తెలంగాణ సీఎం కెసిఆర్ చేతకాని మాటలకు.. సోయలేని మాటలకు.. అయన అన్న లఫంగి మాటలకు భయపడేవాళ్లు ఎవరు లేరన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. 2009 లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న లఫంగి ఎవరని ప్రశ్నించిన అయన గెలిచి క్యాబినెట్ వేయను చేతకాక.. పిరికిపందలాగా సోయ లేకుండా మాట్లాడుతున్నావా? కాలం కలిసివచ్చి గెలిచిన సీఎం నక్షలైట్లకు భయపడి విజయవాడ ఆటో నగర్ లో దాక్కున్న సంగతి మర్చిపోయావా? ఐదేళ్లు ఎలాగూ తిరిగి వస్తుంది.. నువ్వు అన్న ప్రతిమాట నీకే వర్తిస్తుంది అన్న సంగతి తెలుసుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోరు తెరిస్తే పీకుతా పీకుతా అనే మాటలకు భయపడేవాళ్లు ఎవరు లేరన్న దేవినేని ఏం పీకుతావు? అని ప్రశ్నించారు.

uma 30122018

అప్పులలో కష్టాలలో ఏపీ ప్రభుత్వం ఒకటిన్నరలక్ష రుణమాఫీ చేస్తే నువ్వు చేసింది బోడి లక్ష. అప్పుల్లా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి చూసి నేర్చుకో.. బాధ్యత లేకుండా మాట్లాడితే చెల్లవన్నారు. కెసిఆర్ పోలింగ్ అక్రమాలు బయటకు వస్తాయన్న దేవినేని.. రంకు, బొంకు దాగవని తెలుసుకో.. పార్లమెంటు ఎన్నికల వరకు ఓపికగా మంచిగా.. బాధ్యతగా మాట్లాడ్డం నేర్చుకోవాలన్నారు. దేశంలో ఏ నాయకుడిని అడిగినా నీ స్థాయి ఏంటో.. చంద్రబాబు స్థాయి ఏంటో చెప్తారు.. తెలుసుకొని మాట్లాడాలన్నారు. మా నాయకుడు నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నిబద్దత నేర్పించారని.. నీలా నీతిమాలిన మాటలు నేర్పలేదన్నారు.

uma 30122018

డబ్బు మదంతో అధికారం తలకెక్కి కేసీఆర్ సోయ లేకుండా మాట్లాడుతున్నాడంటూ విరుచుకుపడ్డారు. బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గెలిచానన్న అహంకారంతో ఎగిరెగిరిపడుతున్నావ్ అంటూ విమర్శించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ నిలదీశారు. దొంగనోటు కేసులో జైలుకెళ్లబోతున్న నిన్ను కాపాడి మంత్రిని చేసిన విషయం మరచిపోయావా అంటూ నిలదీశారు. కేసీఆర్ గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మంచిదని సూచించారు. ఒకప్పుడు నక్సలైట్లకు భయపడి బెజవాడ వచ్చి దాక్కుంది గుర్తులేదా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. తాను హైదరాబాద్ వెళ్లనని బెజవాడలోనే ఆటో తిప్పుకుని బతుకుతానన్నది మరచిపోతే ఎలా అంటూ నిలదీశారు. ఏదోకాలం కలిసి వచ్చింది రెండోసారి సీఎం అయ్యావ్ అధికారంతో మిడిసిపడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఏదో పీకుతానని బెదిరిస్తున్నావ్ ఏం పీకుతావ్ పీక్కో అంటూ సవాల్ విసిరారు.

నవంబర్ 8... ఈ తారీఖు ప్రతి భారతీయుడికి గుర్తుండి పోయే రోజు.. 500, 1000 నోట్లు రద్దుతో, ప్రతి ఒక్క పౌరుడు ఇబ్బంది పడ్డాడు.. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. అయితే అప్పట్లో దేశ ప్రయోజనాల కోసమని నమ్మి ప్రజలు కష్టమైన సహకరించారు. కాని రాను రాను, ప్రజల ఇబ్బందులు తీర్చటంలో మోడీ ఫెయిల్ అయ్యారు. ఎందుకు చేసారో, దాని ఉద్దేశం ఏంటో పక్కదారి పట్టింది. బీజేపీ నేతలు ఆ చర్యల వల్ల లాభపడ్డారు కాని, సామాన్య ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు, ప్రతి సెక్టార్ దెబ్బతింది. చిన్న వ్యాపారాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఈ కోవలోనే రైతన్నలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాని కేంద్రం మాత్రం, అంతా బాగుందని బుకాయిస్తూ వచ్చింది. కాని నిజం బయటకు రాకుండా ఉండదు కదా...

demo 29122018

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ ఇటీవల నివేదిక రూపొందించిన కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా యూటర్న్‌ తీసుకుంది. నోట్ల రద్దు వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడిందని చెబుతోంది. గణాంకాలను తీసుకోవడంలో జరిగిన పొరబాటు వల్లే గతంలో ఆ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవసాయ రంగంపై నోట్లరద్దు ప్రభావంపై ఇటీవల ఆ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్యానెల్‌కు నివేదిక అందించింది. అందులో..‘పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత రూ. 15లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణి నుంచి వెనక్కివెళ్లాయి. ఫలితంగా వ్యవసాయ రంగంలో తీవ్ర నగదు కొరత ఏర్పడింది. రబీ సీజన్‌లో రైతులు విత్తనాలు, పురుగుల మందులు కొనుక్కోలేకపోయారు’ అని వ్యవసాయ శాఖ ఆ నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

demo 29122018

ఇవి కాస్తా వివాదాస్పదంగా మారడంతో తాజాగా నష్టనివారణ చర్యలు చేపట్టింది వ్యవసాయ శాఖ. నోట్ల రద్దుపై పార్లమెంటరీ ప్యానెల్‌కు మరోసారి నివేదిక సమర్పించిన మంత్రిత్వశాఖ.. గణంకాల సేకరణలో జరిగిన పొరబాట్ల కారణంగా గతంలో అలా చెప్పామని పేర్కొంది. నిజానికి నోట్ల రద్దుతో వ్యవసాయ రంగం లాభపడిందని, రబీ సీజన్‌లో విత్తనాలు, పురుగుల మందుల విక్రయాలు కూడా పెరిగాయని తాజా నివేదికలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేగాక 2016 రబీ సీజన్‌లో పంటల దిగుబడి కూడా పెరిగిందని నివేదికలో పేర్కొన్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. మొత్తానికి చేసిన ఒక తప్పుకు, తప్పు మీద తప్పు చేస్తూ, కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తుంది.

