సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ- బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలను టార్గెట్‌ చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఏడాది కిందటిదాకా- ఆ మాటకొస్తే కొద్దినెలల కిందటి దాకా మోదీ-షాలను సవాలు చేస్తూ గొంతెత్తడమే ఓ సాహసం.. ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందో- పార్టీలో నిరసన ధ్వనులు క్రమేణా ఊపందుకుంటున్నాయి. వ్యక్తులు సరిగా పనిచేయనపుడు, ఆశించిన ఫలం దక్కనపుడు నాయకులే బాధ్యత వహించాలని ఆయన ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ‘‘నేను పార్టీ అధ్యక్షుణ్నయినపుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా..!’’ అని ఆయన సూటిగా విమర్శించారు.

cbn protest 26122018

‘‘ప్రస్తుతం హోంశాఖ సమర్థంగా పనిచేస్తోందంటే దానికి కారణం సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. వారిలో అనేకమంది సచ్ఛీలురు, తమ పని భేషుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఓ పార్టీ విషయంలోనూ అంతే.. వ్యక్తులు సరిగా పనిచేయాలి. లేదంటే దానికి నాదే బాధ్యత. వారిని సరిగా తీర్చిదిద్దని తప్పు నాదే అవుతుంది’’ అని ఆయన ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల సమావేశంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కిందివారు సరిగా పనిచేయనపుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరనపుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి’’ అని పునరుద్ఘాటించారు. అంతేకాదు, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ-గాంధీ విధానాలను శాశ్వతంగా చెరిపేయాలని ఓ పక్క మోదీ-షా ప్రయత్నిస్తున్న తరుణంలో గడ్కరీ ఈ మాటలన్నారు.

cbn protest 26122018

అంతేకాదు...పరమత ద్వేషాన్ని పెంచిపోషిస్తోందని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటున్న దశలో ఆయన భారతీయ వ్యవస్థకు పెద్ద ఆభరణ పరమత సహనం అన్నారు. ‘‘ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విద్వాంసుడే కావొచ్చు. అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీరు పొరబడ్డట్లే. కృత్రిమమైన మార్కెటింగ్‌ ఎల్లకాలం నిలవదు’’ అని గడ్కరీ మోదీ-షాలను దృష్టిలో ఉంచుకుని దుయ్యబట్టారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌ల్లో బీజేపీ ఓటమికి నాయకత్వానిదే బాధ్యత అని కిందటివారమే ఓసారి గడ్కరీ ఘాటు విమర్శలు చేశారు. వాటికిది కొనసాగింపు. పార్టీ ఓడిపోయినా - అమిత్‌ షా గానీ, నరేంద్ర మోదీ గానీ ఒక్కసారి కూడా దానిపై సీనియర్‌ నేతలతో సమీక్ష నిర్వహించకపోవడం విమర్శలకు తావిచ్చింది. గెలిస్తే సంబరాలు చేస్తూ, మోదీని కీర్తిస్తూ సమావేశాలు నిర్వహించే అగ్రనేతలు, ఓడిపోతే మాత్రం తప్పు తమది కాదు, స్థానిక నాయకత్వానిదని చెప్పడం అనేక మంది సీనియర్లకు రుచించలేదు. ఆరెస్సె్‌సకు సన్నిహితుడిగా భావిస్తున్న గడ్కరీ- మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని ప్రచారమవుతున్న తరుణంలో ఆయన నుంచి విమర్శలు శరాలు పెరగడం విశేషం. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన- మిత్రపక్షాలకు కూడా సన్నిహితుడు.

 

గ్రామీణాభివృద్ధి పై అధ్యయనం చేసి గ్రామసీమల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్, కార్యక్రమం ఏర్పాటు చేసింది. గ్రామసీమల్లో నూతన ఆవిష్కరణల ద్వారా జరుగుతున్న అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఈ సంస్థల్లో శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో గ్రామసీమల్లో నూతన ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు ఈ వర్క్ షాపు జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 40 మంది ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, పంచాయితీ‌రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేసే అధికారులను ఆహ్వానించారు.

manikyalarao 25122018

ఈ వర్క్‌షాప్‌కు ఏపీ నుంచి కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక్కరే హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆదర్శ గ్రామమైన సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్‌కి ఎమ్మెల్యేలను తీసుకువెళ్లారు. సిద్దిపేట హరీశ్‌రావు నియోజకవర్గం. ఇబ్రహీంపూర్‌లో వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భూగర్భ డ్రైనేజ్, ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు, సోలార్ పవర్, ఎల్ఈడీ బల్బులు, గొర్రెలు, గేదెలకు గ్రామం వెలుపల షెడ్ల నిర్మాణం, గ్రామం మొత్తం రహదారులు, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, పరిశుభ్రత, ఇంటింటికీ కుళాయి వంటివి ఏర్పాటుచేశారు. ఎన్‌ఐఆర్‌డీ నుంచి వెళ్లిన బృందానికి మాజీమంత్రి హరీశ్‌రావు స్వాగతం పలికారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. వందశాతం అక్షరాస్యత సాధించిన గ్రామం ఇబ్రహీంపూర్.

