వాళ్ళు చెయ్యరు... చేసే వాళ్ళని చెయ్యనివ్వరు... పైగా అబద్ధపు ప్రచారాలతో హోరెత్తిస్తారు.. అన్నీ ఇచ్చేసాం అని ఒక పక్క అంటారు.. మరో పక్క తప్పుని రాష్ట్రాల పై నెట్టేస్తారు. ఇది కేంద్రంలో బీజేపీ పరిస్థితి తీరు. మన రాష్ట్రం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏపి విభజన చట్టంలో ఒకటైన కడప ఉక్కు ఫ్యాక్టరీ పై, నాలుగేళ్ళుగా తరిగి తిరిగి, కేంద్రం చెయ్యదు అని తెలుసుకుని, సొంతగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున, కడప ఉక్క ఫ్యాక్టరీ పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు చంద్రబాబునాయుడు ఈరోజు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం పై కేంద్రం ప్రభుత్వం ఈ రోజు ప్రకటన ఒక ప్రకటన విడుదల చేసింది.

fy;">kadapa 27122018 2

ఏదో మంచి వార్తా అనుకునేరు. కాదు. ఏపి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, తమ చేతకాని తనాన్ని ఏపి ప్రభుత్వం పై నెట్టివేసే ప్రయత్నం చేస్తూ, ప్రకటన విడుదల చేసింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదిక చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉక్కు కర్మాగారంపై పూర్తి వివరాలు అందించలేదని విమర్శించింది. కడపలో స్టీల్ ప్లాంట్ పై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, దీని ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్తుంది. టాస్క్ ఫోర్స్ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ ప్రభుత్వం స్పందించలేదని, తమ వద్ద ఉన్న నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని విమర్శించింది. నాలుగేళ్ల తరువాత కూడా, వీళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు.

kadapa 27122018 2

దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఘాటుగా జవాబు ఇచ్చింది. మెకాన్ సంస్థకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని.. కేంద్రానికి కావాల్సిన నివేదిక కూడా అందించామని ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పదిసార్లు వినతి పత్రాలను అందించామని.. పరిశ్రమ ఏర్పాటుకు మెకాన్ సంస్థకు సానుకూలంగానే స్పందించిందని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం సహకరించకుండానే మెకాన్ సంస్థ కేంద్రానికి నివేదిక ఇచ్చిందా? టాస్క్ ఫోర్స్ నివేదికను కేంద్రం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించింది. అసలు నాలుగేళ్ల నుంచి ఈ విషయం పై కేంద్రం ఏమి చేస్తుందని, ఇప్పుడు వచ్చి ఏపి ప్రభుత్వం పై తోసెయ్యటం ఏంటని, ముందు మెకాన్ సంస్థ నివేదిక బయట పెట్టి, మాట్లాడాలని, కేంద్రాన్ని, ఏపి ప్రభుత్వం నిలదీసింది.

 

కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది. అసలే సాగదీత అనుకుంటుంటే ఇక ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తోంది. కాంట్రాక్టు సంస్థ ‘సోమా ’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో బుధవారం కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఫ్లై ఓవర్‌ పనులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6 కోట్ల బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్‌ పనులకు బిల్లు చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్రమో తెలియని స్థితి. వస్తాయనుకున్న ఎస్కలేషన్‌ చార్జీలు రూ. 4 కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి. దీంతో ‘సోమా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి. ఎవరైనా డబ్బులు ఇస్తే పని చేస్తారు.. మన ప్రజలే కదా అనుకుంటే, కొంత వరకు లాగగలరు. అక్కడా ఇక్కడా రొటేషన్ చేసి, ఎలాగొలా కొంత కాలం లాగుతారు. అయితే, ఎప్పటికైనా డబ్బులు వస్తాయేలే అనే ఆశతో అలా రిస్క్ తీసుకుంటారు. కాని అసలు డబ్బులే ఇవ్వకుండా, పని చెయ్యాలి అంటే ఎవరి వల్లా కాదు. విజయవాడలో ఇదే జరుగుతుంది. కేంద్రం టార్చర్ ఇలా ఉంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులకు బ్రేక్‌పడింది. అసలే సాగదీత అనుకుంటున్న పనులు ఇప్పుడు అసలే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా జీతాలు అందుకోలేని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జీతాలు చెల్లించలేని అసహాయతలో ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6కోట్ల బిల్లును పే అండ్‌ అక్కౌంట్స్‌ కమిటీ తిరస్కరించింది. చేసిన పనికి రీ వాల్యుయేషన్‌ చేయాలని ఆదేశించటంతో ఇప్పట్లో ఈ బిల్లు వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్‌ పనులకు సంబంధించి బిల్లు కూడా అనిశ్చితిలో పడింది.

