నిన్న చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. పోలవరంలో మొదటి గేటు బిగింపు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, పూజా కార్యక్రమాలు అన్నీ ప్రాజెక్ట్ కింద భాగంలో ఏర్పాటు చేసారు. కాని చంద్రబాబు మాత్రం, ఇంతటి గొప్ప సంఘటన జరుగుతుంటే, మొక్కుబడిగా చేస్తామా అతను, పోలీసులు వద్దని వారిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సాహసం చేశారు. నిచ్చెన మెట్లపై 25 మీటర్లు ఎక్కి పూజలు చేశారు. స్పిల్ వేపై 25 మీటర్ల ఎత్తున క్రస్ట్ లెవల్‌లో తొలి రేడియల్ గేటును బిగించాల్సి ఉంది. దీంతో చంద్రబాబు పైకి ఎక్కేందుకు సిద్ధమయ్యారు. భద్రతా పరమైన కారణాల వల్ల సీఎం పైకి ఎక్కేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పారు.
వారి అభ్యంతరాలను పక్కన పెట్టిన చంద్రబాబు ఇలాంటి చిన్నచిన్న విషయాలకు కూడా భయపడడం సమంజసం కాదన్నారు. తానే భయపడితే ఎలాగని, ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందికి భరోసా ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అనంతరం నిచ్చెన ద్వారా స్పిల్‌వే పైకి ఎక్కి పూజలు చేశారు. అయితే చంద్రబాబు పైకి ఎక్కటం, అక్కడే కొంచెం సేపు ఉండటంతో, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అవాక్కయ్యారు.ఆయన కిందకు దిగే దాకా, అలెర్ట్ గా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో గేటు బిగింపునకు సంబంధించి సోమవారం ఉదయం 9.45 నిమిషాలకు పూజ ముగించి స్కిన్ ప్లేట్ అమర్చే ప్రక్రియ ప్రారంభించాలి. ఆ సమయం దాటితే ముహూర్తం మంచిది కాదని పండితులు నిర్ణయించారు.
ఆ మేరకు సీఎం 8.15 గంటలకే చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారు. 9.35 నిమిషాలకు చంద్రబాబు కాన్వాయ్ స్పిల్‌వేలోకి ప్రవేశించింది. కారు దిగిన వెంటనే వడివడిగా స్పిల్‌వేపై 25.72 మీటర్ల క్రస్ట్ స్థాయికి చేరుకున్నారు. అనుకున్న ప్రకారం పూజలు చేయడం, స్కిన్‌ప్లేట్ పైకి లేపి అమర్చడంతో అందరి మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. దాదాపు 20 నిమిషాలు చంద్రబాబు అక్కడే ఉన్నారు. పోలవరంలో తలుపులు ఏర్పాటు చేస్తోంటే జగన్ దీన్ని సాక్షి పత్రిక ద్వారా ‘గేట్ షో’గా వ్యంగ్యంగా చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే, అమరావతి నిర్మిస్తున్నామంటే రియల్ ఎస్టేట్ కోసం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.