 

manikyalarao 25122018

ఇక ఆవుల కోసం కూడా ఊరి బయటే షెడ్లు వేశామని చెప్పగా, ఈ వర్క్‌షాప్‌కు వెళ్లిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమ నియోజకవర్గంలో కూడా పశువులకు ఇటువంటి ఏర్పాట్లు చేశామనీ, వాటికి గోకులాలు అని పేరు పెట్టామనీ వివరించారు. రాష్ట్రమంతా ఈ కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని, పశువుల కోసం, గోకులం పేరుతో, షెడ్లు కడుతున్నామని చెప్పారు. దీంతో చంద్రబాబు మంచి పేర్లు పెడతారని హరీశ్ కితాబునిచ్చారు. ఇక ఇబ్రహీంపూర్‌ గ్రామ సమగ్రాభివృద్ధిని చూసి పెనమలూరు ఎమ్మల్యే హరీష్ రావుని మెచ్చుకున్నారు. రాజకీయ ప్రత్యర్దులమైనా, చేసిన మంచిని తెలుసుకోవటం మంచిదని అన్నారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో పలు గ్రామాలు ఎంతో ప్రగతి సాధించాయని గుర్తుచేశారట. అసలు అలాంటి గ్రామాలు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారట. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి కారణం వల్లనే ఏపీలో పల్లెసీమలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని చంద్రబాబు చేసిన పనులన్నీ, ఎమ్మెల్యే వివరించారు.

నిన్నటి వరకు వివిధ పార్టీల నేతలను కలిసిన తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానుండటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఫ్రంట్‌ అంటూ పర్యటనలు చేస్తున్న కేసీఆర్‌ ప్రధానిని కలవడంలో అర్థమేంటన్నారు. మోదీని కలిసి రాష్ట్ర సమస్యలు వివరిస్తారా? బ్రీఫింగ్‌ చేయడానికి వెళ్తున్నారా? అని కేసీఆర్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. ఏదైనా ఒక మాట చెప్పడం వేరని, చేసే పనులు వేరేగా ఉంటున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు వివిధ పార్టీలను కలిసిన కేసీఆర్‌ ఇవాళ ప్రధానిని కలుస్తున్నారన్నారు. ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ పర్యటనలు చేస్తూ ప్రధానిని కలుస్తున్నారంటే అర్థమేమిటి అని ప్రశ్నించారు. మోదీకి బ్రీఫింగ్‌ చేయడానికి వెళ్తున్నారా...లేక సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా అని చంద్రబాబు అడిగారు.

modi kcr 26122018

దేశంలో ఉన్నది రెండే ఫ్రంట్ లని, ఒకటి బీజేపీ అనుకూల ఫ్రంట్, మరొకటి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థుతుల్లో అటు బీజేపీ కాని, ఇటు కాంగ్రెస్ కాని లేకుండా, మూడో ఫ్రంట్ అనేది సాధ్యం కాదని, ఈ విషయం పై 22 పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని చంద్రబాబు అన్నారు. కేసీఆర్ ఏ ఫ్రంట్ లో ఉంటారో తేల్చుకోవాలని, అంతే కాని, కూటమిలో చీలక తెచ్చి మోడీకి లబ్ది చేకూర్చే ప్రయత్నం చేద్దమనుకుంటే, కుదరదని అన్నారు. మరో పక్క, ఇటు జగన మోహన్ రెడ్డిని, అటు పవన్ కళ్యాణ్ ని కూడా ఇదే విషయం పై స్పష్టత కోరారు చంద్రబాబు. జగన్, పవన్ అటు బీజేపీ పక్షమో, బీజేపీ వ్యతిరేక పక్షమో చెప్పాలని, ఇప్పటి వరకు వారికి దీని పై సమాధానం లేదని అన్నారు.