మరోవైపు వస్తాయనుకున్న ఎస్కలేషన్‌ ఛార్జీలు రూ.4కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి. దీంతో నిధుల వెసులుబాటుకు కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి. జీతాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చేసింది. నాలుగునెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో కార్మికులు రగిలిపోతున్నారు. కనకదుర్గా ఫ్లైఓవర్‌కు సంబంధించి ఇటు ఫ్లైఓవర్‌ నిర్మాణం, అటు క్యాస్టింగ్‌ డిపోలో కలిపి మొత్తం 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా బీహార్‌, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి వచ్చి కుటుంబాలకు దూరంగా ఇక్కడ పనిచేస్తున్నారు. రోజుకు రెండు షిప్టులలో వీరు పనిచేస్తున్నారు. వీరికి సెప్టెంబరు మాసం నుంచి కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ వేతనాలను చెల్లించటం లేదు. ఒక్కో కార్మికుడికి సగటున రూ. 10వేల నుంచి రూ.15 వేల వంతున చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోమా సంస్థ ప్రతినిథుల ఎదుట పలు దఫాలు కార్మికులు తాము సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని ఆందోళన చేశారు. ఒకానొక దశలో అల్టిమేటం కూడా ఇచ్చినట్టు తెలిసింది.

చేతిలో పైసా లేకపోవటంతో సోమా సంస్థ కార్మికుల జీతాలను చెల్లించలేకపోయింది. దీంతో బుధవారం కార్మికులు మూకుమ్మడిగా సమ్మెలోకి దిగారు. సాయంత్రం కార్మికులను పిలిపించిన సోమా ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు. రెండు నెలల వేతనాలను పండుగ లోపు అందిస్తామని సోమా ప్రతినిధులు కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదనకు కొంతమంది కార్మికులు సుముఖత వ్యక్తంచేయగా.. మరికొంత మంది మాత్రం అంగీకరించలేదు. కాంట్రాక్టు సంస్థ చేసిన పనికి రూ. 6 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లు పే అండ్‌ అక్కౌంట్స్‌ కమిటీ దృష్టికి వెళ్ళగా తిరస్కరించింది. సంవత్సరాంతం కావటంతో పనులకు సంబంధించి రీ వాల్యుయేషన్‌చేసి పంపించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. రీవాల్యుయేషన్‌ చేసి పే అండ్‌ అక్కౌంట్స్‌కు పంపించటానికి చాలా సమయం పడుతుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ అయితే కానీ ఆ డబ్బులు రావు. ఇప్పటికే రాష్ట్రం తన వాటా కంటే, దాదాపు 50 శాతం ఖర్చు చేసింది. కేంద్రం మాత్రం, తన వాటాలో సగం కూడా విడుదల చెయ్యలేదు, పైగా డిజైన్ ల పై అభ్యంతరాలు చెప్తూ సాగాదీస్తుంది.

