వారీ 2012 వరకు రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలోనే సాగింది. అప్పటికే రవీంద్రనాథరెడ్డి రూ.50 లక్షల మేర రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చారు. అయితే ఇంతవరకు తనకు ఎటువంటి అకౌంటు చూపలేదని రవీంద్రనాథరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో ఆయన వివేకాను ఆశ్రయించారు. దీంతో వివేకా తన సోదరుడి ఇంటి ముందే నిరసనకు దిగారు.
2008లో మొదలైన ఈ క్వారీ 2012 వరకు రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలోనే సాగింది. అప్పటికే రవీంద్రనాథరెడ్డి రూ.50 లక్షల మేర రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇంతవరకు తనకు ఎటువంటి అకౌంటు చూపలేదని రవీంద్రనాథరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో ఆయన వివేకాను ఆశ్రయించారు. దీంతో వివేకా తన సోదరుడి ఇంటి ముందే నిరసనకు దిగారు. వైసీపీ నాయకుడిగా ఉన్న వివేకానందరెడ్డి స్వయంగా తన సోదరుడి వరుసయిన ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తోంది. వివాదాన్ని రచ్చకెక్కకుండా పరిష్కరించుకోవాలని ఆయన తన బాబాయ్‌లకు సూచించినట్టు సమాచారం.