modi kcr 26122018

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తాను అంటూ, దీనికోసం భాజపా, కాంగ్రెసేతర పక్షాలు ఏకం కావాలంటూ కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల నేతలను కలుస్తున్నారు. ఇటీవల ఒడిశా, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రులు నవీన్‌పట్నాయక్‌, మమతా బెనర్జీతో భేటీ అయి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అయితే వారి నుంచి కేసీఆర్ కు సహకారం అందలేదు. నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ, మేము పోలవరం పై చర్చించుకున్నామని అంటే, మమత అసలు మీడియాతోనే మాట్లాడలేదు. వీరిద్దరినీ కలవగానే, ఈ రోజు ఢిల్లీ వెళ్లి మోడీని కలిసారు కేసీఆర్. అయితే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం, ప్రతిపక్షాల పార్టీల్లో చీలక తెచ్చి, వారిని బలహీన పరిచి, బీజేపీకి లబ్ది చేకూర్చటమే అని, చాలా పార్టీలు నమ్ముతున్నాయి. అందుకే కేసీఆర్ వైపు ఎవరూ మొగ్గు చూపించటం లేదు. మరోవైపు కేంద్రంలో భాజపాయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ విధానాలతో దేశం నాశనం అయ్యిందని, దేశాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపుకు, 22 పార్టీలు స్పందించాయి.

సొంత పార్టీ కార్యకర్తలకే సమాధానం చెప్పలేక మోదీ చేతులెత్తేశారు. మోదీ తీరుతో విపక్షాలకు మంచి అస్త్రం దొరికినట్లయ్యింది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు బీజేపీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్యకర్తలతో ప్రధాని మోదీ నేరుగా లైవ్‌లో మాట్లాడే కార్యక్రమం మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలిదశలో తమిళనాడు, పుదుచ్చేరి కార్యకర్తలతో మోదీ నేరుగా మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తన ఆలోచనా విధానాన్ని వారితో పంచుకున్నారు. ఆ కార్యక్రమం జరుగుతుండగా, పుదుచ్చేరీకి చెందిన ఒక కార్యకర్త వేసిన ప్రశ్న మోదీని, బీజేపీని ఇరకాటంలో పడేసింది. పన్నులు వసూలు చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ప్రజా సంక్షేమంలో లేదని నిర్మల్ కుమార్ జైన్ అనే పాండిచ్చేరి పార్టీ కార్యకర్త మోదీని నిలదీశారు.

cbn protest 26122018

దేశంలో మార్పు కోసం మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదే. మధ్యతరగతి వర్గం ఆలోచన వేరుగా ఉంది. మీ ప్రభుత్వం కేవలం పన్నుల వసూలుపైనే దృష్టి పెట్టింది. ప్రజలకు మీరు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు అంటూ కార్యకర్త నిలదీశారు. కార్యకర్త స్వయంగా నిలదీయడంతో మోదీ నీళ్లు నమిలారు. మాట దాటవేస్తూ మరో కార్యకర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. మధ్యతరగతి వర్గానికి, పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలరో మోదీ చెప్పలేకపోయారు. దీనితో మోదీపై సెటైర్లు వేస్తు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వణక్కం పుదుచ్చేరి అంటూ చేసిన ట్వీట్లో మోదీ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటి దాకా మీడియాతో మాట్లాడేందుకే భయపడిన మోదీ, ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా భయపడాల్సి వస్తోందని రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయలేదని గుర్తు చేస్తూ.... జనంలో కనిపించేందుకు కూడా భయపడే రోజులు వచ్చాయన్నారు. మోదీపై మధ్యతరగతి వర్గం ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందన్నారు.

cbn protest 26122018

కార్యకర్తలతో లైవ్ షోలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీజేపీ, దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగింది. ఇకపై పీఎంతో లైవ్‌లో మాట్లాడే కార్యకర్తలను తామే ఎంపిక చేస్తామని బీజేపీకి తెలిపింది. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రశ్నలు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి ప్రధానికి ఇబ్బంది లేని ప్రశ్నలనే ఆమోదిస్తారు. ఆ ప్రశ్న అడిగే కార్యకర్త పేరు, వయసు, పార్టీలో అతని క్రియాశీలత, పార్టీ నాయకత్వం పట్ల అతని కున్న అంకితభావం ఆధారంగా లైవ్‌లో మాట్లాడే అవకాశమిస్తారు. అభ్యంతరకరమైన వ్యక్తులను, వారు అడగబోయే ప్రశ్నలకు అడ్డుకోవాలని తీర్మానించారు. పుదుచ్చేరి సంఘటన తమకు గుణపాఠమని బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. తర్వాత ఈశాన్య రాష్ట్రాల కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ ఉన్నందున జాగ్రత్తగా ఉండకపోతే పరువు పోతుందని భయపడుతున్నారు.

 

Advertisements

Latest Articles

Most Read