2019 ముందు వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్దిని చూసి, ఈనాటి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తుంటే మనం అబివృద్దిలో ఎంత దిగజారిపోయామో తెలుస్తుంది. అప్పట్లో చంద్రబాబు సియంగా ఉన్నప్పుడు, పరిశ్రమలు పెట్టడానికి కంపెనీలు క్యు కట్టేవి . కాని ఇప్పుడు వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త కంపెనీలు రాక పోగా , మొదలు పెట్టిన కంపెనీలను కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. అయితే తాజాగా ఈ లిస్టు లో చేరింది జాకీ కంపనీ . అప్పట్లో చంద్రబాబు ఉన్నప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న జాకీ సంస్థ , ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ పెట్టడానికి 2017 లో నే ఒప్పందం కుదుర్చుకుంది.. అందుకు కావలసిన స్థల కేటాయింపులు, సన్నాహాలు టిడిపి ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయాయి. అయితే 2019 రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనంతపురం రాప్తాడు దగ్గర మొదలు పెట్టాలని జాకీ పరిశ్రమ నిర్ణయించింది. వైసిపి పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి , నాకు ఎలక్షన్స్ కు రూ.20 కోట్లు ఖర్చయింది, అందులో సగం మీరు ఇవ్వాల్సిందే అని, అంతే కాకుండా ఆ కంపెనీకి సంబందించిన ఉద్యోగాలు తాను ఎవరికీ చెబితే వారికి ఇవ్వాలని బెదిరించడం మొదలు పెట్టాడు.
అంతే కాకుండా కంపెనీ సబ్ కాంట్రాక్ట్లు అన్నీ తనకే ఇవ్వాలని డిమాండ్ చేసాడు. దీంతో అసలుకే మోసం వచ్చింది. తాము ఈ రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయట్లేదని, తాము కట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని జాకీ పరిశ్రమ తేల్చి చెప్పింది. పరిశ్రమ పెడతామంటే రెడ్ కార్పెట్ వేయాల్సిన ప్రభుత్వాలే ఇలా చేస్తే ఎలా ? వేలాది మందికి ఉపాది కల్పించే పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతే యువతకు భవిషత్తు ఎలా ఉంటుంది. రాష్ట్రం ఎలా అబివృద్ది చెందుతుంది ? ఇక ఈ పరిశ్రమ ఇప్పుడు తెలంగాణాకు వెళ్ళిపోయింది. తెలంగాణాలో ఈ ప్లాంట్ పెట్టనున్నారు. దాదాపుగా 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఇక్కడే ఉండి ఉంటే, మన రాయలసీమ ప్రజలకే ఆ ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు అన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. రాయలసీమలో హైకోర్టు పెడతాం అని చెప్తున్న ప్రభుత్వాలు, నాలుగేళ్ల నుంచి చేసింది ఏమి లేదు కానీ, ఇప్పుడు మాత్రం యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తరలి వెళ్ళిపోయేలా చేస్తున్నారు.