 

దేశంలో రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు విడివిడిగా ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉంటే.. మూడు రాష్ట్రాల్లో గెలుపుతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఇటు బీజేపీ కూడా నాలుగు రాష్ట్రాల ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలో నిమగ్నమై ఉంది. బీజేపీ తరపున ప్రధాని మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి ఉద్ధండులు ప్రచారం చేసినప్పటికీ మూడు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపడం కమలం శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నాళ్లూ మోదీ మేనియాతో నెట్టుకొచ్చిన బీజేపీకి వచ్చే లోక్‌సభ ఎన్నికలు పరీక్ష పెట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని మరో అంశం కలవరపెడుతోంది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేస్తేనే ఓట్లు రాలవన్న విషయం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

yogi 27122018 3

మరో కొసమెరుపేంటంటే.. మోదీ, ఆదిత్య నాథ్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ ఓటు షేర్ పతనం కావడం పార్టీ శ్రేణులను మరింత ఆందోళనకు గురిచేసే అంశం. మిజోరం విషయం పక్కనపెడితే.. మోదీ, ఆదిత్యనాథ్ పర్యటించిన ఛత్తీస్‌గర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో గణాంకాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఓ జాతీయ దినపత్రిక కథనం ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఛత్తీస్‌గర్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 18, రాజస్థాన్‌లో 26, తెలంగాణలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రచారం చేసిన 55 నియోజకవర్గాలకు గానూ 46 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గింది. 7 స్థానాల్లో ఓట్ల శాతం పెరిగింది. యోగి ఆదిత్య నాథ్ మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు.

yogi 27122018 4

ఛత్తీస్‌గర్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 11, రాజస్థాన్‌లో 26, తెలంగాణలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూపీ సీఎం ప్రచారం చేసిన 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 స్థానాల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గింది. 11 స్థానాల్లో పుంజుకుంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కొంత ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ మొత్తం 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఛత్తీస్‌గర్‌లో 19, మధ్యప్రదేశ్‌లో 20, రాజస్థాన్‌లో 28, తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన 75 నియోజకవర్గాలకు గానూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 58 నియోజకవర్గాల్లో పెరిగింది. 12 స్థానాల్లో ఓట్ల శాతం తగ్గింది.

మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయితే తప్ప తాము అసెంబ్లీకి రామన్న వైసీపీ నేతలు పంతం వీడతారా? త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా? లేక మా పంతం మాదేనని గతంలో లాగానే సమావేశాలను బహిష్కరిస్తామని చెబుతారా ? వైసీపీ మళ్ళీ అసెంబ్లీకి డుమ్మా కొట్టబోతోందా? ప్రజల కోసం బెట్టుదిగతారా? జగన్ ఏం ఆలోచిస్తున్నారు? ఈసారైనా అసెంబ్లీకి వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు ఉన్నారా? ప్రభుత్వంలో ప్రతిపక్షం అన్నది కీలకపాత్ర పోషించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన పోరాడాలి. అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుంది.

jagan 27122018

ప్రభుత్వం మీద అలిగిన ప్రతిపక్షం ప్రజల తరపున చట్టసభలో పోరాటం ఆపేసింది. కారణం ఏదైనా సరే ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరిస్తారని ఎమ్మెల్యేని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి గైర్హాజర్ అవుతుండడంపై ప్రజలలో అసంతృప్తి ఎక్కువవుతుంది. మరోపక్క ప్రత్యేకహోదా కోసం కేంద్రంలో పోరాడాల్సిన ఎంపీలు హోదా కోసమే అంటూ రాజీనామాలు చేసి తమతమ పనులలో నిమగ్నమయ్యారు. అక్కడ ఎంపీలు, ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిదులుగా ప్రజల పక్షాన లేకపోవడంతో పార్టీపై సంకేతాలు మారే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ తీరు ఎప్పటికప్పుడు ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు.

jagan 27122018

ప్రజలలో కూడా ప్రభుత్వం మీద అలక ప్రజల మీద చూపిస్తారా? అనేలా అసంతృప్తి రగులుతుంది. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశాలకు హాజరుకాకపోయినా తమ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సమావేశాలకు పంపే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలలో వినిపిస్తున్న మాట కాగా అందుకు జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా? అనే ప్రశ్న కూడా పార్టీ వర్గాలలోనే వినిపిస్తుంది. గత రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈసారైనా అసెంబ్లీకి వస్తారని రాజకీయవర్గాలలో ఆశాభావం వ్యక్తమవుతోంది.

Advertisements

Latest Articles

Most Read