కియా రాకతో అనంతపురం ఎలా మారిపోయిందో, ఇప్పుడు కాకినాడ కూడా అలా మారే అవకాసం కనిపిస్తుంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో మెగా పెట్రోకెమికల్ ప్రాజక్ట్ ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశ మందిరంలో సీఎస్ అనిల్‌చంద్ర పునీఠ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ కమిటీ స‌మావేశంలో ఈ ప్రాజక్ట్ విషయమై చర్చించారు. హల్డియా పెట్రోకెమికల్స్ సంస్థతో కలసి టీసీజీ రిఫైనరీ లిమిటెడ్ ఈ కెమికట్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రాజక్ట్ ని చేపట్టడానికి ముందుకు వచ్చినట్లు అధికారులు సీఎస్ కు వివరించారు.

kakinada 29122018 1

ఆ సంస్థ ప్రతిపాదించిన ప్రకారం అయిదు ఏళ్లలో పూర్తి అయ్యే ఈ ప్రాజక్టుకు దశలవారీగా రూ.62 వేల కోట్ల పెట్టుబడి పెడతారని, ప్రత్యక్షంగా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజక్టుకు అవసరమైన 2500 ఎకరాల ప్రైవేటు భూములను ఆ సంస్థ కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రవేట్ భూముల ధరలు, పెట్టుబడులు, జీఎస్టీ, బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్(ఇఐడిఎఫ్), కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్, ఎక్సట్రనల్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్, విద్యుత్ సబ్జిడీ తదితర అంశాలను చర్చించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ డి.సాంబశివరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వళవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై నిర్ణయాధికారాన్ని చంద్రబాబుకే వదిలేసినట్లు సమాచారం. ‘రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలన్నది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మన రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీచేస్తే మీకు లాభమనుకుంటే అలాగే వెళ్దాం. ఎవరికి వారు విడిగా పోటీ చేయడం మంచిదనుకుంటే అదే చేద్దాం. ’ అని ఆయన చంద్రబాబుతో అన్నట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు చంద్రబాబు చొరవ తీసుకుని అన్ని బీజేపీయేతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రాహుల్‌తోనూ చర్చించారు. తర్వాత కూడా ఫోన్లో ఇరు పక్షాల మధ్య రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీల్లో పెద్దదైన కాంగ్రె్‌సను కలుపుకొని వెళ్తేనే కూటమి బలంగా ఉంటుందని.. ఆ పార్టీ లేకుండా ప్రతిపక్ష కూటమి ఏర్పడితే దానికి ప్రజల్లో విశ్వసనీయత ఉండదని మిగిలిన అన్ని ప్రాంతీయ పార్టీలకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

pottulu 29122018

కాంగ్రెస్‌ పట్ల అభ్యంతరాలున్న పార్టీల నేతలకు.. కాంగ్రె్‌సకు మధ్య సుహృద్భావ సంబంధాలు ఏర్పరిచే బాధ్యత కూడా కొంత వరకూ ఆయనే తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిపక్ష కూటమి నిర్మాణ బాధ్యతను ఆయన మరి కొంతముందే తీసుకుని ఉంటే ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీఎస్పీల మధ్య పొరపొచ్చాలు వచ్చి ఉండేవి కావని ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా జరగడానికి తాను ఆదర్శంగా ఉండాలన్న అభిప్రాయంతో చంద్రబాబు తెలంగాణలో ముందు నుంచే జాగ్రత్త పాటించారు. మరీ ఎక్కువ సీట్లు అడగకుండా ఒక పరిమితికి లోబడి తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. కాని అక్కడ ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు.

pottulu 29122018

తెలంగాణా సీట్ల సర్దుబాటులో చంద్రబాబు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం కాంగ్రెస్‌ నేతలకు కూడా బాగా సంతోషం కలిగించింది. దీంతో ఆయన పట్ల కాంగ్రెస్‌ అధిష్ఠానం బాగా సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో కూటమి నిర్మాణానికి ఆయన అవసరం చాలా ఉందని, అందరినీ ఏకతాటిపైకి తేగలిగిన చాతుర్యం ఆయనకు ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. రాష్ట్రాల్లో ఏది పెద్ద పార్టీ అయితే ఆ రాష్ట్రంలో దానికి పెద్దన్న పాత్ర ఇవ్వాలని, సీట్ల సర్దుబాటుపై నిర్ణయాధికారం ఆ పార్టీకే ఉంటే సమస్యలు తగ్గుతాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ప్రతిపాదించారు. దీనిపై మిగిలిన పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకుని ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కోణంలోనే ఆంధ్రప్రదేశ్‌ వరకూ ఆయనకే వదిలివేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించుకుందని అంటున్నారు. ‘ప్రస్తుతం ఎవరేమనుకుంటున్నా అవి ఊహాగానాలే. తగిన సమయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం జాతీయ కూటమి పటిష్ఠ నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారు’ అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read